Difference between revisions 1288684 and 1412372 on tewiki

'''ఋషి పంచమి''' వ్రతక

==భూశుద్ద:==

ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ద చేసి, అలికి, బియ్యపు పిండితో గాని, రంగుల చూర్ణ ములతో గాని, ముగ్గులు పెట్టి, దైవ స్థాపన నిమిత్త మై ఒక పీటను వేయాలి. పీట మరీ ఎత్తుగా గాని, మరీ పల్లముగా గానీ ఉండ కూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి, వరి పిండి (బియ్యపు పిండి) తో ముగ్గులు వేయాలి. సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పుముఖంగా కూర్చోవాలి. ఏ దైవాన్ని పూజింజబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని, చిత్ర పటమును గాని ఆ పీట పై ఉంచాలి. ముందుగా పసుపుతో గణపతిని(contracted; show full)

===[[మంత్ర పుష్పం]] :===
శ్లో || ఓం శ్రీరామ నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు, పువ్వులు, చిల్లర స్వామివద్ద ఉంచవలెను. పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి.
                    

===[[ప్రదక్షిణం]]:===
శ్లో || ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ,
నమస్తే విఘ్న రాజాయ నమేస్తే విఘ్న నాశన ||
శ్లో || ప్రమధ గణ దేవేశ ప్రసిద్దే గణనాయక,
ప్రదక్షిణం కరోమిత్వా మీశ పుత్ర నమోస్తుతే ||
శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
(contracted; show full)శోభనార్ధం పునరాగమనాయచ అని ఉద్వాసన పలుకుతారు.
పూజా విధానం సంపూర్ణం.   
తీర్ధ ప్రాశ నమ్ :
శ్లో || అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణమ్ |
సమస్త పాపక్ష యకరం శ్రీరామ పాదో దకం పావనం శుభమ్ ||
అని తీర్ధమును చేతిలో వేసుకొని మూడుమార్లు నోటి లోనికి తీసుకొనవలెను.

===వ్రత క
ా ప్రారంభము===

సర్వలోకమునకు గురువుఐన, సర్వేశ్వరుడు ఐన శ్రీ కృష్ణుని చూచి ' ధర్మరాజు ' ఓ దేవ దేవా! అనేక వ్రతములను గూర్చి విన్ననూ, వ్రతములలో ఉత్తమమైనది, అన్ని దోషములను పోగొట్టునది ఐన ఒక వ్రతము వినవలెనని ఉన్నది. అని చెప్పగా విన్న శ్రీ కృష్ణుడు ఇలా పలుకుచున్నాడు. ఓ ధర్మ రాజా చెప్పెదను వినము దేనిని చెయుట చేత ప్రజలు నరకమును చూడరో పాపములను పోగొట్టునది ఐన ' ఋషి పంచమి ' అను వ్రతము ఒకటి కలదు. దానిని గూర్చిన పురాణ క ఒకటి కలదు.

పూర్వకాలమున ' విదర్భ దేశం'లో ' ఉదంకుడు ' అను ఒక ' బ్రాహ్మణుడు ' కలడు. అతని భార్య పేరు 'సుశీల' ఈమె పతివ్రత వీరికి సుభీషణుడు అను కొడుకు, ఒక కూతురు ఉండిరి. ఇతని కొడుకు వేదే వేదాంగములను చదివెను. కూతురుని ఒక బ్రాహ్మణునకు ఇచ్చి ' వివాహం ' చేసిరి ఆ తరువాత ఆమె 'విధ వశము' చే వైధవ్యమును పొందెను.( అనగా భర్త లేనిదయ్యెను) తాను పవిత్రముగా ఉండి, తన తండ్రి ఇంటిలోనే కాలము, గడుపు చుండెను. తండ్రి ఐన ఉదంకుడు తన కూతురి పరిస్థితికి బాధ పడుచు కొడుకు ఇంటి నుం(contracted; show full)

కావున బ్రహ్మదేవుని ఆజ్ఞచే మొదటి రోజున చాండాలి, రెండవ రోజున బ్రహ్మఘాతి, మూడవ రోజున రజకిగా నుండి నాలుగవ రోజున పరిశుద్దము అగును కావున, రజః కాలమున జ్ఞానముచే గాని వంట సామాగ్రిని తాకినచో ( అనగా అన్న భాండములు తాకినచో అట్టి పాపము నశించుటకు అన్ని పాపములు తొలగి పోవుటకు సర్వ ఉపద్రవములు నశించిపోవుటకు ఈ 'ఋషి పంచమి' వ్రతము బ్రాహ్మణాది నాలుగు జాతులలోని స్త్రీల చేత ఎక్కువగా ఆచరింపదగినది. (అనగా చేయ దగినది) ఈవిషయమున ఇంకొక పురాణ క
 కలదు.

మొదటగా కృత యుగమున విర్భ దేశమునందు ' శ్వేన జిత్తు ' అను పేరుగల ఒక రాజు నాలుగు (అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, సూద్ర) జాతుల ప్రజలను పరిపాలించుచుండెను. ఇలా ఉండగా అతని దేశమున పద శాస్త్ర హితామహుడ ( అనగా పదములు చెప్పుటలో పాండిత్యము కలిగిన వాడు) అన్ని ప్రాణులయందు లేద ఆజీవులయందు దయ కలవాడైన సుమిత్రడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. ఇతడు వ్యాపారము చేయుచూ కుటుంబమును పోషించుచుండెను. అతని భార్య పతివ్రత, భర్త యందు భక్తి కలది. అనేక మంది చెలికత్తెలు కలదిగా అనేక మంది స్నేహితులు కలదిగా వర్షాకాలమున కృషి వ్యాపారమున(contracted; show full)ుట్టములతో కూడి భుజింపవలెను. ఓ ధర్మరాజా ఎప్పుడూ ఫలం కోరువారు ఇలా చెప్పబడిన విధమున ఉద్యాపనము చేసి, ఈ వ్రతం చేయవలయును. ఇలా ఆచరించిన ఈ వ్రతము సర్వ తీర్ధముల యందు స్నానము చేసిన ఫలమును,అన్ని వ్రతములను ఆచరించిన పుణ్యమును ఇచ్చును. కావున ఓ ధర్మరాజా! ఏ వనిత (అనగా స్త్రీ) ఈ వ్రతమును ఆచరించునో ఆమె సమస్త పాపముల నుండి విముక్తురాలయు ఈ లోకమున చాలాకాలము పుత్రులతో పౌత్రులతో భర్తతో అనేక భోగముల అనుభవించి, నిత్య సౌభాగ్యముతో స్వర్గలోకములో కూడ పూజింపబడి చివరకు మోక్షము పొందును. అని శ్రీకృష్ణుడు చెప్పగా విని ధర్మరాజు సంతోషించెను.






Source: http://www.epurohith.com/telugu/viewtopics.php?page=1&cat_id=634

[[వర్గం:హిందువుల పండుగలు]]