Difference between revisions 1967650 and 1970442 on tewiki

'''ఋషి పంచమి''' వ్రతకథ

==భూశుద్ద:==

ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ద చేసి, అలికి, బియ్యపు పిండితో గాని, రంగుల చూర్ణ ములతో గాని, ముగ్గులు పెట్టి, దైవ స్థాపన నిమిత్త మై ఒక పీటను వేయాలి. పీట మరీ ఎత్తుగా గాని, మరీ పల్లముగా గానీ ఉండ కూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి, వరి పిండి (బియ్యపు పిండి) తో ముగ్గులు వేయాలి. సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పుముఖంగా కూర్చోవాలి. ఏ దైవాన్ని పూజింజబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని, చిత్ర (contracted; show full)

==[[ఘంటానాదము]]:==
శ్లో || ఆగ మార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్ష సామ్
కుర్యాద్ఘంటార వంతత్ర దేవతాహ్వాహన లాంఛ నమ్
మనము ఆచ మనము చేసినటువంటి పంచ పాత్రలోని నీళ్లు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసుగాని, చెంబుగాని తీసుకొని దానిలో శుద్ద జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆనీళ్లు మాత్రమ
 దేవుని పూజకు ఉపయోగించవలెను.
పూజకు కావలసిన వస్తువులు :
ఏ వ్రతమును (పూజకు) ఆచరించుచున్నామో ఆ దేవుని యొక్క బొమ్మ (ప్రతిమ) (తమ శక్తి కొలది బంగారముతో నైనను, వెండితో నైనను లేక మట్టితో నైనను తీసుకోనవలెను), లేదా చిత్ర పటము, మండపమునకు మామిడి ఆకులు, అరటి మొక్కలు, కొబ్బరి కాయలు, పళ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం, అక్షతలు, అగ్గి పెట్టె, అగరవత్తులు, వస్త్ర, యజ్ఞో పవీతములు, తోరములు ( తెల్లని దారమునకు పసుపు రాసి 9 వరసలు (పోగులు) వేసి 9 చోట్ల పువ్వులతో కట్టి, ఈ తోరములను దేవునికి పూజ చేసి పూజ చేసిన వారందర(contracted; show full)ేయవలయును. ఇలా ఆచరించిన ఈ వ్రతము సర్వ తీర్ధముల యందు స్నానము చేసిన ఫలమును, అన్ని వ్రతములను ఆచరించిన పుణ్యమును ఇచ్చును. కావున ఓ ధర్మరాజా! ఏ వనిత (అనగా స్త్రీ) ఈ వ్రతమును ఆచరించునో ఆమె సమస్త పాపముల నుండి విముక్తురాలయు ఈ లోకమున చాలాకాలము పుత్రులతో పౌత్రులతో భర్తతో అనేక భోగముల అనుభవించి, నిత్య సౌభాగ్యముతో స్వర్గలోకములో కూడా పూజింపబడి చివరకు మోక్షము పొందును. అని శ్రీకృష్ణుడు చెప్పగా విని ధర్మరాజు సంతోషించెను.

Source: http://www.epurohith.com/telugu/viewtopics.php?page=1&cat_id=634

[[వర్గం:హిందువుల పండుగలు]]