Difference between revisions 1645511 and 1653680 on tewiki

"'''గొల్లపల్లి(త్రిపురాంతకం)''' ప్రకాశం జిల్లా [[త్రిపురాంతకం]] మండలానికి చెందిన గ్రామం.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=218 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.

==గ్రామంలోని దేవాలయాలు==
శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం:- పురాతనమైన ఈ ఆలయం జీర్ణదశకు చేరటంతో గ్రామస్థులంతా కలసి ఎలాగైనా ఆలయాన్ని పునర్నిర్మించాలని గట్టి పట్టుదలతో చేయీచేయీ కలిపి చందాలు వసూలుచేసి, ఆలయాన్ని రు. 80 లక్షలతో పునర్నిర్మాణం చేసినారు. ఆలయంలో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, బలరామావతారం,కృష్ణావతారం, బుద్ధావతారం వంటి అందమైన విగ్రహాలను ఏర్పాటుచేసినారు. రామాయణం, భాగవతం గ్రంధాలనుండి అంశాలతో పలురకాల శిల్పాలు ఏర్పాటుచేసినారు. ఆలయ పునహఃప్రతిష్ఠాకార్యక్రమలను, 2014,జూన్-19 నుండి మూడు రోజులపాటు నిర్వహిoచినారు. 21వ తేదీ శనివారం నాడు, శ్రీ సీతారామచంద్రమూర్తి మరియూ పరివార దేవతలతోపాటు, బొడ్రాయి ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించినారు. శనివారం నాడు, నిత్యపూజావిధి, పీఠన్యాసం, గర్తన్యాసం, రత్నన్యాసం, యంత్రస్థాపన, అనంతరం ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించినారు. రామనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారు మ్రోగినవి. పరిసర ప్రాంతాలనుండి భక్తులు, తరలివచ్చి ఉత్సవాన్ని కనులారా తిలకించినారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించినారు. [1] & [2]

[1] ఈనాడు ప్రకాశం; 2014,జూన్-2; 2వ పేజీ.
[2] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-22; 9వపేజీ.

[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]