Difference between revisions 814060 and 862884 on tewiki{{Other uses|Desperado (disambiguation)}} {{Infobox Film | name = Desperado | image = Desperado1.jpg | caption = Theatrical poster | director = [[Robert Rodriguez]] | producer = [[Robert Rodriguez]]<br>[[Elizabeth Avellan]]<br>[[Carlos Gallardo (actor)|Carlos Gallardo]]<br>[[Bill Borden]] | writer = [[Robert Rodriguez]] | narrator = | starring = [[Antonio Banderas]] | music = [[Los Lobos]] and [[Tito & Tarantula]] | cinematography = [[Guillermo Navarro]] | editing = [[Robert Rodriguez]] | distributor = [[Columbia Pictures]] | released = August 25, 1995 | runtime = 106 minutes | country = {{filmUS}} | language = English | budget = $7,000,000 | gross = $25,405,445 (U.S.)<ref>http://www.boxofficemojo.com/movies/?id=desperado.htm</ref> | preceded_by = ''[[El Mariachi]]'' | followed_by = ''[[Once Upon a Time in Mexico]]'' }} '''''డెస్పరాడో'' ''' , 1995లో రాబర్ట్ రోడ్రిగ్జ్ రచన మరియు దర్శకత్వంలో వచ్చిన అభినయ ప్రాధాన్య ఉత్కంట భరిత చిత్రం. తన ప్రియురాలిని హత్య చేసిన మాదకద్రవ్య వ్యాపారిపై పగతీర్చుకోవాలనుకునే మాజీ మరియాచి గాయకునిగా అంటోనియో బండేరాస్, మరియు [[సాల్మా హాయక్|సల్మా హయెక్]] లు ఈ చిత్రంలో నటించారు. ''డెస్పరాడో'' , రోడ్రిగ్జ్ యొక్క స్వతంత్ర చిత్రం ''ఎల్ మరియాచి'' (1992) కి తరువాయి భాగం మరియు "మెక్సికో ట్రిలోజీ" లోకి పునః ప్రవేశం. ఇది 1995 కేన్స్ చలన చిత్రోత్సవం పోటీలలో తొలగించబడింది.<ref name="festival-cannes.com">{{cite web |url=http://www.festival-cannes.com/en/archives/ficheFilm/id/3376/year/1995.html |title=Festival de Cannes: Desperado |accessdate=2009-09-08|work=festival-cannes.com}}</ref> == కథాంశం == ఒక పేరు తెలియచేయని వ్యక్తి ( పేర్లలో "బుషెమి"గా సూచించబడింది) (స్టీవ్ బుషెమి) మదధ్యశాల లోనికి ప్రవేశిస్తాడు. ప్రారంభంలో వినియోగదారులు అతని పట్ల అనుచితంగా ఉంటారు కానీ అతను అది పట్టనట్లుగా కనిపిస్తాడు. తాను వేరొక పట్టణంలోని మదధ్యశాలలో ఉన్నపుడు దానిని తుడిచి పెట్టిన బుషో అనే వ్యక్తి కొరకు అన్వేషిస్తున్న ఒక నల్ల దుస్తులలోని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో అతను చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ కధ అక్కడ ఉన్న వ్యక్తులను, మదధ్యం సరఫరాదారుడిని (చీచ్ మారిన్) మరియు అతని సహాయకుడు టావో (టిటో లర్రివ) లను భయపెట్టగా, వారు ఆ వ్యక్తి ముఖ కవళికలను గురించి వర్ణనను అడుగుతారు. బుషెమి తనకు గుర్తింపు చిహ్నాలేవీ తెలియవని మరియు ఆ వ్యక్తి ఈ మార్గంలోనే ముందుకు వస్తున్నట్లు తాను నమ్ముతున్నానని తెలియచేస్తాడు. ఈ కధలోని వ్యక్తి అయిన ఎల్ మరియచి (అంటోనియో బండేరస్) మొదటి చిత్రంలో తన ప్రియురాలైన డొమినోతో కల నుండి మెలకువలోనికి వస్తాడు. తలుపు కొట్టిన శబ్దం విని బుషెమిని లోనికి ఆహ్వానిస్తాడు. బుషో గురించి అన్వేషణలో బుషెమి, ఎల్ కి సహాయపడుతున్నాడని తెలుస్తుంది. తాను ఇంతకుముందు వెళ్ళిన మదధ్యశాలలోనే బుషోని కనుగొనగలడని అతను ఎల్ కి చెప్తాడు. పగ తీరిన తరువాత ఏమి చేస్తావని బుషెమి, ఎల్ ని అడుగుతాడు. ఎల్ దానితో అది అంతమవుతుందని చెప్తాడు. బుషెమి తనకు ఆనందంగా ఉందని చెప్తాడు. ఆ విధమైన విషయాలకు బుషెమి ఎప్పుడూ సరిపోడని ఎల్ పేర్కొంటాడు. దానికి అతడు: "నువ్వు కూడా అంతే" అని జవాబిస్తాడు. తరువాత ఎల్, మరియాచి గాయకునిగా కనిపించే విధంగా తయారై పట్టణంలోనికి వెళ్తాడు. మొదటి చిత్రంలో మోకో వలన తగిలిన తుపాకీ గాయంలో తన ఎడమచేతి వేళ్ళు దెబ్బతినడం వలన వాటిని ఉపయోగించలేనప్పటికీ, అతను ఒక యువకుడికి గిటార్ వాయించేటపుడు వేళ్ళు వదులుగా ఉంచడం గురించి నేర్పుతాడు. ఇదిలాఉండగా, "నల్ల దుస్తులలోని వ్యక్తి" తన కోసం వస్తున్నాడని బుషో కలత చెందుతూ ఉంటాడు. అపరిచితులపై ఒక కన్ను వేసి ఉంచవలసిందిగా తన అనుచరులను ఆజ్ఞాపిస్తాడు మరియు తుపాకీ గుళ్ళు ఛేదించలేని ఒక కారుని కొనుగోలు చేస్తాడు. ఎల్ అప్పుడు మదధ్యశాల లోనికి వెళతాడు. బుషెమి కధలో వర్ణించినట్లుగా అతను లేకపోయినప్పటికీ ("ఎప్పుడూ లేనంత పెద్ద మెక్సికన్!")ఆ మదధ్యశాల యజమానులు అతనిని నల్ల దుస్తులలో ఉండటంతో అనుమానిస్తారు. వారు తుపాకీని పట్టుకొని అతనిని బంధించి వారికి చెప్పబడినట్లుగా("నేను ఎప్పుడూ చూడనంత పెద్ద చేతి ఫిరంగి!") ఆయుధాలను వెదకటానికి గిటార్ ఉంచే పెట్టెను వెదకుతారు, కానీ అక్కడ గిటార్ మాత్రమే ఉంటుంది. పెట్టెలో ఉన్న గిటార్ అతని తుపాకులు దాచుకునే స్థలంగా మాత్రమే తెలియడంతో వారు అతనిని వదలి వేస్తారు. వారు అతనిని చంపడానికి ప్రయత్నిస్తారు కానీ అతను దాచి ఉంచిన రూగర్ P90.45 ACP తుపాకులను అతని భుజాల వద్ద నుండి తీసి వారితో భయంకరమైన తుపాకీ కాల్పులతో పోరాటం జరుపుతాడు. ఇదిలా ఉండగా, ఒక రహస్య గదిలో అనేకమంది వ్యక్తులు వీడియో తెర ద్వారా ఈ తుపాకీ పోరాటాన్ని చూస్తూ ఉంటారు మరియు మాదకద్రవ్యాలను తీసుకువచ్చే వ్యక్తి అయిన (క్వెంటిన్ తరంటినో) తమను మోసం చేసాడని భావించి టావో అతనిని చంపేస్తాడు. బుషో వద్దకు తనను తీసుకు వెళతాడని అనుకున్న మదధ్యం సరఫరా చేసే వ్యక్తిని మినహాయించి ఎల్ అందరు వ్యక్తులను చంపుతూ వెళతాడు కానీ రహస్యంగా దాక్కున్న వ్యక్తి అతని నుదుటిపై కాల్పులు జరపడంతో అతను మరణిస్తాడు. వారు ఒకరినొకరు కాల్చుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ తూటాలు అయిపోవడంతో క్రింద పడిపోయిన వ్యక్తుల తుపాకులను ఉపయోగించాలని ప్రయత్నిస్తారు కానీ అవి అన్నీ ఖాళీగా ఉన్నాయని తెలుసుకుంటారు. చివరకు ఎదుటి వ్యక్తికి ఒక తుపాకీ దొరకగా అతను దానితో ఎల్ ను కాల్చాలని ప్రయత్నిస్తాడు, కానీ ఎల్ అతని మెడను విరిచివేస్తాడు. మదధ్యం సరఫరా చేసే వ్యక్తి యొక్క స్నేహితుడు మరియు బుషో అనుచరుడు అయిన టావో తనను అనుసరిస్తున్నాడని తెలియక, అప్పుడు అతను మదధ్యం దుకాణాన్ని విడిచి వెళతాడు, ఆ వ్యక్తి డెసర్ట్ ఈగల్ మరియు రూగర్ పి90 అనే రెండు తుపాకులను బహిరంగంగా తీసుకు వెళుతుంటాడు. నడుస్తూ ఉండగా, ఒక అందమైన స్త్రీ ([[సాల్మా హాయక్|సల్మా హయక్]]) తన వద్దకు నడుస్తూ రావడాన్ని అతను గమనిస్తాడు. వెనుక ఉన్న వ్యక్తిపై ఆందోళనతో కూడిన ఆమె భావం ఎల్ ను హెచ్చరిస్తుంది మరియు అతని చేతిపై కాల్పులు జరగడంతో సరైన సమయంలో ఆమెను బలంగా పక్కకు నెట్టి వేస్తాడు, అయితే అతను టావోను చంపగలుగుతాడు. తరువాత, ఆమె తన చేతిని కుడుతుండగా ఎల్ ఒక పుస్తక దుకాణంలో కళ్ళు తెరుస్తాడు. తన పేరు కెరొలిన అని ఆమె తెలియచేస్తుంది. అతను ఆసుపత్రికి వెళ్ళాలని కోరుకుంటాడు కానీ వారు చూస్తే అది సాధ్యం కాదని ఆమె తెలుపుతుంది. అతను తాను ఎక్కడ ఉన్నానని ఆమెను ప్రశ్నించగా ఆమె తన అది తన పుస్తక దుకాణమని, కానీ వ్యాపారం అంత బాగా సాగడం లేదని తెలుపుతుంది. ఆమె అతనికి ఇచ్చిన బాధానివారిణుల వలన అతను గాఢనిద్రలోకి వెళతాడు. కెరొలిన కొన్ని పనులు చేసుకొని తిరిగి దుకాణానికి తిరిగివస్తుంది. అతని గిటార్ పెట్టెపై ఆసక్తితో ఆమె గిటార్ చూద్దామని తెరుస్తుంది, కానీ దానిలో అతని తుపాకులను చూస్తుంది. అప్పుడు ఎల్ ఆమెను లాక్కుంటాడు. అతను ఎవరో తనకు తెలుసని ఆమె చెప్తుంది ("మేము ఎప్పుడూ కధలలో వినే వ్యక్తివి నువ్వే.") అతనిని చూసి ఆమె భయపడినట్లు కనిపించదు. అతను తన తుపాకులలో ఒకదానిని ఆమెకు కానుకగా ఇవ్వాలని అనుకుంటాడు కానీ ఆమె దానికి నిరాకరిస్తుంది. అతను చర్చ్ కి వెళ్ళడానికి బయలుదేరతాడు, అక్కడ అతను బుషెమిని కలువగా అతను ఇంకా చేయగల్గి ఉండగానే పారిపొమ్మని, అదే తానూ చేస్తున్నానని చెప్తాడు. తనను ఎవరో అనుసరిస్త్తున్నట్లు తెలియని ఎల్, బుషెమిని అనుసరించి వాదించడం ప్రారంభిస్తాడు, ఈసారి చిత్రం మొత్తంలో అతనిని రహస్యంగా అనుసరించే నల్ల దుస్తులలో ఉన్న మరొకవ్యక్తి (పేర్లలో "నవజాస్" అని సూచించబడ్డాడు) (డానీ ట్రెజో సూచించబడ్డాడు)ఎల్ ని అనుసరిస్తాడు. ఆ సమయంలో అతను బుషెమితో బహుశా తాను వదలిపెట్టి వెళ్ళవచ్చని అంటాడు. బుషెమి దీనికి అంగీకరిస్తాడు, కానీ నవజాస్ కత్తులు విసరడంతో అతను చనిపోతాడు. ఎల్ కి కూడా అవి తగులుతాయి, కానీ అతను కేవలం గాయపడి ఒక చిన్న సందులో దాక్కుంటాడు. నవజాస్ మార్గం వద్ద విశ్వాసంతో ఎదురు చూస్తుంటాడు. ఆయుధాలు కలిగిన వ్యక్తులు మరియు బుషో యొక్క ఆడ స్నేహితులతో నిండిన కారు అతని వెనకాల ఆగి అతను ఎవరని ప్రశ్నిస్తుంది. అతను అనేకమందిని తన కత్తులతో చంపడానికి ముందుకు వెళతాడు, కానీ చివరకు తానే చనిపోతాడు. ఎల్ తప్పించుకోగలిగి అంతకుముందు అతనికి తన నిజమైన గిటార్ చూపాలని కోరుకున్న చిన్న పిల్లవాడి దగ్గరికి వెళతాడు. బాధ వ్యక్తమవుతుండగా, తీవ్రమైన రక్తస్రావంతో ఎల్ అతనిని అనుసరిస్తాడు. ఒక కారు వారిని సమీపిస్తుంది మరియు అందులోని వ్యక్తి ఆ పిల్లవాడితో గిటార్ బేరం చేస్తాడు. అప్పుడు వారు చివరి వరకు వెళ్లి ఎల్ ను చూస్తారు. కారులో ఉన్న వ్యక్తి తుపాకీని బయటకు తీయడానికి ప్రయత్నిస్తాడు, అయితే ఎల్ అతని కంటే వేగంగా కదలి మరొక గిటార్ ను ఇవ్వవలసిందిగా కోరతాడు. వారు దానిని అతనికి ఇచ్చి అక్కడినుండి వెళ్లిపోతారు. అతను దానిని పగులగొట్టి చూడగా అందులో కొకైన్ ఉంటుంది. అతను ఆ పిల్లవాడిని ప్రశ్నించినపుడు కెరొలిన యొక్క పుస్తక దుకాణంతో సహా, నగరంలోని అత్యధికభాగం వ్యాపారాలు దీనికి సహకరిస్తున్నాయని చెప్తాడు. ఆగ్రహంతో, ఎల్ పుస్తక దుకాణం వైపు బయల్దేరతాడు. ఇదిలా ఉండగా, బుషో యొక్క వ్యక్తులు నవజాస్ శవం వద్దకు వస్తారు. అతను తన అధికారులను వారు ఎల్ కొరకు పంపిన వ్యక్తి యొక్క వర్ణనను కోరతాడు. ఆ వర్ణన నవజాస్ తో సరిపోతుంది, అయితే వారు పంపిన వ్యక్తిని తన మనుషులే చంపారనే విషయాన్ని బుషో బయట పడనీయడు. ఎల్ ఒక అద్భుతమని నమ్మినందుకు అతను తన దళంలో తన తరువాత స్థానంలోని వ్యక్తిని శిక్షిస్తాడు. పుస్తక దుకాణానికి తిరిగి వచ్చిన ఎల్, తాను చంపాలని ప్రయత్నిస్తున్న మరియు తన స్నేహితుని మరణానికి కారణమైన వ్యక్తి కొరకు పనిచేస్తున్నందుకు కెరొలినపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆమె తాను బుషో కొరకు పనిచేయడం లేదని, కేవలం సరుకు తన పుస్తక దుకాణంలో ఉంచి అక్కడి నుండి తీసుకువెళ్ళినందుకు తనకు సంవత్సరానికి 50,000 డాలర్లు చెల్లిస్తారని తెలుపుతుంది. తాను కొంత పుస్తక దుకాణం నడపడానికి వాడుకొని మరికొంత తాను ఈ పనిని మానవలసి వచ్చినపుడు ఉపయోగించుకోవడానికి దాచుకుంటానని, కానీ ఒకసారి దీనిలో చేరిన తరువాత బయటపడటానికి అనుమతించరని తెలుపుతుంది. ఎల్ నెమ్మదించి తన గాయాలకు ఆమె మందు రాయడానికి కౌంటర్ పైకి వంగగా, వెంటనే అతనిని అక్కడ నుండి బలవంతంగా నెట్టి వేస్తుంది అంతలో బుషో లోపలికి ప్రవేశిస్తాడు.అతను, ఆమెను ఎవరైనా కొత్త వ్యక్తులను చూసిందా అని ప్రశ్నిస్తాడు, కానీ ఆమె తాను చూడలేదని, చూస్తే అతనికి తెలియచేస్తానని చెప్తుంది. ఎల్, కౌంటర్ వెనుక నుండి తన తుపాకీని భర్తీచేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ బుషో బయటకు వెళ్ళడానికి ముందు ఆ పని పూర్తి చేయలేకపోయాడు. అతను అక్కడ నుండి బయటపడి బుషోని అనుసరించాలని ప్రయత్నిస్తాడు, కానీ కెరొలిన అతనికి అది ఆత్మహత్యతో సమానమని ఇంకా కొంత కాలం వేచి ఉండాలని చెప్తుంది. తరువాత, ఎల్ అతని గాయాల నుండి బయట పడుతుండగా, కెరొలిన అతనికి ఒక గిటార్ ను కానుకగా ఇస్తుంది. వారు దానిని కలసి వాయించడానికి ప్రయత్నిస్తారు కానీ అది సాధ్యపడదు. కెరొలిన ఆ సందర్భంలో ఎల్ ను ముద్దు పెట్టుకొంటుంది, ఇది వారిరువురు ఆమె పడకగదిలో శృంగారం జరపడానికి దారితీస్తుంది. ఇదిలాఉండగా, బుషో పట్టణంలోని తన మనుషులను పిలిపించి పుస్తక దుకాణం వెదకవలసిందిగా, ఒకవేళ ఎల్ అక్కడ ఉంటే ఆ దుకాణాన్ని దహనం చేసి అతనిని మరియు కెరొలినాను చంపాలని ఆజ్ఞాపిస్తాడు. తరువాత రోజు, ఎల్ మేల్కొనేటప్పటికి, కెరొలిన తన కన్నులు మూసుకొని, పరదాల నుండి ఆయుధాలు ధరించిన వ్యక్తుల నీడలను చూడవలసిందిగా పాట పాడుతుంది. అతను నిదానంగా తన తుపాకులలో ఒకదానిని మరియు ఎక్కడ ఉన్నా గుర్తించగలిగే తన డబల్ బారెల్ తుపాకీని బయటకు తీయడానికి ప్రయత్నిస్తాడు మరియు అతను ఆ ఇద్దరు వ్యక్తులని కాల్చి చంపేటపుడు కెరొలినాను పక్కకు నెట్టి వేస్తాడు. వారు పుస్తక దుకాణం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ అది అప్పటికే తగలబడుతూ ఉంటుంది. వారు పై కప్పు నుండి తప్పించుకోవడానికి అనేకమందిని తుపాకీతో కాలుస్తారు, కానీ వారి మార్గం మైదానంలో అనేకమంది వ్యక్తులచే అడ్డగించబడి ఉంటుంది. కెరొలిన దూకేయగా ఎల్ ఆ వ్యక్తులపై కాల్పులు జరుపుతాడు మరియు అప్పుడు తన గిటార్ పెట్టెను ప్రక్క భవనంపైకి విసిరివేస్తాడు. అప్పుడు వ్యక్తులు అతని వెనుక రావడంతో అతను వెనుకకి దూకి కప్పు నుండి పడిపోతూ వారిపై కాల్పులు జరుపుతాడు. అతను గాయపడకుండా, నేలపై పడి ప్రక్కకి దొర్లుతాడు. ముఠాలో చివరి వ్యక్తిని చంపడానికి అతను ఒక గ్రెనేడ్ ను ఉపయోగిస్తాడు. కప్పుపై దాక్కొని ఉన్న ఎల్, బుషో అక్కడికి రావడాన్ని చూస్తాడు. దూరదర్శిని కలిగిన ఒక విల్డే మాగ్నం తుపాకీతో అతను బుషో యొక్క తలపై గురి పెడతాడు కానీ బుషో యొక్క ముఖాన్ని చూసినపుడు సంశయించి తుపాకీని దూరంగా పెట్టేస్తాడు. అతనిని ఎందుకు చంపలేదని కెరొలిన ప్రశ్నిస్తుంది. ఎల్ సమాధానం ఇవ్వడు, వారు ఒక హోటల్ లో ఆశ్రయం పొందుతారు. ఎల్, బుషో ని చంపవలసి ఉన్నందున ఆమె ఒక్కతే తప్పించుకొని తాను రహస్యంగా దాచుకున్న ధనాన్ని ఉపయోగించి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించవచ్చని ఎల్, కెరొలిన కి చెప్తాడు అయితే దాచి ఉంచిన ఆ ధనం దగ్దమైన పుస్తకాలలో ఉందని ఆమె తెలియచేస్తుంది. ఎల్ తన స్నేహితులైన కాంపా మరియు క్వినోలను పిలవాలని నిర్ణయించుకుంటాడు. స్వల్ప వ్యవధిలోనే వారు ప్రత్యక్షమై, నిర్మానుష్యంగా ఉన్న పట్టణ మార్గంలోనికి అతనిని అనుసరిస్తారు, అక్కడ బుషో యొక్క మనుషులు వారిని కనుగొంటారు. కాంపా మరియు క్వినో తమ వద్ద కూడా ప్రత్యేకమైన పెట్టెలు ఉన్నట్లు వెల్లడిస్తారు, కాంపా యొక్క రెండు పెట్టెలలో మర తుపాకులు ఉండగా, క్వినో యొక్క పెట్టెలో ఒక రాకెట్ లాంచర్ ఉంటుంది. కెరొలిన యొక్క సహాయంతో వారు బుషో యొక్క మనుషులను చంపడానికి ముందుకు వెళతారు. అయితే, క్వినో ఒక పై కప్పుపై ముఠాసభ్యుడిచే హత్య చేయబడతాడు, మరియు కాంపా ఒక ఆయుధాగారం నుండి బయటకు వస్తుండగా హత్య గావించబడతాడు. ఆ చిన్న పిల్లవాడు కూడా ఎదురుకాల్పుల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడతాడు. ఎల్ మరియు కెరొలిన, బుషో యొక్క దళంలో రెండవ వాడైన చివరి వ్యక్తిని కూడా అతని పై నుండి వెళ్ళడం ద్వారా హతమారుస్తారు, మరియు ఆ పిల్లవాడిని ఆసుపత్రికి తరలిస్తారు. వైద్యులు ఆ పిల్లవాడి జీవిస్తాడని ఖచ్చితంగా చెప్పలేకపోవడంతో, ఎల్ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి కోపంతో బుషో యొక్క పశుక్షేత్రానికి బయల్దేరతాడు. వారు అక్కడికి వచ్చేసరికి బుషో యొక్క మనుషులు వారిని చుట్టుముట్టి ఉంటారు, కానీ బుషో వారందరినీ పంపించి వేస్తాడు. ఆ సమయంలోనే ఎల్ (మానిటో) మరియు బుషో (సీసర్) అన్నదమ్ములని వెల్లడి అవుతుంది; అందువల్లనే ఇంతకుముందు అవకాశంలో ఎల్, బుషోని చంపడు. ఏదేమైనా బుషో, కెరొలిన యొక్క మోసంపై కోపంతో ఉంటాడు, మరియు ఆమెను చంపేటపుడు ఎల్ తన చేతులను వెనుకకు పెట్టుకోవలసిందిగా అప్పుడు ఎల్ తన మనుషులను చంపినదానికి, దీనితో సమానమవుతుందని చెప్తాడు. మరొకసారి ప్రియురాలి హత్యను భరించలేని ఎల్, గతంలో మదధ్యశాలలో చేసిన విధంగానే తన భుజాలపై నుండి తుపాకులని తీసి బుషో యొక్క తలపై కాలుస్తాడు. తరువాత ఎల్ మరియు కెరొలిన ఆసుపత్రిలో కనిపిస్తారు, అక్కడ వారికి ఆ పిల్లవాడు బ్రతికాడని మరియు అతని పరిస్థితి మెరుగు పడుతోందని తెలుస్తుంది. ఎల్, కెరొలినాకు కృతఙ్ఞతలు తెలియచేసి వెళ్ళిపోతాడు.ఎడారిలో నడుస్తుండగా కెరొలిన ఒక జీపులో వచ్చి తనతో రావలసిందిగా అతనిని అడుగుతుంది. ఎల్ తన గిటార్ పెట్టెను విసిరి వేస్తాడు మరియు అతను ఇంకా కెరొలిన బయల్దేరతారు, కానీ అతను ఆగి, వెనుకకు వెళ్లి సూర్యాస్తమయంలోకి వెళ్లేముందు గిటార్ పెట్టెను("ఒకవేళ అవసరమయితే") తెచ్చుకుంటాడు. ==తారాగణం== * అంటోనియో బన్డేరాస్ - ఎల్ మరియాచి (మానిటో) * [[సాల్మా హాయక్|సల్మా హయెక్]] - కెరొలిన * జోఅక్విం డే అల్మైడా - బుషో (సీజర్) * చీచ్ మారిన్ -పొట్టిగా ఉన్న మదధ్యం సరఫరాదారు * స్టీవ్ బుషెమి -బుషెమి * కార్లోస్ గోమెజ్ -అనుచరుడు (కార్లోస్ గోమెజ్ వలె) * క్వెంటిన్ తరంటినో - తీసుకువచ్చే వ్యక్తి * టిటో లర్రివ - టావో * ఏంజెల్ అవిలెస్ - జామీర * డానీ ట్రెజో - నవజాస్ * అబ్రహాం వెర్డుజ్కో - నినో * కార్లోస్ గల్లర్డో - కాంపా * ఆల్బర్ట్ మైకేల్ జూనియర్ - క్వినో * డేవిడ్ అల్వరాడో - బడ్డీ * ఏంజెలా లాంజా - పర్యాటకురాలు == నిర్మాణము == ఈ చిత్రం స్వతంత్ర చిత్రమైన ''ఎల్ మారియాచి'' యొక్క తరువాయి భాగం. ఇది అసలు తరువాయి భాగం కంటే పునర్నిర్మాణమని వాదించబడింది, కధాంశం అనేక రకాలుగా విభిన్నంగా ఉన్నప్పటికీ, అనేక దృశ్యాలు ఒకే విధంగా ఉన్నాయి. ఏదేమైనా, వరుసక్రమంలో చూసినపుడు ఈ కధలు ఒకే విధంగా ఉండవు."ఎల్ మారియాచి" యొక్క ముగింపుకి ఇది ఒక ప్రత్యామ్నాయ ముగింపు అనే ఒక మూడవ సిద్ధాంతం ఊహించబడింది. ''డెస్పరాడో'' , అంటోనియో బన్డేరస్ యొక్క కీర్తిని ఇనుమడింప చేయటానికి మరియు అమెరికన్ వీక్షకులకు సల్మా హయక్ ను పరిచయం చేయడానికి దోహదపడింది. రోడ్రిగ్జ్ యొక్క స్నేహితుడైన క్వెంటిన్ తరంటినో ఒక "తీసుకువచ్చే వ్యక్తి" గా అతిధి పాత్రలో నటించాడు. ''ఎల్ మారియాచి'' లో ప్రధాన పాత్రను పోషించిన కార్లోస్ గల్లర్డో, ''డెస్పరాడో'' లో బాన్డేరస్ మారియాచి స్నేహితుడైన కాంపా పాత్రలో కనిపిస్తాడు. బుషోగా తారాగణంలో ఎంపికైన రౌల్ జూలియా నిర్మాణం ప్రారంభం కాకముందే అక్టోబర్ 24, 1994న మరణించాడు. 1996 నాటి రోడ్రిగ్జ్ యొక్క చిత్రం ఫ్రమ్ డస్క్ టిల్ డాన్ లో ఎల్ మారియాచి యొక్క షరాయి సంచిలోని తుపాకీ ఉపయోగించబడింది. === సంగీతం === {{seealso|Desperado: The Soundtrack}} చికానో రాక్ మరియు సాంప్రదాయ రంచేరా సంగీతాన్ని ప్రదర్శించే లాస్ ఏంజెల్స్ వాద్యబృందం లాస్ లోబోస్ ఈ చిత్ర సంగీతాన్ని సమకూర్చి, ప్రదర్శించింది. 1995 గ్రామీ పురస్కారాలలో వారి ప్రదర్శన "మరియాచి ష్వీట్" అత్యుత్తమ పాప్ వాద్య ప్రదర్శనకు గ్రామీ పురస్కారాన్ని పొందింది. ఈ సంగీత సంకలనంలోని ఇతర కళాకారులలో [[డైర్ స్ట్రెయిట్స్|డైర్ స్ట్రైట్స్]], లింక్ వ్రే, లాటిన్ ప్లేబాయ్స్ మరియు కార్లోస్ సంటానా ఉన్నారు. సంగీతకారుడు టిటో లర్రివ ఈ చిత్రంలో చిన్న పాత్రను పోషించాడు, ఇంకా అతని వాద్యబృందం టిటో & టారంట్యుల ఈ చిత్ర సంగీతంలో కూడా సహకరించింది. == ఆదరణ == ఈ చిత్రం ప్రస్తుతం రాటెన్ టొమాటోస్ టొమాటోమీటర్ లో 62% "ఫ్రెష్" రేటింగ్ ను కలిగి ఉంది, ఎంపైర్ మాగజైన్ ఈ చిత్రానికి నాలుగు నక్షత్రాల రేటింగ్ ను ఇచ్చింది. ==సూచనలు== {{reflist}} == బాహ్య లింకులు == {{Wikipedia-Books|Mexico Trilogy}} {{Wikiquote}} * {{rotten-tomatoes|id=desperado|title=Desperado}} * {{Amg movie|134790|Desperado}} *{{mojo title|id=desperado|title=Desperado}} * [http://www.moviemaker.com/directing/article/the_reformation_of_a_rebel_without_a_crew_3141 ''మూవీమేకర్'' పత్రికలో రోడ్రిగ్జ్ తో ముఖాముఖి] * {{imdb title|id=0112851|title=Desperado}} * [http://www.austinchronicle.com/gyrobase/Issue/story?oid=oid:529690 ''ఆస్టిన్ క్రానికల్'' చిత్రణ] {{Robert Rodríguez films}} [[Category:1995 చలనచిత్రాలు]] [[Category:1990లోని అభినయ ప్రాధాన్యత కలిగిన చలన చిత్రాలు]] [[Category:సాహసోపేతమైన చిత్రాలు]] [[Category:ముఠాల చిత్రాలు ]] [[Category:రాబర్ట్ రోడ్రిగ్జ్ దర్శకత్వం వహించిన చిత్రాలు ]] [[Category:నూతన-పాశ్చాత్య చిత్రాలు ]] [[Category:మెక్సికో నేపధ్యంగా గల చిత్రాలు ]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=862884.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|