Revision 737127 of "న్యూమోథొరాక్స్" on tewiki{{యాంత్రిక అనువాదం}}
{{Infobox disease |
Name = Pneumothorax |
ICD10 = {{ICD10|J|93||j|90}}, {{ICD10|P|25|1|p|20}}, {{ICD10|S|27|0|s|20}} |
ICD9 = {{ICD9|512}}, {{ICD9|860}} |
Image = Rt_sided_pneumoD.jpg|
Caption = Right sided spontaneous pneumothorax (left in the image). An arrow indicating the edge of the collapsed lung.|
eMedicineSubj = article |
eMedicineTopic = 432979 |
eMedicine_mult = {{eMedicine2|article|424547}} {{eMedicine2|article|360796}} {{eMedicine2|article|808162}} {{eMedicine2|article|827551}} {{eMedicine2|article|1003552}} |
OMIM = 173600 |
DiseasesDB = 10195 |
MedlinePlus = 000087 |
MeshID = D011030 |
}}
'''న్యూమోథొరాక్స్''' ([[ఆంగ్లం]]: '''Pneumothorax''') (బహువచనం '''న్యూమోథొరాసెస్''') [[ఊపిరితిత్తులు| ఊపిరితిత్తులు]], ఛాతీ గోడల మధ్య శ్వాస కుహరంలో పేరుకునే [[గాలి]], లేదా [[వాయువు]]ల సమాహారం. బాధితుల్లో చిరకాలంగా ఊపిరితిత్తుల సమస్యల (''ప్రాథమిక'') వంటివేవీ లేకపోయినా కూడా ఇది కన్పించవచ్చు. దాంతోపాటు ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుల్లో (''ద్వితీయ'') కూడా కన్పించవచ్చు. చాలా న్యూమోథెరాసెస్ ఊపిరితిత్తులకు గాయాలు, పేలుడు తాలూకు గాయాలు, లేదా వైద్య చికిత్సలోని విపరిణామాల వంటివాటి వల్ల కూడా వస్తాయి.<ref name="Tschopp"></ref><ref name="Noppen"></ref>
న్యూమోథెరాక్స్ లక్షణాలు దాని కారణంగా కలిగే గాలి లీకేజీ, వేగాలపై ఆధారపడతాయి. చాలా కేసుల్లో ఛాతిలో బాధ, కొన్నింట్లో [[ఆయాసం|శ్వాస అందకపోవడం]] వంటివి సాధారణంగా కన్పిస్తాయి. తీవ్రమైన కేసుల్లో భౌతిక పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ వీలవుతుంది. కానీ సాధారణంగా ఛాతి ఎక్స్‌రే లేదా టోమోగ్రఫీ (సీటీ స్కాన్) వంటివి అవసరమవుతుంటాయి. సూక్ష్మంగా చెప్పాలంటే న్యూమోథొరాక్స్ బాధితునికి తీవ్ర ఆక్సిజన్ కొరతకు, లో బీపీకి దారి తీస్తుంది. సకాలంలో చికిత్స చేయని పక్షంలో గుండెపోటుకు కూడా దారి తీయవచ్చు. ఈ పరిస్థితిని '''టెన్షన్ న్యూమోథొరాక్స్''' గా పేర్కొంటారు.<ref name="Tschopp"></ref><ref name="Leigh-Smith"></ref>
తక్కువ మోతాదులో అప్పటికప్పుడు వచ్చే న్యూమోథొరాసెస్ సాధారణంగా వాటంతటవే తగ్గిపోతాయి. వీటికి చికిత్సేమీ అవసరముండదు. ముఖ్యంగా అప్పటికే ఊపిరితిత్తుల వ్యాధులేవీ లేని వారికి ఇది బాగా వర్తిస్తుంది. కానీ తీవ్రతతో, లేదా విషమించే లక్షణాలతో వచ్చే న్యూమోథొరాసెస్‌లలో గాలిని సిరంజితో తీయాల్సి రావచ్చు. లేదా వన్ వే చెస్ట్ ట్యూబ్‌ను లోనికి పంపడం ద్వారా గాలిని తీయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు శస్త్రచికిత్స అవసరమూ రావచ్చు. ముఖ్యంగా శ్వాస నాళిక సరిగా లేనివారికి, పలుమార్లు న్యూమోథొరాక్స్ వచ్చిన వారికి ఇది వర్తిస్తుంది. దీనికి పలు చికిత్సలున్నాయి. ప్లూరోడెసిస్ (ఊపిరితిత్తులను ఛాతి గోడకు అతికించడం) వంటివి వీటిలో ముఖ్యమైనవి. న్యూమోథొరాక్స్ మాటిమాటికీ దాడి చేసిన బాపతు కేసుల్లో, రిస్కు మరీ ఎక్కువగా ఉండే సందర్భంలో ఈ చికిత్సను ఉపయోగిస్తారు.<ref name="Tschopp"></ref>
==వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలు==
===క్లినికల్ సబ్‌టైప్స్===
ప్రైమరీ స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్ (పీఎస్‌పీ) ఎలాంటి ఛాతీ సంబంధ సమస్యలూ లేని యువతీ యువకులకు కూడా వస్తుంది. ఇది సాధారణంగా ఓ మాదిరి లక్షణాలనే చూపుతుంది. ఛాతీ నొప్పి, కొన్నిసార్లు కాస్త శ్వాసలేమి వంటివి సాధారణంగా కన్పించే లక్షణాలు.<ref name="Tschopp">{{cite journal |author=Tschopp JM, Rami-Porta R, Noppen M, Astoul P |title=Management of spontaneous pneumothorax: state of the art |journal=Eur. Respir. J. |volume=28 |issue=3 |pages=637–50 |year=2006 |month=September |pmid=16946095 |doi=10.1183/09031936.06.00014206 |url=http://erj.ersjournals.com/content/28/3/637.long}}</ref><ref name="Noppen">{{cite journal |author=Noppen M, De Keukeleire T |title=Pneumothorax |journal=Respiration |volume=76 |issue=2 |pages=121–7 |year=2008 |pmid=18708734 |doi=10.1159/000135932 | url=http://content.karger.com/ProdukteDB/produkte.asp?Aktion=ShowFulltext&ArtikelNr=000135932&Ausgabe=238708&ProduktNr=224278}}</ref> ఈ పీఎస్‌పీ బాధితుల్లో సగం మంది దాకా వైద్య చికిత్సను చాలా రోజుల దాకా ఆలస్యం చేస్తారు.<ref name="BTS">{{cite journal |author=MacDuff A, Arnold A, Harvey J, BTS Pleural Disease Guideline Group |title=Management of spontaneous pneumothorax: [[British Thoracic Society]] pleural disease guideline 2010 |journal=Thorax |volume=65 |issue=8|pages=ii18-ii31 |year=2010|month=December|doi=10.1136/thx.2010.136986|pmid=<!--20696690-->}}</ref> పీఎస్‌పీ టెన్షన్ న్యూమోథొరాక్స్‌కు దారి తీయడం చాలా చాలా అరుదు. దీని లక్షణాలు పొడగరులైన మగవాళ్లలో ముఖ్యంగా ధూమపానం చేసేవారిలో ఎక్కువగా కన్పిస్తాయి. ఇలాంటి వారికి ఈ వ్యాధి వచ్చే ఆస్కారం కూడా ఎక్కువ. పీఎస్‌పీ వాతావరణ ఒత్తిళ్లలో మార్పులు సంభవించేప్పుడు మరీ ఎక్కువగా వస్తుందని తేలింది. దాంతోపాటు గట్టి శబ్దంతో కూడిన సంగీతం వినేటప్పుడు కూడా. న్యూరోథొమాక్స్ కేసులు క్లస్టర్లుగా ఎందుకు వస్తాయన్న దానికి దీన్ని వివరణగా భావింవచ్చు.<ref name="Tschopp"></ref>
సెకండరీ స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్ (ఎస్‌ఎస్‌పీ) ఊపిరితిత్తుల వ్యాధులున్న వారికి సోకుతుంది. దీని లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఊపిరితత్తుల్లో వ్యాధిగ్రస్తమైన భాగం తాలూకు పని ఒత్తిడిని ఆరోగ్యవంతమైన భాగం సమర్థంగా నిభాయించడంలో విఫలమవుతుంది. హైపోక్సియా (రక్తం, ఆక్సిజన్ స్థాయిల్లో తగ్గుదల) ఇలాంటి కేసుల్లో సాధారణంగా కన్పిస్తుంది. ఇది పలుసార్లు సైనోసిస్ (పెదాలు, చర్మం నీలి రంగులోకి మారిపోవడం)గా కూడా మారుతుంటుంది. హైపర్‌కపినా (రక్తంలో కార్బన్ డయాక్సైడ్ పేరుకుపోవడం) కూడా కొన్నిసార్లు కన్పించవచ్చు. ఇది అయోమయంతో పాటు కొన్నిసార్లు కోమాకు కూడా దారి తీస్తుంది. క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధుల్న్ను వారిలో హఠాత్తుగా తలెత్తే శ్వాస ఇబ్బంది సంభావిత న్యూమోథొరాక్స్ అయి ఉండొచ్చు. ఆ దిశగా వ్యాధి నిర్ధారణ జరిగితే వాస్తవాలు తెలుస్తాయి.<ref name="Tschopp"></ref> న్యూమోథొరాక్స్ పరిమాణం బాధితునిలో కన్పించే లక్షణాల మోతాదుపై ఆధారపడి ఉంటుంది.<ref name="BTS"></ref>
ట్రామాటిక్ న్యూమోథొరాక్స్ ఛాతీ గోడకు రంధ్రం వల్ల గానీ (కత్తిపోటు గాయం, లేదా బులెట్ గాయం వల్ల ఏర్పడినది. దీనివల్ల గాలి శ్వాస కుహర స్థలంలోకి వెళ్తుంది), లేదా ఊపిరితిత్తులకు కలిగే గాయం వల్ల గానీ వస్తుంది. సగం కేసుల్లో ఛాతీ గాయంతో, తద్వారా రిబ్ ఫ్రాక్చర్‌తో తలెత్తే సమస్యల వల్ల వస్తుంది. సగం కేసుల్లో న్యూమోథొరాక్స్ చిన్నదిగానే ఉండవచ్చు. కానీ బాధితునికి వైద్య సాయం, ముఖ్యంగా కృత్రిమ శ్వాస అవసరమయ్యే పక్షంలో తీవ్రతరమవుతుంది.<ref name="Noppen"></ref> అప్పటికే యాంత్రికంగా కృత్రిమ శ్వాస పొందుతున్న వారిలో దీనికి లోనయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.<ref name="Noppen"></ref><ref name="Leigh-Smith"></ref>
టెన్షన్ న్యూమోథొరాక్స్‌ను పలు ఆధారాలు పలు విధాలుగా నిర్వచిస్తాయి.<ref name="Leigh-Smith">{{cite journal |author=Leigh-Smith S, Harris T |title=Tension pneumothorax--time for a re-think? |journal=Emerg. Med. J. |volume=22 |issue=1 |pages=8–16 |year=2005 |month=January |pmid=15611534 |pmc=1726546 |doi=10.1136/emj.2003.010421}}</ref> సాధారణంగా చెప్పే నిర్వచనం ప్రకారం ఆక్సిజన్ అందజేస్తున్నా తీవ్రమైన హైపోక్సియా ఉండి,[[రక్త పీడనం| బీపీ]] తగ్గుతుండటం, అయోమయం వంటివి ఉండటం. దీన్ని వైద్య అత్యవసర పరిస్థితిగా చెబుతారు.<ref name="Leigh-Smith"></ref><ref name="BTS"></ref> యాంత్రిక కృత్రిమ శ్వాసపై ఉన్నవారికి కూడా టెన్షన్ న్యూమోథొరాక్స్ రావచ్చు. కానీ బాధితుడు అప్పటికే మత్తులో ఉంటాడు కాబట్టి అతనికి ఈ వ్యాధి వచ్చినట్టు గుర్తించడం కూడా కష్టమే అవుతుంది. ఆరోగ్య పరిస్థితి హఠాత్తుగా దిగజారే సందర్భాల్లో ఈ వ్యాధి వచ్చినట్టు తరచూ గుర్తించడం జరుగుతోంది.<ref name="Leigh-Smith"></ref>
===భౌతిక పరీక్షలు===
భౌతిక పరీక్షల్లో కూడా కొన్నిసార్లు అసహజతలేవీ కన్పించకపోవచ్చు. ముఖ్యంగా న్యూహుథొరాక్స్ చిన్నదైతే. [[స్టెతస్కోప్|స్టెతస్కోప్]]తో విన్పించే స్థాక్ష్మీఇలో వచ్చే శ్వాస శబ్దం ఊపిరితిత్తులో బాధిత భాగం వైపు తక్కువగా విన్పించేందుకు ఆస్కారముంటుంది. ఎందుకంటే శ్వాస కుహరంలో నిండే గాలి శబ్దాన్ని తగ్గిస్తుంది. ఛాతీకి తగిలే దెబ్బ కూడా ఎక్కువ మోతాదు (హై పిచ్)లో విన్పించవచ్చు. ప్రతిధ్వనితో పాటు టక్టైల్ ఫ్రెమిటస్ (ఊపిరితిత్తుల తాలూకు ధ్వని స్థాయిని పరీక్షించిన మీదట) కూడా తగ్గే ఆస్కారముంటుంది.<ref name="Noppen"></ref><ref name="BTS"></ref>
టెన్షన్ న్యూమోథొరాక్స్‌ను అతి వేగంగా శ్వాసించడం, చర్మం, కళ్లు నీలి రంగుకు మారడం,[[రక్త పీడనం| బీపీ]] స్థాయి తగ్గుముఖం పట్టడం (హైపో టెన్షన్), అయోమయం వంటి లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ఛాతీలోని బాధిత భాగం అసాధారణంగా ఉబ్బవచ్చు. దాంతోపాటు అక్కడ కదలికలు తగ్గే ఆస్కారముంటుంది. అప్పుడు అదే మోతాదులో అవతలి భాగంలో కదలికలు పెరుగుతాయి. కొన్ని అతి తీవ్రమైన కేసుల్లో శ్వాస రేటు చాలా వేగంగా పడిపోతుంది. షాక్, కొన్నిసార్లు కోమా కూడా రావచ్చు. అయితే టెన్షన్ తాలూకు లక్షణాలు అన్నిసార్లూ గతంలో భావించినంత తీవ్రంగా ఉండకపోవచ్చని కూడా ఇటీవలి అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా క్లినికల్ లక్షణాలు కూడా టెన్షన్ న్యూమోథొరాక్స్‌ను గుర్తించడంలో పెద్దగా ఉపయోగపడకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాయునాళం ఒకవైపుకు ఒరిగిపోవడం, సిరా నాడిలో ఒత్తిడి పెరగడం (కంఠనాళాలు ఉబ్బడం) వంటివి ఈ విషయంలో పెద్దగా దోహదపడకపోవచ్చు. ముఖ్యంగా క్లినికల్ లక్షణాలు కూడా టెన్షన్ న్యూమోథొరాక్స్‌ను గుర్తించడంలో పెద్దగా ఉపయోగపడకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాయునాళం ఒకవైపుకు ఒరిగిపోవడం, సిరా నాడిలో ఒత్తిడి పెరగడం (కంఠనాళాలు ఉబ్బడం) వంటివి ఈ విషయంలో పెద్దగా దోహదపడకపోవచ్చు.<ref name="Leigh-Smith"></ref>
==కారణం==
[[File:Pneumot rax bullae.JPG|thumb|right|బుల్లా మరియు బ్లెబ్‌కు సంబంధించిన స్కెమాటిక్ డ్రాయింగ్, రెండు ఊపిరితిత్తులు అసాధారణ స్థితికి చేరిన తర్వాత అది న్యూమోథోరాక్స్‌కు దారి తీయవచ్చు.]]
===స్పాంటేనియస్===
స్పాంటేనియస్ న్యూమోథొరాసెస్‌ను రెండు రకాలుగా వర్గీకరిస్తారు:'' ప్రైమరీ.'' ఇది అప్పటికే ఊపిరితిత్తుల వ్యాధులేవీ లేనప్పుడు వచ్చేది. ఇక ''సెకండరీ.'' ఇది అప్పటికే ఊపిరితిత్తుల వ్యాధులతో బాధ పడుతున్న వారికి వస్తుంది. అయితే ప్రైమరీ స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్ రావడానికి కచ్చితమైన కారణం మాత్రం ఇప్పటిదాకా తెలియలేదు. కాకపోతే ఇప్పటికే స్థిరపడ్డ రిస్క్ కారణాల్లో మగవారిలో ధూమపానం, పూర్వికుల్లో న్యూమోథొరాక్స్ ఉండటం వంటివి ముఖ్యమైనవి.<ref name="Rosen2010"></ref> ఈ విషయంలో పలు అనుమానిత అంశాలను దిగువన చర్చించడం జరిగింది.<ref name="Tschopp"></ref><ref name="Noppen"></ref>
సెకండరీ స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్ చాలా రకాల ఊపిరితిత్తుల వ్యాధులున్న వారికి వస్తుంది. ఇందులో అత్యంత సాధారణమైనది క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది దాదాపు 70 శాతం కేసుల్లో కన్పిస్తుంది.<ref name="Rosen2010"></ref> న్యూమోథొరాక్స్ వచ్చే ఆస్కారాన్ని పెంచే ఊపిరితిత్తుల వ్యాధుల్లో కొన్ని:<ref name="Tschopp"></ref><ref name="Noppen"></ref>
* వాయు ప్రవాహ సంబంధిత వ్యాధులు: క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (ముఖ్యంగా[[ఎంఫిసెమా| ఎంఫిసెమా,]] లంగ్ బులే వంటివి ఉంటే), [[ఉబ్బసము|అతి తీవ్రమైన ఆస్తమా]], సిస్టిక్ ఫిబ్రోసిస్
* లంగ్ ఇన్ఫెక్షన్లు: న్యూమోసిస్టిస్ నిమోనియా (పీసీపీ),[[క్షయ| ట్యూబర్ క్యులోసిస్]], [[న్యుమోనియా|నెక్రోటైజింగ్ నిమోనియా]]
* ఇంటెర్‌స్టిషియల్ ఊపిరితిత్తుల వ్యాధులు: సర్కోయ్‌డోసిస్, ఇడియోపథిక్ పల్మనరీ ఫిబ్రోసిస్, హిస్టియోసిటోసిస్ ఎక్స్, లింఫాంజియోలియోమయోమటోసిస్ (ఎల్‌ఏఎం)
* సంధాన కణజాల వ్యాధులు: రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్, పాలీమయోసిటిస్, డెర్మటోమయోటిసిస్, సిస్టెమిక్ స్క్లెరోసిస్, మార్ఫన్స్ సిండ్రోమ్, ఈలర్స్ డన్లోస్ సిండ్రోమ్
* [[కాన్సర్|క్యాన్సర్:]] ఊపిరితిత్తుల క్యాన్సర్, సర్కోమస్ (ఊపిరితిత్తుల సంబంధిత)
* కాటమేనియల్ ([[ఋతుచక్రం|రుతుక్రమానికి ]]సంబంధించి వచ్చే బాపతు): ఎండోమెట్రియోసిస్ ఇన్ ద చెస్ట్
పిల్లల్లో అదనపు కారణాల్లో [[తట్టు|తట్టు,]] ఎచినోకొకోసిస్, బయటి దుమ్మూ ధూళీ వంటివి శ్వాసతో పాటు లోనికి వెళ్లడం, కొన్ని ప్రత్యేకమైన అసహజ కణజాల పెరుగుదలలు ([[కంజెన్షియల్ సిస్టిక్ అడెనొమాటాయిడ్ మాల్‌ఫామేషన్ ]]అండ్ కంజెన్షియల్ లోబర్ ఎంఫీసెమా).<ref name="Robinson">{{cite journal |author=Robinson PD, Cooper P, Ranganathan SC |title=Evidence-based management of paediatric primary spontaneous pneumothorax |journal=Paediatr. Respir. Rev. |volume=10 |issue=3 |pages=110–7|year=2009 |month=September |pmid=19651381 |doi=10.1016/j.prrv.2008.12.003}}</ref>
బ్రిట్ హాగ్ డ్యూబ్ సిండ్రోమ్ అనే ఒక అరుదైన జన్యుపరమైన సమస్య కూడా కుటుంబాల్లో స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్‌కు దారి తీయవచ్చు. పైగా ఇది చర్మ గాయాలకు కూడా (ఫిబ్రోఫోలికులోమస్), ఊపిరితిత్తుల్లో సిస్ట్‌కు కారణమవుతుంది. దాంతోపాటు కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. లంగ్ సిస్ట్ కూడా బహూశా న్యూమోథొరాక్స్ మ్రపాదాన్ని పెంచుతుంది. ఇది సాధారణంగా ఇతర పరిస్థితుల్లో ఎదురయ్యే ఎగువ లోబ్ సిస్ట్‌ల కంటే దిగువ లోబ్స్‌లోనే కన్పిస్తుంది.<ref name="Menko">{{cite journal |author=Menko FH, van Steensel MA, Giraud S, ''et al.'' |title=Birt-Hogg-Dubé syndrome: diagnosis and management |journal=Lancet Oncol. |volume=10 |issue=12 |pages=1199–206 |year=2009 |month=December |pmid=19959076 |doi=10.1016/S1470-2045(09)70188-3}}</ref> బ్రిట్ హోగ్ డ్యూబ్ సిండ్రోమ్ ''FLCN'' జన్యు (క్రోమోజోమ్) విచ్ఛేదాల వల్ల వస్తుంది. ఇందులో ఫోలీ కులిన్ అనే ప్రొటీన్ అసహజన వర్తన కన్పిస్తుంది.<ref name="Robinson"></ref><ref name="Menko"></ref> ''FLCN'' మ్యుటేషన్లు, లంగ్ లెసియన్లు కూడా కుటుంబాల్లో తలెత్తే న్యూమోథొరాక్స్ కేసుల్లో చాలావరకు కన్పించాయి. ఇవన్నీ కూడా బ్రిట్ హోగ్ డ్యూబ్ సిండ్రోమ్ లేని కేసుల్లో సాధారణంగా కన్పించే లక్షణాలు.<ref name="Robinson"></ref>
===ట్రామాటిక్===
ట్రామాటిక్ న్యూమోథొరాక్స్ తీవ్ర గాయాలు, తద్వారా ఛాతీ గోడలకు లోలోతుల దాకా అయ్యే గాయాల వల్ల కలగవచ్చు.<ref name="Noppen"></ref> విపరీతమైన పేలుడు బారిన పడిన వారిలో నేరుగా ఛాతీకి గాయాలేమీ లేకపోయినా ఈ వ్యాధి కన్పిస్తుంది.<ref name="Wolf">{{cite journal |author=Wolf SJ, Bebarta VS, Bonnett CJ, Pons PT, Cantrill SV |title=Blast injuries |journal=Lancet |volume=374 |issue=9687 |pages=405–15 |year=2009 |month=August |pmid=19631372 |doi=10.1016/S0140-6736(09)60257-9}}</ref> రిబ్ ఫ్రాక్చర్ కారణంగా శ్వాస కుహరంలో కోత పడటం దీనికి చాలా సాధారణంగా కన్పించే కారణం.<ref name="Rosen2010">{{cite book |title=Rosen's emergency medicine: concepts and clinical practice 7th edition |last=Marx |first=John |year=2010 |publisher=Mosby/Elsevier |location=Philadelphia, PA |isbn=9780323054720 |pages=393–396}}</ref>
ఛాతీ కణజాలం బయాప్సీ శాంపిల్స్ తీసుకోవడం వంటి ఛాతీపై చేసే వైద్య పరీక్షలు (ఇయాట్రోజెనిక్), స్టెంరల్ వీనస్ కాథెటర్‌ను ఛాతీ నాళాల్లోకి ప్రవేశ పెట్టడం వంటివి కూడా ఒక్కోసారి ఊపిరితిత్తులకు గాయం చేయవచ్చు. తద్వారా న్యూమోథొరాక్స్‌కు దారితీసే ఆస్కారముంటుంది. పాజిటివ్ ప్రెజర్ వెంటిలేషన్ (మెకానికల్, లేదా నాన్ ఇన్వేజివ్) కూడా బారోట్రామా (ఒత్తిడి సంబంధిత గాయం)కు, తద్వారా న్యూమోథొరాక్స్‌కు కారణమవుతాయి.<ref name="Noppen"></ref>
==యంత్రాంగం==
[[File:Pneumothorax CT.jpg|thumb|రోగి ఎడమ వైపు ఛాతిలో న్యూమోథోరాక్స్‌ను చూపిస్తున్న సీటీస్కాన్ చిత్రం (బమ్మలో కుడివైపు)చెస్ట్‌ట్యూబ్‌ను ఏర్పాటు చేయడం (చిన్న నల్ల మార్కు, చిత్రంలో కుడివైపు), గాలి నింపబడిన ప్లూరల్ కేవిటీ (నలువు) మరియు కండరాలు (తెలుపు)ను చూడవచ్చు.మధ్యలో గుండె భాగాన్ని చూడవచ్చు.]]
గొంతు కోశం దిగువన బోలుగా ఉండే ప్రదేశంలో ఊపిరితిత్తులుంటాయి. అవి భౌతికంగా హిలా వద్ద సంధానమై ఉంటాయి. అక్కడే వాయునాళాలు, రక్త నాళాలు వాటిలోకి ప్రవేశిస్తాయి. శ్వాస కుహరం లోపలి భాగం (ఛాతి గోడ, ఊపిరితిత్తుల మధ్య భాగం)లో ఉండే ప్రతికూల ఒత్తిడి కారణంగా అవన్నీ శ్వాసక్రియ చక్రం పొడవునా దాదాపుగా స్థిరంగా గొంతు కోశం లోపల నిలిచి ఉంటాయి. తద్వారా ఊపిరితిత్తుల్ని ఛాతీ గోడలకేసి నెడుతూ ఉంటాయి. ఊపిరితిత్తులు, ఛాతీ గోడ శ్వాస కుహరం (వరుసగా విసెరల్, పరియేటల్‌గా పిలిచే) తాలూకు కొన్ని పొరల కణాలతో కప్పబడి ఉంటాయి. అందులో తక్కువ పరిమాణంలో సెరస్ ద్రావకం ఉంటుంది. ఈ ప్రతికూల ఒత్తిడి సాధారణంగా గాలిని శ్వాస కుహర స్థలంలోకి వెళ్లనివ్వదు. ఎందుకంటే అక్కడ గాలి వెళ్లేందుకు వీలు కల్పించే ప్రాకృతిక అమరిక ఏదీ ఉండదు. పైగా రక్తప్రవాహంలోని వాయువుల ఒత్తిడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అందులోని గాలి కూడా శ్వాస కుహరంలోకి వెళ్లలేదు. కాబట్టి న్యూరోథొరాక్స్ కేవలం గాలి శ్వాస కుహరంలోకి వెళ్లినప్పుడు మాత్రమే వస్తుంది. అది ఛాతీ గోడకు జరిగే ప్రమాదం వల్ల గానీ, లేదా ఊపిరితిత్తులకే నష్టం కలగడం వల్ల గానీ జరగాల్సి ఉంటుంది. లేదంటే కొన్ని సందర్భాల్లో ఆ ఖాళీ స్థలంలోని సూక్ష్మ వ్యవస్థ అనూహ్య రీతిలో వాయువులను ఉత్పత్తి చేయడం కూడా దీనికి కారణం కావచ్చు.<ref name="Noppen"></ref>
ఛాతీ గోడ లోపం సాధారణంగా దానికి గాయాలయ్యే కేసుల్లో స్పష్టంగా తెలుస్తుంది. బులెట్ గాయం (''ఓపెన్ న్యూమోథొరాక్స్'') వంటివి ఇందుకు ఉదాహరణ. సెకండరీ స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్‌లో ఊపిరితిత్తుల కణజాలాల్లో పలు రకాల రోగ ప్రక్రియల వల్ల దుర్బలత్వం చోటుచేసుకుంటుంది. ఎంఫీసెమాలో బులీ (గాలితో కూడిన భారీ లెజియన్లు) వంటివి ఇందుకు ఉదాహరణ. ఒంట్లో కొన్ని ప్రాంతాల్లో నెర్కోసిస్ (అంటే కణజాల మృతి) కూడా న్యూమోథొరాక్స్‌కు కారణం కావచ్చు. అయితే ఈ విషయంలో స్పష్టమైన విధి విధానాలింకా రాలేదు.<ref name="Tschopp"></ref> ప్రైమరీ స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్‌ను చాలా ఏళ్ల పాటు శ్వాస కుహరానికి కాస్త దిగువన బెల్బ్స్‌గా పిలిచే చిన్న లెజియన్ల ద్వారా చికిత్స చేశారు. వాటిపై ఒత్తిడి కలగజేయడం ద్వారా, ఇతర యాంత్రిక పద్ధతుల ద్వారా పొడవాటి మగవాళ్లలో న్యూమోథొరాక్స్ సంభావ్యత పెరగుతుందని భావించేవారు. కానీ ఇది సరి కాకపోవచ్చని పలు సాక్ష్యాలతో కూడిన వాదనలు చెబుతున్నాయి. ఎందుకంటే బెల్బ్స్ ద్వారా శస్త్రచికిత్స జరిపిన తర్వాత కూడా న్యూమోథొరాక్స్ తిరగబెట్టే ప్రమాదం ఉంది. పైగా ఆరోగ్యవంతుల్లో కూడా 15 శాతం దాకా బెల్బ్స్ కన్పించవచ్చు. కాబట్టి పీఎస్‌పీ బహూశా శ్వాస కుహరంలో అంతరాయాలు కలిగే భాగాల వల్ల వస్తుందన్న వాదన తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఆ భాగాలకు రాపిడి కలిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.<ref name="Tschopp"></ref><ref name="Noppen"></ref> దీంతోపాటు చిన్న వాయునాళాల్లో మంటకు, అడ్డంకులకు ధూమపానం కూడా చాలావరకు కారణమవుతుంది. తద్వారా వారికి పీఎస్‌పీ ఆస్కారం బాగా పెరుగుతుంది.<ref name="BTS"></ref> ఒకసారి గాలి శ్వాస కుహరంలోకి వెళ్లకుండా అడ్డంకులు కలిగాయంటే ఇక అది దానంతటదే అక్కడ పేరుకోవడం మొదలు పెడుతుంది. ఈ రిసర్‌ప్షన్ రేటును కేవిటీ పరిమాణంలో రోజుకు 1.25 నుంచి 2.2 శాతంగా అంచనా వేశారు. అంటే పూర్తిగా పాడైపోయిన ఊపిరితిత్తి కూడా ఆరు వారాల్లో పూర్తిగా పెరుగుతుంది.<ref name="BTS"></ref>
గాలిని శ్వాస కుహరపు స్థలంలోకి వెళ్లేందుకు వీలు కల్పించే స్థానం వాల్వ్ మాదిరిగా పని చేస్తుంది. ప్రతి శ్వాసతో మరింత గాలి లోనికి వెళ్తుంది. కాబట్టి అదిక తప్పించుకోలేదు. ఇది తీవ్రమైన హైపోక్సియాకు, ఫలితంగా బీపీ స్థాయిలో, స్పృహ స్థాయిలో తగ్గుదలకు, టెన్షన్ న్యూమోథొరాక్స్‌కు దారి తీస్తుంది. కుప్పకూలిన ఊపిరితిత్తులు ఎయోర్టా వంటి[[రక్తనాళాలు| రక్త నాళాలను]] అదిమేస్తాయంటూ గతంలో చెప్పుకున్న సిద్ధాంతం సరైంది కాకపోవచ్చు.<ref name="Leigh-Smith"></ref>
==రోగ నిర్ధారణ==
న్యూమోథొరాక్స్ లక్షణాలు మరీ సూక్ష్మంగా కూడా ఉండవచ్చు. ముఖ్యంగా పీఎస్‌పీ బాధితుల్లో. కాబట్టి మెడికల్ ఇమేజింగ్ ద్వారా దాన్ని నిర్దారించుకోవడం తప్పనిసరి.<ref name="BTS"></ref> దీనికి విరుద్ధంగా టెన్షన్ న్యూరోథొరాక్స్‌ను ఇమేజింగ్‌కు ముందే తగ్గించేయడం చాలా మంచిది. ముఖ్యంగా తీవ్రమైన హైపోక్సియా, చాలా తక్కు బీపీ, లేదా స్పృహ తగ్గిపోతుండటం వంటి లక్షణాలున్నప్పుడు. అయితే కొన్నిసార్లు న్యూమోథొరాక్స్ బాధిత భాగంపై అనుమానాలుంటే ఎక్స్‌రే వంటివి అవసరం కావచ్చు.<ref name="Leigh-Smith"></ref><ref name="Rosen2010"></ref>
===ఛాతి ఎక్స్‌రే===
[[File:Pneumothorax CXR.jpg|thumb|right|ఎడమవైపు న్యూమోథోరాక్స్ యొక్క ఛాతి ఎక్స్‌రే (చిత్రంలో కుడివైపు చూడవచ్చు)ఎడమ థోరాసిస్ కేవిటీ, ఫ్రీ ఎయిర్‌తో నిండి ఉన్న భాగంమెడియాస్టినమ్ వ్యతిరేక దిశలో మారిపోయి ఉంది.]]
సంప్రదాయకంగా ఎక్స్‌రే కిరణాల సాయంతో ఛాతికి తీసే సాధారణ రేడియోగ్రాఫ్ (వెనక నుంచి ప్రొజెక్స్ చేసే-పోస్టెరో ఆంటెరియర్ లేదా పీఏ)ను అత్యంత సరైన తొలి నిర్ధారణ పరీక్షగా భావిస్తారు. సాధారణంగా వీటిని ఇన్‌స్పిరేషన్ (శ్వాసను బిగబట్టి) చేస్తారు. ఎందుకంటే శ్వాసను వదిలిన తర్వాత తీసే ఛాతి ఎక్స్‌రేలో ఎలాంటి సమాచారమూ లభించదు.<ref name="BTS"></ref><ref name="Noppen"></ref> పీఏ ఎక్స్‌రేలో కూడా న్యూమోథొరాక్స్ ఆనవాళ్లేవీ కన్పించని పక్షంలో ఇంకా గట్టి అనుమానాలు మిగిలే ఉంటే లాటరల్ ఎక్స్ రేలు (కిరణాలను పక్క నుంచి పంపించడం ద్వారా) చేయవచ్చు. కానీ దీన్ని సాధారణంగా చేయరు.<ref name="BTS"></ref><ref name="Robinson"></ref> మీడియాస్టినమ్ (ఊపిరితిత్తుల మధ్యలో గుండె, పలు ఇతర అవయవాలుండే ప్రాంతం) ఒత్తిడి కారణంగా బాధిత ప్రాంతం నుంచి కాస్త పక్కకు తొలగడం కూడా మరీ అసాధరణమేమీ కాదు. ఇది టెన్షన్ న్యూమోథొరాక్స్‌కు మాత్రం సమానం కాదు. దాన్ని ప్రధానంగా లక్షణాలు, హైపోక్సియా, షాక్ వంటివాటి ఆధారంగా నిర్ధారిస్తారు.<ref name="Noppen"></ref>
న్యూమోథొరాక్స్ పరిమాణాన్ని, అంటే గాలి ఉండే ఊపిరితిత్తికి బదులుగా ఛాతిలో గాలి ప్రవేశించిన ఇతర స్థలం పరిమాణాన్ని ఛాతీ గోడ, ఊపిరితిత్తుల మధ్య దూరాన్ని లెక్కించడం ద్వారా దాదాపుగా కచ్చితంగా నిర్ధారించవచ్చు. చిన్నపాటి న్యూమోథొరాసెస్‌లను పలు రకాలుగా నయం చేస్తారు కాబట్టి ఇది చాలా అవసరమైన పరీక్ష. రెండు సెంటీమీటర్లు, లేదా అంతకంటే పెద్ద ఎయిర్ రిమ్ ఉందంటే, న్యూమోథొరాక్స్ శ్వాస కుమరంలో దాదాపుగా సగం స్థలాన్ని ఆక్రమించిందన్నమాటే.<ref name="BTS"></ref> హీలియం స్థాయికి అనుగుణంగా (రక్త నాళాలు, వాయు నాళాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లే చోట) వ్యాధి పరిమాణాన్ని కొలవాలని బ్రిటిష్ ప్రొఫెషనల్ గైడ్‌లైన్స్ సాధారణంగా చెబుతుంటాయి.<ref name="BTS"></ref> అమెరికా గైడ్‌లైన్స్ మాత్రం ఊపిరితిత్తుల పై భాగం (టిప్) వద్ద కొలవాలంటాయి.<ref name="Baumann">{{cite journal |author=Baumann MH, Strange C, Heffner JE, ''et al.'' |title=Management of spontaneous pneumothorax: an [[American College of Chest Physicians]] Delphi consensus statement |journal=Chest |volume=119 |issue=2 |pages=590–602 |year=2001 |month=February |pmid=11171742 |doi=10.1378/chest.119.2.590 |url=http://chestjournal.chestpubs.org/content/119/2/590.long}}</ref> న్యూమోథొరాక్స్ ఊపిరితిత్తుల పై భాగంలో ఉంటే రెండో పద్ధతిలో దాని పరిమాణం బహూశా వాస్తవాని కంటే ఎక్కువగా కన్పించవచ్చు. సాధారణంగా వ్యాధి ఆ ప్రాంతంలోనే కన్పిస్తుంటుంది.<ref name="BTS"></ref> ఇలా పలు పద్ధతుల మధ్య సమన్వయం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఉన్నవాటిలో న్యూమోథొరాక్స్‌ను వీలైనంత కచ్చితంగా అంచనా వేసేందుకు ఉపయోగపడే పద్ధతులు అవే.<ref name="BTS"></ref><ref name="Robinson"></ref> సీటీ స్కానింగ్ (దిగువన చూడండి) కూడా దాని పరిమాణాన్ని కచ్చితంగా నిర్ధారించేందుకు ఉపయోగపడుతుంది. కానీ ఈ విషయంలో దాన్ని సాధారణంగా వాడటాన్ని అంతగా ప్రోత్సహించరు.<ref name="Baumann"></ref>
అన్ని న్యూమోథొరాసెస్‌లూ ఒకలా ఉండవు. కొన్ని కేవలం ఛాతిలోని నిర్ధారిత ప్రాంతంలో కొంతమేర మాత్రమే గాలిని నింపుతాయి.<ref name="BTS"></ref> తక్కువ పరిమాణంలోని ద్రావకం (అది రక్తం, అంటే హిమొనియమోథొరాక్స్ కూడా కావచ్చు) కూడా ఛాతీ ఎక్స్‌రేలో కన్పించవచ్చు.<ref name="Noppen"></ref> కొన్ని కేసుల్లో కేవలం ప్రధానమైన అసాధారణత మాత్రమే కన్పిస్తుంది. ఇది సాధారణంగా ఛాతీ గోడ, డయాఫ్రంల మధ్య స్థలం గాలి ఉనికి వల్ల ఉబ్బి కన్పిస్తుంది.<ref name="Leigh-Smith"></ref>
===కంప్యుటెడ్ టోమోగ్రఫి===
కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీటీ, లేదా సీటీ స్కాన్) కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బాగా ఉపయోగపడుతుంది. కొన్ని ఊపిరితిత్తుల వ్యాధుల్లో, ముఖ్యంగా ఎంఫిసెమా వంటివాటిల్లో బులా (గాలితో నిండిన భారీ సాక్సులు) అసాధారణ ఊపిరితిత్తుల ప్రాంతాలు కూడా చూట్టానికి అచ్చం న్యూమోథొరాక్స్ మాదిరిగానే కన్పిస్తాయి. కానీ వాటి మద్య సిసలైన తేడాను, ఒకవేళ అది న్యూమోథొరాక్సే అని తేలితే అదున్న ప్రాంతం, పరిమాణం తదితరాలను కచ్చితంగా నిర్ధారించే దాకా తొందరపడి ఎలాంటి చికిత్సా మొదలు పెట్టకపోవడమే మంచిది.<ref name="BTS"></ref> గాయాలు ఏర్పడ్డప్పుడు సూటిగా ఫిల్మ్‌ను తీసుకోవడం వీలవకపోవచ్చు. అలాగే ఛాతీ రేడియోగ్రఫీ కూడా మూడో వంతు న్యూమోథొరాక్స్ కేసుల్లో తప్పిపోయే ఆస్కారముంది. సీటీ స్కాన్ మాత్రం సెన్సిటివ్‌గానే ఉంటుంది.<ref name="Rosen2010"></ref>
లోలోపల ఉన్న ఊపిరితిత్తుల లైసన్స్‌ను నిర్ధారించేందుకు సీటీని మరింతగా వాడతారు. సంభావిత ప్రైమరీ న్యూమోథొరాక్స్ కేసుల్లో బెల్బ్‌లు, లేదా సిస్టిక్ లైసన్స్ (చికిత్స కోసం, దిగువన చూడండి)లను గుర్తించేందుకు, సెకండరీ న్యూమోథొరాక్స్‌లో పైన పేర్కొన్న చాలా కారణాలను గుర్తించేందుకు వాడతారు.<ref name="BTS"></ref><ref name="Robinson"></ref>
===అల్ట్రాసౌండ్===
శారీరక గాయాల పాలైన వారికి, ఉదాహరణకు FAST ప్రొటోకాల్ వంటివాటి పాలైన వారికి గాయాల శాతాన్ని నిర్ధారించేందుకు ఆల్ట్రా సౌండ్‌ను సాధారణంగా వాడతారు.<ref name="Scalea">{{cite journal | author=Scalea T, Rodriguez A, Chiu W, Brenneman F, Fallon W, Kato K, McKenney M, Nerlich M, Ochsner M, Yoshii H | title=Focused Assessment with Sonography for Trauma (FAST): results from an international consensus conference | journal=Journal of Trauma | volume=46 | issue=3 | pages=466–72 | year=1999 | pmid=10088853}}</ref> ఛాతీకి తీవ్ర గాయాలైన సందర్భంలో న్యూమోథొరాక్స్ గుర్తింపుకు ఛాతీ ఎక్స్‌రేల కంటే ఆల్ట్రా సౌండే మెరుగ్గా పని చేస్తుంది.<ref>{{cite journal | author=Wilkerson RG, Stone MB | title=Sensitivity of bedside ultrasound and supine anteroposterior chest radiographs for the identification of pneumothorax after blunt trauma | journal=Acad. Emerg. Med. | year=2010 | month=January | pages=11–17 | volume=17 | issue=1 | pmid=20078434 | doi=10.1111/j.1553-2712.2009.00628.x}}</ref>
==చికిత్స==
[[File:Chest Drainage Device.PNG|thumb|right|ఎడమ థోరాసిస్ కేవిటలో ఛాతి ట్యూబ్‌కలిసి ఉన్న వ్యక్తి యొక్క స్కీమాటిక్ డ్రాయింగ్‌వాటర్ సీల్‌కు కనెక్ట్ చేయబడి ఉంది.]]
న్యూమోథొరాక్స్‌కు చికిత్స చాలా కారకాలపై ఆధారపడుతుంది. త్వరితంగా గుర్తించడం నుంచి మొదలు పెట్టి, తక్షణం సిరంజి ద్వారా డీ కంప్రెస్ చేయడం, లేదా ఛాతీ ట్యూబ్‌ను చొప్పించడం వంటి వాటిపై ఆధారపడుతుంది. చికిత్సను వ్యాధి లక్షణాల తీవ్రత, తీవ్రతర జబ్బు వంటి సూచీలు, ముందు నుంచీ ఉన్న ఊపిరితిత్తుల వ్యాధి, ఛాతీ ఎక్స్‌రేల్లో తేలిన మేరకు న్యూమోథొరాక్స్ సంభావిత పరిమాణం, మరికొన్ని కేసుల్లో బాధితుని వ్యక్తిగత ఇష్టాయిష్టాల వంటి కారణాలు కూడా ఇందులతో ఇమిడి ఉంటాయి. స్పాన్టేనియస్ న్యూమోథొరాక్స్‌లో దాన్ని పూర్తిస్థాయిలో నయం చేసేదాకా విమాన ప్రమాణాలు చేయొద్దని చెబుతారు.<ref name="BTS"></ref>
ట్రామాటిక్ న్యూమోథొరాక్స్‌లో సాధారణంగా ఛాతీ ట్యూబులను చొప్పిస్తారు (ఇయాట్రోజెనిక్ కాకపోతే మాత్రమే, దిగువన చూడండి). ట్యూబు చికిత్సతో నిమిత్తం లేకుండా సాధారణ చికిత్సతోనే నయం కాగల తక్కువ స్థాయి న్యూమోథొరాక్స్ ఉప గ్రూపులేమైనా ఉన్నాయా అన్నది ఇంకా అస్పష్టమే. యాంత్రిక కృత్రిమ శ్వాస అవసరమైతే ఛాతీ ట్యూబును చొప్పించడం తప్పనిసరి. ఎందుకంటే అది లేకపోతే టెన్షన్ న్యూమోథొరాక్స్ భయం పెరుగుతుంది.<ref name="Noppen"></ref><ref name="Keel">{{cite journal |author=Keel M, Meier C |title=Chest injuries - what is new? |journal=Curr. Opin. Crit. Care |volume=13 |issue=6 |pages=674–9 |year=2007 |month=December |pmid=17975389 |doi=10.1097/MCC.0b013e3282f1fe71}}</ref>
టెన్షన్ న్యూమోథొరాక్స్‌కు సాధారణంగా అర్జెంట్ నీడిల్ డీ కంప్రెషన్ ద్వారా చికిత్స చేస్తారు. రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లే లోగా ఇది అవసరం కావచ్చు. దీన్ని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, లేదా శిక్షితుడైన ప్రొఫెషనల్ ఇందుకు సరిపోతాడు. నీడిల్, లేదా కానులాను టెస్ట్ ట్యూబ్‌ను చొప్పించే దాకా అలాగే ఉంచుతారు.<ref name="Leigh-Smith"></ref><ref name="Lee">{{cite journal |author=Lee C, Revell M, Porter K, Steyn R |title=The prehospital management of chest injuries: a consensus statement |journal=Emerg. Med. J. |volume=24 |issue=3 |pages=220–4 |year=2007 |month=March |pmid=17351237 |pmc=2660039 |doi=10.1136/emj.2006.043687}}</ref> తెరిచి ఉన్న ఛాతీ గాయాలేమైనా ఉంటే వాటిని తక్షణం మూసేయాల్సి ఉంటుంది. లేదంటే అది టెన్షన్ న్యూమోథొరాక్స్‌కు సంభావ్యతను మరీ ఎక్కువ చేస్తుంది. అలాంటి గాయాలకు ఆషెర్మన్ సీల్‌గా పిలిచే డ్రెసింగ్ చేయడం అభిలషణీయం. ఆషెర్మన్ సీల్ ప్రత్యేకంగా తయారు చేసిన పరికరం. అది ఛాతీ గోడకు తగిలి ఉంటుంది. అందులోని వాల్వ్ వంటి ఏర్పాటు గాలి వెలుపలికి వెళ్లేందుకే తప్ప లోనికి వచ్చేందుకు తావివ్వదు.<ref name="Lee"></ref>
===సంప్రదాయక===
చిన్న సంప్రదాయ న్యూమోథొరాసెస్‌లకు అన్నిసార్లూ చికిత్స అవసరం కాకపోవచ్చు. ఎందుకంటే అవి శ్వాస వైఫల్యానికి, టెన్షన్ న్యూమోథొరాక్స్‌కు దారి తీయకపోవచ్చు. పైగా సాధారణంగా అవి అప్పటికప్పుడే తగ్గిపోతుంటాయి. న్యూమోథొరాక్స్ సంభావిత పరిమాణం చిన్నగా (ఉదాహరణకు 50 శాతం కంటే తక్కువగా) ఉంటే, [[ఆయాసం|శ్వాసలేమి]] లేకపోతే, ముందు నుంచీ ఊపిరితిత్తుల వ్యాధులేవీ లేకపోతే ఇదే అభిలషణీయమైన మార్గం.<ref name="Robinson"></ref><ref name="Baumann"></ref> పెద్ద పీఎస్‌పీలను కూడా లక్షణాలు కొద్దిగానే ఉంటే సంప్రదాయిక పద్ధతుల ద్వారానే నయం చేయడం మంచిది.<ref name="BTS"></ref> ఆస్పత్రుల్లో చేరడం కూడా చాలాసార్లు అవసరం కాకపోవచ్చు. కానీ లక్షణాలు మరీ విషమిస్తాయని తెలిసి, ఆస్పత్రిలో చేరాలని డాక్టర్లు స్పష్టంగా చెబితే మాత్రం అలా చేయడమే మేలు. ఇతర పరిస్థితుల్లో ఔట్ పేషెంట్‌గానే తర్వాతి పరీక్షలు చేయించుకోవచ్చు. అలాంటప్పుడు చికిత్సలో పురోగతి ఉందని తెలుసుకునేందుకు ఎక్స్‌రేలను పదేపదే చేయవచ్చు. దాంతోపాటు శస్త్రచికిత్సకు దారితీసేలా వ్యాధి తిరగబెట్టడాన్ని నిరోధించేందుకు సలహాలు కూడా తీసుకోవచ్చు (దిగువన చూడండి).<ref name="BTS"></ref> సెకండరీ న్యూమోథొరాసెస్‌లను మాత్రం దాని పరిమాణం చాలా చిన్నగా (సెంటీమీటర్, అంతకంటే తక్కువగా) ఉంటే మాత్రమే సంప్రదాయికంగా నయం చేస్తారు. సాధారణంగా ఈ కేసుల్లో ఆస్పత్రిలో చేరడాన్నే సూచిస్తారు. హెచ్చు మోతాదులో ఇచ్చే ఆక్సిజన్ కూడా రిసర్‌ప్షన్‌ను ఎక్కువ చేయవచ్చు.<ref name="BTS"></ref>
===ఆస్పిరేషన్===
లార్జ్ ప్రైమరీ స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్ (50 శాతం కంటే ఎక్కువ), లేదా పీఎస్‌పీకి శ్వాస లేకపోవడం వంటివి తోడైన సందర్భాల్లో ప్రొఫెషనల్ గైడ్‌లైన్లను సిఫార్సు చేశారు. లోనికి తీసుకునే శ్వాస పరిమాణాన్ని తగ్గిస్తే ఛాతీ ట్యూబ్ వేయడంతో సమానంగా పని చేస్తుంది. లోకల్ అనెస్తీషియా ఇచ్చి, త్రీ వే ట్యాప్ ద్వారా నీడిల్‌ను కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా (పెద్దల్లో) 2.5 లీటర్ల దాకా గాలిని తొలగిస్తారు. ఒకవేళ న్యూమోథొరాక్స్ పరిమాణం బాగా తగ్గిందని తర్వాతి ఎక్స్‌రేల్లో తేలితే, తర్వాతి చికిత్సను సంప్రదాయికంగా చేయవచ్చు. ఈ పద్ధతి 50 శాతానికి పైగా కేసుల్లో పని చేస్తుంది.<ref name="Tschopp"></ref><ref name="BTS"></ref><ref name="Robinson"></ref> పీఎస్‌పీల్లో ఫస్ట్ లైన్ ఆస్పిరేషన్ ద్వారా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరమున్న రోగుల సంఖ్య తగ్గిపోతుంది. ట్యూబ్ డ్రైనేజీ వంటివాటిలో ఇతరత్రా ఇబ్బందుల రిస్కును కూడా తగ్గిస్తుంది.<ref>{{cite journal |author=Wakai A, O'Sullivan RG, McCabe G |title=Simple aspiration versus intercostal tube drainage for primary spontaneous pneumothorax in adults |journal=Cochrane Database Syst Rev |volume= |issue=1 |pages=CD004479 |year=2007 |pmid=17253510 |doi=10.1002/14651858.CD004479.pub2 |url=http://onlinelibrary.wiley.com/o/cochrane/clsysrev/articles/CD004479/frame.html}}</ref>
సెకండరీ న్యూమోథొరాక్స్ మామూలు పరిమాణంలో (1 నుంచి 2 సెంటీమీటర్ల ఎయిర్ రిమ్) ఉంటే, శ్వాసలేమి వంటివేవీ లేకపోతే ఆస్పిరేషన్‌ను గురించి ఆలోచించవచ్చు.<ref name="BTS"></ref> పెద్ద న్యూమోథొరాక్స్‌లన్నింటినీ (పీఎస్‌పీ వల్ల వచ్చిన వాటితో పాటుగా) ఛాతీ ట్యూబ్‌తో నయం చేయాలని చెబుతారు.<ref name="Baumann"></ref> వైద్య పద్ధతుల (ఉయాట్రోజెనిక్) వల్ల తలెత్తే మామూలు పరిమాణంలోని ట్రామాటిక్ న్యూమోథొరాక్స్‌ను ఆస్పిరేషన్‌తో తగ్గించవచ్చు.<ref name="Noppen"></ref>
===ఛాతి ట్యూబ్===
ఛాతి ట్యూబ్ (లేదా ఇంటర్‌కోస్టల్ డ్రెయిన్) న్యూమోథొరాక్స్‌కు కచ్చితమైన ఫలితమిచ్చే ప్రాథమిక చికిత్స. దీన్ని ఆక్సిలియా (చంక) కింది భాగంలో చొప్పిస్తారు. దాన్నే సేఫ్ ట్రయాంగిల్‌గా పిలుస్తారు. తద్వారా లోపలి అవయవాలకు గాయమయ్యే అవకాశాలను తగ్గించేందుకు వీలవుతుంది. ఈ పద్ధతిలో ముచ్చిక దాకా అడ్డంగా ఒక గాటు పెడతారు. ఛాతీ గోడకు చెందిన రెండు కండరాలు (లాటిసిమస్ డోర్సి, పెక్టోరలిస్ మేజర్) ఉపయోగపడతాయి. లోకల్ అనస్తీషియా కూడా ఇస్తారు. ట్యూబుల్లో రెండు రకాలను వాడవచ్చు. స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్‌లో స్మాల్ బోర్ (14 FG, 4.7 మిల్లీమీలర్ల వ్యాసార్ధం కంటే కూడా చిన్నది) ట్యూబ్‌లను స్లెడింగర్ పద్ధతి ద్వారా చొప్పిస్తారు. ఇక పెద్ద ట్యూబుల వల్ల పెద్దగా ఉపయోగముండదు.<ref name="BTS"></ref> ట్రామాటిక్ న్యూమోథొరాక్స్‌లో పెద్ద ట్యూబులను (28 ఎఫ్‌జీ, 9.3 ఎంఎం) వాడతారు.<ref name="Lee"></ref>
నీడిల్ ఆస్పిరేసన్‌కు స్పందించని పీఎస్‌పీ కేసుల్లో ఛాతి ట్యూబులు అవసరమవుతాయి. ఒకవేళ పెద్ద (50 శాతం కంటే పెద్ద) ఎస్‌ఎస్‌పీ ఉండే టెన్షన్ న్యూమోథొరాక్స్‌ల్లో కూడా అంతే. వాటిని వన్ వే వాల్వ్ సిస్టమ్ ద్వారా కలుపుతారు. వాటిద్వారా గాలి బయటికి వెళ్తుందే తప్ప లోనికి రాదు. ఇందుకు నీటి ముద్రతో కూడిన ఒక నీటి బాటిల్, లేదా హెయిమ్లిచ్ వాల్వ్ కావాల్సి ఉంటుంది. వాటిని సాధారణంగా ప్రతికూల ఒత్తిడి సర్‌క్యూట్‌కు కలుపుతారు. తద్వారా ఊపిరితిత్తి తిరిగి విస్తరిస్తుంది. కాకపోతే దాంతోపాటే పల్మనరీ ఎడెమా (రీ ఎక్స్‌పాన్షన్ పల్మనరీ ఎడెమా) రిస్కు కూడా పెరుగుతుంది. ఈ ట్యూబును సంబంధిత స్థలంలో కొంతకాలం పాటు గాలి లేదని తేలేదాకా అలాగే ఉంచుతారు. తర్వాత ఊపిరితిత్తుల పరిమాణం పెంచేందుకు ఎక్స్‌రేలను వాడతారు.<ref name="BTS"></ref><ref name="Robinson"></ref><ref name="Baumann"></ref>
2 నుంచి 4 రోజుల తర్వాత ఇంకా గాలి లీకేజీ అవుతున్న సూచనలుంటే, పలు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతికూల ఒత్తిడి సక్షన్ (10 నుంచి 20 సెంటీమీర్ల H<sub>2</sub>O వద్ద తక్కువ స్థాయి ఒత్తిళ్లు)ను హెచ్చు స్థాయి ప్రవాహ రేటుతో ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా పీఎస్‌పీ కేసుల్లో. ఇది లీకేజీని నయం చేసే ప్రక్రియను పెంచుతుందని భావిస్తారు. ఎస్‌ఎస్‌పీలో థొరాటిక్ సర్జన్ సాయాన్ని ముందుగానే తీసుకోవాల్సి రావచ్చు.<ref name="BTS"></ref> ఇక శస్త్రచికిత్స పద్ధతులను కూడా మున్ముందు ఎడిసోడ్లలో దిగువన చర్చించిన మాదిరిగా అనుసరించాల్సి ఉంటుంది.
==నివారణ==
మెడికల్, సర్జికల్ చికిత్సలు రెండూ న్యూమోథొరాక్స్ తిరిగి వచ్చే ప్రమాదాన్ని తగ్గించేందుకు అందుబాటులో ఉన్నాయి.<ref name="Bau04"></ref> ప్లెరోడెసిస్‌ను సాధించడమే వీటి ప్రధాన లక్ష్యం. ఊపిరితిత్తులు, ఛాతీ గోడ మధ్య సమన్వయం సాధించాల్సి ఉంటుంది. అయితే అత్యంత ప్రభావవంతమైన చికిత్సా విధానానికి సంబంధించి కొన్ని అంశాల్లో ఇప్పటికీ అయోమయమే రాజ్యమేలుతోంది. ఇక దీనికి యూరప్, అమెరికాల్లో అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల్లో కూడా బాగా తేడాలున్నాయి.<ref name="Tschopp"></ref> పైగా అన్ని న్యూమోథొరాక్స్‌లకూ ఇవి అవసరం కాకపోవచ్చు. ఈ విషయంలో నిర్ణయం చాలావరకు వ్యాధి తిరగబెట్టే సంభావ్యతపైనే ఆధారపడి ఉంటుంది. అయితే చాలాసార్లు రెండో న్యూమోథొరాక్స్ తర్వాత మాత్రం ఈ చికిత్సా పద్ధతులను సిఫార్సు చేస్తారు.<ref name="Bau04">{{cite journal |author=Baumann MH, Noppen M |title=Pneumothorax |journal=Respirology |volume=9 |issue=2 |pages=157–64 |year=2004 |month=June |pmid=15182264 |doi=10.1111/j.1440-1843.2004.00577.x}}</ref> డైవింగ్ చేసేవారికి మాత్రం దీన్నుంచి మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే శాశ్వత చికిత్స తీసుకుంటే తప్ప డైవింగ్‌ను అరక్షితంగా పరిగణిస్తారు. ఈ విషయంలో రెండు ఊపిరితిత్తులకూ ప్లూరెక్టమీ చేయడాన్ని ప్రొఫెషనల్ గైడ్‌లైన్స్ సిఫార్సు చేస్తాయి (దిగువన చూడండి). ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు, సీటీ స్కాన్ వంటివాటిలో కూడా అంతా సాధారణంగా ఉందన్న ఫలితం వచ్చాకే డైవింగ్ మొదలు పెట్టాల్సి ఉంటుంది.<ref name="BTS"></ref><ref name="Baumann"></ref>
అత్యుత్తమ ఫలితాలను, అంటే 1 శాతం కంటే తక్కుత తిరగబెట్టే సంభావ్యతను థోరాకోటమీ (శస్త్రచికిత్స ద్వారా చాతీని తెరవడం), తద్వారా గాలి లీకేజీ ఉంటే గుర్తించి, స్టాప్లాంగ్ బెల్బుల ద్వారా అరికట్టాలి. తర్వాత (శ్వాస వాహికలను తెరవడం ద్వారా) శ్వాస వాహిక బయటి పొరలకు ప్లూరెక్టమీ చేయాలి. తర్వాత లోపలి పొరలకు ప్లూరల్ అబ్రేషన్ (స్క్రాపింగ్ ఆఫ్ ద ప్లూరా) చేయాలి. నయమయే ప్రక్రియలో ఊపిరితిత్తులు ఛాతీ గోడలకు సజావుగా ఆనుకుంటుంది. తద్వారా ప్లూరల్ స్పేస్‌ను మూసేస్తుంది. థోరాకొటమీని ఎప్పుడూ జనరల్ అనస్తీషియా ఇచ్చి చేస్తారు.<ref name="Tschopp"></ref><ref name="BTS"></ref>
ఇంతకంటే కాస్త తక్కువ ఇబ్బందితో అయే విధానం థోరాకొస్కొపీ. ఇది సాధారణంగా వీడియో ఆధారిత థోరాకోస్కొపిక్ సర్జరీ అనే పద్ధతిలో జరుగుతుంది. ఇందుకు జనరల్ అనెస్తెటిక్ కూడా అవసరం అవుతుంది. కానీ ఊపిరితిత్తులను కొన్ని పక్కటెముకల మధ్య చిన్న చిన్న కోతలు పెట్టడం ద్వారా ఊపిరితిత్తుల వద్దకు చేరతారు. వీఏటీఎస్ ఆధారిత ప్లూరల్ అబ్రేషన్ ఫలితం ఏమిటంటే థోరాకొటమీ కంటే కాస్త మెరుగైన ఫలితాలను చర్మంపై తక్కువ మచ్చల ద్వారానే ఇది సాధిస్తుంది. వీఏటీఎస్‌ను కెమికల్ ప్లూరోడెసిస్‌ను సాధించేందుకు కూడా వాడవచ్చు. ఇందులో టాల్క్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇది స్కారింగ్ రియాక్షన్‌ను యాక్టివేట్ చేస్తుంది. అది ఊపిరితిత్తులను ఛాతీ గోడలకు ఆనుకునేలా చేస్తుంది.<ref name="Tschopp"></ref><ref name="BTS"></ref>
అయితే శస్త్రచికిత్సకు అందరూ సిద్ధంగా ఉండకపోవచ్చు. ఛాతీ ట్యూబ్ అప్పటికే ఉంటే అదే ట్యూబ్ ద్వారా ప్లూరోడెసిస్‌ను సాధించేందుకు పలు ఏజెంట్లను పంపవచ్చు. ముఖ్యంగా టాల్క్, యాంటీబయోటిక్ టెట్రాసిలైన్‌ను. అయితే దీని ఫలితాలు శస్త్రచికిత్స కంటే కాస్త తక్కువ మెరుగ్గానే ఉంటాయి.<ref name="BTS"></ref><ref name="Tschopp"></ref> టాల్క్ ప్లూరోడెసిస్ యువతీ యువకుల్లో కొన్ని దీర్ఘకాలిక పరిణామాలను కూడా కలిగిస్తుంది.<ref name="Tschopp"></ref>
==సాంక్రమిక రోగ విజ్ఞానం==
స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్ స్త్రీల కంటే పురుషుల్లోనే సర్వసాధారణం. పీఎస్‌పీ ఏటా వచ్చే రేటు ప్రతి లక్ష మంది పురుషుల్లో 18 నుంచి 28 దాకా ఉంటుంది. స్త్రీల్లో మాత్రం 1.2 నుంచి 6 మాత్రమే. సెకండరీ స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్ మాత్రం అంత సాధారణం కాదు. మగవాళ్లలో 6.3 శాతం, ఆడవాళ్లలో 2.0 శాతం ఉంటుంది. ఇది తిరగబెట్టే రిస్కు ముందు నుంచీ ఊపిరితిత్తుల వ్యాధులున్నాయా అన్నదానిపై ఆధారపడుతుంది. ఒకసారి న్యూరోథొమాక్స్ తిరగబెడితే మరిన్నిసార్లు అది దాడి చేసే ప్రమాదం ఎక్కువవుతుంది.<ref name="Tschopp"></ref> పొగ తాగేవారిలో ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. తొలి స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్ వచ్చిన తర్వాత అది వచ్చే ప్రమాదం పొగ తాగని వారితో పోలిస్తే మహిళల్లో దాదాపు తొమ్మిది రెట్లు, పురుషుల్లో 22 రెట్లు పెరుగుతుంది.<ref name="pmid3677805">{{cite journal| doi=10.1378/chest.92.6.1009| author=Bense L, Eklund G, Wiman LG| title=Smoking and the increased risk of contracting spontaneous pneumothorax. | journal=Chest | year= 1987 | volume= 92 | issue= 6 | pages= 1009–12 | pmid=3677805 }}</ref> పిల్లల్లో ఈ రేటు ఎలా ఉంటుందో పెద్దగా అధ్యయనం జరగలేదు. కానీ వారిలో పెద్దల కంటే తక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇది తరచూ ముందు నుంచీ ఉన్న ఊపిరితిత్తుల వ్యాధులను బట్టి ఉంటుంది.<ref name="Robinson"></ref>
న్యూమోథొరాక్స్ వల్ల మరణం సంభవించడం చాలా అరుదు (టెన్షన్ న్యూమోథొరాక్స్ మినహా). బ్రిటిష్ గణాంకాల మేరకు మరణ శాతం ఏటా దాదాపు 12.6 లక్షల మంది పురుషులు, 6.2 లక్షల మంది స్త్రీలుగా ఉంది.<ref name="BTS"></ref> ఇక న్యూమోథొరాక్స్ తిరగబెట్టిన వారిలో, వృద్ధుల్లో మరణ శాతం ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.<ref name="Tschopp"></ref>
==చరిత్ర==
జీన్ మార్క్ గాస్పర్డ్ ఇటార్డ్ అనే రేనే లానెక్ విద్యార్థి 1803లో తొలిసారిగి న్యూమోథొరాక్స్‌ను గుర్తించాడు. దాని పూర్తిస్థాయి క్లినికల్ పిక్చర్‌ను కూడా ఆయనే 1819లో గుర్తించాడు.<ref>{{cite book | author=Laennec RTH | title=Traité de l'auscultation médiate et des maladies des poumons et du coeur - part II | language=French | location=Paris | year=1819}}</ref> అప్పట్లో చాలా సాధారణంగా అందరిలోనూ కన్పించే ట్యూబర్‌క్యులోసిస్ వల్ల కాకుండా వ్యాధి సోకిన కొన్ని కేసులను అతను గుర్తించాడు. తర్వాత ప్రైమరీ స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్ అనే భావనను రెండోసారి డెన్మార్క్‌కు చెందిన వైద్యుడు హన్స్ జాయెర్‌గార్డ్ 1932లో ప్రవేశపెట్టాడు.<ref name="BTS"></ref><ref>{{cite journal | author=Kjaergard H | title=Spontaneous pneumothorax in the apparently healthy | journal=Acta Med. Scand. | year=1932 | volume=43 Suppl | pages=1–159 | doi=10.1111/j.0954-6820.1932.tb05982.x}}</ref>
యాంటీ ట్యూబర్‌క్యులోసిస్ మందులు వచ్చే ముందు ఇయాట్రోజెనిక్ న్యూమోథొరాసెస్‌లను టీబీ రోగులకు కావాలనే ఇచ్చేవారు. ఒక లోబ్‌ను కానీ, కేవిటేటింగ్ లేజన్ పరిసరాల్లో మొత్తం ఊపిరితిత్తులకు మొత్తంగా కుప్పకూల్చేందుకు ఇలా చేసేవారు. దీన్ని ''రెస్టింగ్ ద లంగ్''గా పిలిచేవారు. ఇటలీకి చెందిన సర్జన్ కార్లో ఫోర్లానినీ 1888లో దీన్ని ప్రవేశపెట్టాడు. తర్వాత అమెరికాకు చెందిన శస్త్రచికిత్సకుడు జాన్ బెంజమిన్ మర్ఫీ 20వ శతాబ్ది తలినాళ్లలో బాగా వ్యాప్తిలోకి తెచ్చాడు. ఇదే పద్ధతిని ఆయన స్వతంత్రంగా కనిపెట్టాడు. మర్ఫీ అప్పట్లో అప్పుడప్పుడే కనిపెట్టిన ఎక్స్‌రే పరిజ్ఞానాన్ని వాడటం ద్వారా సరైన పరిమాణంలో న్యూమోథొరాసెస్‌లను పుట్టించేవాడు.<ref>{{cite journal |author=Herzog H |title=History of tuberculosis |journal=Respiration |volume=65 |issue=1 |pages=5–15 |year=1998 |pmid=9523361 |doi=10.1159/000029220 |url=http://content.karger.com/ProdukteDB/produkte.asp?Aktion=ShowPDF&ArtikelNr=000029220&Ausgabe=226544&ProduktNr=224278&filename=000029220.pdf | format=PDF}}</ref>
==సూచనలు==
{{Reflist|2}}
[[Category:ఛాతీ ప్రమాదాలు]]
[[Category:వైద్య అత్యవసరాలు]]
[[వర్గం:ఊపిరితిత్తుల వ్యాధులు]]
[[వర్గం:ఆంగ్ల పదజాలము]]
[[en:Pneumothorax]]
[[hi:वातिलवक्ष]]
[[ar:استرواح الصدر]]
[[az:Pnevmotoraks]]
[[bg:Пневмоторакс]]
[[ca:Pneumotòrax]]
[[cs:Pneumotorax]]
[[de:Pneumothorax]]
[[es:Neumotórax]]
[[eu:Pneumotorax]]
[[fa:پنوموتوراکس]]
[[fi:Ilmarinta]]
[[fr:Pneumothorax]]
[[he:חזה אוויר]]
[[id:Pneumothoraks]]
[[it:Pneumotorace]]
[[ja:気胸]]
[[ko:기흉]]
[[nl:Pneumothorax]]
[[no:Pneumotoraks]]
[[pl:Odma opłucnowa]]
[[ps:نيوموتوراکس]]
[[pt:Pneumotórax]]
[[ro:Pneumotorax]]
[[ru:Пневмоторакс]]
[[sh:Pneumotoraks]]
[[simple:Pneumothorax]]
[[sr:Pneumotoraks]]
[[sv:Lungkollaps]]
[[th:โพรงเยื่อหุ้มปอดมีอากาศ]]
[[tl:Pneumothorax]]
[[tr:Pnömotoraks]]
[[uk:Пневмоторакс]]
[[zh:氣胸]]All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?oldid=737127.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|