Revision 737088 of "సహారన్పూర్" on tewiki{{Multiple issues
| refimprove=December 2007
| copyedit=October 2010
}}
{{copyedit|article|date=May 2009 }}
{{Infobox Indian Jurisdiction |
native_name = ''Saharanpur'' |
type = city |
latd = 29.97 | longd = 77.55|
locator_position = right |
state_name=Uttar Pradesh |
district = [[Saharanpur district|Saharanpur]] |
leader_title = |
leader_name=%25257C
altitude = 269|
population_as_of = 2001 |
population_total = 1252925|
population_density = |
area_magnitude= sq. km |
area_total = |
area_telephone = 0132 |
postal_code = 247001 |
vehicle_code_range = UP-11 |
sex_ratio = |
unlocode = |
website = saharanpur.nic.in |
footnotes = |
}}
'''సహారన్పూర్ (Saharanpur)''' ([[హిందీ భాష|హిందీ]]: सहारनपुर, [[ఉర్దూ భాష|ఉర్దూ]]: سهارنپور) అనేది ఉత్తర భారతదేశంలోని [[ఉత్తర ప్రదేశ్|ఉత్తరప్రదేశ్]] [[భారతదేశం యొక్క రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు|రాష్ట్రం]]లో ఉన్న ఒక నగరం మరియు పురపాలక సంస్థ. ఇది సహారన్పూర్ జిల్లా మరియు సహారన్పూర్ డివిజన్ పరిపాలక రాజధానిగా ఉంది. [[హర్యానా|హర్యానా]] మరియు [[ఉత్తరాఖండ్|ఉత్తరాఖండ్]] రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఉన్న ఈ నగరం [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్]] పాలనా కాలం నుంచి చరిత్ర కలిగివుంది, ఈ నగరం చుట్టూ ధాన్యం మరియు పండ్ల సమృద్ధ దిగుబడికి ప్రసిద్ధిగాంచిన బాగా సారవంతమైన వ్యవసాయ ప్రాంతం ఉంది, సహారన్పూర్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక వృద్ధిరేటు గల నగరాల్లో ఒకటి. కొయ్య బొమ్మల కుటీర పరిశ్రమ ద్వారా సహారన్పూర్ అంతర్జాతీయ ప్రసిద్ధిగాంచింది. బాస్మతి బియ్యం మరియు [[మామిడి|మామిడికాయ]]లతోపాటు, స్థానిక వ్యవసాయ ఉత్పత్తికి ఇది ఒక అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఉంది. వివిధ రకాల వ్యవసాయ-ఆధారిత పరిశ్రమలైన టెక్స్‌టైల్స్, [[చక్కెర|చక్కెర]], [[కాగితం|కాగితం]] మరియు [[సిగరెట్|సిగరెట్]] కర్మాగారాలు కూడా ఇక్కడ ఉన్నాయి.
==రాజకీయాలు==
సహారన్పూర్ జిల్లా రాజకీయాల్లో సైనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు.2009 సహారన్పూర్ నగర్‌కు నగర్ నిగమ్ హోదా ఇచ్చారు. ఇప్పుడు దీనిని సహారన్పూర్ మహానగరంగా పిలుస్తున్నారు.
సహారన్పూర్ ఒక క్రియాశీల రాజకీయ వేదికగా ఉంది. స్వాతంత్ర్యం తరువాత అనేక దశాబ్దాలపాటు, ఇక్కడ [[భారత జాతీయ కాంగ్రేసు|ఇండియన్ నేషనల్ కాంగ్రెస్]] ఆధిపత్యం చెలాయించింది, అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి మారింది: ఓ.డి. త్యాగి, నిర్భయ్ పాల్ శర్మ మరియు చౌదరి నాక్లీ సింగ్(గుర్జార్) వంటి వ్యాపారవేత్తల సాయంతో 1980లో [[భారతీయ జనతా పార్టీ|భారతీయ జనతా పార్టీ]] (BJP) ఈ నగరంలో మంచిపట్టు సాధించింది; ఠాగూర్ జగదీష్ సింగ్ రాణా పలుమార్లు సమాజ్‌వాదీ పార్టీ మంత్రివర్గంలో సభ్యుడిగా పనిచేశారు.
సహారన్పూర్ జిల్లాలో కులాలవారీగా ఎమ్మెల్యేలు (MLA)
1.నాకుడ్ - చౌదరి మహిపాల్ మజ్రా - గుర్జార్
2.డియోబంద్ - మనోజ్ చౌదరి --------- గుర్జార్
3.ముజాఫరాబాద్- ఇమ్రాన్ మసూద్--------------ముస్లిం
4.సర్సావా - ధరమ్ సింగ్ సైనీ----------సైనీ
5.సహారన్పూర్- రాఘవ్ లఖన్‌పాల్ ---------పండిట్
6.హరోరా - ప్రత్యేక సీటు-------------ఎస్సీ (SC)
7.నాగల్ - ప్రత్యేక సీటు-------------ఎస్సీ (SC)
==చరిత్ర==
{{seealso|Saharanpur division|History of Uttar Pradesh}}
===చరిత్రపూర్వ, పురాతన సింధూ లోయ మరియు ఆర్య కాలాలు===
ఒక పట్టణ కేంద్రంగా సహారన్పూర్ నగరం మొఘలుల కాలంలో ఏర్పాటయింది. ఇది సారవంతమైన దోవాబ్ ప్రాంతంలో ఉంది, మధ్యయుగ కాలం వరకు ఈ ప్రాంతం అడవులతో నిండివుంది, అయితే దీనిలో మానవుల నివాసాలు 2000 B.C.<ref>వెబ్‌సైట్ ఆఫ్ ది ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా http://asi.nic.in/</ref> నుంచి ఉన్నాయి; సింధూ లోయ నాగరికత మరియు హరప్పా సంస్కృతి అవశేషాలు ఇక్కడ గుర్తించబడ్డాయి. ఈ ప్రాంతం యొక్క అసలు జనాభా (''ద్రవిడ, కిన్నెర, దాసా'' మరియు ''దాస్య'' వంటి సంతతులు) పంజాబ్ ప్రాంతంలో కొత్తగా స్థిరపడిన ఆర్యులచే అణిచివేయబడ్డారు. అనేక యుగాలకు చెందిన పురాతన ఆక్రమణదారులు (ఉదా. ''నందా, గ్రీకు, మౌర్య, షుంగా, ఇండో-గ్రీకు, యావుధేయ, మౌఖరీ, రాజపుత్రులు-పందీరులు, చండెలా, ముక్తాపిదా, ఆయుద్ధా, గుర్జర-ప్రతిహార, పాళులు'' తదితరులు) ఈ ప్రాంతంలో తమ వారసత్వాన్ని విడిచిపెట్టారు, ఈ ప్రాంతంలో వారి వారసుల మొదటి మరియు చివరి పేర్లు వారి చారిత్రక మూలాలను ప్రతిబింబిస్తాయి (మరియు కొన్నిసార్లు పురాణ మూలాలు కూడా తెలియజేస్తాయి, ఉదాహరణకు, ''సూర్యవంశం'' /''చంద్రవంశం'' ). అందుబాటులోని అతికొద్ది ఆధారాల ప్రాతిపదికన, ఈ కాలాలకు చెందిన కొన్ని నమూనాలను సహారన్పూర్ డివిజన్ అనే వ్యాసంలో "చరిత్ర" విభాగంలో వివరించడం జరిగింది. మధ్యయుగ కాలం నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన చారిత్రక వివరాలు పత్రబద్ధం చేయబడ్డాయి, వీటిలో ''ఘజ్నావీద్, కళాచురీ, గహాద్వాలా, చౌహాన్, ఘోరీద్/తుర్కిక్-సుల్తానేట్, మొగల్'' తదితర రాజవంశాల గురించి చారిత్రక వివరాలు ఉన్నాయి.
===మధ్యయుగ కాలం===
[[ఢిల్లీ|ఢిల్లీ]] మరియు ఇతర తూర్పు భూభాగాలపై దాడి చేసేందుకు పురాతన కాలం నుంచి ఉపయోగంలో ఉన్న ఒక పశ్చిమవైపు రహదారిలో సహారన్పూర్ భాగంగా ఉంది, [[మధ్య ఆసియా|మధ్య ఆసియా]]ను అస్థిరపరిచిన ప్రారంభ తుర్కుల దండయాత్రలు (1018–1033 A.D.) ప్రస్తుత సహారన్పూర్ ప్రాంతంలోని భూభాగాల గుండా సాగిన తరువాత - దీనిని పలువురు ఇతర పాలకులు కూడా ఆక్రమించారు, వీరిలో ముఖ్యమైనవారు భోజ పరమారా, లక్ష్మీకర్ణ కలచూరి, చంద్ర దేవ్ గహద్వాలా మరియు చౌహాన్‌లు. వీరు ఢిల్లీ సుల్తానేట్ (1192–1526 A.D.) ఏర్పాటయ్యే వరకు ఈ ప్రాంతాన్ని పాలించారు.
షంసుద్దీన్ ఇల్తుత్‌మిష్ (1211–36) పాలనాకాలంలో ఈ ప్రాంతం ఢిల్లీ సుల్తానేట్‌లో భాగమైంది. ఈ సమయంలో, ఇక్కడ ఎక్కువ భూభాగం [[అడవి|అడవులు]] మరియు గడ్డిభూములతో నిండివుండేది, వీటి గుండా సహారన్పూర్ యొక్క 'పావన్‌ధోయి', 'ధామోలా' మరియు 'గందా నలా' (క్రెగీ నలా) వంటి నదులు ప్రవహిస్తున్నాయి; వాతావరణం ఆర్ద్రతతో కూడివుండటంతో, మలేరియా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉండేది. ఢిల్లీ సుల్తాన్ [[మహమ్మద్ బిన్ తుగ్లక్|మహమ్మద్ బీన్ తుగ్లక్]] (1325–1351) 1340లో శివాలిక్ రాజుల తిరుగుబాటును అణిచివేసేందుకు ఉత్తర దోవాబ్ దండయాత్ర చేపట్టాడు, ఒక స్థానిక విశ్వాసం ప్రకారం ఆయన పావన్‌ధోయి నది ఒడ్డున ఒక సుఫీ సన్యాసి ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఈ మునిని సందర్శించిన తరువాత, సుఫీ సన్యాసి పేరు ''షా హరన్ చిష్టీ'' పేరుమీదగా ఆయన ఈ ప్రాంతానికి "షా-హరన్‌పూర్" అనే పేరు పెట్టారు <ref>[http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V21_375.gif హిస్టరీ] ది ఇంపీరియల్ గెజిటర్ ఆఫ్ ఇండియా, v. 21, p. 369. 1909.</ref> సహారన్పూర్ నగరం యొక్క పాత భాగంలో ఈ సన్యాసి సమాధి ఇప్పటికీ సురక్షితంగా ఉంది, ఈ సమాధి మాలీ గేట్/బజార్ దిననాథ్ మరియు హాల్వాయ్ హట్టా మధ్య ఉంది. 14వ శతాబ్దం ముగిసే సమయానికి, సుల్తానేట్ అధికారం క్షీణించింది, మధ్య ఆసియా యొక్క [[తైమూర్ లంగ్|తైమూర్]] చక్రవర్తి ఈ ప్రాంతంపై దాడి చేశారు. తైముర్ 1399లో సహారన్పూర్ ప్రాంతం గుండా ఢిల్లీపై దాడి చేశారు, ఈ ప్రాంత ప్రజలు ఆయన సైన్యంతో పోరాడి విఫలమయ్యారు. బలహీనపడిన సుల్తానేట్‌ను తరువాత మధ్య ఆసియా మొగల్ రాజు [[బాబర్|బాబర్]] స్వాధీనం చేసుకున్నారు.
===మొఘల్ కాలం===
మొఘల్ కాలంలో, చక్రవర్తి [[అక్బర్|అక్బర్]] (1542–1605) సహారన్పూర్‌ను ఢిల్లీ ప్రావీన్స్ పరిధిలో ఒక సర్కార్‌గా చేశారు. రాజా షా రణ్ వీర్ సింగ్‌కు సహారన్పూర్‌ను జాగీరుగా బహుమతి ఇచ్చారు, ఒక ఆర్మీ కంటోన్మెంట్ వద్ద రాజా షా రణ్ వీర్ సింగ్ ప్రస్తుత నగరానికి శంకుస్థాపన చేశారు, ఆయన పేరుమీదగానే ఈ నగరానికి సహారన్పూర్ అనే పేరు వచ్చింది; ఆ సమయంలో దీనికి అతి సమీపంలోని నివాస ప్రాంతాలు షేక్‌పురా మరియు మాల్హీపూర్. దివంగత స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ జుగ్మందర్ దాస్ జైన్ స్పెషల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మరియు ఆయన కుటుంబం రాజా షా రణ్ వీర్ సింగ్ వారసత్వం కలిగివున్నారు. ఆయన కుమారుడు అశోక్ జైన్ (సింఘాల్) నవీన్ నగర్ వద్ద ఆఫీసర్స్ కాలనీ ఢిల్లీ రోడ్డు సమీపంలో ఒక కొత్త కోటను నిర్మించారు, దీనికి రాజా షా రణ్ వీర్ సింగ్ కిలా అనే పేరు పెట్టారు. రాజా షా రణ్ వీర్ సింగ్ యొక్క సహారన్పూర్ నగరం నాలుగు గేట్లతో చుట్టూ గోడలు ఉండేవి; అవి సారాయ్ గేట్, మాలీ గేట్, బురియా గేట్ మరియు లాఖీ గేట్; గోడలతో ఉన్న సహారన్పూర్ నగరంలో ఆనాటి నివాస ప్రాంతాలు నిఖాసా బజార్, షా బెహ్లోల్, రాణి బజార్ మరియు లాఖీ గేట్. షా రణ్ వీర్ సింగ్ యొక్క పాత కోట ఇప్పటికీ సహారన్పూర్ చౌదరియన్ ప్రాంతంలో కనిపిస్తుంది. ఆయన ముహల్లా చౌంధరియాన్‌లో ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు<ref>మధు జైన్, ఓ. సి. హందా, అండ్ ఓమకాండా హా??ఎ, ''వుడ్ హ్యాండీక్రాఫ్ట్: ఎ స్టడీ ఆఫ్ ఇట్స్ ఆరిజన్ అండ్ డెవెలప్‌మెంట్ ఇన్ సహారన్పూర్, '' ఇండస్ పబ్లిషింగ్ (2000), పేజీలు. 22-24.ISBN 81-7387-103-5</ref>.
===సయ్యద్‌లు మరియు రోహిల్లాలు===
మొగల్ చక్రవర్తులు అక్బర్ మరియు తరువాత షాజహాన్ (1592–1666) సయ్యద్ కుటుంబాలకు సర్వాత్ పరగణాను బహుమతిగా ఇచ్చారు; 1633లో వీరిలో ఒకరు ఒక నగరాన్ని స్థాపించి, దానికి చుట్టుపక్కల ప్రాంతాలతో కలిపి ముజాఫర్‌నగర్ అనే పేరు పెట్టారు, తన తండ్రి సయ్యద్ ముజాఫర్ అలీ ఖాన్ మీదగా దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది. సయ్యద్‌లు 1739లో నాదీర్ షా ముట్టడి వరకు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆయన పతనం తరువాత, దోవాబ్ ప్రాంతమంతటా అస్థిరత ఏర్పడింది, రాజపుత్రులు, త్యాగీలు, బ్రాహ్మిణ్‌లు, జాత్‌లు ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టారు, తరచుగా సిక్కులు కూడా ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. అస్థిరతను అనుకూలంగా చేసుకొని, రోహిల్లాలు గంగానది పరిసర ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.
===సహారన్పూర్ నవాబు నజీబుద్ దౌలా (1748–1770 A.D.)===
నాదీర్ షా తరువాత వచ్చిన [[ఆఫ్ఘనిస్తాన్|ఆఫ్ఘన్]] పాలకుడు అహ్మద్ షా దురానీ రోహిల్లా చీఫ్ నజాఫ్ ఖాన్‌కు జాగీరుగా సహారన్పూర్ భూభాగాన్ని ఇచ్చారు, ఆయనకు నవాబ్ నజీబుద్ దౌలా అనే పట్టం ఉండేది, 1754 నుంచి ఆయన సహారన్పూర్‌లో నివసించారు. ఆయన గౌన్స్‌గఢ్‌ను తన రాజధానిగా చేసుకున్నారు, మరాఠా దాడుల నుంచి తన స్థానం బలహీనపడకుండా చూసుకునేందుకు గుజ్జార్ నేత మనోహర్ సింగ్‌తో మైత్రీబంధం కలుపుకున్నారు. నజీబుద్ దౌలా 1759 A.D.లో లాండౌరా రాజుగా మారిన మనోహర్ సింగ్‌కు 550 గ్రామాలు ధారాదత్తం చేస్తూ ఒప్పంద పత్రాన్ని జారీ చేశారు. అందువలన రోహిల్లాలు మరియు గుజ్జర్లు ఇప్పుడు సహారన్పూర్ ప్రజానీకంలో ఆధిపత్యం కలిగివున్నారు.
===మరాఠా పాలన (1789–1803 A.D.)===
1757లో, మరాఠా సైన్యం సహారన్పూర్ ప్రాంతాన్ని ఆక్రమించడంతో నజీబుద్ దౌలా కొద్దికాలం తన జాగీరును కోల్పోయారు, ఇదిలా ఉంటే రాఘునాథ్ రావు మరియు మల్హోత్రా హోల్కార్ తరువాత దీనిని ఆక్రమించుకున్నారు - అయితే పంజాబ్ దండయాత్ర కోసం రఘునాథ్ రావు వెళ్లడంతో నవాబు ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. రోహిల్లాలు మరియు మరాఠాల మధ్య సంఘర్షణ డిసెంబరు 18, 1788లో నజీబుద్ దౌలా మనవడు గులామ్ ఖాదీర్ నిర్బంధంతో ముగిసింది, గులామ్ ఖాదీర్‌ను మరాఠా సైన్యాధిపతి మహాదాజీ సిందియా ఓడించారు. నవాబ్ గులామ్ ఖాదీర్ సహారన్పూర్ నగరానికి చేసిన సేవల్లో నవాబ్ గంజ్ ప్రాంతం మరియు అహ్మదాబాదీ కోట ముఖ్యమైనవి, విజయ్ టాకీస్ ఎదురుగా ఈ కోటను ఇప్పటికీ చూడవచ్చు.గులామ్ ఖాదీర్ మరణంతో సహారన్పూర్‌లో రోహిల్లాల పాలనకు తెరపడింది, ఇది మరాఠా సామ్రాజ్యంలో ఉత్తరాన ఉన్న చివరి జిల్లాగా మారింది. ఘనీ బహదూర్ బండా దీనికి మొదటి మరాఠా గవర్నర్‌గా నియమించబడ్డారు. మరాఠా పాలనలో, సహారన్పూర్ నగరంలో భుతేశ్వర్ ఆలయం మరియు బాగేశ్వర్ ఆలయం నిర్మించబడ్డాయి.
===బ్రిటీష్ వలసరాజ్య కాలం (1803–1947 A.D.)===
బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో మరాఠాలు పరాజయం పాలవడంతో, 1803లో సహారన్పూర్ ప్రాంతాన్ని బ్రిటీష్‌వారు ఆక్రమించుకున్నారు; ప్రస్తుత ముజాఫర్‌నగర్ మరియు [[హరిద్వార్|హరిద్వార్]] జిల్లాలు రెండూ ఈ ప్రాంతంలో భాగంగా ఉన్నాయి. సహారన్పూర్ 1804లో పూర్తిగా బ్రిటీష్ ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లింది, ఈ సమయానికి వారు మరాఠీల ప్రతిఘటనను పూర్తిగా అధిగమించడంతోపాటు, తరచుగా జరిగిన సిక్కు దాడులను అణిచివేశారు. రాజా దయాల్ సింగ్ గుజ్జర్ ఆస్తులను బ్రిటీష్‌వారు స్వాధీనం చేసుకుంటున్నప్పుడు, 1813లో గుజ్జర్‌లు చేత ఒక స్థానిక తిరుగుబాటు మొదలైంది, అయితే బ్రిటీష్‌వారు దీనిని ఉక్కుపాదంతో అణిచివేశారు. స్థానిక అధిపతులు 1824లో ఒక సంయుక్త తిరుగుబాటుకు ప్రణాళికలు రచించారు, అయితే ఈ ప్రణాళికలు బ్రిటీష్‌వారికి తెలియడంతో, ఉద్యమం అణిచివేయబడింది.
విదేశీ ఆక్రమణకు వ్యతిరేకంగా జరిగిన 1857నాటి ఉత్తర భారతదేశ తిరుగుబాటు సమయంలో సహారన్పూర్/ముజాఫర్‌నగర్ ప్రాంతం ఈ తిరుగుబాటు జరిగిన ఒక భూభాగంగా ఉంది, ఈ తిరుగుబాటు ఇప్పుడు మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంగా పరిగణించబడుతుంది. స్వాతంత్ర్య సమరయోధుల కార్యకలాపాలకు ఒక కేంద్రంగా ఉన్న ప్రస్తుత ముజాఫర్‌నగర్ జిల్లాలోని చిన్న పట్టణం షామ్లీ కొంతకాలంపాటు స్వాతంత్ర్యం పొందింది. తిరుగుబాటు విఫలమైన తరువాత, బ్రిటీష్‌వారి ప్రతీకార చర్యలు ఇక్కడ తీవ్రంగా సాగాయి. బ్రిటీష్‌వారు తిరుగుబాటుకు ప్రధాన ప్రేరేపకులుగా భావించిన ఈ ప్రాంత పౌరులు, ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని హత్యాకాండ మరియు విధ్వంసం సృష్టించారు; ఈ హింసాకాండ ఫలితంగా ఇక్కడ ముస్లిం సమాజం గుర్తించడానికి వీలులేనంత నాశనం చేయబడింది. వారి సామాజిక పునర్నిర్మాణం ప్రారంభమైనప్పుడు, ముస్లింల సాంస్కృతిక మరియు రాజకీయ చరిత్ర డియోబంద్ మరియు అలీగఢ్ ప్రాంతాల్లో పునరుద్ధరించబడింది, సంఘ సంస్కర్త షా వాలియుల్లా యొక్క సామాజిక మరియు రాజకీయ కాయకల్ప సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన మౌలానా ముహమ్మద్ ఖాసిమ్ నానోత్వీ మరియు మౌలానా రషీద్ అహ్మద్ గంగోహి ఇద్దరూ 1867లో డియోబంద్‌లో ఒక పాఠశాలను స్థాపించారు. దారుల్ ఉలూమ్‌గా ఇది ప్రాచుర్యం మరియు అంతర్జాతీయ గుర్తింపు పొందింది. దీని యొక్క వ్యవస్థాపకుల ఉద్దేశంలో రెండు అంచెలు ఉన్నాయి:
*శాంతియుతమైన పద్ధతుల ద్వారా ముస్లింల మతపరమైన మరియు సామాజిక అవగాహనను మేలుకొల్పే సామర్థ్యం ఉన్న ఒక మేధావుల బృందాన్ని వృద్ధి చేయడం మరియు విస్తరించడం, ముస్లింలను తమ విశ్వాసం మరియు సంస్కృతిలో విద్యావంతులను చేసేందుకు వారి ద్వారా చర్యలు చేపట్టడం; మరియు
*హిందూ-ముస్లిం ఐక్యత మరియు సమైక్య [[భారత దేశము|భారతదేశ]] భావనలు ద్వారా జాతీయవాద భావనను మరియు జాతీయ ఐక్యమత్యం తీసుకురావడం.
సహారన్పూర్‌లోని ముస్లిం మేధావులు ఈ సిద్ధాంతానికి క్రియాశీల మద్దతుదారులుగా ఉన్నారు, ఇటువంటి భావాలతోనే ఆరు నెలల తరువాత వారు తమ సొంత బోధనా ప్రదేశాన్ని స్థాపించారు; దీని పేరు మజాహీర్-ఉల్-ఉలూమ్. ప్రస్తుతం సహారన్పూర్ నగరం తన యొక్క మత సామరస్య స్ఫూర్తికి మంచి గుర్తింపు పొందింది.
[[File:United Provinces 1909.jpg|thumb|యునైటెడ్ ప్రావీన్స్‌లు, 1909]]
బ్రిటీష్ అధికార యంత్రాంగం 1857 తిరుగుబాటు తరువాత కంపెనీ ఆక్రమించుకున్న భారతీయ భూభాగాన్ని ఒక కాలనీ (వలసరాజ్యం)గా మార్చింది - తద్వారా 1901లో ముజాఫర్‌నగర్ జిల్లా సృష్టించబడింది, సహారన్‌పూర్ జిల్లా నుంచి దీనిని వేరుచేశారు, ఈ రెండు జిల్లాలు వలసరాజ్యమైన బ్రిటీష్ రాజ్‌లోని ఆగ్రా మరియు అవధ్ సమైక్య ప్రావీన్స్‌ల యొక్క మీరట్ డివిజన్‌లో భాగంగా ఉన్నాయి.<ref>[http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V18_089.gif ముజాఫర్‌నగర్ డిస్ట్రిక్ట్] ది ఇంపీరియల్ గెజిటర్ ఆఫ్ ఇండియా, 1909, v. 18, p. 83.</ref>.
===స్వాతంత్ర్యోత్తర కాలం (1947 A.D. – 21వ శతాబ్దం)===
బ్రిటీష్‌వారి నుంచి ఆగస్టు 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, పశ్చిమ పంజాబ్ నుంచి భారీ సంఖ్యలో ప్రజలు ఈ నగరాన్ని తమ నివాసంగా మార్చుకున్నారు, తద్వారా ఈ నగరంలో సాంస్కృతిక వైవిధ్యం మరింత పెరిగింది. ఈ ఔత్సాహిక మరియు కష్టించే ప్రజా సమూహం వ్యాపారంలో మాత్రమే కాకుండా, ఇతర వృత్తుల్లో కూడా తమదైన ముద్ర వేశారు. ఈ ప్రాంతం క్రమక్రమంగా వారిని తమలో విలీనం చేసుకుంది; అయితే ఒక శరణార్థ శిబిరంగా ఉన్న సహారన్పూర్ 'ఎగ్జిబిషన్ గ్రౌండ్స్' ఇప్పుడు ఆధునిక పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది, ఒక ప్రభావంతమైన పంజాబీ సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది, ఉన్నదున్నట్లుగా చెప్పాలంటే ఈ ప్రాంతం ఒక పంజాబ్ నగరమైన భావన కలుగుతుంది.
బ్రిటీష్ పాలన ముగిసే వరకు, గత పాలనా తరగతులకు చెందిన వారసులకు తిరుగులేని పలుకుబడి మరియు సామాజిక ప్రతిష్ట ఉండేది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీరికి విశేష గుర్తింపు ఉండేది; తరచుగా వీరిని ఉన్నత వర్గాలుగా పిలిచేవారు, వీరు మిగిలిన కులాలు మరియు దిగువ తరగతి ప్రజలపై పెత్తనం చెలాయించేవారు. స్వాతంత్ర్యం తరువాత, దేశం యొక్క ప్రజాస్వామ్య పరిపాలన ద్వారా ఈ నిమ్న మరియు అంటరాని [[దళితులు|దళిత]] తరగతులు భారతదేశంలోని అన్ని రంగాల్లో క్రమక్రమంగా ముందడుగు వేయడం ప్రారంభించాయి. దళిత అనుకూల బహుజన్ సమాజ్ పార్టీ (BSP) వ్యవస్థాపకుడు, దివంగత నేత [[కాన్షీరామ్|కాన్షీరామ్]] సహారన్పూర్‌లోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన వారసురాలు కుమారి మాయావతి సహారన్పూర్‌కు చెందిన ఒక దళితురాలు, ప్రస్తుతం ఆమె BSP ముఖ్యమంత్రిగా (2010) ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. జైనులు మరియు అగర్వాల్‌లు ఇక్కడ శక్తివంతమైన వ్యాపార వర్గాలు; రెండో వర్గానికి 'అగర్వాల్ సభ' అనే ఒక సంస్థ ఉంది, దీని అధ్యక్షుడిని వారు ఏడాదికొకసారి ఎన్నుకుంటారు.
డిసెంబరు 28, 1988న, సహారన్పూర్ జిల్లా [[హరిద్వార్|హరిద్వార్]] ప్రాంతాన్ని కోల్పోయింది, సహారన్పూర్ డివిజన్‌లో దీనిని ఒక కొత్త జిల్లాగా మార్చారు. తరువాత, [[హరిద్వార్|హరిద్వార్ జిల్లా]] సహారన్పూర్ డివిజన్ నుంచి తొలగించి, ఇప్పటి [[ఉత్తరాఖండ్|ఉత్తరాఖండ్]] రాష్ట్రంలో చేర్చారు, నవంబరు 9, 2000న ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ కొత్త రాష్ట్రంగా అవతరించింది. భూభాగ పునర్వ్యవస్థీకరణతో సహారన్పూర్ అనేక ప్రసిద్ధ మతపరమైన మరియు సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను కోల్పోయింది, అంతేకాకుండా ప్రసిద్ధి విద్యా నగరం రూర్కీ కూడా వేరుకావడం సహారన్పూర్ వాసులను నిరాశపరిచింది. నగరంతోపాటు, సహారన్పూర్ భాగాలను ఉత్తరాఖండ్‌లో చేర్చడంపై ఇప్పటికీ రాజకీయ చర్చ జరుగుతుంది. ప్రస్తుత పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి హరిత్ ప్రదేశ్ అనే కొత్త రాష్ట్రాన్ని సృష్టించే ప్రతిపాదన కూడా వ్యక్తమైంది; కుమారి మాయావతి ఈ ప్రతిపాదనకు మద్దతు పలుకుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నిలువుగా మూడు భాగాలు చేయడానికి ఆమె మద్దుతు ఇస్తున్నారు. సహారన్పూర్ భవిష్యత్‌కు ఎటువంటి నిర్ణయమైనా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
==ప్రభుత్వం==
*ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు: జగదీష్ సింగ్ రాణా (BSP)
*ప్రస్తుత రాష్ట్ర శాసనసభ సభ్యుడు: రాఘవ్ లఖన్‌పాల్ (BJP)
*పురపాలక సంస్థ ప్రస్తుత ఛైర్మన్: ఇమ్రాన్ మసూద్ (సమాజ్‌వాదీ పార్టీ)
*మనోజ్ చౌదరి BSP ఎమ్మెల్యే(గుజ్జర్)
మహిపాల్ మజ్రా BSP ఎమ్మెల్యే (గుజ్జర్)
==భౌగోళిక స్థితి==
సహారన్పూర్ నగరం {{coord|29.97|N|77.55|E|}}<ref>[http://www.fallingrain.com/world/IN/36/Saharanpur.html ఫాలింగ్ రెయిన్ జెనోమిక్స్, ఇంక్ - సహారన్పూర్]</ref> వద్ద ఉంది, ఇది [[చండీగఢ్|చండీగఢ్]]కు దక్షిణ-ఆగ్నేయ దిశగా 140 కిమీ దూరంలో మరియు [[ఢిల్లీ|ఢిల్లీ]] నుంచి ఉత్తర-ఈశాన్య దిశగా 170 కిమీ దూరంలో ఉంది. ఇది సగటున సముద్రమట్టానికి 2269 [[మీటరు|మీటర్]]ల (882 అడుగులు) ఎత్తులో ఉంది.
==జనాభా==
{{As of|2001}} భారత జనాభా లెక్కలు<ref>{{GR|India}}</ref> ప్రకారం, సహారన్పూర్‌లో 452,925 జనాభా ఉంది. వీరిలో పురుషులు 53%, మహిళలు 47% మంది ఉన్నారు. సహారన్పూర్‌లో సగటు అక్షరాస్యత రేటు జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా 78% వద్ద ఉంది. ఈ నగరంలో పురుషుల అక్షరాస్యత రేటు 88% మరియు మహిళల అక్షరాస్యత రేటు 70% వద్ద ఉంది. సహారన్పూర్‌లో 14% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగివుంది.
==ఆర్థిక వ్యవస్థ==
సహారన్పూర్ ఒక వృద్ధి చెందుతున్న వ్యాపార నగరం: ఇది ఒక ముఖ్యమైన ప్రాంతీయ టోకు మరియు చిల్లర వ్యాపార కేంద్రంగా ఉంది, ముఖ్యంగా ధాన్యం, కలప మరియు వస్త్ర వ్యాపారులకు ప్రసిద్ధి చెందింది.
దీని యొక్క ధాన్యపు మార్కెట్‌కు దోవాబ్ ప్రాంతం నుంచి భారీస్థాయిలో వ్యవసాయ ఉత్పత్తి వస్తుంది, ధాన్యానికి మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు పెద్ద టోకు మార్కెట్ (అనాజ్ మండి) చిల్కానా రోడ్డులో ఉంది.
సాంప్రదాయికంగా కలప మార్కెట్‌కు ఉత్తర కొండప్రాంత అటవీ భూభాగాల నుంచి సరఫరాలు జరుగుతున్నాయి, ఈ కలప సరఫరాలు స్థానిక కొయ్య బొమ్మల కుటీర పరిశ్రమ మరియు ఇతర అవసరాలు తీరుస్తున్నాయి. కొయ్య హస్తకళా పరిశ్రమ గురించి ప్రస్తావించకుండా సహారన్పూర్ యొక్క ఆర్థిక వ్యవస్థ వర్ణన పూర్తికాదు, ఈ పరిశ్రమ సగం జనాభాకు జీవనాధారంగా మరియు ఈ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు కారకంగా ఉంది. అంబాలా రోడ్డు నుంచి చిల్కానా రోడ్డు వరకు విస్తరించివున్న మార్కెట్‌లో అందమైన కళా మరియు ప్రయోజనకర కొయ్య వస్తువుల ప్రదర్శన మరియు విక్రయాలు జరుగుతున్నాయి. సహారన్పూర్‌లో కొయ్య హస్తకళా పరిశ్రమ పితామహుడిగా అట్టా హుస్సేన్ పరిగణించబడుతున్నారు, ఈయన ప్రస్తుత ఎస్ఎం.ఇమామ్ ఎం.ఇక్రామ్ కుటుంబ పూర్వికుడు, ఈ కుటుంబం ఇప్పటికీ ఈ హస్తకళా పరిశ్రమలో క్రియాశీలకంగా ఉంది.
గత కొన్ని దశాబ్దాలుగా, పంజాబీ మార్కెట్ మరియు కంబోహ్ కటెహ్రా మార్కెట్ వారి పెద్ద వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ధి చెందాయి. అల్లిక పని కూడా ఇక్కడ ఒక గణనీయమైన కుటీర పరిశ్రమగా మారింది, లూధియానా మార్కెట్, మరియు ఇతర సమీబ నగరాలు మరియు ఉత్తరాఖండ్ మార్కెట్‌లకు ఇక్కడి నుంచి సరుకులు సరఫరా చేయబడుతున్నాయి.
చారిత్రాత్మకంగా, ప్రసిద్ధ ప్రదేశమైన జామా మసీదు చుట్టూ ఒక సాధారణ గృహోపకరణ మార్కెట్ కేంద్రీకృతమై ఉంది. దీనిచుట్టూ అర కిలోమీటరు కంటే తక్కువ వ్యాసార్థంలో ఆభరణాల నుంచి పచారీ వస్తువుల వరకు అన్ని సరుకులు విక్రయించే దుకాణాలతో కూడిన ఇరుకైన రోడ్ల వ్యవస్థ ఒకటి ఉంది.
ఆధునిక షోరూములు, ఉన్నతస్థాయి బ్రాండ్‌ల వస్తువుల చిల్లర దుకాణాలు మరియు అనేక ప్రధాన బ్యాంకుల శాఖలు కోర్టు రోడ్డు మార్కెట్‌లో నగరం యొక్క సివిల్ కోర్టు మరియు కలెక్టర్ కార్యాలయాలకు సమీపంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఉన్నతస్థాయి ఫ్యాషన్‌లకు సంబంధించిన అధునాతన కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా, నగరంలో ఇప్పటి వరకు ఎటువంటి అత్యాధునిక షాపింగ్ మాల్‌లు ఏర్పాటుకాలేదు.
ప్రతివారం ఏర్పాటయ్యే మంగళ్ బజార్ (మంగళవారపు మార్కెట్) ఆకర్షణీయ దృశ్యాలు ప్రసిద్ధ నెహ్రూ మార్కెట్ మరియు దాని పరిసరాల్లో కనువిందు చేస్తాయి, ఈ రోజు నగరంలోని షాపులను వార సెలవుగా మూసివేస్తారు; దీనిని వాచ్యంగా పేదల బహిరంగ మార్కెట్‌గా పిలుస్తారు. గృహావసరాలకు సంబంధించిన ప్రతి వస్తువు, వివిధ వ్యాపారాలకు అవసరమైన సాధనాలు, సాధారణ గృహోపకరణాలు, వాటి భాగాలు దీనిలో దొరుకుతాయి; ఈ వస్తువుల నాణ్యత మరియు ధర కింది స్థాయి వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించబడతాయి. ఈ మార్కెట్‌కు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారు.
గతంలో ఆంగ్లో-అమెరికన్ టొబాకో కంపెనీ లేదా ఇంపీరియల్ టబాకో కంపెనీగా పిలిచిన బహుళజాతి సిగరెట్ తయారీ సంస్థ ఇండియన్ టొబాకో కంపెనీ (ITC లిమిటెడ్) సహారన్పూర్‌లో ఉంది. ఈ కర్మాగారాన్ని 1930వ దశకంలో బాబా సాయిబ్ దయాల్ బేడి నిర్మించారు. ఆయన ఆ సమయంలో సహారన్పూర్ పురపాలక కమిషనర్‌గా ఉన్నారు.
ఒక ఐటీ (IT) సేవా ప్రదాత [http://www.cherisys.com క్రిసిస్ టెక్నాలజీస్ (Cherisys Technologies)] న్యూఢిల్లీ తరువాత ఈ నగరంలో ఐటీ కార్యకలాపాలు ప్రారంభించింది. నగరంలో అడుగుపెట్టిన మొట్టమొదటి IT సేవల ప్రదాతగా క్రిసిస్ టెక్నాలజీస్ గుర్తింపు పొందింది, ఇది ఇక్కడ ఒక పెద్ద ప్రాంగణంలో కార్యాలయాన్ని ప్రారంభించింది.
స్టార్ పేపర్ మిల్లు, షుగర్ మిల్లు, హార్డ్‌బోర్డ్ మిల్లు, టెక్స్‌టైల్ మిల్లు మరియు వుడెన్-సీజనింగ్ మిల్లులను నగరంలోని ఇతర ముఖ్యమైన పారిశ్రామిక సంస్థలుగా చెప్పవచ్చు.
==సంస్కృతి==
సాంస్కృతికంగా, సహారన్పూర్‌లో పశ్చిమ [[ఉత్తర ప్రదేశ్|ఉత్తరప్రదేశ్]]లోని మిగిలిన నగరాలు లక్షణాలు కనిపిస్తాయి, ఉదాహరణకు భాష, వేషం, ఆహార అలవాట్లు, పండుగలు మరియు ఇతర సంప్రదాయాలు మరియు వేడుకలు ఈ ప్రాంతంలో ఒకే విధంగా ఉంటాయి. వినోదానికి సినిమాలు, హోటళ్లు మరియు తినుబండార కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ హిందీ మరియు ఉర్దూ వార్తాపత్రికల స్థానిక ఎడిషన్‌లు ప్రచురించబడుతున్నాయి. తన యొక్క సాహిత్యసంబంధ రూపాలైన [[హిందీ భాష|హిందీ]] మరియు [[ఉర్దూ భాష|ఉర్దూ]] భాషల్లో ఖాదీబోలీ ఇక్కడ ''ఉమ్మడి భాష'' గా గుర్తించబడుతుంది, దీనిని పంజాబీ పౌరులు కూడా బాగా మాట్లాడతారు.
==ఉన్నత విద్య==
భారతదేశంలో అగ్రశ్రేణి సాంకేతిక విద్యా సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ (IIT రూర్కీ)కి సహారన్పూర్‌లో ఒక క్యాంపస్ ఉంది. పేపప్ టెక్నాలజీ మరియు పాలిమర్ సైన్స్ మరియు ప్రాసెస్ ఇంజనీరింగ్‌లలో ఇంజనీరింగ్ కోర్సులను ఈ క్యాంపస్ అందిస్తుంది. ఈ క్యాంపస్ పేపర్ మిల్లు రోడ్డుపై ఉంది, దీనికి ఒకవైపు సహారన్పూర్‌లోని స్టార్ పేపర్ మిల్స్ మరియు మరొకవైపు సెంట్రల్ పల్ప్ అండ్ పేపర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CPPRI) (ఆసియాలో ఇటువంటి సంస్థ ఇదొక్కటే ఉంది) ఉన్నాయి.
ప్రసిద్ధ ముస్లిం విద్యా కేంద్రమైన మజాహీర్-ఉల్-ఉలూమ్, సహారన్పూర్ సున్నీ ధర్మశాస్త్రంలోకి అధునాతన విద్యను స్వీకరించింది, దురుల్ ఉలూమ్, దియోబంద్ స్కూల్ కూడా ఇదే మార్గంలో నడిచాయి, విద్యాపరమైన ర్యాంకుల్లో ఇవి మూడు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఈ ముస్లిం విద్యా కేంద్రం అరబీ మదర్సాలో ఉంది.
సహారన్పూర్ నగరం కొద్ది మంది అద్భుత ప్రతిభగల విద్యార్థులు మరియు సాంకేతిక నిపుణులు మరియు ఔత్యాహిక పారిశ్రామికవేత్తలను ప్రపంచానికి అందించింది.
పోలీస్ స్టేషన్ వెనుకవైపు ఉన్న మౌంట్ కార్మెల్ క్రిస్టియన్ అకాడమీ, ఫతేపూర్, ఈ ప్రాంతంలో 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తున్న పాఠశాలగా గుర్తింపు పొందింది.
అనేక కళాశాలలు, మీరట్ విశ్వవిద్యాలయ అనుబంధ సంస్థలు అనేక ఆర్ట్స్ మరియు సైన్స్ సబ్జెక్ట్‌ల్లో విశ్వవిద్యాలయ స్థాయి కోర్సులు అందిస్తున్నాయి.
2000లో, శోభిత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (కళాశాల కోడ్ - 103) అనే పేరుతో ఒక కొత్త ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించబడింది.
''''డూన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ' (కళాశాల కోడ్-426),''' అనే పేరుతో మరో కొత్త ఇంజనీరింగ్ కళాశాల 2008లో ప్రారంభమైంది.
ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేసే ప్రాజెక్టును అమలు చేశారు (2009 నాటికి), ప్రతిపాదిత మన్నియా కాన్షి రామ్ అల్లోపతిక్ గవర్నమెంట్ కాలేజ్ సహారన్పూర్ నగర సమీపంలో నిర్మాణంలో ఉంది.
ఇదిలా ఉంటే, సహారన్పూర్ జిల్లా జనాభా మరియు ఆర్థిక బలం యొక్క పరిమాణాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే, పొరుగు జిల్లాల్లో అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలతో పోల్చినప్పుడు ఇక్కడ అధునాతన విద్య మరియు పరిశోధనకు సంబంధించి మౌలిక సదుపాయాల కొరత కనిపిస్తుంది. నగరంలో విస్తృతమైన కోర్సులు మరియు అల్లోపతి మరియు [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] విద్యకు సంబంధించిన వైద్య కళాశాలలతోపాటు, సొంత ఇంజనీరింగ్ కళాశాలలతో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా వేగవంతమైన దిద్దుబాటు చర్య చేపట్టాలనే భావన ఉంది. రూర్కీ నగరం ఈ ప్రాంతం నుంచి వేరుచేయబడిన తరువాత ఈ భావనలు మరింత బలపడ్డాయి, రూర్కీ నగరాన్ని సహారన్పూర్ జిల్లా నుంచి వేరుచేసి, సెప్టెంబరు 2000లో కొత్తగా ఏర్పాటైన [[ఉత్తరాఖండ్|ఉత్తరాఖండ్]] రాష్ట్రంలో కలిపారు.
==ప్రసిద్ధ ప్రాంతాలు==
సహారన్పూర్‌లో, అనేక ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి. కంపెనీ గార్డెన్‌గా తెలిసిన సహారన్పూర్ బొటానికల్ గార్డెన్స్ ఒకప్పుడు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిరక్షణలో ఉండేది, ఈ బొటానికల్ గార్డెన్ చాలా అందంగా ఉంటుంది. భారతదేశంలోని అతిపురాతన సజీవ ఉద్యానవనాల్లో ఇది కూడా ఒకటి, 1750 కాలానికి ముందు దీనిని నిర్మించారు. అప్పుడు దీనికి ఫరాహత్-బక్ష్ అనే పేరు ఉండేది, ఇది మొదట స్థానిక అధికారి ఇంతజాముద్ ఉల్లా ఏర్పాటు చేసిన ఒక కాలక్షేప ప్రదేశంగా ఉంది. 1817లో దీనిని బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ,<ref>[http://books.google.com/books?id=PjfVFGM4p6wC&pg=PA297&lpg=PA297&dq=Farahat-Bakhsh&source=bl&ots=nYmwaJfiPb&sig=f0ofrNx-JEbCaQzfYLsnXIGBvO4&hl=en&ei=9jjPSfyhH6a2tAOqkuSiAw&sa=X&oi=book_result&resnum=10&ct=result శరద్ సింగ్ నెగీ, ''బయోడైవర్శిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా'' 2వ సవరణ ఎడిషన్ ][http://books.google.com/books?id=PjfVFGM4p6wC&pg=PA297&lpg=PA297&dq=Farahat-Bakhsh&source=bl&ots=nYmwaJfiPb&sig=f0ofrNx-JEbCaQzfYLsnXIGBvO4&hl=en&ei=9jjPSfyhH6a2tAOqkuSiAw&sa=X&oi=book_result&resnum=10&ct=result న్యూఢిల్లీ, ఇండస్ పబ్లిషింగ్ (2008) ISBN 978-81-7387-211-2]</ref> కొనుగోలు చేసి, జిల్లా సర్జన్ (శస్త్రచికిత్స నిపుణుడు) అధికారంలో ఉంచింది. జోసఫ్ డాల్టన్ హూకర్ ఈ బొటానికల్ గార్డెన్ గురించి ఈ విధంగా రాశారు, చైనా నుంచి టీ మొక్కను చేర్చడం ఈ ఉద్యానవన ప్రధాన ఘనతల్లో ఒకటిగా పరిగణించారు, అనేక మంది ఆంగ్ల పాఠకులకు హిమాలయ ప్రాంతం మరియు [[అసోం|అస్సాం]]లో [[తేనీరు|టీ]]-వాణిజ్య స్థాపన గురించి తెలియదని పేర్కొన్నారు, కలకత్తా మరియు సహారన్పూర్ తోటల గురించి వివరించారు.<ref>జోసఫ్ డాల్టన్ హూకర్, ''హిమాలయన్ జర్నల్స్, ఆర్ నోట్స్ ఆఫ్ ఎ న్యాచురలిస్ట్ ...,'' కెవ్ (1854), వాల్యూమ్. I, p. 5.</ref>
1887లో దేశంలో ఉద్యానవన శాస్త్రాన్ని సంస్కరించేందుకు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు, దీంతో సహారన్పూర్ ఉత్తర భారతదేశ వృక్షజాల అధ్యయనానికి కేంద్రంగా మారింది. మొత్తంమీద, ఈ గార్డెన్ చారిత్రాత్మకంగా రెండో పురాతన ఉద్యానవనంగా పరిగణించబడుతుంది, దీనికంటే ముందు జాతీయ ప్రాధాన్యత, విజ్ఞానశాస్త్రానికి మరియు ఆర్థిక వ్యవస్థకు అందించిన సేవలుపరంగా కలకత్తా గార్డెన్స్ ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ పోషణలో, ఇక్కడ పూర్తిస్థాయి పచ్చదనం, అనేక రకాల చెట్లు మరియు పువ్వులు పెంచబడుతున్నాయి.<ref>[http://www.nhm.ac.uk/nature-online/online-exhibitions/art-themes/india/more/lily_more_info.htm సహారన్పూర్ బోటానిక్ గార్డెన్]</ref>
నగరంలోని ఇతర ఆసక్తికరమైన ప్రదేశాల్లో ముఖ్యమంత్రి మాయావతి ప్రారంభించిన అంబెడ్కర్ పార్కు, అంబాలా రోడ్డు నుంచి చిల్కానా రోడ్డు వరకు విస్తరించివున్న పెద్ద కొయ్య బొమ్మల మార్కెట్ ముఖ్యమైనవి, ఈ కొయ్య బొమ్మల మార్కెట్‌లో అద్భుతమైన కళా వస్తు ప్రదర్శనలు మరియు విక్రయాలు జరుగుతుంటాయి. ఇక్కడి నుంచి ఈ బొమ్మలు విదేశాలకు కూడా ఎగుమతి చేయబడుతున్నాయి.
ధామోలా మరియు పావోన్ ధాయి నదులు కలిసిపోయి పాత టీస్ దారా పాల్ (వంతెన) కిందగా ప్రవహిస్తున్నాయి. లాలా దాస్ కా బడా మరో ప్రశాంతమైన ప్రదేశం; దీనిలో అందమైన ఆలయాలు మరియు ఒక మినార్ ఉంది, ఇక్కడి నుంచి సహారన్పూర్ నగరం మొత్తాన్ని చూడవచ్చు.
గుఘల్ మేళా అనేది సహారన్పూర్ యొక్క చారిత్రక సామాజిక-మతపరమైన [[పండుగ|వేడుక]], దీనిని ప్రతి ఏటా సెప్టెంబరు నెలలో నిర్వహిస్తారు, అన్ని మతాలవారు ఈ వేడుకలో పాలుపంచుకుంటారు.
ఇటీవల "కేఫ్ కాఫీ డే" & "డొమినోస్" ఇక్కడ తమ శాఖలను ఏర్పాటు చేశాయి.
==ఆలయాలు మరియు ఇతర మతపరమైన ప్రదేశాలు==
'''5000 సంవత్సరాల చరిత్రగల ఆలయం నానౌతా సమీపంలోని బార్సిలో ఉంది.'''
సహారన్పూర్ నుంచి గంగో-డియోబంద్ రోడ్డుపై 37 కిలోమీటర్ల దూరంలో బార్సి ఉంది.ఈ గ్రామం యొక్క విశేషం ఏమిటంటే ఇక్కడ ఒక శివాలయం ఉంది. ఇది బాగా పురాతన మరియు ప్రసిద్ధ ఆలయం. దీనిని పాండవులు మరియు కౌరవులు నిర్మించారు.
పతేశ్వర ఆలయం (కోర్టు రోడ్డు), శివ మందిరం (నవీన్ నగర్), జైన్‌బాగ్ (చిల్కానా రోడ్డు), భూతేశ్వర ఆలయం (భూతేశ్వర్ రోడ్డు), బాగేశ్వర ఆలయం (చాక్రౌతా రోడ్డు), లక్ష్మీ నారాయణ ఆలయం (కోర్టు రోడ్డు), బాలాజీ ఆలయం (బాధ్-తాలా), సాయిబాబా ధామ్ (బెహాత్ రోడ్డు),శ్రీహరి దర్శన్ మందిరం'PT.రాకేశ్ శర్మ,{చిల్కానా రోడ్డు}, పటాలేశ్వర ఆలయం (రాణి బజార్), జామా మసీదు, మదర్సా మజాహీర్-ఉల్-ఉలూమ్, నౌ-గాజా పీర్ మందిరం, ఓజ్రియా పీర్ మందిరం (షా బెహ్లోల్), టెలియోన్ కి మసీద్ (పురాణీ మండి), క్లాక్‌టవర్ & సమీదు (ఘంటాఘర్), షాజహానీ మసీదు, అన్గూరీ (ద్రాక్ష) మసీదు, రైల్వే స్టేషన్ మసీదు, టాబ్లీగ్-మార్కాజ్ (బంజారోన్ కా పుల్). 2010నాటికి ఇక్కడ 195 ఆలయాలు ఉన్నాయి.
నగరంలో హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన షాకుంభ్రీ దేవి ఆలయం, ప్రముఖ జైన ఆలయం పర్శ్వనాథ్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇటీవల సహారన్పూర్‌కు 10 కిమీ దూరంలో బెహాత్ రోడ్డుపై [[షిర్డీ సాయిబాబా|సాయిబాబా]] ఆలయాన్ని నిర్మించారు.
==కొత్త పట్టణ ప్రాంతాలు ==
సహారన్పూర్ నగర పాత భాగాలు కొత్త ప్రాంతాలతో రైల్వే ట్రాకుతో వేరుచేయబడుతున్నాయి. పొడవైన రైల్వే వంతెన కాచెహ్రీ కా పుల్ నగరంలోని రెండు ప్రాంతాల్లోని ముఖ్యమైన ప్రదేశాలను కలిపే ఒక ముఖ్యమైన ప్రదేశంగా ఉంది. నగరం అన్నివైపులా విస్తరిస్తుంది; కొత్త పట్టణ ప్రాంతాలు సమకాలీన వాస్తు శైలిలో నిర్మించబడుతున్నాయి, అయితే ఇక్కడ ఇప్పటివరకు ఎత్తైన ఆకాశహర్మాలేవీ లేవు. బహుళ అంతస్తు వాణిజ్య సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి.
నగరంలో ప్రధాన కొత్త టౌన్‌షిప్‌లు: సౌత్ సిటీ కాలనీ, హాకీకాత్ నగర్, ఆవాస్ వికాస్ కాలనీ, సెంట్రల్ పార్క్, గిల్ కాలనీ, ఇంద్రప్రస్తా కాలనీ, జగదీష్ కాలనీ, లక్ష్మణ్ సింగ్ కాలనీ, మిషన్ కాంపౌండ్, నేహా గార్డెన్, న్యూ పటేల్ నగర్, దేవి నివాస్, పారామౌంట్ టూలిప్, రాయల్ పామ్, అన్సారియన్ స్ట్రీట్, బాసెరా హాజీ అబ్దుల్ గఫూర్, శంకర్‌పూరి కాలనీ, సన్ సిటీ మరియు సన్ సిటీ గ్రాండ్. [[పంజాబ్ నేషనల్ బ్యాంకు|పంజాబ్ నేషనల్ బ్యాంక్]] ఆధ్వర్యంలో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేయబడుతున్న ''మక్తి జారోలీ'' అనే గ్రామం నగరంలోని అత్యంత అధునాతన ప్రాంతాల్లో ఒకటి; బలమైన వ్యాపారం, 100% అక్షరాస్యత, అనేక రాజకీయ నేతలు మరియు పెద్ద వ్యాపార తరగతి కుటుంబాలు ఇక్కడ చూడవచ్చు.
==ప్రయాణం మరియు రవాణా==
నగర ప్రధాన ప్రజా రవాణాకు వెన్నెముకగా సైకిల్-రిక్షాలు ఉన్నాయి, కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ఆటో రిక్షాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, ప్రత్యేక సందర్భాల కోసం ప్రైవేట్ బస్సులు మరియు ట్యాక్సీలు కూడా నగరంలో అద్దెకు దొరుకుతాయి.
ఇదిలా ఉంటే సహారన్పూర్ నగరం మిగిలిన ప్రధాన నగరాలకు బస్సు మరియు రైలు మార్గాల్లో అనుసంధానం చేయబడివుంది. ఈ నగరం జాతీయ రహదారి NH-73పై ఉన్నాయి. ఇది [[భారతీయ రైల్వేలు|భారతీయ రైల్వే]] వ్యవస్థలో ఒక ప్రధాన జంక్షన్‌గా ఉంది; భారతదేశపు మరింత మారుమూల ప్రాంతాలను కలిపే అనేక ముఖ్యమైన రైళ్లు ఈ నగరం గుండా ప్రయాణిస్తున్నాయి. ప్రధాన రైల్వే స్టేషన్ సహారన్పూర్ జంక్షన్, ఇది నగరం నడిబొడ్డున ఉంది, టాప్రీ రైల్వే స్టేషన్ పేపర్ మిల్లు రోడ్డుపై ఉంది. రోడ్‌వేస్ బస్-స్టాండ్ సహారన్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉంది; ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ రవాణా బస్సులు మరియు ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సేవలు అందుబాటులో ఉంటాయి, సమీపంలోని పట్టణాలు మరియు ప్రధాన నగరాలైన [[డెహ్రాడూన్|డెహ్రాడూన్]], రూర్కీ, అంబాలా, [[హరిద్వార్|హరిద్వార్]], మీరట్, మోరదాబాద్, [[లక్నో|లక్నో]], [[ఆగ్రా|ఆగ్రా]], [[చండీగఢ్|చండీగఢ్]], [[ఢిల్లీ|ఢిల్లీ]], ఇండోర్, ఉజ్జయినీ, అంబెహతా చంద్ మరియు జైపూర్‌లకు ఏ సమయంలోనే బస్సులు అందుబాటులో ఉంటాయి. సహారన్పూర్ విమానాశ్రయం సర్సావాలో ఉంది, అయితే దీనిని భారతీయ వైమానిక దళం మాత్రమే ఉపయోగిస్తుంది.
==వీటిని కూడా చూడండి==
* సహారన్పూర్‌కు ఉత్తర ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ షాకుంభ్రీ దేవి ఆలయం
==సూచనలు==
{{reflist}}
==బాహ్య లింకులు==
* [http://thesaharanpur.com/ ఎ కాంప్రహెన్సివ్ వెబ్ పోర్టల్ అండ్ ఫోరమ్ ఫర్ అండ్ ఎబౌట్ సహారన్పూర్]
* [http://wikimapia.org/#lat=29.9814562&lon=77.5547701&z=18&l=0&m=b వికీ మ్యాప్ ఆఫ్ సహారన్పూర్]
* [http://saharanpur.nic.in/ సహారన్పూర్ అధికారిక వెబ్‌సైట్]
* [http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V21_373.gif సహారన్పూర్ హిస్టరీ ఇన్ ది ఇంపీరియల్ గెజిటర్ ఆఫ్ ఇండియా, 1909]
* [http://mscollegesre.com మహారాజ్ సింగ్ కాలేజ్]
* [http://lions321c1.com లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ అధికారిక వెబ్‌సైట్]
* [http://rotary3080zone11.com రోటరీ క్లబ్ యొక్క అధికారిక వెబ్‌సైట్]
* [http://www.meharwansteels.com/ కాస్ట్ ఐరన్ ఇండస్ట్రీ ఇన్ సహారన్పూర్]
* [http://thesaharanpur.com/achievers1.htm సహారన్పూర్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ దీజ్ పీపుల్]
* [http://thesaharanpur.com/healthcare.html సహారన్పూర్‌లో ఆరోగ్య సేవలు]
* [http://wooden-handicraft.com/ వుడెన్ హ్యాండీక్రాఫ్ట్ ఫ్రమ్ సహారన్పూర్]
* [http://thesaharanpur.com/javedjamil1.htm సహారన్పూర్ : ది సిటీ ఆఫ్ పీస్]
<br>
{{Saharanpur district}}
{{Uttar Pradesh}}
{{Hindi Speaking Areas of India}}
[[Category:సహారన్పూర్ జిల్లాలో నగరాలు మరియు పట్టణాలు]]
[[en:Saharanpur]]
[[hi:सहारनपुर]]
[[ta:சகாரன்பூர்]]
[[be:Горад Сахаранпур]]
[[bpy:শাহরানপুর]]
[[ca:Saharanpur]]
[[de:Saharanpur]]
[[eo:Saharanpur]]
[[es:Saharanpur]]
[[fa:سهارانپور]]
[[fi:Saharanpur]]
[[gu:સહરાનપુર]]
[[it:Saharanpur]]
[[ja:サハーランプル]]
[[ko:사하란푸르]]
[[mr:सहारनपूर]]
[[no:Saharanpur]]
[[pam:Saharanpur]]
[[pl:Saharanpur (miasto)]]
[[pnb:سہارن پور]]
[[ru:Сахаранпур]]
[[sv:Saharanpur]]
[[uk:Сахаранпур]]
[[ur:سهارنپور]]
[[vi:Saharanpur]]
[[war:Saharanpur]]All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?oldid=737088.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|