Difference between revisions 838190 and 926792 on tewiki

{{multiple issues|refimprove =June 2006|cleanup =January 2007|weasel =March 2009}}

{{Copied to Wikibooks}}
'''కుక్కల శిక్షణ'''  అనేది [[కుక్క|కుక్క]]లకి కొన్ని ఆజ్ఞలకు అనుగుణంగా కొన్ని పనులు చేయడంలో శిక్షణ ఇచ్చే ప్రక్రియ, ఇందులో కుక్క ఆజ్ఞలని అర్థం చేసుకోవడం ఉంటుంది. ఇది కుక్క ఎలా నేర్చుకుంటుంది అని వివరించలేని ఒక సాధారణ పదం. 

కుక్కల శిక్షణలో చాలా పద్ధతులు చాలా విషయాలు ఉన్నాయి, ప్రాథమికంగా అణకువ శిక్షణ, ఇది కొన్ని ప్రత్యేక విభాగాలలో అంటే న్యాయ పరిరక్షణ, మిలటరీ, శోధన మరియు రక్షణ, వేట, పశువులతో కలిసి పనిచేయడం, వికలాంగులకి సహాయపడడం, వినోద కార్యక్రమాలు, కుక్కల ఆటలు, ప్రజలని లేదా ఆస్తిని కాపలా కాయడం మొదలైనవాటిలో.     
 
జంతు సమూహాలకి, అడవి కుక్కలకి ఉన్న సహజ శక్తులు వాటి సహచర కుక్కల సహకారంతో ఇనుమడిస్తాయి.   
చాలా ఇంటి కుక్కలు సహజాతం వలన లేదా పెంపకం వలన కావచ్చు పెంచిన వ్యక్తి సంజ్ఞలని సరిగ్గా అర్థం చేసుకుని ప్రతిస్పందిస్తాయి. 

==ప్రాథమిక శిక్షణ==
చాలా కుక్కలు వాటి ముందటి శిక్షణ లేదా కోరే ఉద్దేశ్యంతో సంబంధం లేకుండా వారి చుట్టుప్రక్కల ఆహ్లాదాన్ని నింపేలా ప్రవర్తించాలని కోరుకొనే, వాటిని జాగ్రత్తగా చూసుకొనే, వాటికీ మిగతా మనుషులకి, పెంపుడు జంతువులకి రక్షణనిచ్చే మనుషులతో కలిసిఉంటాయి.    కుక్కలు వాటంతటవే ప్రాథమిక అణకువని గుర్తించలేవు; అవి ఖచ్చితంగా శిక్షణ పొందాలి.
 
శిక్షణలో క్లిష్టమైన అంశం కుక్కతో మానవ పద్ధతిలో అది అర్థం చేసుకొనేలా సంభాషించడం.  ఏమైనా, అన్ని సంభాషణల అంతర్లీన సూత్రం సరళమైనది: బహుమతి కోరే ప్రవర్తనని అయిష్ట ప్రవర్తనని సరి చేస్తూ లేదా మర్చిపోతూ పెంచడం.

ప్రాథమిక కుక్కపిల్ల అణకువ శిక్షణ సాధారణంగా ఆరు ప్రవర్తనలను కలిగిఉంటుంది:
*కూర్చో
*క్రింద
*ఆగు
*పిలవడం ("రా", "ఇక్కడ" లేదా "లోపల")
*మూయడం (లేదా నడక) 
*మడమ

"సవరణలు" హానికర శారీరక శక్తిని లేదా హింసని కలిగి ఉండకూడదు. 
శిక్షణలో బలాన్ని ఉపయోగించడం వివాదాస్పదం, దీనిని తేలికగా తీసుకోకూడదు, ఎందుకంటే అది ప్రవర్తనని మార్చినప్పటికీ అసంబద్ధంగా ఉపయోగించినపుడు కొన్ని కుక్కలలో ఇది చొరవ కోల్పోవడం (ఇచ్చిన పని మీద ఆసక్తి), ఒత్తిడి , కొన్ని సందర్భాలలో దూకుడుకి కూడా దారి తీస్తుంది. శిక్షకుడు బలాన్ని ఉపయోగించుకోవటాన్ని గురించి నిర్ణయించుకోవచ్చు కానీ చాలామంది శిక్షకులు ఉపయోగించే కనిష్ట స్థాయి అది కూడా నచ్చని పద్ధతిని తొలగించటానికి మాత్రమే ఉపయోగించాలి. 

===కుక్క పిల్లలు మరియు అభ్యాసం ===

గర్భావస్థ సమయం అనేది కుక్క పిల్లల అభివృద్ధి దశగా తాజాగా గుర్తించబడింది. ఒక ఆలోచన ప్రకారం "ప్రవర్తనాభివృద్ధి మీద దీర్ఘ-కాలిక ప్రభావాలు కొన్ని క్షీరదాలలో గర్భంలో ఉన్నప్పుడు జరిగే కార్యక్రమాల ద్వారా కూడా ప్రభావం చూపుతాయి".<ref>సెర్పాల్, 1995, p.&nbsp;80</ref> కుక్క పిల్లల ప్రవర్తన పరిశీలించలేదు కాబట్టి పూర్వపు అధ్యయనాలు ఈ సమయపు మనుగడని గురించి పట్టించుకోలేదు. ప్రస్తుతం అల్ట్రాసౌండ్ యంత్రం అభివృద్ధితో కుక్క పిల్లని తల్లి పొట్టలో ఉన్నప్పుడే నాలుగు వారాల గర్భధారణ వయస్సులో గమనించవచ్చు.

కుక్క పిల్ల పిండము తల్లి పొట్ట బయటి స్పర్శకి లేదా ఒత్తిడికి ప్రతిస్పందిస్తుందని కనుగొనబడినది. అదనంగా కుక్క పిల్లలు పుట్టుక సమయంలో మంచి-అభివృద్ధి చెందిన స్పర్శాజ్ఞానాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఈ స్పర్శాజ్ఞానం పుట్టుక ముందు కూడా బాగా-అభివృద్ధి చెంది ఉంటుందని సిద్ధాంతీకరించబడింది. అధ్యయనాలు "కడుపుతో ఉన్న జంతువు పెంచుకోబడినప్పుడు దాని పిల్ల ఇంకా బాగా పెరుగుతుందని" కనుగొనబడినది,<ref>దేనెంబెర్గ్ అండ్ వింబే 1964, ఫాక్స్ లో 1978</ref> ఫాక్స్ ప్రకారం ఇది ప్రశాంతతను, మానసిక అనుబంధాన్ని, సామాజీకరణని పెంపొందిస్తుంది.    ఇతర అధ్యయనాలు గర్భంలో ఉన్నప్పుడు (తల్లి కుక్క పెంపకందారులు) బయటి స్పర్శని పొందిన కుక్క పిల్లలు ఎటువంటి స్పర్శా పొందని కుక్క పిల్లల కంటే ఎక్కువ స్పర్శకి ఎక్కువ సహన శక్తిని కలిగిఉంటాయని సూచిస్తున్నాయి. దీనిని తల్లి పొట్టని మృదువుగా స్పృశించడం ద్వారా కుక్క పిల్లలో జనాలపట్ల మంచి, లాభదాయక సామాజీకరణని పెంపొందించవచ్చని సిద్ధాంతికరించవచ్చు.  

నియోనేట్ సమయంగా పిలిచే కుక్క పిల్ల జీవితపు మొదటి రెండు వారాలప్పుడు కుక్క పిల్లలు చిన్న చిన్న సాంగత్యాలని నేర్చుకుంటాయి.<ref>సెర్పల్, 1995</ref>  ఏమైనా పూర్వానుభవ విషయాలు తరువాతి వయసులకి రవాణా అవ్వవు.   అధ్యయనాలు నియోనేట్ సమయపు కుక్క పిల్లలు అనుభవం ద్వారా నేర్చుకోవని సూచిస్తున్నాయి.<ref>స్కాట్ అండ్ ఫుల్లర్, 1965</ref> దీనికి కారణం కుక్క పిల్ల మెదడు, ఆలోచన, మిగతా అవయవాలు ఇంకా అభివృద్ధి చెందకపోవడమే అన్న సత్యమని సిద్ధాంతికరించబడింది. దాని ఇంద్రియ, అభ్యాసాల అల్ప సామర్థ్యం మీద ఆధారపడి కుక్క పిల్లని మానసికంగా మంచిగా, చెడుగా ప్రభావితం చేయడమన్నది కష్టం.<ref>స్కాట్ అండ్ ఫుల్లర్, 1965</ref> 

తరువాతి సమయాన్ని సామాజికరణ సమయం అంటారు. ఈ సమయం 3 వారాల వయస్సులో ప్రారంభమయ్యి షుమారు 12 వారాల వయస్సులో ముగుస్తుంది.<ref>బీవర్, 1999</ref> ఈ సమయపు ప్రధానాంశం సామజిక ఆట. సామాజిక అధ్యయనం, సరదా గొడవలు, సరదా శృంగార ప్రవర్తన అనేవి దాని జీవితంలో సామాజిక బంధాలు పెంపొందడానికి చాలా అవసరం.<ref>స్కాట్ అండ్ ఫుల్లర్, 1965</ref> క్రొత్త ప్రవర్తనా పద్ధతులు కుక్క పిల్ల గర్భంలో ఉన్నప్పుడు తల్లి మరియు ఇతర కుక్క పిల్లలతో ఉన్న సంకర్షణ ద్వారా నేరుగా ప్రభావితం చేయబడతాయి. 

ఈ సమయంలో కుక్క పిల్లలు మిగతా కుక్క పిల్లలతో అలాగే జనాలతో సామాజిక బంధాలని పెంచుకుంటాయి. ఏమైనా కుక్క పిల్లలు అపరిచితుల పట్ల భయాన్ని వృద్ధి చేసుకొనే సమయం ఒకటి ఉంటుంది. 3-5 వారాల వయస్సులో కుక్క పిల్లలు అపరిచితులని ఉత్సాహంగా కలుస్తాయి.  దీని తరువాత వెంటనే నెమ్మదిగా అపరిచితులని దూరం పెట్టడం మొదలుపెట్టి 12-14 వారాల వయస్సులో పెరిగిపోతుంది.<ref>బీవర్, 1999</ref> ఈ అపరిచితుల పట్ల సహజ భయం మంచి కుక్క పిల్లని దొంగలనుంచి రక్షించేదిగా, జనాలతో మామూలు సంబంధాలని ఆటంకపరిచేదిగా కూడా కుక్క పనిచేస్తుంది.  

ఈ సమయంలో ఉలికిపాటు చర్యల నుండి హటాత్తు కదలికలు, శబ్దాలు వృద్ధి చెందుతాయి. ఇది కుక్క పిల్ల ప్రమాద మరియు సురక్షిత లేదా అసంబద్ధ విషయాల మధ్య తేడా తెలుసుకోవడానికి పనికి వస్తుంది.<ref>స్కాట్ అండ్ ఫుల్లర్, 1965</ref> సామాజికరణ సమయంలో కొన్ని ప్రత్యేక ప్రదేశాలతో అనుబంధం ఏర్పడడం మొదలవుతుంది. ఇది ప్రదేశం మారినప్పుడల్లా కుక్క పిల్లలో విపరీతమైన కలవరం ద్వారా ప్రదర్శించబడుతుంది. దీనిని స్థానీకరణం అంటారు. (సేర్పెల్, 1995) స్థానీకరణం తరచుగా కుక్క పిల్లల 6-7 వారాల వయస్సు<ref>స్కాట్ అండ్ ఫుల్లర్, 1965</ref> మధ్య ఎక్కువగా ఉంటుంది, తరువాత తగ్గిపోయి ఆ సమయం తరువాత ప్రదేశ మార్పు కుక్క పిల్లని ఇబ్బందిపెట్టదు.

మొదటి ఎనిమిది వారాల వయస్సులో మనుషుల ద్వారా పెంచబడిన కుక్కలు సాధరణంగా మనుషుల ఇళ్ళల్లో ఉండడానికి శిక్షణ పొందడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. కుక్క పిల్లలు వాటి 8 నుండి 10 వారాల వయస్సు మధ్య వాటి శాశ్వత నివాసాలలో నివసించడం ఆదర్శప్రాయంగా ఉంటుంది. కొన్ని చోట్ల కుక్క పిల్లలని వాటి తల్లి దగ్గరి నుంచి 8 వారాల వయస్సుకి ముందు తీసుకువెళ్ళడం చట్ట వ్యతిరేకం. కుక్క పిల్లలు 10 నుండి 12 వారాల వయస్సులో క్రొత్త విషయల పట్ల విపరీతమైన భయాన్ని కలిగిఉంటాయి, ఇది వాటికి కొత్త ఇల్లు అలవాటు చేసుకోవడంలో కష్టాన్ని కలిగిస్తుంది.{{Citation needed|date=April 2008}}

కుక్క పిల్లలు మెళుకువలు, ఆజ్ఞలని నేర్చుకోవడం 8 వారాల వయస్సులో మొదలుపెడతాయి; దీనికి సత్తువ, ఏకాగ్రత, శారీరక సమన్వయము హద్దులు.( బీవర్, 1999; లిండ్సే, 2000; స్కాట్, ఫుల్లర్ 1965; సేర్పెల్ 1995) 

====పళ్ళు రావడం====
మూడు నుండి ఆరు నెలల వయస్సు మధ్య కుక్క పిల్లకి దాని పెద్ద పళ్ళు రావడం మొదలవుతుంది.  ఈ సమయం కొంచెం భాదబాధాకరమైనది, చాలామంది యజమానులు నమలవలసిన సహజవసరాన్ని గుర్తించరు. పళ్ళ నొప్పిని తగ్గించడానికి రూపొందించిన కొన్ని నమిలే బొమ్మలను అందించడం ద్వారా (గట్టి నైలాన్ ఎముక వంటివి) వాటి దృష్టిని బల్ల కాళ్ళు మరి ఇతర సామాగ్రి మీద నుండి మల్లిన్చావచ్చు. చాలామంది ఈ నమలడాన్ని మాన్పడానికి వాటికి ఇష్టమైన బూట్లు, సామాను లేదా వాల్ పేపర్ మీద కూడా దుర్వాసన వచ్చే, చెడ్డ రుచి గల స్ప్రేలను చల్లుతారు. వగరు ఆపిల్ దీనికి సామాన్యంగా ఉపయోగించే స్ప్రే, కానీ అనేక రకాల వాణిజ్య స్ప్రేలు కూడా అందుబాటులో ఉన్నాయి. వివిధ పనుల, యజమానుల, కుక్కల కోసం వివిధ స్ప్రేలు పని చేస్తాయి.

===ప్రాథమిక శిక్షణా తరగతులు ===
నిపుణులైన "కుక్క శిక్షకులు" కుక్క యజమానికి దానికి శిక్షణ ఇవ్వడానికిగానూ శిక్షణనిస్తారు. మరింత ప్రతిభావంతంగా ఉండడానికి యజమానులు ఖచ్చితంగా కుక్కకి నేర్పిన మేలుకువాలని మరలా మరలా ఉపయోగించాలి. కలిసి తరగతులకి హాజరైన యజమానులు మరియు కుక్కలు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి, శిక్షకుడి పర్యవేక్షణలో కలిసి పని చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కుక్కతో ఉండే అందరూ శిక్షణలో పాల్గొంటే స్థిర ఆజ్ఞల, పద్ధతుల, అమలు చేయడాల శిక్షణ మరింత ప్రభావవంతంగా ఉంటుంది.  తరగతులు కుక్క ఇతర కుక్కలు, మనుషులతో కలిసి ఉండడానికి కూడా సహాయపడతాయి. శిక్షణా తరగతులు చాలా కేన్నేల్స్, పెంపుడు జంతువుల దుకాణాలు, వ్యక్తిగత శిక్షకుల ద్వారా అందజేయబడుతున్నాయి.

సాముహిక తరగతులు కుక్క పిల్ల తన 3-4 నెలల వయస్సు వరకు అన్ని టీకాలు వేయించుకున్నదాకా కుదరదు; ఏమైనా కొంతమంది శిక్షకులు కుక్క పిల్ల సామజికరణ తరగతులు కుక్క పిల్లలు వాటి శాశ్వత నివాసాలు నమోదు చేసుకున్న వెంటనే ప్రాథమిక టీకాలు వేసుకొని జబ్బు ప్రమాదాలు కనిష్ట స్థాయికి చేరుకున్న వెంటనే ప్రారంభిస్తారు.  చాలా సందర్భాలలో ప్రాథమిక శిక్షణా తరగతులు కుక్క పిల్లలు కనీసం 3 నుండి 6 నెలల వయస్సుకి వచ్చాక కానీ మొదలుపెట్టరు కానీ కుక్క పిల్ల మీ ఇంటికి వచ్చిన తరువాత శిక్షణ ఎంత తొందరగా మొదలుపెడితే అంట మంచిది. 8 వారాల వయస్సులో ఉన్నప్పుడు శిక్షకుడు వ్యక్తిగతంగా ఇంటికి వచ్చి కూడా శిక్షణనివ్వవచ్చు. 

ఒక కుక్క పిల్లకి దాని యజమాని క్రమశిక్షణ, స్థిరత్వం, ఓపిక అవసరం.    కుక్క పిల్ల శిక్షణా దశ మంచి ఆరోగ్యమైన, ఆనందమైన కుక్క పెరుగుదలకి, సురక్షిత మరియు సరదా గృహ వాతావరణాన్ని ఉంచడానికి చాలా ముఖ్యం. 

కుక్కలు భావప్రకటితమైనవి, కరవడం, ఊపడం, గెంతులు వేయడం ద్వారా వాటి అవసరాలని తెలియజేస్తాయి.   తమ సొంత ప్రవర్తనని మార్చుకోవడం కుక్క పిల్ల ప్రవర్తన మారడం పైన ప్రభావం చూపుతుంది. 

గృహ శిక్షణ కుక్క పిల్లలకి ఆవశ్యకమైన అంశం.  స్థిరత్వాన్ని ఆధారంగా చేసుకొని వివిధ గృహ శిక్షణా పద్ధతులు పని చేస్తాయి. క్రమ ఆధారిత నియమాలు, లిట్టర్ బాక్స్, క్రేట్ లేదా కాగితపు శిక్షణ వంటివి ఉపయుక్తం.

భంగిమ ఆధారిత విశ్రాంతి (PFR) అనేది యజమాని, కుక్క పిల్ల మధ్య బంధం ఏర్పడడానికి మంచి కిటుకు. యజమాని 4-6 నెలలకి మించని కుక్క పిల్లని క్రింది భంగిమలో ఉంచి దానిని అదే భంగిమలో కావలసినంత శక్తిని మాత్రమే ఉపయోగించి అదే భంగిమని నిర్వహించడం అవసరం. కుక్క పిల్ల గింజుకోవడం మానేసి ప్రశాంతంగా ఉన్నప్పుడు, యజమాని కుక్క పిల్ల మెడని, వీపుని నెమ్మదిగా మసాజ్ చెయ్యాలి. (కానినే డయిమంషన్స్ , 2007, 23)

==సంభాషణ==
సామాన్యంగా కుక్క శిక్షణ సంభాషణ గురించి. మానవ దృక్కోణం నుంచి చూస్తే యజమాని కుక్కతో ఏ ప్రవర్తన సరైనది, కోరుకున్నది లేదా ఏ పరిస్థితులని కోరుకున్నది, ఏ ప్రవర్తన నచ్చనిది అని సంభాషించడం. 

యజమాని కుక్క సంభాషణని అర్థం చేసుకోవాలి. కుక్క తనకి ఖచ్చితంగా తెలియదని, అయోమయం, కంగారు, సంతోషం, ఆనందం మొదలైనవాటిని సంజ్ఞల రూపంలో తెలుపుతుంది. కుక్క మానసిక స్థితి శిక్షణ ఇవ్వడంలో ముఖ్య ప్రాధాన్యతని కలిగిఉంటుంది, కుక్క ఒత్తిడితో లేదా చికాకుతో ఉంటే అంత బాగా నేర్చుకోలేదు. 

అభ్యాస సిద్ధాంతం ప్రకారం యజమాని కుక్కకి నాలుగు ముఖ్య సందేశాలను పంపగలడు:
; బహుమతి లేదా విడుదల గుర్తు 
: సరిగ్గా చేశావు. నువ్వు బహుమతి గెలుచుకున్నావు. 
; ముందుకు సాగు అనే సంజ్ఞా (KGS)
: సరిగ్గా చేశావు. ఇదే కొనసాగించు నువ్వు బహుమతి గెలుచుకుంటావు.
; బహుమతి లేదనే సంజ్ఞా (NRM)
: తప్పు ప్రవర్తన.  వేరేవిధంగా ప్రయత్నించు.
; శిక్షా సంజ్ఞా
: తప్పుడు ప్రవర్తన. నువ్వు శిక్షని పొందావు. 

ఈ సందేశాల కోసం స్థిర సంజ్ఞాలని లేదా పదాలని ఉపయోగించడం వలన కుక్క వీటిని చాలా తొందరగా అర్థం చేసుకోగలుగుతుంది.  

కుక్క బహుమతి దాని బహుమతి సంజ్ఞా లాంటిది కాదని గుర్తుంచుకోవాలి.  బహుమతి సంజ్ఞా కుక్కకి అది బహుమతి గెలుచుకుంది అని తెలియజేస్తుంది. బహుమతులు పొగడ్త, ట్రీట్, ఆట లేదా కుక్క బహుమతిగా అనుకొనే ఏవయినా కావచ్చు. బహుమతి సంజ్ఞా ఇచ్చిన తరువాత బహుమతి ఇవ్వకపోవడం ఆ బహుమతి సంజ్ఞా విలువని తుడిచేసి శిక్షణని మరింత క్లిష్టతరం చేస్తుంది.

ఈ నాలుగు సంజ్ఞల అర్థాలు కుక్కకి పునఃశ్చరణ ద్వారా నేర్పవచ్చు, దీనితో కుక్క సాంప్రదాయ షరతు విధానాన్ని కలిపి చూడడం అలవాటు చేసుకుంటుంది అందువలన కుక్క శిక్షా సంజ్ఞని శిక్షతో కలిపిచూస్తుంది. ఈ సందేశాలు మాటలతో లేదా సంజ్ఞలతో సంభాషించబడతాయి. యాంత్రిక క్లిక్కర్లు బహుమతి సంజ్ఞలుగా తరచుగా "అవును!" కి లేదా "గుడ్!" కి సమానంగా ఉపయోగించబడతాయి.  "కాదు!" అన్న పదం సామాన్య శిక్షా గుర్తు. "ఓహ్!" సామాన్య NRM. KGS సాధారణంగా పునఃశ్చరించే అక్షరం ("గుఉఉఉఉడ్" వంటి మాటలకి "గు-గు-గు-గు-గు" వంటి మాటలు అంటారు).  

చేతి సంజ్ఞలు, శరీర భాష కూడా కుక్కల అభ్యాసంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొంత మంది మనిషి మాటే ప్రభావవంతమైన గుర్తని చెపుతారు.<ref>కానినే డయిమన్శంస్, 2008, 32</ref>

కుక్కలు ఆజ్ఞలను సులభంగా సాధారణీకరించలేవు.  ఇంట్లో పని చేశే అజ్ఞా బయట లేదా భిన్న పరిస్థితులలో అయోమయానికి గురిచేయవచ్చు. ప్రతి అజ్ఞా ప్రతి క్రొత్త పరిస్థితిలో మరలా-నేర్పించాలి. దీనిని కొన్నిసార్లు "వ్యతిరేక-సందర్భికరణం" అంటారు, అంటే కుక్క తను నేర్చుకున్నదానిని అనేక భిన్న సందర్భాలకి సంధానించి చూడడం నేర్చుకోవాలి.   

==బహుమతి మరియు శిక్ష ==
దాదాపు చాలావరకు శిక్షణ కుక్క ప్రవర్తనకి పరిణామాలను అందించడంలో ఉంటుంది.  ఒపరాంట్ కండిషనింగ్ క్రింది నాలుగు విధాలైన పరిణామాలను వివరిస్తుంది. 

#'''ధనాత్మక బలము'''  అనేది పరిస్థితికి అదనంగా కొంత కలిపి అదే ప్రవర్తన మరలా పునరావృతం అయ్యే అవకాశాన్ని పెంచుతుంది.
#'''ఋణాత్మక బలము'''  పరస్థితి నుండి కొన్ని అంశాలను తీసివేసి ప్రవర్తన మరలా పునరావృతమయ్యే అవకాశాన్ని పెంచుతుంది.
#'''ధనాత్మక శిక్ష'''  పరిస్థితికి అదనంగా కొన్ని చేర్చి ప్రవర్తన పునరావృతమయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది.
#'''ఋణాత్మక శిక్ష'''  పరిస్థితినుంచి కొన్ని తొలగించి ప్రవర్తన మరలా పునరావృతమయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది.

చాలామంది శిక్షకులు వారు "ధనాత్మక శిక్షణా పద్ధతులను" ఉపయోగిస్తున్నామని చెప్పారు.  సాధారణంగా దీని అర్థమేమిటంటే చెడు ప్రవర్తనని తగ్గించడానికి శారీరక శిక్షని ఇవ్వడం కంటే బహుమతి-ప్రధాన శిక్షణ ఉపయోగించడం మంచి ప్రవర్తనని పెంచుతుంది. 

===బహుమతులు===
ధనాత్మక బలాలు కుక్క బహుమతిగా భావించే ఏవైనా కావచ్చు-ప్రత్యేక ఆహార పదార్థాలు, బొమ్మతో ఆడుకొనే అవకాశం, మిగత కుక్కలతో కలయికలు, లేదా యజమాని శ్రద్ధ మొదలైనవి. కుక్క ప్రత్యేక వస్తువుని మంచి బహుమతిగా అనుకున్నప్పుడు దానిని పొందడానికి అది ఎక్కువ పని చేస్తుంది. కుక్క సాధించినదానికి ఆనందించడమే వాటికి పెద్ద బహుమతి.

ఉదాహరణకి కొంతమంది కుక్క శిక్షకులు తిండిని బహుమతిగా ఇవ్వడం మీకు అనుకూలిస్తుందని సలహా ఇచ్చారు. మీ కుక్క లేదా కుక్క పిల్ల ఖచ్చితంగా కాలేయపు ముక్కలని లేదా జున్నుని ఆస్వాదిస్తాయి<ref>యారెమెంకో&amp; రాండోల్ఫ్, 2004</ref>.  ఏమైనా అన్నివేళలా మంచి బలంగా మీరిచ్చే బహుమతి ఆరోగ్యదాయకము అయిఉండి మీ కుక్క లేదా కుక్క పిల్ల ఆరోగ్యాన్ని పాడుచేసేది కానిది అయిఉండాలి<ref>యారెమెంకో&amp; రాండోల్ఫ్, 2004</ref>.    

కొంతమంది శిక్షకులు ఒక శిక్షణా పద్ధతిలో కుక్క పిల్ల ఒక ప్రత్య్తేక బొమ్మ గురించి తీవ్ర కోరికని పెంచుకొనేలా చేసి దానిని మంచి ప్రవర్తన కోసం ధనాత్మక బలంగా ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని "ఎరని నిర్మించడం" అంటారు, ఇది సామాన్యంగా నార్కోటిక్స్ కనుగొనడంలో శిక్షణా కోసం పోలీసు కుక్కలకి ఉపయోగిస్తారు. దీని లక్ష్యం ప్రత్యేక బొమ్మ బహుమతిని పొందాలన్న ఆశతో వ్యక్తిగతంగా ఒక కుక్క ఎక్కువ సమయం పని చేసేలా చేయడం.

సాంప్రదాయ పధ్ధతి శిక్ష ఆధునిక కుక్క శిక్షకుల ద్వారా తక్కువగా ఉపయోగించబడతాయి. ఒక కుక్కకి ఈ శిక్షని సాధారణంగా అది కావాలని యజమాని మాట విననప్పుడు, అతను తీవ్ర పరిస్థితిలో కుక్క రక్షణ అవసరాలని చూడవలసివచ్చినప్పుడు ఇస్తారు. శిక్ష కుక్క నుండి కోరుకున్న ప్రవర్తనా శిక్షణలతో ప్రభావవంతంగా జతపడిఉంటుంది, కానీ ఇది ఒక్కటే పరిష్కారం కాదు, కుక్కకి కోరుకున్న ప్రవర్తనలు నేర్పకపోతే అది సహకరించడానికి నిరాకరించడం లేదా భయానికి లోనవడం అవుతుంది.  

శిక్షలు కుక్క వ్యక్తిత్వానికి, వయస్సుకి, అనుభవానికి, శారీరక మరియు మానసిక స్థితికి సరిపడేలా ఉండేలా గమనించుకోవాలి. కొన్ని కుక్కలు తీవ్ర పదజాల దిద్దుబట్లకి భయపు లేదా ఉద్వేగపు సంజ్ఞలని చూపిస్తాయి. మిగతా కుక్కలు తోట్లని పట్టించుకోవు. కొన్ని కుక్కలు నీటిని వాటి మీద చల్లినప్పుడు నీటికి భయపడడం లేదా వ్యతిరేకతని పెంచుకుంటాయి.

==శిక్షణా మెళుకువలు==
చాలా మంది కుక్కల యజమానులు వారి కుక్కలకి మెళుకువలు నేర్పుతారు. ఇది అనేక ప్రయోజనాలని అందిస్తుంది: ఇది మనిషికీ కుక్కకి మధ్య ధృడ బంధాన్ని నెలకొల్పుతుంది, ఇది వినోదాన్ని అందిస్తుంది, ఇది కుక్క మెదడుని ఆలోచనలతో నింపుతుంది, దీని వలన బోర్ వాళ్ళ వచ్చే సమస్యలు ఉండవు.

== పట్టీలు మరియు తొడుగులు ==
 
చొక్ పట్టీ: చొక్ పట్టీ పొడవైన లోహపు-పట్టీ గొలుసు రెండు వైపులా వృత్తాన్ని కలిగిఉంటుంది. ఈ గొలుసు ఒక వృత్తంలో నుంచి జారి కుక్క తల మీద ఉంటుంది. కుక్క అయిష్టతని ప్రదర్శించినపుడు పట్టీ బిర్రు చేయబడుతుంది. ఇది సాంప్రదాయ కుక్క శిక్షణలో ఉపయోగిస్తారు.

ప్రోంగ్ (లేదా గుచ్చే) పట్టీ: ప్రోంగ్ పట్టీ లోహపు లింకులతో కలిపి పొడవైన, మొనదేలిన పన్ని వంటి భాగం కుక్క మెడకి తగిలేల ఉంటుంది. ఈ పట్టిలో ఒక భాగం గొలుసు లింకులతో కలిసి దానిని లాగినపుడు, బిర్రు చేసినపుడు కుక్క మెడని గుచ్చుతాయి. ఈ పట్టిల వినియోగం వివాదాస్పదం, ఇది PETA వంటి జంతు హక్కుల సంఘాల ద్వారా వ్యతిరేకించబడింది. ఈ పట్టీ ముఖ్యంగా సాంప్రదాయ కుక్క శిక్షణలో ఉపయోగించబడుతుంది. 

రేడియో-నియంత్రిత పట్టీలు: ఇవి పట్టికి రేడియో రిసీవర్ ని కలిగి ఉంటాయి, ట్రాన్స్ మీటర్ శిక్షకుడు పట్టుకొనిఉంటాడు.  నొక్కినప్పుడు పట్టీ అయిష్టతని జారీ చేస్తుంది. ప్రత్యేక అయిష్టతలు పట్టీల తయారీని బట్టి మారతాయి. కొన్ని శబ్దాలని పంపితే, కొన్ని కంపిస్తాయి, కొన్ని సిట్రోనేల్ల లేదా ఇతర ఎరోసల్ స్ప్రేలను విడుదల చేస్తే, కొన్ని విద్యుత్ తరంగాలని వదులుతాయి. కొన్ని పట్టీలు వీటిలో కొన్నింటిని కలిగిఉంటాయి.  వీటిలో విద్యుత్ ఉత్తేజకాలు అతి సామాన్య ఉపయోగిత, అతి విస్తృత ఉపయోగితం. పూర్వపు విద్యుత్ పట్టీలు కేవలం ఒక ఎక్కువ-స్థాయి షాక్ ని అందించి, అయిష్ట ప్రవర్తనని శిక్షించడానికి మాత్రమే ఉపయోగించేవారు.<ref>లిండ్సే, 2005, p.&nbsp;583</ref> ఆధునిక విద్యుత్ పట్టీలు సర్దగలిగేవి, శిక్షకుడిని ఉత్తేజక స్థాయిని కుక్క సున్నితత్వం, ఉద్రేకాన్ని దృష్టిలో పెట్టుకొని జతపరిచేవిధంగా చేయగలిగేవి. ఇవి స్థిర, కొలవగలిగిన స్థాయి అయిష్ట ఉత్తేజకాన్ని విడుదల చేస్తాయి, ఇవి గణనీయమైన అసౌకర్యాన్ని మాత్రమే కలిగించి, శాశ్వత శారీరక దెబ్బని కలిగించకుండా చేస్తాయి.<ref>లిండ్సే, 2005, p.&nbsp;584</ref>  లిండ్సే ప్రాథమిక అంటే నిమ్న అణకువ నియంత్రానని కలిగించడానికి ఈ పట్టీలను ఉపయోగించడం అనవసరంగా భావిస్తున్నారు.<ref>లిండ్సే, 2005, 586</ref>

మార్టిన్గేల్ పట్టీ: మార్టిన్గేల్ పట్టీ లాగినప్పుడు బిర్రయ్యే ఒకే ఒక అంశాన్ని కలిగిఉంటుంది.  ఇది బాగా బిగుసుకుపోయే చొక్ పట్టీకి బిన్నమైనది.  

హెడ్ పట్టీ: హెడ్ పట్టీ గుర్రపు కళ్ళానికి చాలా దగ్గరిగా ఉంటుంది. దీని సిద్ధాంతం నీకు తల మీద నియంత్రణ ఉంటే దేహం మీద నియంత్రణ అదే వస్తుంది. హెడ్ పట్టీ సాధారణంగా రెండు ఉచ్చులని కలిగిఉంటుంది. ఒక ఉచ్చు చెవుల క్రిందగా వెళుతుంది రెండవది కుక్క ముక్కు మీదుగా వెళ్ళి రెండు కుక్క దవడ క్రింద ఎక్కడో కలుస్తాయి. ఈ సాధనం వలన కుక్క తల విదిలించడానికి చాలా కష్టపడుతుంది.  ఈ సాధనం సాధారణంగా ధనాత్మక బల శిక్షణలో ఉపయోగిస్తారు.

లాగనవసరం లేని కళ్ళెం: లాగనవసరం లేని కళ్ళెం జంతువు దేహం మీద ధరింపబడుతుంది. లాగనవసరం లేని కళ్ళెం సంప్రదాయ కళ్ళాలకి భిన్నంగా ఉంటుంది, ఇది కుక్క లాగడానికి గట్టిగ ఉండడమే కాక ఇది శక్తిని కుక్క వీపు, భుజాల శక్తిని దేహమంతా పంపిణీ చేస్తుంది. లాగనవసరం లేని కళ్ళెం కుక్క లాగినపుడు దాని దేహపు కదలికని నియంత్రిస్తుంది. హెడ్ పట్టీ లాగా లాగనవసరం లేని కళ్ళెం కూడా కుక్కకి లాగవద్దని నేర్పించదు; ఇది కేవలం కుక్క లాగడానికి గట్టిగ మాత్రమే ఉంటుంది.

==ప్రత్యేక శిక్షణ==
కుక్కలు కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం కూడా శిక్షణ పొందుతాయి:
*పరిశోధనా కుక్కలు 
*సహాయక కుక్కలు 
*హీర్దింగ్ కుక్కలు, పంట పొలాల కాపలా కుక్కలు, గొర్రె కాపలా కుక్కలు
*వేట కుక్కలు 
*పోలీస్ కుక్కలు 
*రక్షణ కుక్కలు 
*''షుత్జ్ హండ్''  జర్మన్ "రక్షణ కుక్క".
 కుక్క ముఖ్యంగా సాధించవలసినవి మూడు అంశాలు (జాడ పసిగట్టడం, అణకువ, స్వీయ రక్షణ)  

===కాపలా జంతువులు===
{{Expand section|Guard animals|date=June 2008}}
వారి సహజ సామాజిక నిర్మాణం కారణంగా-ఇవి ప్రాదేశిక మరియు సహవాసులతో రక్షించబడే-సహవాస జీవులు అపరిచితుల పట్ల కొన్ని రకాల జాగురుకత కల ప్రవర్తనలను ప్రదర్శిస్తాయి. 
 కానీ కాపలా కుక్కలు, పొలిసు కుక్కలు సహవాస జంతువులు కావు.

కాపలా కుక్కలను రదనికలుగా వర్ణిస్తారు, ఇవి శిక్షణ వలన కానీ లేదా సహజశక్తి వలన కానీ సంపదని, వ్యక్తులని లేదా వస్తువులని రక్షిస్తాయి.{{Citation needed|date=April 2008}} మంచి సుశిక్షితమైన కాపలా కుక్క వ్యక్తిని, ఆస్తిని లేదా వస్తువులని ఆజ్ఞా మీద రక్షిస్తాయి అలానే ఆజ్ఞతో "ఆపివేస్తాయి".  

కాపలా జంతువులకు తర్ఫీదునివ్వడానికి తూర్పు (ఉదా||కోహ్లేర్ పధ్ధతి-విలియం కోహ్లేర్ ద్వారా అభివృద్ధి చేయబడింది, ఈయన మిలటరీ కుక్కల, వాల్ట్ డిస్నీ నిర్మాణాల జంతువుల శిక్షకుడు) మరియు పాశ్చాత్య పద్ధతులు కలగలిసిన అనేక పద్ధతులు ఉన్నాయి.  ''షుత్జ్ హుండ్''  అట ఒక రక్షణ దశని కలిగిఉంటుంది ఇందులో కుక్క "డికోయ్" అనే "చెడ్డ వ్యక్తి"గా నటిస్తున్న వ్యక్తి వేసుకున్న రబ్బరు చేతిని కుక్క శికహకుడిని బెదిరించగానే పట్టుకోవాలి; అలాగే కుక్క ఆజ్ఞని వినగనే వదిలేసి డికోయ్ కి కాపలా కాయాలి.   

కొన్ని పరిస్థితులలో ఆస్తికి కాపలాగా కుక్కలు ఒంటరిగా వదిలి వేయబడినపుడు అపరిచిత వ్యక్తులు ఇచ్చిన తిండిని ఇతర పదార్థాలను తినకుండా వాటికీ శిక్షణనివ్వాలి. 

===సేవా జంతువులు ===
{{Expand section|Service animals|date=June 2008}}
సహాయక కుక్కలు, పర్యవేక్షించే, వినే కుక్కల వంటివి వాటి సునిశిత శక్తులను ఉపయోగించుకోవడానికి జాగ్రత్తగా శిక్షణ పొందవలసిఉంటుంది, మనిషితో
 ఉన్న బంధాన్ని బట్టి కుక్కలు వాటి రక్షణా శక్తులు లోపం ఉన్న వ్యక్తుల దయినండిన జీవితంలో సహాయపడతాయి.   సహాయక కుక్కల ఉపయోగం దినదినాభివృద్ధి చెందుతున్న వర్గం, విస్తృత స్థాయి స్వికారాలతో ఇది ఉంటుంది.  

==వీటిని కూడా పరిశీలించండి==

* ఆల్ఫా పాత్ర 
* జంతు శిక్షణ 
* మొరుగు (కుక్క)
* కన్ఫర్మేషన్ షోఇంగ్

* కుక్క సామర్థ్యం
* కుక్కల ఆటలు 
* జంతుప్రవర్తన అధ్యయనశాస్త్రము
* అణకువ శిక్షణ
* ఒపెరాంట్ కండిషనింగ్
* శిక్ష (మనస్తత్వశాస్త్రం)
* రిఇన్ఫోర్స్మెంట్ 
* బహుమతి వ్యవస్థ 

==సూచనలు==
{{Reflist}}
{{Citation style|date=September 2009}}
*బీవర్, బొన్నీ వి. (1999). ''కానిన్ బిహేవియర్: ఎ గయిడ్ ఫర్ వెటరినేరియన్స్'' . డబ్ల్యూ. బి. సౌండర్స్ కంపెనీ, ఫిలడెల్ఫియా, PA
*ఆల్ఫా డాగ్ ట్రైనింగ్ [www.alphadog.co.il]
*లిండ్సే, స్టీవెన్ ఆర్. (2000). ''హ్యాండ్ బుక్ అఫ్ అప్ప్ల్యడ్ డాగ్ బిహేవియర్ అండ్ ట్రైనింగ్, వాల్. 1: ఆడప్టేశన్ అండ్ లెర్నింగ్'' . ఐవా స్టేట్ యూనివర్సిటి ప్రెస్, ఆమెస్, IA.
*స్కాట్, జాన్ పి. అండ్ ఫుల్లర్, జాన్ ఎల్. (1965). ''కుక్క యొక్క జన్యు మరియు సామాజిక ప్రవర్తన'' . యూనివర్సిటి అఫ్ చికాగో ప్రెస్, చికాగో, IL.
*సర్పాల్, జేమ్స్ ఎ. (1995). ''ది డొమెస్టిక్ డాగ్: దాని పరిణామం, ప్రవర్తన, ప్రజలతో కలివిడిగా ఉండడం'' . కేంబ్రిడ్జ్ యూనివర్సిటి ప్రెస్, న్యూయార్క్, NY.

{{Dog nav}}

{{DEFAULTSORT:Dog Training}}
[[వర్గం:కుక్క శిక్షణ మరియు ప్రవర్తన ]]
[[వర్గం:పెంపుడు జంతువులు]]