Revision 735871 of "సింగపూర్‌లో పర్యాటక రంగం" on tewiki

[[File:Orchids-NationalOrchidGarden-20041025.jpg|thumb|సింగపూర్ వృక్షసంబంధ ఉద్యానవనాలలో ఆర్చిడ్లు]]
[[File:RafflesHotel-Singapore-20041025.jpg|thumb|చారిత్రాత్మక రాఫెల్స్ హోటల్ జాతీయ స్మారకంగా ఉంది]]

'''[[సింగపూరు|సింగపూర్‌]]‌లో [[పర్యాటక రంగం|పర్యాటక రంగం]]'''  అతిపెద్ద పరిశ్రమగా ఉంది మరియు ప్రతి సంవత్సరం అనేక మిలియన్ల పర్యాటకులను ఆకర్షిస్తుంది.<ref name="stb1">[http://app.stb.com.sg/asp/tou/tou02.asp#VS ప్రధాన గణాంకాల సమాచారం]</ref> దీని సాంస్కృతిక వైవిధ్యత సాంస్కృతిక ఆకర్షణకు కారణంగా ఆపాదించబడింది, ఇది వలసరాజ్య చరిత్ర మరియు చైనీస్, మాలే, భారతీయ మరియు అరబ్ జాతులను ప్రతిబింబిస్తుంది. ఇది పర్యావరణానికి అనుకూలంగా ఉండి సహజమైన మరియు వారసత్వ సంరక్షణా కార్యక్రమాలను చేపడుతుంది. దానియొక్క నాలుగు అధికారిక భాషలలో [[ఆంగ్ల భాష|ఆంగ్లం]] ప్రధానమైనది కావటంతో, పర్యాటకులు దేశంలోని స్థానిక ప్రజలతో జరిపే సంభాషణలను, ఉదాహరణకు షాపింగ్ చేసే సమయంలో అర్థం చేసుకోవటం సులభతరంగా ఉంటుంది. సింగపూర్‌లో రవాణా సింగపూర్‌లోని అన్ని బహిరంగ ప్రదేశాలకు కాకపోయినప్పటికీ చాలా ప్రాంతాలకు సేవలను అందిస్తుంది, ఇది పర్యాటకులకు సౌకర్యాన్ని పెంచుతుంది. ఇందులో ప్రఖ్యాతి చెందిన మాస్ రాపిడ్ ట్రాన్సిట్ (MRT) విధానం కూడా ఉంది.

ఆర్చర్డ్ రోడ్ ప్రాంతమంతా బహుళ అంతస్థుల షాపింగ్ సెంటర్లు మరియు హోటళ్ళను కలిగిఉండి సింగపూర్ పర్యాటక రంగం యొక్క కేంద్రంగా భావించబడుతుంది. ఇతర పర్యాటక ఆకర్షణలలో సింగపూర్ జంతుప్రదర్శనశాల మరియు నైట్ సఫారీ ఉన్నాయి, ఇది ఆసియా, ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికాకు చెందిన అడవి జంతువులను రాత్రిపూట చూడటానికి, అతిధులు మరియు జంతువుల మధ్యలో కంటికి కనబడే ఏ విధమైన అడ్డంకుల లేకుండా అనుమతిస్తుంది. సింగపూర్ జంతుప్రదర్శన 'బహిరంగ జంతుప్రదర్శన' భావాన్ని అవలంబిస్తుంది, తద్వారా జంతువులను బోనులలో ఉంచకుండా పర్యాటకుల నుండి వేరుచేస్తూ శుష్క లేదా తడి కందక ఆవరణలలో ఉంచబడతాయి. జురాంగ్ బర్డ్ పార్క్ అనే ఇంకొక జంతుసంబంధమైన ఉద్యానవనం [[పక్షి|పక్షుల]] కొరకు ఉద్దేశింపబడి, ప్రపంచంలోని పక్షి జాతులను మరియు వివిధ రకాలను ప్రజలకు బహిర్గతం చేసే ఆశయంతో ఉంది, ఇందులో వెయ్యి ఎర్ర కొంగల సమూహం కూడా ఉంది. సింగపూర్ దక్షిణాన ఉన్న పర్యాటక ద్వీపం సెంటోసాకు ప్రతిసంవత్సరం 5 మిలియన్ల సందర్శకులు విచ్చేస్తున్నారు, ఇందులో 20-30 ప్రముఖ ప్రదేశాలు ఉన్నాయి, వీటిలో [[రెండవ ప్రపంచ యుద్ధం|ప్రపంచ యుద్ధం II]] సమయంలో జపనీయులనుండి రక్షణగా దుర్గంగా సిలోసో కోట నిర్మించబడింది. ప్రపంచ యుద్ధం II శకంలోని, సూక్ష్మ-పరిమాణంలో ఉన్న తుపాకి నుండి 16 పౌండ్లు (7 కిలోలు) ఉన్న తుపాకులను సిలోసో కోటలో చూడవచ్చును. అంతేకాకుండా, ఈ ద్వీపంలో టైగర్ స్కై టవర్‌ నిర్మించబడింది, ఇది మొత్తం సెంటోసా అంతటినీ చూడటానికి అలానే సెంటోసా ల్యూజ్‌ను ఎక్కటానికి సందర్శకులకు వీలుకల్పిస్తుంది, ల్యూజ్‌లో ఒకరు లేదా ఇద్దరి కొరకు ఒక మోటుబండి ఉంటుంది, ఇందులో ఎక్కినవారు కాళ్ళను ముందు పెట్టి పడుకున్నట్టు ఉండి మొహం పైకిలేపి ఉంచుతారు. మోటుబండిని నడిపేవారికి జతచేయబడిన తాళ్ళను లాగటం లేదా బరువును మార్చటం ద్వారా ముందుకు లాగబడుతుంది. సింగపూర్‌లో కాసినోలను కలిగి రెండు సమీకృత విడుదులు ఉన్నాయి, అవి మరీనా బే సాండ్స్ మరియు రిసార్ట్స్ వరల్డ్ సెంటోసా.

==పర్యాటక రంగం యొక్క గణాంకాలు==
[[File:Singapore Ducktours, Jul 07.JPG|thumb|right|250px|సింగపూర్ డక్‌టూర్స్]]
2006లో సింగపూర్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్య అంచనాలను మించి 9.7 మిలియన్లకు చేరింది, 2005తో పోలిస్తే 8.9 మిలియన్లు ఉంది.<ref name="stb1"></ref>

పర్యాటకులు అంచనాల ప్రకారం S$12.4 బిలియన్లను ఖర్చుచేశారు, 2005లో ఇది 10.8 బిలియన్లు ఉంది, గత సంవత్సరం 2005తో పోలిస్తే ఇది 14% పెరిగింది.<ref name="stb1"></ref>

పర్యాటకులు సగటున 4.2 రోజులు 2006లో నివసించారు మరియు పర్యాటకులకు ప్రధాన మూలంగా [[ఇండోనేషియా|ఇండోనేషియా]] ఉంది, ఇక్కడ నుండి 2006లో 1.8 మిలియన్ల మంది పర్యటించారు మరియు దీనిని తరువాత చైనా నుండి 1.0 మిలియన్ మంది పర్యటించారు. [[మలేషియా|మలేషియా]] నుండి 996,000 మంది పర్యాటకులు విచ్చేసారు.<ref name="stb1"></ref>

హోటల్స్ యొక్క సగటు ఆక్రమణ రేటు మొత్తం సంవత్సారనికి 2005లోని 84%తో పోలిస్తే 86% ఉండి 1.4% వృద్ధిని సాధించింది.<ref name="stb1"></ref>

గదుల ధరలు 10 సంవత్సరాల రికార్డులను అధిగమిస్తూ గత సంవత్సరం 2005లోని $137తో పోలిస్తే అత్యధికంగా S$164కు చేరి 19.6% వృద్ధిని సాధించింది.<ref name="stb1"></ref>

2006లో, మొత్తం గదుల రాబడి, సందర్శకులు వచ్చిన రోజు మరియు లభ్యంలో ఉన్న గది యొక్క రాబడి వరుసగా  $1.5 బిలియన్లు, $32.9 మిలియన్లు మరియు $140గా ఉన్నాయి. 2005 సంవత్సరంతో పోలిస్తే మొత్తం మూడు రంగాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి.<ref name="stb1"></ref>

2007లో, దేశం 10.3 మిలియన్ల పర్యాటకుల ఆగమనాలను సాధించింది.

2015 నాటికి ఉన్నతస్థితిని ఆశిస్తున్న పర్యాటక రంగం 2015 ప్రణాళిక లక్ష్యంలో పర్యాటకుల ఆగమనాలను 17 మిలియన్లకు మరియు పర్యాటక రాబడులను S$30 బిలియన్లకు పెంచాలని ఉంది.

===సాధారణ పోకడలు===

{| class="wikitable" border="1"
|-
!సంవత్సరం
!పర్యాటక ఆగమనాలు
!<ref name="stb1"></ref> గత కాలంతో పోలిస్తే మారిన శాతం
|-
| 1965
|  align="right"|99,000
| &nbsp;
|-
| 1970
|  align="right"|579,000
| 488.1%
|-
| 1975
|  align="right"|1,324,000
| 128.6%
|-
| 1980
|  align="right"|2,562,000
| 93.5%
|-
| 1985
|  align="right"|3,031,000

| 18.3%
|-
| 1990
|  align="right"|5,323,000
| 75.6%
|-
| 1995
|  align="right"|7,137,000	
| 34.1%
|-
| 2000
|  align="right"|7,691,399
| 7.8%
|-
| 2005
|  align="right"|<ref>{{cite news| title= Singapore visitor arrivals hit record 8.94&nbsp;m in 2005 | publisher= Channel NewsAsia | date= 18 January 2006 | url= http://www.channelnewsasia.com/stories/singaporebusinessnews/view/188813/1/.html }}</ref> 8,942,408
| 7.4%
|}

{{-}}

===ఇటీవలి సంవత్సరాలు===

{| class="wikitable" border="1"
|-
!సంవత్సరం
!పర్యాటక ఆగమనాలు
!<ref name="stb1"></ref> గత సంవత్సరం నుండి మార్పు చెందిన శాతం
|-
| 1997
|  align="right"|7,197,871
| 1.30%
|-
| 1998
|  align="right"|6,242,152
| -13.28%
|-
| 1999
|  align="right"|6,958,201
| 11.47%
|-
| 2000
|  align="right"|7,691,399
| 10.54%
|-
| 2001
|  align="right"|7,522,163
| -2.20%
|-
| 2002
|  align="right"|7,567,110
| 0.60%
|-
| 2003
|  align="right"|6,126,569
| -19.04%
|-
| 2004
|  align="right"|8,328,118
| 35.92%
|-
| 2005
|  align="right"|<ref>{{cite news| title= Singapore visitor arrivals hit record 8.94&nbsp;m in 2005 | publisher= [[Channel NewsAsia]] | date= 18 January 2006 | url= http://www.channelnewsasia.com/stories/singaporebusinessnews/view/188813/1/.html }}</ref> 8,942,408
| 7.4%
|-
| 2006
|  align="right"|9,748,207
| 9.0%
|-
| 2007
|  align="right"|<ref>{{cite web| title= Visitor Arrivals Year 2007 | publisher= [[Singapore Tourism Board]] | date= 23 January 2008 | url=http://app.stb.gov.sg/Data/tou/typea/type1/2007/16/2007vas.pdf }}</ref> 10,284,545
| 5.5%
|-
| 2008
|  align="right"|<ref>{{cite web| title= Visitor Arrivals Year 2008 | publisher= [[Singapore Tourism Board]] | date= 23 January 2009 | url=http://app.stb.gov.sg/Data/tou/typea/type1/2008/16/2008vas.pdf}}</ref> 10,115,638
| -1.6%
|}

===సందర్శనీయ స్థలాలను చూడటానికి బస్సు సౌకర్యం===
* 4 '''స్కానియా L94UB'''  (ఓపెన్-టాప్) లో ఫ్లోర్, నాన్-WAB, ఉహాన్ లారీ (బ్రౌన్ TOSST, PA4685C), ఝాడింగ్ రాడిష్ (రెడ్, PA4709T), రసెల్ రాక్స్ (బ్రౌన్ TOSST, PA5418B) మరియు వెంజియో ఛో (బ్రౌన్ TOSST, PA5420T)
* 9 '''స్కానియా K230UB'''  (ఓపెన్-టాప్) {{Access icon|15px}} స్మైలీ రికీ (PA6432C), జనరల్ ఎకిలిప్స్ (PA6433A), సైడింగ్ టియో (PA7143E), సోలార్ మూన్ (PA7187D), క్లేబ్ టో (PA7316Z), స్టైలో కిమ్ (PA9585A), OK లిమ్ (PA9587U), ఈజీ తాన్ (PA9800D) మరియు బేసన్ హుయీ(PA9916D)
* 4 '''స్కానియా K280IB'''  మాంస్టర్ రైనో, హై డెక్ బ్లూబీ, వాడెర్ అండ్ గోల్డీ.

===పడవ సౌకర్యం===
* 5 కాండీసెల్ లార్క్ V

==షాపింగ్==
[[File:Ngee Ann City Orchard Road.jpg|thumb|right|250px|ఆర్చర్డ్ రోడ్‌లోని తకషిమయ షాపింగ్ సెంటర్]]

సింగపూర్‌లో అనేక షాపింగ్ ప్రాంతాలు ఉన్నాయి, అందులో మరీనా బే, బ్యుగిస్ స్ట్రీట్, చైనాటౌన్, గెవ్లాంగ్ సెరై, కాంపాంగ్ గెలాం &amp; అరబ్ స్ట్రీట్, లిటిల్ ఇండియా, నార్త్ బ్రిడ్జి రోడ్, ఆర్చర్డ్ రోడ్ మరియు ది సబర్బ్స్ ఉన్నాయి.

[[ఆగ్నేయ ఆసియా|ఆగ్నేయ ఆసియా]] యొక్క వ్యాపార స్థావరంగా సింగపూర్ చూడబడుతుంది మరియు ఆర్చర్డ్ రోడ్ ప్రాంతంలో విస్తారమైన షాపింగ్ ఆవరణాలు ఉన్నాయి. అనేక బహుళ అంతస్తుల షాపింగ్ కేంద్రాలు ఆర్చర్డ్ వీధిలో ఉన్నాయి; ఈ ప్రాంతంలో అనేక హోటళ్ళు ఉన్నాయి మరియు డౌన్‌టౌన్ కోర్ తో పాటు ఇది కూడా ప్రధాన పర్యాటక కేంద్రంగా సింగపూర్‌లో ఉంది. విస్తృతంగా షాపింగ్ చెయ్యటానికి స్థానిక జనాభా కూడా ఆర్చర్డ్ రోడ్‌ను ఉపయోగిస్తారు.

ఆర్చర్డ్ రోడ్ కాకుండా సింగపూర్‌లోని ఇంకొక అతిపెద్ద షాపింగ్ కేంద్రం వివోసిటీ, 2006లో ఆరంభించినప్పటి నుండి అనేక మిలియన్ల ప్రజలను ఇది ఆకర్షించింది.<ref name="vivocna">ఫరా అబ్దుల్లా రహీం''"[http://www.channelnewsasia.com/stories/singaporelocalnews/view/235628/1/.html నూతనంగా ఆరంభించిన వివోసిటీ మాల్ షాపింగ్ చేసే మిలియన్ల మందిని ఆకర్షిస్తుంది]'' , ఛానల్ న్యూఆసియా, 2006-10-15</ref>

సింగపూర్‌లో కొనుగోళ్ళు చేయటానికి పర్యాటకులను మరింత ప్రోత్సహించటానికి, సింగపూర్  టూరిజం బోర్డ్ మరియు ఇతర కార్యకర్తలు ప్రతి సంవత్సరం గ్రేట్ సింగపూర్ సేల్ నిర్వహిస్తారు. దీనిలో పాల్గొంటున్న దుకాణాలలో గొప్ప డిస్కౌంటులను మరియు బేరాలను కొనుగోలుదారులు ఆనందించవచ్చు. సింగపూర్ పర్యాటక సంఘం "లేట్ నైట్ షాపింగ్"ను 2007లో ప్రవేశపెట్టింది.<ref>[http://www.visitsingapore.com/publish/stbportal/en/home/what_to_do/shopping/latenightshopping.html విలక్షణమైన సింగపూర్  - అర్థరాత్రి వరకు షాపింగ్, ఆహారలభ్యం మరియు వినోదం]</ref> పర్యాటకులు
"లేట్ నైట్ షాపింగ్"ను ఆర్చర్డ్ రోడ్ లో శనివారంనాడు రాత్రి 11pm గంటల వరకు చేయవచ్చు మరియు ప్రత్యేకమైన ఒప్పందాలు లేదా ప్రోత్సాహకాలను పాల్గొంటున్న రిటైలర్ల నుండి పొందవచ్చు.

==ద్వీప విడుదులు==
సింగపూర్ దక్షిణాన ఉన్న సెంటోసా ద్వీపం అతిపెద్ద ద్వీపంగా ఉంది. తీరం ఎదురుగా ఉండే విడిది‌తో పాటు, పర్యాటక ఆకర్షణలలో చారిత్రాత్మక వస్తుప్రదర్శనశాల ఫోర్ట్ సిలోసో, అండర్‌వాటర్ వరల్డ్ అక్వేరియం మరియు ''టైగర్ స్కై టవర్''  ఉన్నాయి. సింగపూర్‌లో రెండు కాసినోలు కూడా ఉన్నాయి (సమీకృత విడుదులు), అందులో ఒకటి మరీనా బే సాండ్స్ మరియు రెండవది రిసార్ట్స్ వరల్డ్ సెంటోసా (యూనివర్సల్ స్టూడియోస్ సింగపూర్‌ను కలిగిఉంది) ఈ విడుదులలో సింగపూర్ కాసినోలను నిర్మించటం వివాదస్పదంగా అయ్యింది.

==ప్రాకృతిక దృశ్య వీక్షణం==
[[File:Chopin at Singapore Botanical Gardens.jpg|thumb|right|200px|సింగపూర్ ఉద్యావనాలలో ఈ స్మారకాన్ని ఉంచబోతున్నారు, ఇది సింఫనీ సరస్సుకు దక్షిణ భాగంలో ఉంది.]]
సింగపూర్‌లో అనేకరకాల ఉద్యానవనాలు మరియు పథకాలు ఉన్నాయి, ఇవి తరచుగా దానియొక్క సహజమైన ఉష్ణ వాతావరణాన్ని తెలియచేస్తాయి.

[[ఆసియా|ఆసియా]], [[ఆఫ్రికా|ఆఫ్రికా]] మరియు [[దక్షిణ అమెరికా|దక్షిణ అమెరికా]]కు చెందిన జంతువులను రాత్రి సమయంలో ప్రజలు అన్వేషించటానికి సింగపూర్ జంతుప్రదర్శనశాల మరియు నైట్ సఫారి(రాత్రి సమయంలో జంతువులను వీక్షించటం) అతిథులకు మరియు క్రూర జంతువులకు మధ్య చూడటానికి కనబడే ఏ విధమైన అడ్డంకులు లేకుండా అనుమతిస్తాయి.

సింగపూర్ ప్రజల కొరకు సింగపూర్ వృక్షశాస్త్ర సంబంధ ఉద్యానవనాలను కలిగిఉంది, ఇది 52 హెక్టార్లలో ఉంది మరియు ఇందులో జాతీయ ఆర్చిడ్ సేకరణ కూడా ఉంది, అందులో 3000 రకాలకు పైగా ఆర్చిడ్లను పెంచుతారు.

ఆధునిక జీవితంలోని ఒత్తిడి నుండి దూరంగా ఉండటానికి ఇటీవల కాలంలో ప్రభుత్వం సంగీ బులో వెట్‌ల్యాండ్స్ రిజర్వ్‌ను ప్రోత్సహిస్తోంది.

బ్యుకిట్ తిమ నేచర్ రిజర్వ్ అనేది విస్తృతమైన సహజ అభయారణ్యాలు, ఇవి చాలా వరకు బ్యుకిట్ తిమ కొండను ఆక్రమించి ఉంటాయి మరియు ద్వీపంలో ప్రాథమిక వర్షాధార అడవి ఉన్న ఏకైక ప్రాంతంగా ఇది నిలిచిఉంది.

జురాంగ్ బర్డ్‌పార్క్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్యదేశీయ పక్షుజాతుల విస్తృత నమూనాలు ఉన్నాయి, ఇందులో ఒక వెయ్యి ఎర్రకొంగల సమూహం ఉంది.

సింగపూర్ తీరంలోని పులౌ ఉబిన్ ద్వీపం నిదానంగా పర్యాటక ప్రదేశంగా అవుతోంది. ఇక్కడ ప్రకృతి జంతుజీవనం యొక్క నిశ్చలత కాపాడబడుతోంది.

==ఆహారం==
{{Main|Cuisine of Singapore}}
సింగపూర్ సంస్కృతి యొక్క ప్రాచీన విభిన్నతకు ప్రధాన ఉదాహరణగా '''సింగపూర్ వంటలను'''  ఇక్కడ నివసించే ప్రజలు చూస్తారు. [[సింగపూరు|సింగపూర్ ]] హాకర్ సెంటర్లు(వీధులలో బళ్ళమీద అమ్మేవారు) - అనేది సాంకేతికంగా తప్పుగా చెప్పబడిన పేరు, ఉదాహరణకి సంప్రదాయక మాలే హాకర్ దుకాణాలలో [[హలాల్|హలాల్]] ఆహారాన్ని సంప్రదాయక తమిళ్ లేదా చైనా ఆహారం యొక్క హాలాల్ పద్ధతులతో అందించవచ్చు. చైనీయుల దుకాణాలు మాలే లేదా భారతీయ వంటపదార్థాలను, వంటచేసే విధానాలను లేదా మొత్తం వంటలను వారి పద్ధతిలో అందించవచ్చును. కొన్ని వంటలలో మూడు సంస్కృతుల అంశాలు ఉంటాయి, అయితే ఇతరులు [[ఆసియా|ఆసియా]] మరియు పాశ్చాత్య ప్రాంతంలోని మిగిలిన భాగాల ప్రభావాలను అవలంబించవచ్చు.

ఈ పద్ధతి సింగపూర్ వంటవిధానాన్ని ఘనమైన మరియు సాంస్కృతిక ఆకర్షణగా చేసింది. వాస్తవమైన రెస్టారెంటులలో కన్నా వండిన ఆహారం హాకర్ కేంద్రాలు లేదా ఆహార ప్రదేశాలలో (ఉదా. లౌ పా సాట్) దొరుకుతుంది. ఈ కేంద్రాలు విస్తారంగా ఉన్నాయి, దీనివల్ల తక్కువ ధరలలో ఆహారం లభ్యమయ్యి అధిక వినియోగదారులను ఆకర్షిస్తుంది.

పర్యాటకుల కొరకు ఆహారం భారీగా ప్రోత్సహించబడింది మరియు సాధారణంగా దీనిని సింగపూర్  టూరిజం బోర్డ్ లేదా సంఘాలు అనేక ప్రోత్సాహకాలతో ప్రోత్సహిస్తాయి, షాపింగ్‌తో పాటు సింగపూర్‌లోని ఉత్తమమైన ఆకర్షణలలో ఒకటిగా ఇది ఉంది. ప్రభుత్వం సింగపూర్ ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రతి సంవత్సరం జూలైలో సింగపూర్ యొక్క వంటల ఉత్సవం కొరకు నిర్వహిస్తుంది. స్థానిక ఆహారం యొక్క బహుళ సంస్కృతి, అంతర్జాతీయ వంటలు వెనువెంటనే లభ్యమవ్వటం మరియు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండటానికి రోజు మరియు సంవత్సరంలో అన్ని సమయాలలో విస్తారమైన పరిధిలో ధరలను కలిగిఉండటం వలన అదే పేరుతో అమ్మే ఇతర పోటీదారులను అధిగమించి "ఆహార స్వర్గాన్ని" ఏర్పరచటంలో సహాయపడుతుంది. సింగపూర్ నౌకాశ్రయం వ్యూహాత్మక మార్గాల మధ్య ఉండటం కారణంగా వైవిధ్యమైన ఆహారం లభిస్తుందని తరచుగా చెప్పబడుతుంది.

ఫాస్ట్-ఫుడ్ క్రమాల యొక్క వేగవంతమైన పెరుగుదల కూడా జరిగింది, వీటిలో మక్‌డోనాల్డ్స్, పిజ్జా హట్, KFC, బర్గర్ కింగ్, సబ్వే, లాంగ్ జాన్ సిల్వర్స్, మరియు మోస్ బర్గర్ ఉన్నాయి, సాంస్కృతిక సరళిలో నడుపబడిన ఫలహారశాలలో క్రమాన్ని పేర్కొనాలి. ఏదిఏమైనా ఇది ప్రపంచవ్యాప్త సమస్య అయిన స్థూలకాయంను అధికం చేస్తుంది, దీనిని సింగపూర్ అధికారులు గుర్తించటం వలన అట్లాంటి విలాసవంతమైన ఏర్పాట్లను నిర్మూలించాలనే యోచనలో ఉంది.

[[హలాల్|హలాల్]] మరియు శాకాహార ఆహారం కూడా సులభంగా లభ్యమవుతుంది.

==రాత్రి జీవితం==
సింగపూర్ ప్రసారసాధనాల ప్రకారం, రాత్రి జీవనం, చక్కటి ఆహారం మరియు షాపింగ్ కొరకు ఉన్న ప్రపంచంలోని ప్రథమస్థానంలోని ఐదు దేశాలలో సింగపూర్ ఉంది. రాత్రి సమయంలో సింగపూర్‌లో వినోదాన్ని అందించే కొన్ని ప్రముఖ ప్రదేశాలలో:

===బోట్ కీ===
[[File:Boat Quay.jpg|right|thumb|300px|సింగపూర్ నది ప్రక్కన బోట్ క్వే]]
{{Main|Boat Quay}}

[[సింగపూరు|సింగపూర్]]‌లోని బోట్ కీ(పడవ ఘట్టం) చారిత్రాత్మక ఘట్టం, ఇది సింగపూర్ నదీప్రవేశంలోని ఎగువ ప్రవాహం వద్ద ఉంది. దీని మీద ఉన్న దుకాణాలు జాగ్రత్తగా భద్రపరచబడినాయి మరియు ఇప్పుడు ఇక్కడ అనేక మద్యపు దుకాణాలు, పబ్బులు మరియు ఫలహారశాలలు ఉన్నాయి.

ప్రపంచంలోని అనేక రకాల పానీయాలు మరియు ఆహార ఎంపికలు ఇక్కడ లభ్యమవుతాయి నదీ వెంట ఉన్న ఆహారంతో కూడిన బార్లు చాలా ప్రసిద్ధి చెందాయి. చక్కటి రాత్రి విందు చేసిన తరువాత చుట్టుప్రక్కల ఉన్న పబ్బులు మరియు డిస్కోలకు వెళ్ళవచ్చు. హిందీ సంగీతాన్ని కలిగి అందమైన భారతీయ నాట్యకారులతో కూడిన ప్రదేశాలు అత్యంత ప్రజాదరణను పొందాయి, వీరు మెరిసే దుస్తులలో ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ పాటలకు నృత్యం చేస్తారు.

ఖజానా, బాలీవుడ్ ధున్, క్లబ్ కొలాబా, తరానా, ఘుంగ్రూ, క్రిష్, టేబుల్, హల్ది, మొదలైనవి ఉన్నాయి.

===క్లార్క్ కీ(క్లార్క్ ఘట్టం)===
{{Main|Clarke Quay}}

క్లార్క్ కీ నదిప్రక్కన ఉన్న చారిత్రాత్మక కీ మరియు [[సింగపూరు|సింగపూర్]]‌లో ఉత్సాహవంతమైన పార్టీల కేంద్రంగా మారుతోంది, ఇది బోట్ కీ కన్నా సింగపూర్ నది యొక్క ప్రవేశద్వారం నుండి వచ్చే ఎగువ ప్రవాహానికి మరింత ముందుగా ఉంది. ప్రస్తుతం, పునఃస్థాపనయిన ఐదు గిడ్డంగి భవనాలు, అనేక ఫలహారశాలలు మరియు ప్రాచీన వస్తువులను విక్రయించే దుకాణాలు ఉన్నాయి. చైనీయుల చిరుతిళ్ళు (''టోంగ్‌కంగ్స్'' ) దొరికేవి ఇక్కడ గుంపుగా ఉన్నాయి, వాటిని తేలుతున్న పబ్బులుగా మరియు ఫలహారశాలలుగా మెరుగుపరచారు. క్రేజీ హార్స్ పారిస్ వారి మూడు కాబరే ప్రదర్శనను ప్రపంచవ్యాప్తంగా క్లార్క్ కీలో డిసెంబర్ 2005లో ఆరంభించింది, కానీ వ్యాపారం సాగకపోవటంతో కార్యకలాపాలను ఆపివేసింది. మినిస్ట్రీ ఆఫ్ సౌండ్‌ను క్లార్ కీ వద్ద డిసెంబర్ 2005లో ఆరంభించారు, కానీ అది కూడా లాభాలను గడించలేకపోయింది.[[File:UM3Poster.jpg‎‎‎|థంబ్|రైట్|180px| "అల్టిమేట్ మేజిక్: ది రివల్యూషన్" (మే 2009)]]పోస్టరులో  [http://www.ultimatemagic.sg '''అల్టిమేట్ మేజిక్''' ]‌లో నటించిన J C సమ్ మరియు 'మేజిక్ బేబ్' నింగ్ 2008లో ఆరంభమయ్యాయి మరియు ఇవి 2009 వరకు క్లార్క్ కీ వద్ద ఉన్న ది అరేనాలో కొనసాగేటట్టు ప్రణాళిక చేయబడింది.<ref name="magicquay">"మేజిక్ హోల్డ్స్ ది క్వే", ది స్ట్రైట్స్ టైమ్స్, LIFE! 30 ఏప్రిల్ 2008</ref><ref name="cnaprimetime">"ప్రైమ్‌టైం మార్నింగ్ ఇంటర్వ్యూ”, ఛానల్ న్యూస్ ఆసియా, 19 జనవరి 2009</ref>

క్లార్క్ కీ 50 రకాల ఆహారప్రదేశాలను కలిగిఉంది, ఇక్కడ 20 వైవిధ్యమైన వంటలు అందించబడతాయి మరియు 20 కన్నా అధికంగా బార్లు, క్లబ్బులు మరియు పబ్బులు ఉన్నాయి. ప్రపంచంలోని ఉత్తమమైన పబ్బులలో కొన్ని క్లార్క్ కీ వద్ద ఉన్నాయి.

==పర్యాటకుల కొరకు కార్యక్రమాలు==
సింగపూర్ పర్యాటక సంఘం అనేకరకాల కార్యక్రమాలను పర్యాటకుల కొరకు సంవత్సరం అంతటా ప్రోత్సహిస్తుంది. వ్యాఖ్యాతను కలిగిఉండే కొన్ని రకాల కార్యక్రమాలలో చింగే పరేడ్, సింగపూర్ ఆర్ట్స్ ఫెస్టివల్ మరియు సింగపూర్ గార్డెన్ ఫెస్టివల్ ఉన్నాయి.

సింగపూర్ 2008 FIA [[ఫార్ములా వన్|ఫార్ములా వన్]] వరల్డ్ ఛాంపియన్షిప్‌ను నిర్వహించింది (సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్).<ref>[http://www.formula1.com/news/6063.html http://www.formula1.com/news/6063.html]</ref> ఈ పోటీ మరీనా ఉపసాగరం వద్ద ఉన్న నూతన వీధి ప్రాంతంలో ఫార్ములా వన్ చరిత్రలో మొదటిసారి రాత్రి సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడింది. ఈ కార్యక్రమం కొరకు కష్టపడి పనిచేయటం, ప్రణాళిక మరియు నిర్వహణ కారణంగా విజయవంతంగా ముగిసిందని భావించబడింది.[http://bleacherreport.com/articles/84653-how-successful-were-the-new-singapore-and-valencia-street-tracks ]. 2010లో కూడా, సింగపూర్ తొలి యూత్ ఒలింపిక్ గేమ్స్‌ను నిర్వహించింది, సింగపూర్ పర్యాటక సంఘం (STB) అంచనాల ప్రకారం ఈ క్రీడలను చూడటానికి రాత్రీపూట బసచేసే కనీసం 180,000 సందర్శకులు సింగపూర్ వస్తారని తెలిపింది.<ref>{{cite news| title = Inaugural Youth Olympic Games will boost Singapore's tourism industry| publisher = [[Channel NewsAsia]] | date = 23 February 2008 | url = http://www.channelnewsasia.com/stories/singaporelocalnews/view/330661/1/.html}}</ref>

==తదుపరి అభివృద్ధి==
{{Main|Future developments in Singapore}}
===నగర పునరుజ్జీవరణ===
[[File:URA Gallery Marina Bay.jpg|thumb|right|250px|భవిష్య నగరం యొక్క పర్యవలోకనం]]
[[File:Singapore.jpg|thumb|right|250px|ప్రస్తుత పట్టాన భారి భావంతులులు ]]
ఆసియాలోని అనేక ప్రత్యర్థులైన [[హాంగ్‌కాంగ్|హాంగ్‌కాంగ్]], టోక్యో మరియు [[షాంఘై|షాంగై]]తో పోటీపడటానికి నగరం పూర్తిగా దేదీప్యమానం చేసి నగరాన్ని మరింత ప్రకాశవంతమైన మరియు ఆసక్తికరమైన ప్రదేశంగా మార్పుచెందబడుతుందని సింగపూర్ పట్టణ పునరాభివృద్ధి అధికారసంస్థ ప్రకటించింది. మరింతమంది పర్యాటకులను ఆకర్షించటం దీని ఉద్దేశ్యంగా ఉంది. ఇది సింగపూర్‌ను జీవవంతంగా మరియు సింగపూర్ దృశ్యాన్ని ఇనుముడింప చేసి మనసుకు హత్తుకునే చిత్తరువును రాత్రి సమయంలో అందించటానికి మరియు ప్రపంచంలో ఉత్తమ స్థాయి హోదాను కలిగిఉండటానికి సహాయపడుతుంది. నగరంలో ముఖ్యమైన పరిణామంగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (CBD)లోని స్కై లైన్ ఉంది. 2009 నాటికి, CBDలోని ప్రతి అత్యంత ఎత్తన భవంతికి ప్రకాశవంతమైన రంగురంగుల నియాన్ దీపాలు అమర్చబడినాయి, ఇవి మధ్యమధ్యలో పండుగలు మరియు ప్రత్యేక కార్యక్రమాల సమయంలో మార్చబడతాయి. ప్రతిరోజు రాత్రి సమయంలో నీటి వద్ద ప్రదర్శనలు జరుగుతాయి.<ref>{{cite news| title = Let there be Light| publisher = Urban Redevelopment Authority | date = November 2006 | url = http://www.ura.gov.sg/skyline/skyline06/skyline06-02/text/pg4.html}}</ref>

నగరం యొక్క నాలుగు ప్రధాన భాగాలలో రాత్రి సమయంలో జరిగిన అనేక మార్పులలో:
* '''ఆర్చర్డ్ రోడ్''' : ప్రకాశవంతమైన భవంతుల ముందుభాగాల కారణంగా షాపింగ్ అనుభవాన్ని ఉత్సాహపరుస్తుంది, ఆకర్షణకు లోనయ్యే వాటిని కూడా వీటికి జోడించారు, ఇందులో వీధులలో కూర్చొనటానికి సీట్లను అమర్చారు, ఇందులో ఎవరైనా కూర్చున్నవెంటనే రంగులు మారిపోతాయి మరియు సింగపూర్‌ను ఉద్యాననగరంగా ప్రోత్సహించటానికి చెట్లు ప్రకాశవంతం చేయబడ్డాయి.
*'''సింగపూర్ నది''' : ఇందులో క్లార్క్ కీ మరియు బోట్ కీ ఉన్నాయి. "జెల్లీఫిష్" దీపాలు బోట్ కీ వద్ద నదిలో తేలుతాయి. నది తీరాలు మరియు ప్రక్కలు విద్యుత్తు దీపాలతో అలంకరించబడుతుంది, వాతావరణ అందాన్ని ద్విగుణీకృతం చేయటానికి నదులలో ప్రయాణించటానికి ఉండే పడవలను ప్రకాశవంతం చేస్తారు. 3&nbsp;కిమీ ఉండే అండర్‌పాస్ అనేక ఆకృతులు మరియు కుడ్యచిత్రాలతో దేదీప్యమానం చేయబడుతుంది.
* '''బ్రాస్ బాసా మరియు బ్యూగిస్''' : ముఖ్యమైన ప్రవేశద్వారాలు మరియు ప్రధానమైన ప్రవేశమార్గాలు నవీకరించబడిన శిల్పాలు మరియు గుర్తింపులతో ప్రకాశవంతమైన వినోదకర కేంద్రంలో ఉన్నట్టు భావనను కలుగచేస్తుంది. ఇక్కడ అనేక తేజోమయమైన ప్రకటన బోర్డులు, 3D "కళతో-ప్రకటనలు" మరియు యానిమేషన్లు గోడల మీద ఉంటాయి. చక్కగా ఆకృతి చేయబడిన నియాన్ ప్రకటనలు కూడా పెట్టబడతాయి.
* '''CBD మరియు మరీనా ఉపసాగరం''' : మొత్తం ప్రణాళికలో ఈ ప్రాంతం ముఖ్యమైనదిగా ఉంది. ప్రస్తుత కమలా-పసుపు రంగుల వాటికి బదులు తెల్లటి వీధిదీపాలను అమర్చటం వలన ఈ ప్రదేశం అత్యంత-ఆధునిక ఆర్థిక కేంద్రంగా ప్రజలు భావించటానికి సహాయపడుతుంది. నగర స్కైలైన్, మరీనా బే ఫైనాన్షియల్ సెంటర్ మరియు ఇంటిగ్రేటెడ్ రిసార్ట్‌లను విద్యుత్ దీపాలంకరణ చేసే యోచన ఉంది. అత్యంత ఎత్తైన భవంతుల యొక్క దీపాలను మధ్యలో మారుస్తూ ఉంటారు, వీధులలో సంగీతం మరియు ఉపసాగరం వద్ద నీటి ప్రదర్శనలు మరింత జీవాన్ని మరియు ప్రకాశాన్ని అందచేస్తాయి.

===2010లో పురోగతిలో ఉన్న ప్రణాళికలు===
2015 నాటికి నూతన అభివృద్ధులతో 17 మిలియన్ల సందర్శకులను ముఖ్యంగా మరీనా బే మరియు సెంటోసాకు ప్రతి సంవత్సరం పొందుతాయని ప్రభుత్వం భావిస్తోంది: 
* సెంటోసా వద్ద రిసార్ట్స్ వరల్డ్ (పూర్తయ్యింది)
* యూనివర్శల్ స్టూడియోస్ (సెంటోసా వద్ద) ఇంటిగ్రేటెడ్ రిసార్ట్ (పూర్తయ్యింది)
* మరీనా బే సాండ్స్ ఇంటిగ్రేటెడ్ రిసార్ట్ (పూర్తయ్యింది)
* మరీనా బే ఫైనాన్షియల్ సెంటర్ ఇందులో ఒక రాఫెల్స్ కీ మరియు ఒక మరీనా బౌల్వార్డ్ ఉన్నాయి.
* ది సైల్ @ మరీనా బే వంటి ఉన్నతశ్రేణి నివాస ప్రాంతాలు ఉన్నాయి.
* సింగపూర్ ఫ్లయర్ (పూర్తయ్యింది)
* ఉపసాగరం ప్రక్కన ఉన్న ఉద్యానవనాలు
* మరీనా బారేజ్ (పూర్తయ్యింది)
* క్లిఫ్ఫోర్డ్ పీర్ మరియు మాజీ కస్టమ్స్ అండ్ హార్బర్ శాఖ
* ది హెలిక్స్ వంతెన (పూర్తయ్యింది)
* యూత్ ఒలింపిక్ పార్క్ (పూర్తయ్యింది)
* వృత్తాకార MRT మార్గం (ముగిసింది)
* దిగువప్రాంతానికి MRT మార్గం
* సాధారణ సేవల సొరంగం
* సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ మరీనా బే స్ట్రీట్ సర్క్యూట్ యొక్క గుంటలు మరియు తాత్కాలిక మార్గాలు(ముగిసింది)

[[File:Sentosa and Cruise Bay, Singapore, panorama, Nov 06.jpg|thumb|center|600px|హర్బర్ ఫ్రంట్ దగ్గర వివోసిటి నుండి క్రూజ్ బే నేపద్యం తో సెంటోస.]]

==వీటిని కూడా చూడండి==
{{Portal|Singapore}}
* సింగపూర్‌లో సమాచారమార్పిడులు 
* సింగపూర్ సంస్కృతి
* సింగపూర్ చరిత్ర
* గణతంత్ర సింగపూర్ చరిత్ర
* సింగపూర్‌లోని ముఖ్య ప్రదేశాలు 
* సింగపూర్ యొక్క ప్రసారసాధనాలు 
* సింగపూర్ పర్యాటక సంఘం
* సింగపూర్ రవాణా

==సూచనలు==
{{Reflist}}

==బాహ్య లింకులు==
* {{Wikitravel|Singapore}}
* [http://www.singaporetraveltourguide.com/ సింగపూర్ ట్రావెల్ టూర్ గైడ్]
* [http://www.stb.com.sg/ సింగపూర్ పర్యాటక సంఘం]
* [http://www.yoursingapore.com/ Yoursingapore.com]
* [http://www.visitors.sg/ సింగపూర్ సందర్శకులకు గైడ్]
* [http://www.toursinsingapore.com/ సింగపూర్‌లోని సందర్శనాలు]
* [http://photoblog.visitors.sg/ సింగపూర్  సంస్కృతి మరియు పర్యటన మీద సందర్శకుల ఛాయాచిత్రాల బ్లాగ్]
* [http://www.singaporetravelholic.com/ సింగపూర్ పర్యటన మీద వ్యామోహం]
* [http://www.singaporetraveltours.com/ సింగపూర్ పర్యటన]
* [http://www.singaporetraveltourguide.com/ సింగపూర్ ట్రావెల్ టూర్ గైడ్]
* [http://www.guidegecko.com/singapore-travel-guide/ సింగపూర్ ట్రావెల్ గైడ్] పర్యటన, ఆహారం మరియు జీవనశైలి గైడ్

{{Tourism in Asia}}
{{Southeast Asia topic|Tourism in}}
{{Major Tourist Attractions in Singapore}}

{{DEFAULTSORT:Tourism In Singapore}}
[[Category:సింగపూర్‌లో పర్యాటక రంగం]]

[[en:Tourism in Singapore]]
[[hi:सिंगापुर में पर्यटन]]
[[bn:সিঙ্গাপুর#পর্যটন]]
[[id:Pariwisata di Singapura]]
[[vi:Du lịch Singapore]]