Difference between revisions 906007 and 906008 on tewiki

{{Taxobox
| name = ఉడుము
| image = Varanus varius1.jpg
| image_width = 240px
| image_caption = An [[Australia]]n [[lace monitor]]<br />(''Varanus varius'') on a tree.
| regnum = [[ఏనిమేలియా]]
| phylum = [[కార్డేటా]]
| classis = [[సరీసృపాలు]]
(contracted; show full)ith Comments on the Study of Adaptation   | publisher = Field Museum of Natural History  | date = 1986  | isbn = 9998057760 }}</ref> ఇవి గుడ్లను పెడతాయి. ఒకసారి 7 నుండి 37 గుడ్లు పెట్టి వాటిని మట్టితో కప్పిపుచ్చుతాయి. లేదా బోలుగా ఉన్న వృక్షాలలో దాచిపెడతాయి.<ref name=EoR>{{cite book |editor=Cogger, H.G. & Zweifel, R.G.|author= Bauer, Aaron M.|year=1998|title=Encyclopedia of Reptiles and Amphibians|publisher= Academic Press|location=San Diego|pages= 157-159|isbn= 0-12-178560-2}}</ref>.

ప్రకృతిలో ఉద్భవించిన జీవరాశులన్నిటినీ మానవుడు మనుగడకి అనేక విధాలుగా ఉపయోగించుకుంటున్నాడు. మనిషికి ఇది ప్రకృతి సిద్దంగా వచ్చిన తెలివి. ప్రతినిత్యం ఆదే అన్వేషణలో దేనిలో ఏదుందో కనిపెట్టి దానిని ఏదో విధంగా జీవన సరళికి వినియో గించుకుంటూ, ఆరోగ్యాన్నీ, ఐశ్వర్యాన్ని పొందుతున్నాడు. ఆ విధంగా ఉపయోగపడే ప్రాణు ల్లో ఉడుము ఒకటి. దీని శాస్త్రీయ నామం వరానస్‌. ఇది వరనిడారు కుటుంబానికి చెందిన పెద్ద మాంసాహారులైన బల్లులు. వీటిలో అతిపెద్ద ఉడుము కొమొడొ డ్రాగన్. వీటి ఉనికి చాలా విస్త్రుతమైనది. ఆఫ్రికా, ఇండియా, శ్రీలంకా, చైనా, ఇండోనేషియా, ఫిలిప్పిన్స్‌, న్యూ జనియా, ఆస్ట్రేలియా మొదలైన చోట్ల, ఇండియాకి, చైనాకి దగ్గరగా ఉన్న సముద్ర దీవుల్లోను ఎక్కువగా ఉంటాయి.ఉడుములు సాధారణంగా పెద్ద సరీసృపాలు. అన్నింటికన్న చిన్నదైన ఉడుము 12 సె.మీ. పొడవున్నది. వీటికి పొడవైన మెడ, పంజా, గోర్లు కలిగిన బలమైన కాళ్ళుంటాయి. సుమారుగా అన్ని ఉడుములు మాంసాహారులు. Varanus prasinus మరియు Varanus olivaceus మాత్రం పండ్లను కూడా తింటాయి. ఇవి గుడ్లను పెడతాయి. ఒకసారి 7 నుండి 37 గుడ్లు పెట్టి వాటిని మట్టితో కప్పిపుచ్చుతాయి. లేదా బోలుగా ఉన్న వృక్షాలలో దాచిపెడతాయి. ఇందులో అనేక జాతులు ఉన్నాయి. ముఖ్యంగా ఇది పెద్ద సర్పజాతికి చెందిందిగా భావిస్తారు. ఈ ఉడుములు చాలా తెలివి గలవి. వీటికి పొడ వైన మెడ, శక్తివంతమైన తోక, అవయవాలు ఉండి కాళ్ళు నాలుగూ చాలా బలిష్టంగా ఉం టాయి. 'ఉడుము అనగానే చరిత్ర తెలిసిన చాలామందికి శివాజీ గుర్తుకు వస్తాడు. ఛత్రపతి శివాజీ ఈ ఉడుముల్ని ప్రత్యేకంగా పెంచేవాడు. వీటి నడుముకు పెద్ద వెూకులు తాళ్ళు కట్టి, మూతికి బెల్లం పాకం రాసి శత్రువుల కోటగోడల వద్ద పైకెక్కించేవాడు. అవి పూర్తిగా పైదా కా ఎక్కిన తరువాత ఆ తాడు కొద్దిగా లాగితే ఆ ఉడుము గోడ చివరి భాగాన్ని గట్టిగా పట్టు కున్ని ఉండేది. ఇక ఆతాడుతో శివాజీ సైన్యంతో సహా కోటగోడలు ఎక్కి ముట్టడించేవాడు. ఇక వైద్య పరంగా ఈ ఉడుములు చాలారకాలుగా ఉపయోగపడుతున్నాయి. వీటి చర్మంనుంచి తయారుచేసిన తైలం పక్షవాతం వచ్చిన వారికి మంచి ఔషధంగా ఉపయోగ పడుతుంది. సాధారణ పరిస్థితుల్లో కూడా అడపాదడపా శరీరానికి ఈ ఉడుము చమురు మర్ధనా చేసుకుని ఒక గంట ఆరనిచ్చి స్నానం చేస్తూవుంటే, శరీరం వజ్రకాయంగా, ధృఢంగా తయారవుతుంది. కొన్ని వ్యాధులకి ఉడుము మాంసంతో చేసిన బిరియానీ వంటి వంటకాలు ఔషధంగా ఉపయోగపడతాయి. నేటికీ చాలా మంది యోధులు చైనాలోను, కేరళ కొన్ని ప్రాంతాల్లోను, శరీర ధారుడ్యానికి ఉడుము చమురుని ప్రత్యేకంగా వాడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం మన హైదరా బాద్‌ నగ రంలో కోటీ మార్కె ట్టులో కూడా ఉడు ములు అమ్మే వారు. నేటికీ అక్కడక్కడ ఈ ఉడుముల వ్యాపారులు మనకి కనిపిస్తూ వుంటారు. ఉడుము మాంసంతో చేసిన వంట కాలు తీసుకున్నా, ఉడుము చమురు లేపనం చేసుకున్నా శరీర కండరాలు బలిష్టంగా తయారవ్వడమే కాకుండా శృంగారపరమైన శక్తిని కూడా పెంచుతుంది. అయితే వీటిలో కొన్ని జాతులు విషపూరితమైనవి ఉంటాయి. అందువలన వీటిని పెంచే వారికి మాత్రమే వీటిలో విషయావగాహన ఉంటుంది. జీవకారుణ్య సంఘాలు ఉద్భవించిన తరువాత వీటి వాడకం కొంత తగ్గిందనే చెప్పవచ్చు. కానీ, ప్రత్యేకమైన పరిస్థితులు లేకపోవడం వల్ల వీటి ఉత్పత్తి బాగానే జరుగుతోంది. 
== మూలాలు ==
*https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%89%E0%B0%A1%E0%B1%81%E0%B0%AE%E0%B1%81&action=edit&section=1
{{మూలాలజాబితా}}

[[వర్గం:బల్లులు]]