Difference between revisions 814324 and 863260 on tewiki

{{వికీకరణ}}

'''నీటి శుద్ధీకరణ'''  అనేది కలుషితమైన [[నీరు|నీటి]] నుండి అవసరము లేని రసాయనాలను, పదార్ధాలను, మరియు జీవావరణమును కలుషితము చేసే తీసివేసే ప్రక్రియ. దీని యొక్క లక్ష్యము నీటిని ఒక ప్రత్యేకమైన పనికి ఉపయోగపడేలా చేయటము. చాలా వరకు నీటిని మనుషులు ఉపయోగించుటకు మరియు తాగు నీటి కొరకు శుద్ధి చేయటము జరుగుతుంది. అంతే కాక అనేక ఇతర ఔషదాలు, మందుల తయారీ, రసాయనిక మరియు పరిశ్రమల అవసరాల దృష్ట్యా కూడా నీటి శుద్ధీకరణ చేయటము అనేది జరుగుతుంది. సాధారణముగా నీటి శుద్దీకరణకు ఉపయోగించే పద్దతులు ఏవ(contracted; show full)్ ను లేదా దాని సంబదిత పదార్దాలైనటువంటి క్లోరోమిన్ లేదా క్లోరిన్ డై ఆక్సైడ్ ను ఉపయోగించుతాయి. క్లోరిన్ ఒక శక్తివంతమైన ఆక్సిడెంటు ఇది అత్యంత వేగముగా అనేక వ్యాధి కారక సూక్ష్మ క్రిములను చంపుతుంది. ఎందువల్లనంటే క్లోరిన్ ఒక విషపూరిత వాయువు మరియు దీనిని ఉపయోగిస్తున్నప్పుడు ఈ విష వాయువు వెలువడే ప్రమాదము కూడా ఉన్నది. ఈ సమస్య సోడియం హైపోక్లోరైట్ అనే తక్కువ ఖర్చుతో కూడిన ద్రవమును ఉపయోగించుట ద్వారా పరిష్కరించబడుతుంది. ఎలాగంటే ఈ ద్రావణము నీటిలో కరిగినప్పుడు ఫ్రీ క్లోరిన్ ను విడుదల చేస్తుంది. సాధారణ ఉప్పు ద్రావణములను వి
్యుత్ వాహకముల ద్వారా రసాయనిక చర్య గావించుట ద్వారా క్లోరిన్ ను అప్పటికి అప్పుడు తయారు చేయవచ్చు. ఘన రూపములో ఉన్న కాల్షియం హైపోక్లోరైట్ అనేది నీటిలో కలిసిన వెంటనే క్లోరిన్ ను విడుదల చేస్తుంది. ఈ ఘన పదార్దాన్ని ఉపయోగించుట అనేది ఎక్కువ మానవ శక్తి పైన ఆధారపడి ఉన్నది ఎందువల్లనంటే సంచులను తెరచుట మరియు పోయుట వంటివి వాయు సిలిండర్లు లేదా బ్లీచ్ వంటి సులభముగా యంత్రాలతో చేయగలిగే వాటిలా కాకుండా మానవులచే నిర్వహించబడాలి. ద్రవ రూపములో ఉన్న సోడియం హైపోక్లోరైట్ ను తయారు చేయుట తక్కువ ఖర్చుతో కూడినది మరియు వాయువు లేదా ఘన రూపముల(contracted; show full)

==== ఓజోన్ క్రిమిసంహారణ ====
O<sub>3</sub> అనేది స్థిరము లేని పరమాణువు. ఇది అనేక నీటిలో ఉద్భవించు జీవులకు విషకారకముగా పనిచేసే శక్తివంతమైన ఆక్సిడైజింగ్ ఏజంటును ఒక ఆక్సిజన్ పరమాణువు ద్వారా ఏర్పరుస్తుంది. ఇది యురోపులో విస్తృతముగా ఉపయోగించబడుతున్న ఒక బలమైన, విస్త్రుత పరి
ి కలిగిన క్రిమిసంహారకము. ఇది ప్రమాదకరమైన గడ్డలను కలిగించు ప్రోటోజువా ను నిస్తేజము చేయుటకు ఒక శక్తివంతమైన పద్ధతి. ఇది దాదాపు అన్ని రకాలైన వ్యాదికారకాలపై సమర్ధవంతముగా పనిచేస్తుంది. ఓజోన్ అనేది ఆక్సిజన్ ను ఆల్ట్రావయొలెట్ కిరణము ద్వారా ప్రసరింప చేయుటవలన లేదా ఒక "చల్లని" వి్యుత్ వాహకము ద్వారా ప్రసరింప చేయుట ద్వారా తయారు చేయబడుతుంది. ఓజోన్ ను క్రిమిసంహారిణి గా వాడుటకు దానిని తప్పనిసరిగా నీటిని శుద్ధి చేయు ప్రదేశములోనే తయారు చేయాలి మరియు దానిని బుడగల ద్వారా నీటికి కలపాలి. ఓజోన్ యొక్క కొన్ని ఉపయోగాలు ఏమిటంటే అది ప్రమాదకరమైన ఉప ఉత్పాదనలను చాలా తక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది (క్లోరినేషనుతో పోల్చిచూసినప్పుడు) మరియు ఓజోనైజేషను వల్ల రుచి మరియు వాసన ఏర్పరచబడవు. ఓజోనైజేషను చాలా తక్కువ ఉపఉత్పాదనలను ఏర్పరచినప్పటికి ఓజోన్ తక్కువ స్థాయిలో అనుమానించదగిన కార్సినోజన్ బ్రోమేట్ ను  నీటిలో ఉ(contracted; show full)
{{DEFAULTSORT:Water Purification}}

[[వర్గం:నీటి విజ్ఞానము]]
[[వర్గం:నీటి కాలుష్యం]]
[[వర్గం:నీటి శుద్దీకరణ]]

[[tr:Su arıtma]]