Difference between revisions 814436 and 927091 on tewiki{{pp-move-indef}} {{two other uses||the Internet company|Google|other similar titles|Google (disambiguation)}} '''గూగోల్''' అనేది 10<sup>100</sup> అనే ఒక భారీ సంఖ్య, అనగా అంకె ఒకటి, తరువాత వంద [[సున్న|సున్నాలు]]: : 10,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000 ఈ పదాన్ని 1938<ref>కాస్నేర్, ఎడ్వర్డ్ మరియు లూయిస్ కొరియా, ''మేథమేటిక్స్ అండ్ ది ఇమాజినేషన్,'' 1940, సైమన్ మరియు షస్టర్, న్యూ యార్క్. ISBN 0-912616-87-3.</ref>లో 9 సంవత్సరాల వయస్సుగల మిల్టన్ సిరోట్ట (1929–1981) అనే బాలుడు రూపొందించాడు. ఈ బాలుడు అమెరికాకు చెందిన గణిత శాస్త్రవేత్త అయిన ఎడ్వర్డ్ కస్నేర్ యొక్క మేనల్లుడు. ''మేథమేటిక్స్ అండ్ ది ఇమాజినేషన్'' (1940) అను తాను వ్రాసిన పుస్తకములో కాస్నేర్ ఈ ఆలోచనకు ప్రాచుర్యం తెచ్చాడు. గూగోల్‌కు ఇతర పేర్లు షార్ట్ స్కేల్‌లో '''పది డ్యువోట్రైజిన్టిల్లియన్''' , లాంగ్ స్కేల్‌లో, '''పది వేల సెక్స్ డేసిల్లియన్''' , లేదా పెలేటియర్ లాంగ్ స్కేల్‌లో '''పది సెక్స్ డేసిల్లియార్డ్''' . [[గణితము|గణితం]]లో గూగోల్‌కు ప్రత్యేకమైన ప్రాముఖ్యత లేదు. కాని కనిపించే విశ్వంలో ఉన్న సబ్-అటామిక్ శకలాలు లేదా సాధ్యమయ్యే [[చదరంగం (ఆట)|చెస్]] ఆటలు వంటి ఇతర భారీ సంఖ్యలను పోల్చడానికి ఇది ఉపయోగపడుతుంది. ఊహించలేని భారీ సంఖ్యకు అనంతానికి మధ్య ఉన్న తేడాను వివరించడానికి ఎడ్వర్డ్ కస్నేర్ ఈ సంఖ్యను వాడాడు. ఈ రూపంలో గణిత బోధనలో ఇది కొన్ని సార్లు ఉపయోగపడుతుంది. గూగోల్ సంఖ్య 70 యొక్క ఫేక్టోరియల్ సంఖ్య యొక్క అదే పరిమాణ క్రమంలో ఉంటుంది (70! అనగా సుమారు 1.198 గూగోల్). ==గూగోల్ ప్లేక్స్== {{Main|googolplex}} ఒక గూగోల్‌ప్లెక్స్ అంటే పదిని ఒక గూగోల్ పవర్‌కు పెంచడం: అది ఒక భారీ సంఖ్య. ''[[Cosmos: A Personal Voyage|కాస్మోస్]]'' అనే ఒక డాక్యుమెంటరీలో, ఖగోళ శాస్త్రవేత్త మరియు ప్రచార మాధ్యమంలో ప్రముఖుడు అయిన కార్ల్ సగాన్ ఈ విధంగా చెప్పాడు: ఒక గూగోల్ ప్లేక్స్‌ను 10-బేస్ అంకెలతో (అనగా అంకె 1, తరువాత గూగోల్ సున్నాలు) వ్రాయడం అసాద్యం ఎందుకంటే దానికి తెలిసిన విశ్వం అందించగలిగిన స్థలానికంటే ఎక్కువ స్థలం కావాలి. ==జనరంజక సంస్కృతిలో== * ''"అంకె 1, తరువాత 100 సున్నాలు ఉన్న సంఖ్య ఏది?"'' అనే మిలియను-పౌండ్ ప్రశ్నకు ''గూగోల్'' సరైన సమాధానం. ఈ ప్రశ్న ''హూ వాంట్స్ టు బి ఏ మిలియనీర్?'' కార్యక్రమంలో అడగబడింది. 10 సెప్టెంబర్ 2001 నాడు మేజర్ చార్లెస్ ఇంగ్రాం ఈ క్విజ్ కార్యక్రమంలో మోసానికి పాల్పడడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రశ్న అడగబడింది. ఈ ప్రశ్నకు ఇవ్వబడిన ఇతర ఆప్షన్‌లు, మెగాట్రాన్, గిగాబిట్ మరియు నానోమోల్.<ref>[http://news.bbc.co.uk/2/hi/uk_news/2823407.stm ఉత్తమ బహుమతికి మిలియనీరు యొక్క మార్గము]</ref> * బాల్డేర్డాష్ అనే ఒక బోర్డ్-గేంలో ఉన్న 336 పదాలలో ''గూగోల్'' కూడా ఒకటి. కార్డ్ వెనుక దీనికి ఇవ్వబడిన అర్ధం: "అంకె ఒకటి తరువాత 100 సున్నాలు" * జనవరి 23, 1963 నాటి ''పీనట్స్'' స్ట్రిప్‌లో, లూసి, ష్రోడేర్ ను, తాము పెళ్లి చేసుకోవడానికి ఉన్న అవకాశాలు ఎంత అని అడుగుతుంది. దానికి ష్రోడేర్ "ఓ, "గూగోల్" కు ఒకటి." అని సమాధానమిస్తాడు. * ''[[Teenage Mutant Ninja Turtles: Fast Forward]]'' అనే ఒక అనిమేటడ్ సిరీస్‌లోని ఒక కధథాంగంలో, "గేమినేటర్"లో "3-గూగోల్ హెర్ట్స్ ప్రాసెసర్" ఉన్నట్లు చూపబడుతుంది. * "గూగోల్ ప్లేక్స్, సంఖ్య ఒకటి నుంచి ఎంత దూరంలో ఉందో అంతే దూరంలో ''ఖచ్చితంగా'' అనంతం నుంచి కూడా ఉంది." — కార్ల్ సాగన్, ''[[Cosmos: A Personal Voyage#Episode 9: "The Lives of the Stars"|కాస్మోస్]]'' * [[గూగుల్|గూగుల్]] అనే పేరు "గూగోల్" అనే పదం యొక్క స్పెల్లింగును పొరపాటుగా వాడి గూగుల్ వ్యవస్థాపకులు లారి పేజ్ మరియు సెర్జీ బ్రిన్ పెట్టారు అని డేవిడ్ ఎ. వైస్ వ్రాసిన ''ది గూగుల్ స్టొరీ'' అనే పుస్తకములో వ్రాయబడింది. * ''ది కంప్యూటర్ వొర్ టెన్నిస్ షూస్'' అనే 1995 చిత్రములో రెండు కళాశాలలు పోటీ పడుతున్నప్పుడు ''గూగోల్'' అనేది ఒక ప్రశ్న. "గూగోల్ అనగానేమి?" అనేది ఒక ప్రశ్న. నార్వుడ్ గిల్స్ దీనికి సమాధానం ఇచ్చాడు, "ఒకటి, తరువాత వంద సున్నాలు". * ''బ్యాక్ టు ది ఫ్యూచర్ III'' లో, ఏమ్మేట్ బ్రౌన్ తాను ప్రేమిస్తున్న క్లారా అనే మహిళ "గూగోల్ ప్లేక్స్ లో ఒకరు" అని చెబుతాడు. * స్టీవ్ మార్టిన్ యొక్క ''కామెడీ ఇస్ నాట్ ప్రెట్టి!'' అనే ఒక హాస్యాత్మక ఆల్బంలో, మార్టిన్ తాను ఒక గూగోల్ఫోనిక్ స్టీరియో సిస్టం కొనడం గురించి చెబుతాడు. (ఆ సంఖ్యను పొరపాటుగా "అనంతానికి ముందు అత్యధిక స్పీకర్లు కలిగిన అతిపెద్ద సంఖ్య..." అని చెబుతాడు). అతను తన స్టీరియోఫోనిక్, క్వాడ్రఫోనిక్, ఆ తరువాత డోడేకాఫోనిక్ సిస్టంల తో సంతృప్తి చెందక ఆ వ్యాఖ్యను చేస్తాడు. * ''సమురాయ్ జాక్'' యొక్క "జాక్ వర్సెస్ మాడ్ జాక్" అనే ఒక కధథాంగంలో, ఆకూ అనే రూపాన్ని మార్చుకునే చీకటి గురువు నోబుల్ సమురై తలపై 2 గూగోల్ ప్లేక్స్ ల ధరను ఉంచాడు. * రిచీ రిచ్ యొక్క మార్చ్ [[1976|1976]] కామిక్ పుస్తకములో (వాల్ట్స్ అఫ్ మిస్టరి #9), "ది గూగోల్" అనే ఒక విలన్ ప్రవేశపెట్టబడుతాడు. * 2002లో క్లచ్ అనే బ్యాండ్ ''లివ్ అట్ ది గూగోల్ ప్లేక్స్'' అనే ఆల్బంను విడుదల చేసింది. * ది సింప్సన్స్ అనే ఆనిమేటడ్ టెలివిషన్ సిరీస్ లో స్ప్రింగ్ ఫీల్డ్‌లో ఉన్న అతి పెద్ద సినిమా పేరు "గూగోల్ ప్లేక్స్". * ''ఫినీస్ & ఫెర్బ్'' లో డాన్విల్లెలోని ప్రధాన షాపింగ్ సెంటర్, గూగోల్ ప్లేక్స్ మాల్. * ది సోప్రనోస్ సీసన్ 5 ఎపిసోడ్ 56 - ఆల్ హ్యాపీ ఫామిలీస్... లో AJ గణితం నేర్చుకుంటున్నప్పుడు, ఈ ప్రశ్న అడగబడుతుంది - "సరే, ఒక పేపర్ యొక్క రెండు వైపులు మిలియను జీరోలో వ్రాయగలిగితే, ఒక గూగోల్ సున్నాలు వ్రాయాలంటే, ఎన్ని పేపర్లు అవసరము?" * 1985 TV సిరీస్ అయిన ది స్మాల్ వండర్ లో, వికీ, అనే ప్రధాన పాత్ర గూగోల్ ను ఈ విధంగా వివరిస్తాడు, "ఒక అంకెల పరంపర. ఒకటితో మొదలయి వంద సున్నాలు ఉంటాయి". ==వీటిని కూడా చూడండి== * [[గూగుల్|గూగుల్]] * గూగోల్ ప్లేక్స్ * భారీ సంఖ్యలు * భారీ సంఖ్యల పేర్లు ==సూచనలు== {{Reflist|2}} {{Large numbers}} ==బాహ్య లింకులు== * {{MathWorld | urlname=Googol | title=Googol}} * {{PlanetMath | urlname=Googol | title=googol}} [[Category:భారీ పూర్ణాంకాలు]] [[Category:పూర్ణాంకాలు]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?diff=prev&oldid=927091.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|