Difference between revisions 1976943 and 1984274 on tewiki'''ఋషి పంచమి''' వ్రతకథ ==భూశుద్ద:== ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్దధ చేసి, అలికి, బియ్యపు పిండితో గాని, రంగుల చూర్ణ ములతో గాని, ముగ్గులు పెట్టి, దైవ స్థాపన నిమిత్త మై ఒక పీటను వేయాలి. పీట మరీ ఎత్తుగా గాని, మరీ పల్లముగా గానీ ఉండ కూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి, వరి పిండి (బియ్యపు పిండి) తో ముగ్గులు వేయాలి. సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పుముఖంగా కూర్చోవాలి. ఏ దైవాన్ని పూజింజబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని, చిత్ర పటమును గాని ఆ పీట పై ఉంచాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి ( పసుపును సుమారు అంగుళం సైజులో త్రికోణ(contracted; show full) ==[[ఘంటానాదము]]:== శ్లో || ఆగ మార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్ష సామ్ కుర్యాద్ఘంటార వంతత్ర దేవతాహ్వాహన లాంఛ నమ్ మనము ఆచ మనము చేసినటువంటి పంచ పాత్రలోని నీళ్లు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసుగాని, చెంబుగాని తీసుకొని దానిలో శుద్ దధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆనీళ్లు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను. పూజకు కావలసిన వస్తువులు : ఏ వ్రతమును (పూజకు) ఆచరించుచున్నామో ఆ దేవుని యొక్క బొమ్మ (ప్రతిమ) (తమ శక్తి కొలది బంగారముతో నైనను, వెండితో నైనను లేక మట్టితో నైనను తీసుకోనవలెను), లేదా చిత్ర పటము, మండపమునకు మామిడి ఆకులు, అరటి మొక్కలు, కొబ్బరి కాయలు, పళ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం, అక్షతలు, అగ్గి పెట్టె, అగరవత్తులు, వస్త్ర, యజ్ఞో పవీతములు, తోరములు ( తెల్లని దారమునకు పసుపు రాసి 9 వరసలు (పోగులు) వేసి 9 చోట్ల పువ్వులతో(contracted; show full)క్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్ధం సకలవిధ మనోవాంఛాఫల సిద్ద్యర్ధం, శ్రీరామ ముద్దశ్య శ్రీరామ ప్రీత్యర్ధం ( ఏ దేవుని పూజించుచున్నాయో ఆ దేవునియొక్క పేరు చెప్పుకొని) సంభవద్భి రుపచారై: సంభవతానియమేన సంభవతా ప్రకారేణ యావచ్చక్తి ( నాకు తోచిన రీతిలో, నాకు తోచిన విధముగా, భక్తి శ్రద్ధలతో సమర్పించుకొంటున్న పూజ) ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. తధంగ కలశ పూజాం కరిష్యే || పిద పకలశారాధ నను చెయవలెను. ==కలశ పూజను గూర్చిన వివరణ :== వెండి, రాగి, లేక కంచు గ్లా సులు ( లేదా పంచ పాత్రలు) రెండింటిలో శుద్ దధ జలమును తీసుకొని ఒక దానియందు ఉద్దరిణిని, రెండవ దానియందు అక్షింతలు, తమలపాకు, పువ్వు ఉంచుకొనవలెను. రెండువ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమ అద్దవలెను. ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమునుగాని, కుంకుమనుగాని పూయరాదు. గంధమును ఉంగరపు వేలితో పూయవలెను. కుంకుమ అక్షతలువ గైరాబొటన, మధ్య, ఉంగరపు వ్రేళ్లను కలిపి సమర్పించవలెను. యజమానులు ( ఒక్కరైతే ఒకరు, దంపతులు లైతే ఇద్దరూను) ఆ కలశాన్ని కుడి చేతితో మూసివుంచి, ఇలా అనుకోవాలి. ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదవవలె(contracted; show full) మధుపర్కం : ఓం శ్రీ రామ నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చుచున్నామని తలుస్తూ, ఈ మధుపర్కాన్ని ఆయన ప్రతిమకు అద్దవలెను (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్న దాన్ని మధుపర్కం అంటారు ) ===పంచామృత స్నానం : === ఓం శ్రీ రామ నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవునెయ్యి, ఆవుపాలు, ఆవుపెరుగు, తేనె, పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరిణెతో చల్లవలెను. శుద్ దధోదక స్నానం : ఓం శ్రీ రామనమః శుద్దధోదక స్నానం సమర్పయామి . పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను . ===వస్త్ర యుగ్మం : === ఓం శ్రీ రామనమః వస్త్ర యుగ్మం సమర్పయామి (యుగ్మమనగా రెండు ) అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును ఇటువంటివి రెండు చేసుకొనవలెను ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను. ===[[యజ్ఞోపవీతం]] : === ఓం శ్రీరామనమః ఉపవీతం సమర్పయామి (contracted; show full) పానీయం సమర్పయామి అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరిణెతో) స్వామికి నివేదనం చుపించాలి. పిదప ఓం శ్రీరామ నమః నైవేద్యానంతరం ' హస్తౌ ప్రక్షాళ యామి' అని ఉద్దరిణెతో పంచ పాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్యపాత్ర ( పంచ పాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకొనే నీళ్ల పాత్ర ) లో వదలాలి. తరువాత ' పాదౌప్రక్షాళ యామి' అని మరో సారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతో వదలాలి. పునః శుద్ దధాచ మనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి తదనంతరం ===[[తాంబూలం]] : === శ్లో || ఓం శ్రీరామ నమః తాంబూలం సమర్పయామి అని చెబుతూ తాంబూలమును ( మూడు తమలపాకులు, రెండు పోక చెక్కలు, అరటి పండు వేసి) స్వామి వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ, ' తాంబూల చరవణానంతరం శుద్దధ ఆచమనీయం సమర్పయామి ' అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి.పిమ్మట కర్పూరం వెలిగించి ===[[నీరాజనం]] :=== శ్లో || ఓం శ్రీరామ నమః కర్పూర నీరాజనం సమర్పయామి అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి, మూడుమార్లు త్రిప్పుచూ, చిన్నగా ఘంట వాయించవలెను. అనంతరం మళ్లీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ' కర్పూర నీరాజనానంతరం శుద్దధాచ మనీయం సమర్పయామి ' అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తరువాత అక్షతలు, పువ్వులు, చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని, ===[[మంత్ర పుష్పం]] :=== శ్లో || ఓం శ్రీరామ నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు, పువ్వులు, చిల్లర స్వామివద్ద ఉంచవలెను. పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి. ===[[ప్రదక్షిణం]]:=== శ్లో || ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ, నమస్తే విఘ్న రాజాయ నమేస్తే విఘ్న నాశన || (contracted; show full) ఓ ప్రాణేశ్వరీ! ఆమె ఇంతకుముందు తన ఏడవ జన్మమున బ్రాహ్మణ స్త్రీగా ఉండి 'రజస్వల' యై దూరముగా నుండక ఇంటి పనులు అన్ని చేయుచూ వంట సామాగ్రిని (అనగా అన్నము, కూర, పప్పు, మొ|| పదార్దములు వండిన గిన్నెలు|| వాటిని) తాకిన దోషము వలన ఆమె శరీర మంతట పురుగులు వ్యాపించనవి, కావున 'స్త్రీ' రజొయుక్తరాలు ఐనచో పాపము కలది అగును. అది యెట్లు అనగా మొదటి రోజున చూడాలి రెండవ రోజున బ్రహ్మఘాతి ( అనగా బ్రహ్మను చంపిన పాపము కలదిగను) మూడవ రోజున రజకి ఐ నాలుగవ దినమున శుద్ దధ అగును. ఇలా ఉండగా ఈమె పూర్వము చెలికత్తెలతో కలిసి ఒక మంచి వ్రతమును అవమానించెను. కాని, ఆ వ్రతము చేయుటను చూచి ఉండుట వలన నిర్మలమైన బ్రాహ్మణకులంలో పుట్టుట జరిగినది ఆ వ్రతమును దూషించుట వలన శరీరమంతా పురుగుల కలదిగా అయ్యెను. అని ఉదంకుడు తన కూతురు యొక్క పూర్వజన్మ వృత్తాంత మను గూర్చి చెప్పగా అతని భార్యైన సుశీల ఏ వ్రతము యొక్క మహిమచే ఉత్తమ కులములో పుట్టుటయు మరియు శరీర మంతా పురుగులు వ్యాపించుట జరిగినదో ఆ మహిమ కల ఆశ్చర్య కరమైన వ్రతము గూర్చి నాకు తెలపువలెను.అని కోరగా అందుకు ఉదంకుడు ఈ విధముగా చెప్పుచుండెను. (contracted; show full)ా ఉండునపుడు దూరముగా ఉండుటకు హేతువు ఉంది. అనగా కారణము ఉంది. అది ఏమనగా ఇంద్రుడు ముందు వృత్రాసురుని చంపినపుడు కలిగిన పాపము వలన బ్రహ్మహత్య చేత పీడింపబడి, ఆపీడను పోగొట్టుకొనుటకై బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి శరణము కోరగా బ్రహ్మ ఆ ఇంద్రుడి బ్రహ్మహత్యను నాలుగు భాగములుగా విభజించి ' స్త్రీ 'లయందును, వృక్షములయందును (అనగా నీటి యందును) ఈ విధముగా నాలుగు తావులయందు (అనగా నాలుగు స్థలముల యందు) ఉంచెను. కావున బ్రహ్మదేవుని ఆజ్ఞచే మొదటి రోజున చాండాలి, రెండవ రోజున బ్రహ్మఘాతి, మూడవ రోజున రజకిగా నుండి నాలుగవ రోజున పరిశుద్ దధము అగును కావున, రజః కాలమున జ్ఞానముచే గాని వంట సామాగ్రిని తాకినచో ( అనగా అన్న భాండములు తాకినచో అట్టి పాపము నశించుటకు అన్ని పాపములు తొలగి పోవుటకు సర్వ ఉపద్రవములు నశించిపోవుటకు ఈ 'ఋషి పంచమి' వ్రతము బ్రాహ్మణాది నాలుగు జాతులలోని స్త్రీల చేత ఎక్కువగా ఆచరింపదగినది. (అనగా చేయ దగినది) ఈవిషయమున ఇంకొక పురాణ కథ ఉంది. (contracted; show full)పలుకుచున్నది. ఓ స్వామి! నేడు ఉచ్చిష్టము (అనగా అందరూ తినగా మిగిలినది) వెయక పోవుట వలన ఆకలి మిక్కిలి బాధించుచున్నది. ప్రతిరోజు నా పుత్రుడు నాకు వేయుచుండెను. ఇది గాక బ్రాహ్మణుల కొరకు శ్రార్దమునకై చేసిన పాకములో ఒక సర్పము (అనగా పాము) వచ్చి అక్కడి పాయసము తిని, విషము దానిలో కలిపి పోయెను అది నేను చూచి, ఆ సర్పము విషము కలిపిన ఆహార పదార్దములను ఆ బ్రాహ్మణులు తినినచో చనిపోవుదురని భావించి వాటిని నేను తినినచో నేనొక్కదానినే చనిపోయెదను అని అనుకొని అవి నేను తాకి తిని అది సుమతి యొక్క భార్య చూచి అపార్దము చేసుకొని నన్ను బాధించి నంది. అని ఏడ్చుచుండెను. అలా ఏడ్చుచున్న ఆ (శునకము) అనగా కుక్కను ఆ (వృషభము) ఎద్దు తన కష్టముల గూర్చి చెప్పుచుండెను. ఓ దేవీ! మా తండ్రి గారు చనిపోయిన రోజు వచ్చినది కావున బ్రాహ్మణులకు భోజనము పెట్ట వలెను. అందుకై వంట చేయుమని అడుగగా ఆమె వెంటనే భర్త శాసనమును అనుసరించి అనేక శాకములను (అనగా అనేక పిండి వంటలను చేసెను) చేసి వాటిని సిద్దము చేయుచుండెను. ఇలా ఉండగా ఒక సర్పము వచ్చి పాయసాన్నములను తినుచుండెను. అక్కడ ఉన్న ఆ కుక్క దానిన చూచెను. అది తినినచో బ్రాహ్మణులందరూ మరనింతురు.అని అనుకొని తాను తాకినది వారు చూచినచో ఆ అన్నమును ఎవ్వరూ ముట్టరు అనుకొని అది అన్నమును తినుచుండెను. వెంటనే అది చూచి దానిని ఎంగిలి చేసినదిగా భావించి సుమతి భార్య కుక్కను బాగా కొట్టెను. ఆ ఆహార పదార్దములను పార వేసి, మరల శుభ్రముగా వండి, బ్రాహ్మణులంతా భోజనము చేసిన తరువాత వారికి అన్ని విధముల విధులు సమకూర్చి, పిదప మిగిలిన వాటిని ఇంట్లో నివారంతా భుజించి మిగిలిన పదార్దములను కూడా ఆ కుక్కకు వేయక పోవుట వలన అది తన భర్త రూపములో నున్న వృషభము (అనగా ఎద్దును) చూచి ఇలా పలుకుచున్నది. ఓ స్వామి! నేడు ఉచ్చిష్టము (అనగా అందరూ తినగా మిగిలినది) వెయక పోవుట వలన ఆకలి మిక్కిలి బాధించుచున్నది. ప్రతిరోజు నా పుత్రుడు నాకు వేయుచుండెను. ఇది గాక బ్రాహ్మణుల కొరకు శ్రార్దమునకై చేసిన పాకములో ఒక సర్పము (అనగా పాము) వచ్చి అక్కడి పాయసము తిని, విషము దానిలో కలిపి పోయెను అది నేను చూచి, ఆ సర్పము విషము కలిపిన ఆహార పదార్దములను ఆ బ్రాహ్మణులు తినినచో చనిపోవుదురని భావించి వాటిని నేను తినినచో నేనొక్కదానినే చనిపోయెదను అని అనుకొని అవి నేను తాకి తిని అది సుమతి యొక్క భార్య చూచి అపార్దము చేసుకొని నన్ను బాధించినంది. అని ఏడ్చుచుండెను. అలా ఏడ్చుచున్న ఆ (శునకము) అనగా కుక్కను ఆ (వృషభము) ఎద్దు తన కష్టముల గూర్చి చెప్పుచుండెను. అను శ్లోకముచే ఉత్తరేణు పుల్లను ప్రార్ధథించి, దంత ధావనం చేసి, (అనగా పండ్లను శుభ్రముగా కడుగుకొని) తిలామలక పిష్ఠములచే కేశసంశోధం చేసుకుని (అనగా నువ్వుల నూనెను వ్రాసుకుని) మృత్తి కాస్నాన పూర్వకముగా శుద్దధోదక స్నానము (అనగా ఎవరైనా మరణించిన తరువాత చేయు స్నానము అని అర్దము) పరిశుద్దధ మైన వస్త్రములను కట్టుకొని యధా విధి కర్మలు ఆచరించి (అనగా నిత్య కర్మలు కాలకృత్య కర్మలు తీర్చుకొని అగ్నిని వ్రేల్చి అనగా యజ్ఞ మునకు కావలసిన అన్ని సామగ్రులను సిద్దము చెసికొని భక్తి యుక్తుడై సప్తర్షులను ఆవహింప చేసి శుభములైన పంచామృత రసములచే వారిని సంత్రుప్తులను గావించి, అభిషిక్తులను గావించి, చందన, అగరు, కర్పూరాది సుగంధములను అలంకరింపచేసి, అనేక విధములైన పువ్వులతో వారిన పూజించి, వస్త్రయజ్ఞో పవితముల చేత కప్పి ధూప దీప నైవేద్యములు పెట్టి అనేక శాకములు (అనగా కరలు) పాయసములు అనగా పరమాన్నములు మొ||న ఆరురుచులుగల షడ్రశోపేత భో(contracted; show full) ==ఉద్యాపన ఘట్టము:== ఓ దేవకీ నందనా ఈ వ్రతమునకు ఉద్యాపన విధానము ఎలా? సుమతి ఎలా చేసాడు దాని వివరము చెప్పవలెను అనిన వసుదేవ సుతుడు ఇలా చెప్పుచుండెను. ఓ కుంతీ కుమారా! మొదటి రోజున అనేక ఆహార పదార్ధములను చేసి, ప్రోద్దునేలేచి, స్నానముచేసి, గురువుదగ్గరకు చేరి ఆ గురువును చూచి, ఓ స్వామినే చేయు ఉద్యాపనము ఆచార్యుండ వైఉండుము అని ప్రార్ దథించి ముందు చెప్పిన విధి ప్రకారము భక్తితో ప్రార్దథించి పరిశుద్ధ ప్రదేశమును అలికి, అందు సర్వతొ భద్రమండలమను ఏర్పరచి (అనగా రాగి పాత్రైనకావచ్చును, రాగి చెంబుతో కలశమును తయారు చేసుకొనవలెను. ఆ చెంబునకు వస్త్రసూత్రమును కట్టి, పంచరత్నములను ఇచ్చి, పూలు, పండ్లు, గంధము, అక్షతలు మొ||గు వాటిచేత అర్పించి, ఇలా చేసిన తరువాత ఆ కలశమును పూజించవలెను. ఆ కలశము మీద సువర్ణ రజత తామ్రములతో (అనగా బంగారం, వెండి, రాగి మొ||వి ఏదైననూ శక్తిని మించక అనగా తమకున్న శక్తితో సప్తఋషుల బొమ్మలు చేయించి ఆ కలశములమీద ఉంచి ఫలపుష్పములతో కూడిన పంచవర్ణ నితానంబులను కట్టించి సమస్త పూజాద్రవ్యములతో మధ్యాహ్న సమయమున శ్రద్ధతో భక్తితో కశ్యషమహర్షి మొ||న సప్తఋషులను పూజించి, అరుంధతితో కూడిన కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్టులారా, నాచేత ఇవ్వబడిన అర్ఘ్యము తీసుకొని సంతోషములతో ఉండమని ప్రార్ధథించి, ఈవిధముగా పూజచేసి, స్థిరమైన మనసు కలవాడై, ఇలాంటి విధానముచే ఈవ్రతము ఏడు సంవత్సరముల చేయవలెను. దీనికి ఉద్యాపనము ఇంకను వేదవేదాం పారంగతులైన గురువులను ఋషులను పూజించి జటాజుటాసూత్రక మండల సమన్వితులును (అనగా బొమ్మలను) ఆకలశముల మీద ఉంచి పంచామృత స్నానమును భక్తితో చేయించి, విధ విధానము చేత సప్తర్షులను పూజించి, ఆ రాత్రి పురాణము చదువుటచేతను, వినుట చేతను జాగరణము చేసి, మరునాడు ఉదయమున స్నాన సంధ్యావంద నాదికములు ఆచరించి నిత్య కృత్యములు తీర్చుకొని (అనగా కాలకృత్యములు తీర్చుకొని) వేద మంత్రముల చేత నైననూ, పురాణములో చెప్పిన మంత్రమ(contracted; show full)ేయవలయును. ఇలా ఆచరించిన ఈ వ్రతము సర్వ తీర్ధముల యందు స్నానము చేసిన ఫలమును, అన్ని వ్రతములను ఆచరించిన పుణ్యమును ఇచ్చును. కావున ఓ ధర్మరాజా! ఏ వనిత (అనగా స్త్రీ) ఈ వ్రతమును ఆచరించునో ఆమె సమస్త పాపముల నుండి విముక్తురాలయు ఈ లోకమున చాలాకాలము పుత్రులతో పౌత్రులతో భర్తతో అనేక భోగముల అనుభవించి, నిత్య సౌభాగ్యముతో స్వర్గలోకములో కూడా పూజింపబడి చివరకు మోక్షము పొందును. అని శ్రీకృష్ణుడు చెప్పగా విని ధర్మరాజు సంతోషించెను. Source: http://www.epurohith.com/telugu/viewtopics.php?page=1&cat_id=634 [[వర్గం:హిందువుల పండుగలు]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=1984274.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|