[[Pension]]s
[[Mutual fund]]s | market cap = Rs.12,463 crores (2005-2006) | revenue = | operating_income = | net_income = | assets = {{INRConvert|9.31|t}} | equity = | num_employees = 112,184 (2008) | owner = [[Government of India]] | subsid = LIC Housing Finance Limited
LIC(Nepal)Ltd
LIC(Lanka)Ltd
LIC(International)BSC(C) | homepage = [http://www.licindia.in www.licindia.in] | footnotes = | intl = yes }} '''లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా''' ({{lang-hi|भारतीय जीवन बीमा निगम}})('''LIC''' ) రాష్తట్రముల సొంతమైన, పెద్ద జీవిత భీమాకంపెనీ, మరియు [[భారత దేశము|భారతదేశము]]లో పెద్ద పెట్టుబడి సంస్థ. ఇది పూర్తిగా [[భారత ప్రభుత్వము|భారత ప్రభుత్వం ]]వారి సొంతము. ఇది దాదాపుగా భారతీయ ప్రభుత్వం ఖర్చులలో 24.6% వరకు నిధులను సమకూర్చుతుంది. ఇది {{INRConvert|9.31|t}}<ref>{{cite web|url=http://www.telegraphindia.com/1100308/jsp/business/story_12190577.jsp |title=The Telegraph - Calcutta (Kolkata) | Business | LIC seeks to pack greater funds punch |publisher=Telegraphindia.com |date=2010-03-08 |accessdate=2010-08-30}}</ref> ఆస్తులను కలిగి ఉంది. ఇది 1956లో దాదాపు 200లకు పైగా భీమా కంపెనీలు మరియు ప్రావిడెంట్ సంస్థల కూటమిగా ఆవిర్భవించింది. <ref>[http://www.myinsuranceclub.com/life-insurance/companies/lic-of-india లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ అఫ్ ఇండియా]</ref> లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా భారత ఆర్ధిక మరియు వాణిజ్య రాజధాని<ref>{{cite web|url=http://www.iloveindia.com/finance/insurance/companies/lic.html |title=Life Insurance Corporation of India - LIC - LIC India |publisher=Iloveindia.com |date= |accessdate=2010-08-30}}</ref> అయిన [[ముంబై|ముంబై]] లో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. ఇంకా ప్రస్తుతము 8 జోనల్ కార్యాలయాలు మరియు భారతదేశములోని వేరు వేరు ప్రాంతములలో, నగరములలో, జిల్లా కేంద్రములు మొదలైన వాటిలో 101 డివిజినల్ కార్యాలయాలు కలిపి దాదాపుగా 2048 శాఖలు కలిగి ఉంది.అలాగే దాదాపు 50 శాఖలు ఉపగ్రహము ద్వారా కలపబడి ఉన్నాయి. ఇంకా 1.2 మిలియన్ల ఏజెంట్ లు జీవిత భీమా వ్యాపార సేవలు ప్రజలకు అందిస్తున్నారు. ==చరిత్ర== ఓరియంటల్ జీవిత భీమా సంస్థ భారతదేశములో తొలిసారిగా జీవిత భీమా కవరేజ్ ను ఇచ్చిన సంస్థ. ఇది 1818లో బిపిన్ బిహారీ దాస్ గుప్త మరియు ఇంకా కొంతమంది ద్వారా కలకత్తాలో ప్రారంభించబడినది. వారి వ్యాపారమునకు భారతదేశములోని యురోపియన్లు మొదటి లక్షముగా ఉండేవారు మరియు భారతీయుల నుండి అధిక మొత్తములో ప్రీమియమ్స్ వసూలు చేసేవారు. 1870 లో వచ్చిన బాంబే మ్యూచువల్ లైఫ్ ఎష్యురెన్స్ సొసైటీ, తోలిసారిగా భీమాను ఇచ్చే స్వదేశి సంస్థ అయింది. స్వంతంత్రము రాక ముందు ప్రారంభించబడిన జీవిత భిమా సంస్థలు: *భారత్ ఇన్సూరెన్స్ కంపెనీ (1896) *యునైటెడ్ ఇండియా(1906) *నేషనల్ ఇండియన్(1906) *నేషనల్ ఇన్సూరెన్స్ (1906) *కో-ఆపరేటివ్ ఎష్యురెన్స్ (1906) *హిందుస్తాన్ కో-ఆపరేటివ్స్(1907) *ఇండియన్ మర్చెంటైల్ *జనరల్ ఎష్యురెన్స్ *స్వదేశీ లైఫ్ (ఆ తరువాత బాంబే లైఫ్) మొదటి 150 సంవత్సరములు అత్యంత ప్రతికూల పరిస్థితులు ఉండేవి. తొలి స్వతంత్ర సంగ్రామముకు,[[మొదటి ప్రపంచ యుద్ధం|మొదటి ప్రపంచ యుద్దము ]]మరియు [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండవ ప్రపంచ యుద్దము]] వలన భారతదేశపు ఆర్ధికరంగము పై కలిగిన దుష్పరిణామములకు మరియు ఆ రెండింటి మధ్య యావత్ ప్రపంచములో వచ్చిన తీవ్రమైన ఆర్ధిక సంక్షోభమునకు ఇది ప్రత్యక్షసాక్షిగా నిలిచింది. 20వ శతాబ్దం మొదటి సగములో కూడా బలమైన భారత స్వాతంత్ర పోరాటము చూసింది. వీటి అన్నిటి సమిష్టి ఫలితము ఎన్నో భారతీయ జీవిత భీమా సంస్థలు నష్టపోవడానికి,ఆ తరువాత విలినమునకు కారణము అయ్యింది. ఇది మాములు ప్రజలకు జీవితభీమా పై ఉన్న నమ్మకము పై ప్రతికూల ప్రభావము చూపించింది. లైఫ్ ఇన్సురెన్స్ యాక్ట్ మరియు ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ లు 1912లో వచ్చాయి. ఇవి మొదటిసారిగా ఒక సరైన, ప్రమాణికమైన పద్ధతిని జీవిత భీమా వ్యాపారములోకి తెచ్చాయి. ప్రభుత్వము, ఇండియన్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1928 ద్వారా కంపనీల నుండి జీవిత భీమా మరియు ఇతర రకములైన భీమాలకు సంబంధించిన సాంఖ్యకశాస్త్ర వివరములను తీసుకోగలదు. ఆ తరువాత వచ్చిన ఇన్సూరెన్స్ యాక్ట్ 1938, ఆర్ధికముగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కుంటున్న పరిశ్రమల పై మరింత పట్టు వచ్చేలా చేసింది. 1944లో లెజిస్లేటివ్ అసెంబ్లీలో భీమా పరిశ్రమని జాతీయము చేయడానికి ఒక బిల్ ప్రవేశపెట్టబడింది. ==జాతీయం చేయడము== 1955లో పార్లమెంటు సభ్యుడు అయిన అమోల్ బరాటే భీమాలో యజమానుల మరియు ప్రైవేట్ భీమా సంస్థలలో జరిగే మోసముల గురించి లేవనెత్తారు. ఆ తరువాత జరిగిన విచారణతో,టైమ్స్ అఫ్ ఇండియా దిన పత్రిక యజమాని మరియు భారతదేశములోని ధనవంతుల్లో ఒకరైన రామ్ కిషన్ దాల్మియా, రెండు సంవత్సరములు జైలుపాలు అయ్యారు. దాని ఫలితముగా,[[భారత పార్లమెంటు|భారత పార్లమెంట్ ]]1956-06-19 న జీవితభీమా చట్టంను ప్రతిపాదించింది. దీని ద్వారా 245 ప్రైవేట్ భీమా సంస్థలను మరియు జీవితభీమాను ఇస్తున్న ఇతర వాటిని ఒకటిగా చేసి జీవిత భీమా సంస్థ ఆవిర్భవించింది. జీవిత భీమా సంస్థ జాతీయం అవ్వడము, 1956లో ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ ఫలితముగా జరిగింది, ఈ పాలసీ ప్రకారము కనీసము ఆర్ధిక రంగమునకు సంబంధించిన పదిహేడు శాఖల పై రాష్ట్రమునకు నియంత్రణ అధికారమును ఇచ్చింది. అందులో జీవితభీమా ఒకటి. ==ప్రస్తుత పరిస్థితి== [[File:LICDELHI.jpg|right|thumb|ఎల్ఐసి భవనము,కాన్నాగ్ట్ ప్లేస్,న్యూ ఢిల్లీ,డిజైన్ చేసినవారు చార్లెస్ కొరియా, 1986.]] దాదాపు 50 సంవత్సరములుగా భారతదేశములో భీమా అందించే ఏకైక అగ్రగామి సంస్థగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ అఫ్ ఇండియా ఎదిగింది. అలాగే చాలా ఎక్కువగా ధనమును సంపాదించి 2006లో భారతదేశపు GDPలో దాదాపు 7% వరకు ఇవ్వగలిగింది. 300ల కార్యాలయాలతో, 5.6 మిలియన్ల పాలసీలు మరియు 459 మిలియన్ల INR (US$ 92 , 1959లో భారతదేశ రూపాయలలో ఒక <ref>{{cite web|url=http://data.un.org/Data.aspx?d=CDB&f=srID:6080 |title=UNdata | record view | Exchange rate, US$ per national currency, period average (IMF) |publisher=Data.un.org |date=2008-05-22 |accessdate=2010-08-30}}</ref>US$ విలువ 5 రూపాయలు ప్రకారం) లతో మొదలైన ఈ సంస్థ ఇప్పడు 25000 కార్యాలయాలతో, 180 మిలియన్ల పాలసీలతో మరియు {{INRConvert|8|t}}ధనమునకు ఎదిగింది. ఈ మధ్య ఎకనమిక్ టైమ్స్ చేసిన బ్రాండ్ ఈక్విటీ సర్వేలో LIC '''దేశపు నెం.1 సర్వీస్ బ్రాండ్ ''' గా ఎన్నిక అయింది. ==సూచనలు== {{reflist}} == బాహ్య లింకులు == * [http://www.licindia.in/ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ అఫ్ ఇండియా ]- అధికారిక LIC వెబ్ సైట్ {{Major insurance companies}} [[Category:ముంబాయి కేంద్రంగా ఉన్న సంస్థలు]] [[Category:భారతదేశము లోని ప్రభుత్వము సొంతమైన సంస్థలు]] [[Category:భారతదేశము యొక్క ఇన్స్యూరెన్స్ సంస్థలు]] [[Category:ఇన్స్యూరెన్స్ సంస్థలు]] [[Category:1956లో స్థాపించబడిన సంస్థలు]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=864657.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.