Difference between revisions 1852170 and 1892505 on tewiki{{వ్యాఖ్య|'''భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్'''|}} "సంగితమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం" అన్నట్లుగా ఆ సంగీతం సాహిత్యం మా పూర్వీకుల వారసత్వ సంపద, మా వంతు భాధ్యతగా ఆ సంపదను పెంచుకుని పదిమందితో పంచుకోవాలన్న సదాశయంతో, విస్సా ఫౌండేషన్ ఆవిష్కార సభ 07/07/2012 వ తేదిన ఏర్పాటు చెయ్యడం జరిగింది. మా పూజ్యజనకులు కీ!!శే.శ్రీ విస్సా వెంకట సత్య వర ప్రసాదరావు గారి పేరిట 'కళా వర ప్రసాద పురస్(contracted; show full) సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది...అనే నినాదంతో ఏర్పడిన ఈ విస్సా ఫౌండేషన్ గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ లంకె మీద నొక్కండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలిపి మా బ్లాగ్ ను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా సహకరించమని విశ్వవ్యాప్త వీక్షకులకు మా వినమ్ర విన్నపం!!....ఈ ఆనందోత్సవ శుభవేళ...మా విస్సా ఫౌండేషన్ కార్యక్రమాలు యు ట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంచుతున్నామని విన్నవించుకుంటున్నాము..ధన్యవాదములతో...సత్యసాయి విస్సా ఫౌండేషన్. --> == శీర్షిక పాఠ్యం == ==మరిన్ని వివరాలు== మా పినపళ్ళ గ్రామదేవత గోల్లాలమ్మ మా పినపళ్ళ గ్రామదేవత గోల్లాలమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయి. మన దేశంలో గ్రామదేవతల ఆరాధన అన్నది అనాదిగా వస్తూన్న ఆచారం, ఊరు పొలిమేరలో ఉండి దుష్ట శక్తుల నుండి గ్రామాన్ని గ్రామప్రజలను కాపాడతారు. అందుకు గ్రామప్రజలు కృతజ్ఞతగా ఏటేటా వారికి కొలుపులు, పూజలు చేసి తమ భక్తిప్రపత్తులను చాటుకుంటారు. మరి అటువంటి గ్రామ దేవతలు ఎలా ఉద్భవించారు ఇలా అనేక విషయాలు ఆశక్తి కరంగా వుంటాయి. ఒకసారి గతంలోకి తొంగి చూద్దాం! ప్రపంచంలో మనిషి జంతువు నుంచి పరిణామం చెంది మానవునిగా మారే క్రమంలో కొన్ని నమ్మకాలు ఏర్పడ్డాయి. అందులో ముఖ్యమైనది మానవాతీత శక్తి ఉందనే నమ్మకం. ఈ అతీత శక్తినే దేవత, లేక దేవుడు అని నమ్మేవారు. ముఖ్యంగా అగ్ని, నీరు, వాయువు, సూర్యుడు, చంద్రుడు వంటి ప్రకృతి శక్తులను ఇలా భావించేవారు. తమకు ప్రమోదం కలిగినా, ప్రమాదం కలిగినా కారణం ప్రకృతిలోని ఏదో ఒక శక్తే అని మనిషి నమ్మాడు. అందుకే ప్రకృతిలోనూ, ఆకాశంలోనూ కనిపించే అనేక సహజమైన శక్తులను దైవశక్తులుగా భావించి పూజించడం ప్రారంభించాడు. అలా ప్రారంభమైన ఆరాధన ఇప్పటి ఆటవిక జాతుల్లో పెద్దగా మార్పులేమీ లేకుండానే వేల ఏళ్ళుగా కొనసాగుతున్నాయి. ఇలాగే ప్రకృతి ఆరాధన విషయంలో ప్రపంచం మొత్తం మీద మన దేశంలోనే ఎక్కువ ఆధారాలు కనిపిస్తాయి. ఇప్పటికీ మనవారు ప్రకృతిలోని చెట్టు, పుట్ట, కొండ, గుట్ట, నదీనదాలు, కుక్క, పాము వంటి చరాచర జీవులన్నింటినీ పూజిస్తున్నారు. మన దేశంలో అతి పెద్ద మతంగా ఉన్న హిందూ మతం నిజానికి మతమే కాదు. అది ప్రకృతిలోని ఒక ప్రాంతం పేరు (సింధ్ అనే ప్రాంతం) కాల క్రమంగా హింద్గా మారటం వల్ల ప్రచారంలోకి వచ్చిన పేరు. హిందూ మతంగా చెప్పుకుంటున్న జీవన విధానంలో ఉన్నదంతా ప్రకృతి శక్తుల ఆరాధనే. ప్రకృతే సృష్టికి మూలంగా భావించి ఒక శక్తిగా కొలవడం మొదట ప్రారంభం అయింది. భూమిపై పెరిగే మొక్కలే మిగిలిన జీవరాసులందరికీ జీవనాధారం కాబట్టి భూమిని భూమాత అన్నారు. సూర్యుడు లేకపోతే జీవ ప్రపంచం మనుగడ కష్టమని అర్థమయిన తరువాత సూర్యభగవానుడన్నారు. బతకడానికి గాలి, నీరు అత్యంత ముఖ్యమైనవి కాబట్టి వాటిని వాయు దేవుడు, వరుణ దేవుడు (వర్షాన్నిచ్చే దేవుడు) అన్నారు. సకల నదులు, ఏరులు గంగాదేవిగా పూజలందుకోవడం ప్రారంభమయింది. ఇక అమ్మవార్ల విషయానికి వస్తే ప్రపంచంలో ఎందరో అమ్మదేవతలు ఉన్నారు. వారిలో మన దేశానికి వచ్చేటప్పటికి అదితి, లజ్జాగౌరి, రేణుక అనేవారు ముఖ్యులు. మిగతా వివరాలు మరో మారు చెప్పుకుందాం! మొన్న మా పినపళ్ళ గ్రామంలో జరిగిన గోల్లాలమ్మ వారి జాతర దృశ్యాలు తిలకించండి! అమ్మవారిని దర్శించండి సంపూర్ణ అనుగ్రహాన్నిపొందండి. సత్యసాయి విస్సా ఫౌండేషన్. ⏎ ⏎ మరింత సమాచారం కోసం ఈ లింకులు నొక్కండి... 1) Face Book: SATYA SAI VISSA 2) Blog: VISSAFOUNDATION.BLOGSPOT.COM 3) U TUBE: VISSAFOUNDATION VIDEOS ==మూలాలు== {{మూలాలజాబితా}} ==ఇతర లింకులు== [[వర్గం:సంస్థలు]] 1) Face Book: SATYASAI VISSA 2) Blog: VISSAFOUNDATION.BLOGSPOT.COM 3) U TUBE: VISSAFOUNDATION VIDEOS All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=1892505.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|