Difference between revisions 1833873 and 1833874 on tewiki

{{వికీకరణ}}
{{మూలాలు లేవు}}
==దివ్యక్షేత్రం వాడపల్లి- దివ్య చరిత వాడనిమల్లి"==
File:వాడపల్లి వేంకటేశ్వరస్వామి.jpg|thumb|కోనసీమ తిరుపతి గా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యమంగళ విగ్రహం
==చరిత్ర==
[[File:వాడపల్లి వేంకటేశ్వరస్వామి.jpg|thumb|కోనసీమ తిరుపతి గా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యమంగళ విగ్రహం]]
ఒకసారి సనకసనందనాది మహర్షులందరూ వైకుంఠం లోని శ్రీమన్నారాయణుని దర్శించుకుని ఆయనను అనేకవిధములుగా స్తుతించిన తరువాత తాము వచ్చిన పనిని తెలిపారు.  కలియుగం లో ధర్మం ఒంటిపాదం లో నడుస్తోంది ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యత నిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వశులై అధర్మ జీవితం గడుపుచున్నారు ఉపేక్షిస్తే అధర్మం మిగిలిన యుగాలకు కూదా ప్రాప్తిస్తుంది.కనుక ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవిమ్మని ఋషులు మహావిష్ణువును ప్ర్రార్ధించగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈవిధంగా చెప్పెను. అధర్మం ప్రబలినప్పుడు స్వయముగా యుగ యుగమందున అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలు ధరించితిని కాని కలియుగం లో పాపభూయిష్టము యెక్కువ అయిఉంది కొద్ది మాత్రమే పుణ్యాన్వితమ్ కావున (contracted; show full)అంటే పాపాలను "కట" అంటే పోగొట్టే వాడు కనుక స్వామికి "వేంకటేశ్వరుడు"అని నారదుడే స్వయంగా నామకరణం  చేసి ప్రతిష్టింప చేసినాడు.వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి నిలువెత్తు రూపం చూడగానే కళ్ళకు ఆకట్టుకుని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది.భారతదేశం లో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో "వాడపల్లి" ఒకటి వాడపల్లి తీర్ధం అనగా వాడవాడలా ఉత్సవమే.ఆబాలగోపాలానికీ ఆనందమే.ప్రతీఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామీ వారి తీర్ధం ,కల్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి.
స్వామివారి బ్రహ్మోత్సవ ,
  కల్యాణోత్సవ  కార్యక్రమములను కన్నుల పండుగగా భక్తీ ప్రపత్తులతో తిలకిస్తారు. ఏటా కళ్యాణంతో పాటు నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శిస్తుంటారు.

==ఏడు శనివారముల వెంకన్న దర్శనం -ఏడేడు జన్మల పుణ్యఫలం==
(contracted; show full)
వాడుకరి వడ్డూరి రామకృష్ణ ఫోన్ :9440953315

==మూలాలు==
వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వారు ఇచ్చిన స్థలపురాణం పేపరు ఆధారంగా వ్రాయబడింది.దేవస్థానం ప్రధాన అర్చకుల అనుమతితో.
[[File:స్థలపురాణం పేపరు.jpg|thumb|వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం స్థలపురాణం]]
https://www.youtube.com/watch?v=mTwov1SUJQo
http://www.sakshi.com/news/andhra-pradesh/wadapalli-teertha-celebrations-starts-on-monday-226168
https://www.facebook.com/KonaseemaToday/posts/1551403828454598