Difference between revisions 736148 and 736804 on tewiki{{Unreferenced|date=July 2007}} {{Infobox airport |name = Netaji Subhash Chandra Bose International Airport |nativename = নেতাজী সুভাষচন্দ্র বসু আন্তর্জাতিক বিমানবন্দর |image = CCU_tarmac.jpeg |IATA = CCU |ICAO = VECC |type = Public | owner-oper = [[Airports Authority of India]] |city-served = [[Kolkata]] |location = [[Dum Dum]], [[India]] | hub = <div> *[[Indian Airlines]] *[[IndiGo]] *[[Kingfisher Airlines]] *[[SpiceJet]] *[[Blue Dart Aviation]] </div> |elevation-f = 16 |elevation-m = 5 |coordinates = {{Coord|22|39|17|N|088|26|48|E|type:airport_region:IN-WB|display=inline,title|name=Netaji Subhash Chandra Bose International Airport}} |website = [http://www.nscbiairport.org/ www.nscbiairport.org/] | metric-elev = Y | metric-rwy = Y |r1-number = 01L/19R |r1-length-f = 10,240 |r1-length-m = 3,200 |r1-surface = [[Asphalt]] |r2-number = 01R/19L |r2-length-f = 11,900 |r2-length-m = 3,627 |r2-surface = Asphalt |footnotes = }} [[దస్త్రం:CCU Entry Road.jpg|right|thumb|జెస్సోర్ రోడ్ నుంచి విమానాశ్రయంలోకి దారితీసే మార్గం]] [[దస్త్రం:CCU Domestic Entry.jpg|thumb|right|దేశీయ టెర్మినల్‌కు మార్గం ]] [[దస్త్రం:CCU Departure gate.jpg|right|thumb|మొదటి డొమెస్టిక్ గేట్]] [[దస్త్రం:CCU tarmac.JPG|thumb|ఎయిర్‌పోర్ట్ టార్మాక్ ]] [[దస్త్రం:AI A320 at CCU.jpg|right|thumb|దేశీయ టెర్మినల్ వద్ద ఇండియన్ ఎయిర్ లైన్స్ A320 విమానం]] '''నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం''' ({{lang-bn|নেতাজী সুভাষচন্দ্র বসু আন্তর্জাতিক বিমানবন্দর}} ''Netaji Shubhashchôndro Boshu Antorjatik Bimanbôndor'' ) {{Airport codes|CCU|VECC}} అనేది [[భారత దేశము|భారతదేశం]]లోని [[పశ్చిమ బెంగాల్|పశ్చిమ బెంగాల్]]లోని డమ్ డమ్‌లో ఉన్న ఒక విమానాశ్రయం. గ్రేటర్ [[కోల్‌కత|కోల్‌కతా]] మెట్రో ప్రాంతానికి ఇది సేవలందిస్తోంది. [[సుభాష్ చంద్రబోస్|సుభాష్ చంద్ర బోస్]] గౌరవార్థం పేరు మార్పు జరిగే వరకు దీనిని '''డమ్ డమ్ విమానాశ్రయం''' గా పిలిచేవారు. ముంబయ్, ఢిల్లీ, చెన్నై మరియు బెంగుళూరుల తర్వాత దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన ఐదవ విమానాశ్రయంగా గుర్తింపు సాధించిన ఈ విమానాశ్రయం ఏటా 8.5 మిలియన్ ప్రయాణీకులను ఆకర్షిస్తోంది. కోల్‌కతా నగర కేంద్రం నుంచి దాదాపు {{convert|17|km|mi|abbr=on}} దూరంలో ఇది కొలువై ఉంది. తూర్పు [[భారత దేశము|భారతదేశం]]లో అతిపెద్ద విమానాశ్రయంగా ఉండడంతో పాటు పశ్చిమ బెంగాల్‌లో ఉన్న రెండు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటి (మరొకటి బాగ్దోగ్రాలో ఉంది)గా ఉంటోంది. ఈశాన్య భారతదేశం, [[బంగ్లాదేశ్]] మరియు బ్యాంకాక్‌లకు వెళ్లే అన్ని విమానాలకు ఈ విమానాశ్రయం ఒక ప్రధాన కేంద్రం. == విమానాశ్రయం నిర్మాణం == ఈ విమానాశ్రయంలో మూడు టెర్మినల్స్ ఉన్నాయి: ఒక దేశీయ టెర్మినల్ (1990ల ప్రారంభంలో ప్రారంభమైంది), ఒక అంతర్జాతీయ టెర్మినల్ (పురాతనమైన టెర్మినల్) మరియు ఒక సరకు రవాణా టెర్మినల్ రూపంలో ఇవి సేవలందిస్తున్నాయి. గడచిన కొన్ని సంవత్సరాల్లో ఈ విమానాశ్రయం భారీస్థాయి కొత్త సౌకర్యాలను సొంతం చేసుకుంది{{Citation needed|date=November 2008}}.ప్రయాణీకుల రద్దీని తట్టుకునే దిశగా 2009లో ప్రస్తుతమున్న దేశీయ టెర్మినల్‌ను మరింతగా విస్తరించారు.ఇందులో భాగంగా కొత్త టికెట్ కౌంటర్లు, చెక్-ఇన్ కియోస్క్‌లు మరియు కేఫ్‌లు లాంటి వాటిని అదనంగా ఏర్పాటు చేశారు.విమానాశ్రయం వెలుపలి ప్రాంతంలో లోపలి మరియు వెలుపలి రద్దీని తట్టుకోవడం కోసం ట్రాఫిక్ లైన్లను నిర్మించారు.ఈ విమానాశ్రయం ప్రస్తుతం నాలుగు ఎయిరోబ్రిడ్జిలను కలిగి ఉంది.(ఇందులో మూడు దేశీయ టెర్మినల్‌లో ఉండగా, ఒకటి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది).కొత్త టెర్మినల్స్ నిర్మాణం పూర్తి కాగానే వీటి సంఖ్య ఒక్కసారిగా ఇరవైకి చేరుకోనుంది. ఈ విమానాశ్రయంలో ఒకదానికొకటి సమాంతరంగా రెండు రన్‌వేలు ఉన్నాయి. 01/19 L/R అనేది ఇందులో ఒకటి. ఇక రెండోది, పొడవైనది అయిన 01R/19Lను టేకాఫ్‌లు మరియు ల్యాండింగ్‌లు కోసం ఉపయోగిస్తున్నారు. అదేసమయంలో మొదటి రన్‌వేను మాత్రం చాలావరకు టాక్సీవే గాను మరియు పగటిపూట విమానాలు దిగేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ రన్‌వేను విస్తరించాలనే ప్రణాళిక ఉన్నప్పటికీ, దీనికి 100 అడుగుల దూరంలో విమానాశ్రయం పరిథిలో ఉన్న ఒక 119-ఏళ్ల నాటి [[మస్జిద్|మసీదు]] ఒకటి ఇందుకు అడ్డంకిగా నిలుస్తోంది<ref>[http://www.expressindia.com/latest-news/Kolkata-airport-Map-redrawn-land-to-be-acquired-highrises-trimmed-to-save-mosque/317195/ విమానాశ్రయం ప్రాంగణంలో నిర్మించిన మసీదు గురించి ఎక్స్‌ప్రెస్‌ఇండియా కధనం ]</ref>. === అనుసంధానత === కోల్‌కతా సబర్బన్ రైల్వే వ్యవస్థకు అనుసంధానంగా ఉన్న ఈ విమానాశ్రయం, టాక్సీ మరియు [[బస్సు]]ల ద్వారా అందుబాటులో ఉంది. విమానాశ్రయానికి మరియు నగరానికి మధ్య లో ఫ్లోర్ వోల్వో బస్సులు నిరంతరం తిరుగుతుంటాయి. ఇటీవల నగరానికి ఎయిర్ కండీషన్ వోల్వో బస్సు సర్వీసును కూడా ప్రవేశపెట్టారు. ప్రీ-పెయిడ్ విధానంలో మీటర్లతో కూడిన పసుపురంగు క్యాబ్‌లు, కోల్‌కతా క్యాబ్‌లు, రేడియో క్యాబ్‌లు మరియు మెగా క్యాబ్‌లు సైతం అందుబాటులో ఉన్నాయి. నిర్మాణ పనులు జరుపుకుంటోన్న కోల్‌కతా తూర్పు-పడమర మెట్రోను విమానాశ్రయం వరకు విస్తరించనున్నారు. దీంతోపాటు విమానాశ్రయం సమీపంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం ఒక ఫ్లైఓవర్‌ను సైతం నిర్మిస్తున్నారు. === ఆధునికీకరణ === ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ద్వారా ప్రస్తుతం ఈ విమానాశ్రయం కొత్త సొగసులను సంతరించుకుంటోంది. ఇందులో భాగంగా గడచిన మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో భారీగా పెరిగిన ప్రయాణీకుల రద్దీని తట్టుకునే దిశగా విమానాశ్రయం కోసం నాలుగో టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు{{Citation needed|date=November 2008}}. రన్‌వేల పొడవును పెంచే ఆలోచనను సైతం ఈ ఆధునికీకరణ ప్రణాళికలో భాగం చేశారు. మరోవైపు సబర్బన్ రైల్వే వ్యవస్థను ఈ విమానాశ్రయానికి అనుసంధానించారు. ఈ విమానాశ్రయం రోజుకు 360 విమానాల వరకు సేవలందించగలదు. రోజు రోజుకూ పెరుగుతున్న విమానాల రద్దీ కారణంగా నగరంలో రెండో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది{{Citation needed|date=November 2008}}. ఈ పనిని నిర్వహించేందుకు ప్రత్యేకత కలిగిన ప్రైవేట్ సంస్థల సేవలను ఉపయోగించుకునేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య సిద్ధమయ్యారు.ఇందులో భాగంగా విమానాశ్రయం ఆధునికీకరణ పనులను చేపట్టేందుకు కోల్‌కతాకు చెందిన సిక్కా అసోసియేట్స్‌తో పాటు థాయ్‌కి చెందిన కన్సార్టియంను నియమించారు. ఇప్పుడున్న దేశీయ టెర్మనల్ భవనానికి అవసరమైన మార్పులు చేయడం మరియు భవన ముఖభాగం మొత్తానికి జోడింపులు చేయడం ద్వారా దానిని ఉపయోగించడాన్ని కొనసాగించనున్నారు. కొత్తగా రెండు ఐదు నక్షత్రాల విలాసవంత హోటళ్లు మరియు ఒక షాపింగ్ మాల్ నిర్మించడం కోసం అవసరమైన స్థలం కోసం విమానాశ్రయానికి చెందిన పాత హోటల్ 'అశోక్'ను తొలగించారు. ప్రయాణీకులు మరియు ప్రజలకు సేవలు అందించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. ఆర్థిక మాంద్యం నుంచి కోలుకున్న పరిస్థితుల్లో అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్యలో విపరీతమైన పెరుగుదల చోటు చేసుకుంది. దీంతో 2012 నుంచి ఈ విమానాశ్రయం ఇప్పుడు సేవలందిస్తోన్న 1.01 మిలియన్ ప్రయాణీకులకు సంఖ్య కంటే ఎక్కువగా 4 మిలియన్ ప్రయాణీకులకు సేవలందించనుందని అంచనా <ref>(http://www.newkerala.com/news/fullnews-80564.html</ref>. AAI ఇటీవల ఈ విమానాశ్రయానికి సంబంధించిన సరకు రవాణా సామర్థ్యాన్ని మరింతగా వృద్ధి చేసింది. దీనివల్ల 2015-16 వరకు ఏర్పడే డిమాండ్‌ను తీర్చేందుకు మార్గం సుగమమైంది. 2006-07లో ఈ విమానాశ్రయం నుంచి 65,687 విమాన ప్రయాణాలు జరుగగా, అందులో అంతర్జాతీయ విమానాల సంఖ్య 9,414గా ఉండగా, స్వదేశీ విమానాల సంఖ్య 56,273గా నమోదైంది. కోల్‌కతా నుండి వెళ్లే మరియు వచ్చే అంతర్జాతీయ సరుకు రవాణా విషయంలో 25 శాతం వృద్ధి చోటు చేసుకోగా, అంతర్జాతీయ ప్రయాణంలో సైతం 15 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. నగరం నుంచి విదేశాలకు వెళ్లే సరుకు రవాణాలో ఆటోమొబైల్ విడి భాగాల వాటా ఎక్కువ భాగం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది కోల్‌కతా నుంచి వెళ్లే మరియు వచ్చే అంతర్జాతీయ సరుకు రవాణాలో దాదాపు 25 శాతం వృద్ధి నమోదు కావడంతో, ఆయా మార్గాల్లో మరిన్ని సరుకు రవాణా విమానాలను నడిపేందుకు విదేశీ విమానయాన సంస్థలు సిద్ధమయ్యాయి. 2008 నవంబర్‌లో విమానాశ్రయం వేదికగా పశ్చిమ బెంగాల్‌లోనే మొదటిసారిగా సెంటర్ ఫర్ పెరిషబుల్ కార్గో (CPC) ప్రారంభమైంది. CPC అనేది {{convert|742.5|m2|abbr=on}} విస్తీర్ణాన్ని కలిగి ఉండడంతో పాటు ప్రతి ఏటా 12,000 మిలియన్ టన్నుల సరకులను నిల్వచేయగల సామర్థ్యాన్ని కలిగినది. దీంతోపాటు మరిన్ని మార్పులు చేర్పులను సొంతం చేసుకునే దిశగా 2008 జూన్‌లో CPC ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా వాణిజ్య మంత్రిత్వ శాఖలో భాగమైన అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) అందించిన [[రూపాయి|Rs]].67.5 మిలియన్లతో కొత్త నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.<ref>[http://www.freshnews.in/west-bengal-gets-first-centre-for-perishable-cargo-77103 నశించే కార్గో సెంటర్ గురించి ఫ్రెష్‌న్యూస్ కధనం]</ref>. 2008-09లో ఎగుమతుల మొత్తం 21,683 టన్నులుగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో NSCBI అధికారులు 23,042 టన్నులకు మించిన సరుకు రవాణాను నిర్వహించారు. అదేవిధంగా దిగుమతులు సైతం 16,863 టన్నుల నుంచి 18,733 టన్నుల వరకు పెరగడం ద్వారా అదే ఏడాది ఈ విభాగంలో పది శాతం పెరుగుదల నమోదైంది. అయినప్పటికీ, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2008-09లో విమానాశ్రయం చేపట్టిన మొత్తం సరుకు రవాణాలో 4.8 శాతం తగ్గుదల నమోదైంది. రెండవ రన్‌వే విస్తరణకు సంబంధించిన పనులతో పాటు, వేగవంతమైన నిష్క్రమణ ట్యాక్సీవేలు మరియు పార్కింగ్ బేలు లాంటివి నిర్మాణం జరుపుకుంటున్నాయి. రెండవ రన్‌వేకు సంబంధించి ఇప్పటికే ఉత్తరం దిశగా {{convert|400|m|abbr=on}} మేర విస్తీర్ణం పూర్తయ్యింది. ఇక దక్షిణం దిశగా 1000 అడుగుల విస్తీర్ణం పనులతో పాటు వేగవంతమైన నిష్క్రమణ ట్యాక్సీ వేల నిర్మాణం జోరుగా జరుగుతోంది. రాత్రిపూట ఉపయోగం కోసం రెండవ రన్‌వేను CAT-I సౌకర్యాలతో పటిష్టం చేశారు. తక్కువ వెలుతురు ఉన్న సమయాల్లోనూ విమానాలు ల్యాండింగ్ కావడం కోసం ప్రాథమిక రన్‌వేను CAT-I నుంచి CAT-II ILS సౌకర్యాలతో పటిష్టం చేశారు. === కొత్త టెర్మినల్ === 2008 నవంబర్ నుంచి కొత్త సమగ్ర టెర్మినల్‌పై పనులు ప్రారంభమైంది.విమానాల రాక పోకలు రెండింటికీ ఉపయోగపడే విధంగా ఈ కొత్త సమగ్ర టెర్మినల్ అనేది ఒక రెండు-టైర్స్‌తో L-ఆకారపు నిర్మాణంగా పూర్తికానుంది. మొదటి దశలో భాగంగా {{convert|40000|m2|abbr=on}} ప్రాంతంలో ఆధునికీకరణ పనులు చేపట్టారు, విపరీతంగా పెరుగుతున్న రద్దీని తట్టుకునే దిశగా గంటకు 1,800 ప్రయాణీకులకు వసతి కల్పించే దిశగా ఈ నిర్మాణానికి తుదిరూపం ఇవ్వనున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే మిమానాశ్రయం మొత్తం సామర్థ్యం ప్రతి ఏటా 20 మిలియన్ ప్రయాణీకులకు సేవలు అందించగల స్థాయికి చేరుతుంది. ఈ కొత్త టెర్మినల్ భవనంలో 104 చెక్-ఇన్ కౌంటర్లు, 44 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, 25 సెక్యూరిటీ గేట్లు, ఐదు కన్వేయర్ బెల్టులు మరియు 15 ఎయిరోబ్రిడ్జీలు కొలువుదీరనున్నాయి. వీటితో పాటు ఈ కొత్త నిర్మాణంలో ఇన్‌లైన్ బ్యాగేజ్ వ్యవస్థ కూడా ఏర్పాటు కానుంది. తద్వారా ముందస్తు తనిఖీ కోసం ప్రయాణీకులు ఎక్స్‌రే మిషన్ల ద్వారా వెళ్లాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఈ కొత్త నిర్మాణానికి సంబంధించిన గోడలపై బెంగాలీ రచయిత మరియు నోబెల్ గ్రహీత అయిన [[రవీంద్రనాధ టాగూరు|రవీంద్రనాథ్ టాగూర్]] రచనలను ఏర్పాటు చేయనున్నారు. పగటిపూట ప్రకృతిసిద్ధ కాంతిని వినియోగించుకోవడంతో పాటు శీతలీకరణ వ్యవస్థలను కూడా తక్కువ మొత్తంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణానికి సంబంధించిన పైకప్పును సైతం వాననీటిని సేకరించే విధంగా నిర్మించడం ద్వారా ఆ నీటిని భూమిలో ఇంకేలా చేయనున్నారు. కార్ల కోసం ఉద్దేశించిన అండర్‌గ్రౌండ్ పార్కింగ్ సైతం ఇక్కడ నిర్మానం జరుపుకుంటోంది<ref>[http://groups.google.com/group/theindiastreet/web/new-kolkata-international-airport-pictures చిత్రములు కలిగిన కొత్త ఎయిర్‌పోర్ట్ గురించిన కధనం ]</ref>. ప్రతిపాదిత టెర్మినల్ భవనానికి సంబంధించి బేస్‌మెంట్ ప్రాంతంలో సిమెంట్‌ను నింపడంతో పాటు ప్రయాణీకులు వచ్చే ప్రాంతంలో మరియు పైన వచ్చే ప్రాంతంలోని వివిధ భాగాల్లో కాలమ్స్ నిర్మాణం, VIP రోడ్డు నుంచి నిర్మించే ప్రాతిపాదిత ఫ్లైఓవర్ కోసం వచ్చి పోయే మార్గాల అభివృద్ధి, టాక్సీవేలు మరియు అప్రాన్స్ మరియు రెండో రన్‌వే విస్తరణకు సంబంధించిన అతిపెద్ద భాగం నిర్మాణం లాంటి పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రయాణీకుల టెర్మినల్ వద్ద 1.8 లక్షల చదరపు మీటర్ల ప్రదేశం అందుబాటులోకి రావడం, 50,000 చదరపు మీటర్ల నిర్మాణం లాంటివి ఇప్పటివరకు పూర్తయ్యాయి. 400-మీటర్ల ప్రతిపాదిత రెండవ రన్‌వే విస్తరణ, 73 మీటర్లపై పనులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఆక్రమణ కారణంగా రన్‌వే విస్తరణ పనుల్లో జాప్యం చోటు చేసుకుంటోంది<ref>http://www.thehindubusinessline.com/2010/03/31/stories/2010033152511900.htm</ref>. === MRO హ్యాంగర్ సౌకర్యాలు === ఎయిర్ ఇండియా మరియు ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లు కోల్‌కతా విమానాశ్రయంలో హ్యాంగర్ సౌకర్యాలను కలిగి ఉన్నాయి. == ఎయిర్‌లైన్స్ మరియు గమ్యస్థానాలు == === షెడ్యుల్డ్ ప్యాసింజెర్స్ ఎయిర్‌లైన్స్ === {{Airport-dest-list |3rdcoltitle = Terminal |[[AirAsia]]|Kuala Lumpur<!--DO NOT ADD PENANG. THAT WAS WRONG NEWS. -->| International |[[Air India]] operated by [[Indian Airlines]]|Delhi<!--DO NOT ADD NEW YORK-JFK OR LONDON-HEATHROW AS THESE DESTINATIONS FROM KOLKATA REQURE THE PASSENGERS TO CHANGE PLANES IN DELHI! -->| International |[[Air-India Express]]|Bangkok-Suvarnabhumi, Dhaka, Singapore | International |[[Air India Regional]]|Agartala, Aizawl, Dimapur, Guwahati, Imphal, Jorhat, Nagpur, Shillong, Silchar, Tezpur | Domestic |[[Biman Bangladesh Airlines]]|Dhaka | International |[[China Eastern Airlines]]|Kunming | International |[[Druk Air]]|Paro | International |[[Emirates (airline)|Emirates]]|Dubai | International |[[GMG Airlines]]|Chittagong, Dhaka | International <!-- Do not add Hainan Airlines: no exact date known and no charters to be listed --> |[[Indian Airlines]]|Agartala, Aizawl, Bagdogra, Bangalore, Chennai, Delhi, Dibrugarh, Dimapur, Guwahati, Hyderabad, Imphal, Mumbai, Port Blair, Silchar | Domestic |Indian Airlines| Kathmandu, Yangon | International |[[IndiGo]]|Agartala, Ahmedabad, Bangalore, Chennai, Delhi, Dibrugarh, Guwahati, Hyderabad, Imphal, Jaipur, Kochi, Lucknow, Mumbai, Nagpur, Patna, Pune, Vadodara | Domestic |[[Jet Airways]]|Agartala, Bagdogra, Bangalore, Bhubaneswar, Chennai, Delhi, Guwahati, Jorhat, Lucknow, Mumbai, Patna, Pune, Ranchi | Domestic |Jet Airways|Bangkok-Suvarnabhumi, Dhaka | International |[[JetLite]]|Agartala, Bangalore, Delhi, Guwahati, Imphal, Jorhat, Mumbai, Port Blair, Visakhapatnam | Domestic |[[Kingfisher Airlines]]|Agartala, Ahmedabad, Aizawl, Bagdogra, Bangalore, Bhubaneswar, Chennai, Delhi, Goa [begins 31 October], Guwahati, Hyderabad, Imphal, Indore [begins 31 October], Mumbai, Patna, Pune [begins 31 October], Raipur, Ranchi, Silchar, Trivandrum [begins 31 October]| Domestic |Kingfisher Airlines|Bangkok-Suvarnabhumi, Dhaka | International |[[Lufthansa]]|Frankfurt [ends 26 March]| International |[[Singapore Airlines]]|Singapore | International |[[SpiceJet]]|Agartala, Ahmedabad, Bagdogra, Bangalore, Chennai, Delhi, Goa, Guwahati, Hyderabad, Jaipur, Mumbai, Pune | Domestic |[[Thai Airways International]]|Bangkok-Suvarnabhumi | International |{{nowrap|[[United Airways]]}}|Dhaka | International }} === సరుకు రవాణా టెర్మినల్ === {{Airport-dest-list |[[Air India Cargo]]|Mumbai, Delhi, Chennai, Thiruvananthapuram, Hyderabad, Bangalore, Ahmedabad, Goa, Kochi, Kozhikode, Lucknow |Biman Bangladesh Cargo|Dhaka, Dubai |[[Blue Dart Aviation]]|All Major Indian Cities |[[Deccan 360]]|All Major Indian Cities |[[Emirates SkyCargo]]|Dubai |[[Etihad Crystal Cargo]]|Abu Dhabi |[[Jade Cargo]]|Lahore, Shenzhen |Kingfisher Cargo|23 Destinations around India |[[Qatar Airways Cargo]]|Doha, Dhaka |[[Singapore Airlines Cargo]]| }} == విమానాశ్రయం సేవలు == === లాంజ్‌లు === దేశీయ డిపార్చర్ లాంజ్‌లను కింది సంస్థలు అందిస్తున్నాయి: *ఎయిర్ ఇండియా *జెట్ ఎయిర్‌వేస్ *కింగ్‌పిషర్ ఎయిర్‌లైన్స్ === కేటరర్స్(ఆహార సరఫరాదార్లు) === *ఓబరాయ్ ఫ్లైట్ సర్వీసెస్ *TAJ-SATS === ఇంధనం అందించేవారు === *భారత్ పెట్రోలియం *ఇండియన్ ఆయిల్ == రెండవ ప్రపంచ యుద్ధం == 1942లో [[మయన్మార్|బర్మా]]పై సాగించిన యుద్ధంలో, యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ 7వ బాంబర్డ్‌మెంట్ గ్రూప్‌కు చెందిన B-24 లిబరేటర్ బాంబర్స్ ఈ విమానాశ్రయం నుంచే ఎగిరివెళ్లాయి. కలకట్టాకు అత్యంత సమీపంలో ఉందన్న కారణంతో యుద్ధం జరిగినంతకాలం రవాణా మరియు ఉపకరణాల కోసం ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ కమాండ్ ద్వారా ఈ వైమానిక కేంద్రం ఒక కార్గో ఏరియల్ పోర్ట్‌గా ఉపయోగించబడింది. అలాగే టెన్త్ ఎయిర్ ఫోర్స్ కోసం ఒక సమాచార కేంద్రంగా కూడా ఇది వినియోగించబడింది.<ref>మౌరెర్, మౌరెర్ (1983). వరల్డ్ వార్ II యొక్క ఎయిర్ ఫోర్స్ కాంబాట్ యూనిట్స్ మ్యాక్స్‌వెల్ AFB, అలబామా: ఆఫీస్ అఫ్ ఎయిర్ ఫోర్స్ హిస్టరీ. ISBN 0-262-08150-4</ref> == ఛాయాచిత్ర మాలిక == <gallery> File:VECC-intl-kerb.jpg|NSCBI ఎయిర్ పోర్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ యొక్క కెర్బ్‌సైడ్ దృశ్యం File:VECC-intl-boarding-area.jpg|NSCBI ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ యొక్క బోర్డింగ్ ప్రాంతం File:VECC-intl-gate-01.jpg|NSCBI ఎయిర్‌పోర్ట్‌లోని ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్ద ఉన్న బోర్డింగ్ గేట్ 1 File:VECC-intl-airside.jpg|NSCBI ఎయిర్‌పోర్ట్‌లోని ఇంటర్నేషనల్ టెర్మినల్ యొక్క ఎయిర్‌సైడ్ </gallery> == వీటిని కూడా చూడండి. == {{Portal|World War II}} * పశ్చిమ బెంగాల్ విమానాశ్రయాల జాబితా == సూచనలు == {{AFHRA}} <references></references> == బాహ్య లింకులు == * ఎయిర్‌పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా వెబ్ సైట్‌లో [http://www.airportsindia.org.in/kolkata/index.jsp నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ] * {{WAD|VECC}} * {{ASN|CCU}} {{Airports in India}} {{Kolkata topics}} {{USAAF 10th Air Force World War II}} {{Use dmy dates|date=October 2010}} [[వర్గం:భారతదేశంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు]] [[వర్గం:కోల్‌కతాలో రవాణా]] [[వర్గం:కోల్‌కతాలో భవనాలు మరియు నిర్మాణాలు]] [[వర్గం:సుభాస్ చంద్ర బోస్]] [[వర్గం:బ్రిటిష్‌రాజ్‌లోని యునైటెడ్ స్టేట్స్ అర్మీ ఎయిర్ ఫోర్సెస్ యొక్క ఎయిర్‌ఫీల్డ్స్]] [[వర్గం:పశ్చిమబెంగాల్‌లోని విమానాశ్రయాలు]] [[వర్గం:ప్రతిపాదిత విమానాశ్రయ విస్తరణ]] [[en:Netaji Subhash Chandra Bose International Airport]] [[hi:नेताजी सुभाष चंद्र बोस अन्तर्राष्ट्रीय हवाई अड्डा]] [[ml:നേതാജി സുഭാഷ് ചന്ദ്രബോസ് അന്താരാഷ്ട്രവിമാനത്താവളം]] [[bn:নেতাজি সুভাষচন্দ্র বসু আন্তর্জাতিক বিমানবন্দর]] [[de:Flughafen Kolkata]] [[es:Aeropuerto Internacional Netaji Subhash Chandra Bose]] [[fi:Netaji Subhash Chandra Bosen kansainvälinen lentoasema]] [[fr:Aéroport international Netaji Subhash Chandra Bose]] [[id:Bandar Udara Internasional Netaji Subhash Chandra Bose]] [[it:Aeroporto Internazionale Netaji Subhash Chandra Bose]] [[ja:ネータージー・スバース・チャンドラ・ボース国際空港]] [[ko:네타지수바시 찬드라 보스 국제공항]] [[mr:नेताजी सुभाषचंद्र बोस आंतरराष्ट्रीय विमानतळ]] [[ms:Lapangan Terbang Netaji Subhash Chandra Bose In]] [[new:नेताजी सुभाष चन्द्र बोस अन्तर्राष्ट्रीय विमानस्थल]] [[no:Netaji Subhash Chandra Bose internasjonale lufthavn]] [[pl:Port lotniczy Kolkata]] [[ru:Международный аэропорт имени Нетаджи Субхас Чандра Боса]] [[sv:Netaji Subhash Chandra Bose International Airport]] [[vi:Sân bay quốc tế Netaji Subhash Chandra Bose]] [[zh:内塔吉·苏巴斯·钱德拉·鲍斯国际机场]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=736804.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|