Revision 738019 of "సర్వశిక్షా అభియాన్" on tewiki[[Image:Karadiaschool.jpg|thumb|right|250px|[[మధ్యప్రదేశ్]] లోని ఒక గ్రామంలో [[ప్రాథమిక పాఠశాల]].]]
'''సర్వశిక్షా అభియాన్''' : '''అందరికీ విద్య''' ఓ ''ఉద్యమం'', ఇంకోవిధంగా చెప్పాలంటే''ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్కరికీ విద్య నేర్పించాలి''. ఈ కార్యక్రమం భారతప్రభుత్వ కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశ్యం ''విద్య యొక్క సార్వత్రీకరణ''. [[భారత రాజ్యాంగం]] 86వ సవరణల ప్రకారం, 6-14 వయస్సు గల బాలబాలికలకు విద్య ఉచిత మరియు ఖచ్చితమైన విషయంగా చేర్చారు. దీనినొక [[భారతదేశంలో ప్రాథమిక హక్కులు|ప్రాధమిక హక్కు]] గా అభివర్ణించి [[ప్రాథమిక విద్య]] ను 2010 వరకు సార్వత్రీకరణ చేయుటకు ఉద్దేశింపబడినది.
ఈ కార్యక్రమాను సారం, భారతదేశంలో అవసరమైన చోటల్లా పాఠశాలలు స్థాపించడం, పిల్లలందరినీ పాఠశాలలలో చేర్పించడం, విద్యను సార్వత్రీకరించడం. నిరక్షరాస్యతను పారద్రోలి, అక్షరాస్యతను సాధించడం. పాఠశాలైన, ప్రాథమిక పాఠశాలలను ప్రతి కిలోమీటరునకూ ఒక పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్లకూ ఓ ప్రాథమికోన్నత పాఠశాల, ప్రతి ఐదు కిలోమీటర్లకూ ఒక ఉన్నత పాఠశాల ఉండేటట్లు చూసి, విద్యను వ్యాపింపజేయడం ముఖ్య ఉద్దేశ్యం. పాఠశాలల నిర్వహణకు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని తగురీతిలో వుంచి విద్యాస్థాయిన్ పెంపొందించడం. పాఠశాలలలో ప్రయోగశాలలను ఏర్పాటుచేయడం, కంప్యూటర్లను ఏర్పాటుచేయడం కూడా ముఖ్య ఉద్దేశ్యాలలోనివి.
ఈ కార్యక్రమానికి కేంద్రప్రభుత్వం 2005-06 లో రూ. 7156 కోట్లను కేటాయించగా, సత్ఫలితాలను చూసి, 2006-07 లో ఈ బడ్జెట్ ను 10,004 కోట్లరూపాయలకు పెంచారు. 5,00,000 అదనపు గదులను నిర్మించడం, 1,50,000 అదనపు ఉపాధ్యాయులను నియమించడం కూడా ఉద్దేశ్యాలే. 2006-07 లో రూ 8746 కోట్ల రూపాయలను ప్రారంభ శిక్షా కోష్ కు కేటాయించి, మిగతా రొక్కాన్ని [[విద్యా సెస్సు]] గా వసూళ్ళద్వారా సమకూర్చడానికి నిర్ణయం జరిగినది.
==వెనుకటి చరిత్ర==
'''ప్రాథమిక విద్యను సార్వతీకరణ చేయుటకు, రాజ్యాంగ, న్యాయ మరియు జాతీయబద్ధ ప్రకటనలు'''
# రాజ్యాంగ నిర్ణయాలు [[1950]] - "పిల్లలు 14 సంవత్సరాలు నిండేవరకు, వారికి పదేండ్లవరకు ఉచిత మరియు కంపల్సరీ విద్యనందించడం కొరకు రాష్ట్రప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలి.
# [[జాతీయ విద్యా విధానం]], [[1986]] - "21వ శతాబ్దంలో ప్రవేశించకమునుపు, 14 యేండ్లవరకు ఉచిత మరియు కంపల్సరీ మరియు క్వాలిటీ విద్యనందించవలెను.
# ఉన్నికృష్ణన్ తీర్పు, [[1993]] - "భారతదేశంలోని పిల్లలు/పౌరులు, విద్యాహక్కును, తమ వయస్సు 14 యేండ్లు నిండేంత వరకు కలిగివున్నారు."
==ఉద్దేశ్యాలు==
* పిల్లలందరూ పాఠశాలలో, [[:en:Education Guarantee Centre|ఎడ్యుకేషన్ గ్యారంటీ సెంటర్]] లేదా [[ప్రత్యామ్నాయ పాఠశాల]] [[2003]] లో.
* 2007 వరకూ, అందరు పిల్లలూ ఐదేండ్లు ప్రాథమిక విద్య పూర్తిచేయాలి.
* 2010 వరకూ పిల్లలందరూ తమ ఎనిమిదేండ్ల విద్యను పూర్తిచేయాలి.
* జీవిత లక్ష్యాలను సాధించడం కొరకు కావలసిన నాణ్యమైన విద్యను, ప్రాథమిక విద్యయందు సాధించుటకు కృషి చేయుట.
* అన్ని సామాజిక తరగతులకు, లింగభేదాలు లేకుండా ఏకీకృతం చేసి, 2010 వరకూ ప్రాథమిక విద్యను సాధించుట.
* 2010 వరకు విద్యను సార్వత్రీకరణ చేయుట.
==భారతదేశంలో విద్య కొరకు బడ్జెట్==
{{భారత్‌లో విద్యకొరకు బడ్జెట్ కేటాయింపు}}
==ఆంధ్రప్రదేశ్ లో సర్వ శిక్షా అభియాన్==
2010-11 నివేదిక ప్రకారం,<ref>[http://rvm.ap.nic.in/Planning/annual_report_2010-11.pdf ఆంధ్రప్రదేశ్ లో సర్వశిక్షా అభియాన్ 2010-11 నివేదిక (ఇంగ్లీషు)]</ref> పనితీరు ఈ విధంగా వుంది.
* 73324 పాఠశాలలకు నిర్వహణ ఖర్చులను పంపిణీ చేశారు.
* 25 కొత్త పాఠశాలలను తెరవటం జరిగింది.
* 37,429 ఉపాధ్యాయులకు జీతాల పంపిణీ
* 2, 13,386 బడిబయటపిల్లలను బడిలో చేర్చారు.
* 6,973 పాఠశాల సంకీర్ణాలకు తోడ్పాటు నందించారు.
* 1,137 మండల సంపన్మూల కేంద్రాలకు తోడ్పాటు
* 84,621 పాఠశాలలకు ధనం మంజూరు.
* 2, 84,862 ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
* 5,765 ఆదర్శ క్లస్టర్ పాఠశాలలను ప్రారంభించారు.
* 725 కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయాలను ప్రారంభించారు.
* 7, 36,346 సముదాయ సభ్యులకు శిక్షణ ఇచ్చారు.
* 2,29,856 ఉపాధ్యాయులకు గ్రాంటులిచ్చారు.
* మూడు నివాస పాఠశాలలు ప్రారంభించారు.
* 52, 66,837 పిల్లలకు సమవస్త్రాలను పంపిణిచేశారు.
దీనికి 1107 కోట్ల రూపాయలు ఖర్చయినవి.
2010కి 100 శాతం పిల్లలు పాఠశాలలో వుండాల్సిన లక్ష్యానికి 95.81 శాతం ఆవాసాలకు 1 కిమీ దూరంలో 57184 ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో వున్నాయి. మిగతా ఆవాసాలలో చాలినంత పిల్లలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ సృజనాత్మక విద్యా పద్ధతులద్వారా 100 శాతం లక్ష్యం అందుకున్నారు.
నాణ్యత పెంచడానికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా విద్యార్థుల శిక్షణ మెరుగైంది.
అయితే అసర్ సర్వే ప్రకారం తెలిసిన ఫలితాలకు పొంతన వున్నట్లు లేదు. ప్రాథమిక స్థాయిలో దాదాపు 60 శాతం పిల్లలు వారితరగతికి తగిన నైపుణ్యం కలిగివున్నారని సర్వ శిక్ష అభియాన్ నివేదిక చెప్తుంటే [[ప్రాథమిక విద్య#ఫలితాలు/ నాణ్యత ప్రమాణాలు |అసర్]] లో 50 శాతం మంది మాత్రమే మూడు తరగతుల తక్కువ స్థాయి నైపుణ్యాలు కలిగివున్నట్లు చెప్పింది.
==మాధ్యమం==
మాధ్యమం గణాంకాలు (దాదాపు 10 వతరగతి వరకు విద్యార్ధుల శాతం) ఈ విధంగా వున్నాయి.
<table border=0 cellpadding=0 cellspacing=0 id='tblMain'><tr><td><table border=0 cellpadding=0 cellspacing=0 class='tblGenFixed' id='tblMain_0'><tr class='rShim'><td class='rShim' style='width:0;'><td class='rShim' style='width:120px;'><td class='rShim' style='width:120px;'><td class='rShim' style='width:120px;'><tr><td class=hd><p style='height:16px;'></td><td class='s0'>సంవత్సరం<td class='s1'>తెలుగు<td class='s1'>ఇంగ్లీషు</tr><tr><td class=hd><p style='height:16px;'></td><td class='s2'>1995-1996 <td class='s3'>85.62%<td class='s3'>11.47%</tr><tr><td class=hd><p style='height:16px;'></td><td class='s2'>1996-1997 <td class='s3'>85.28%<td class='s3'>11.90%</tr><tr><td class=hd><p style='height:16px;'></td><td class='s2'>1997-1998 <td class='s3'>85.30%<td class='s3'>11.97%</tr><tr><td class=hd><p style='height:16px;'></td><td class='s2'>1998-1999 <td class='s3'>85.31%<td class='s3'>11.44%</tr><tr><td class=hd><p style='height:16px;'></td><td class='s2'>1999-2000 <td class='s3'>84.64%<td class='s3'>12.67%</tr><tr><td class=hd><p style='height:16px;'></td><td class='s2'>2000-2001 <td class='s3'>83.47%<td class='s3'>13.77%</tr><tr><td class=hd><p style='height:16px;'></td><td class='s2'>2001-2002 <td class='s3'>82.14%<td class='s3'>14.93%</tr><tr><td class=hd><p style='height:16px;'></td><td class='s2'>2002-2003 <td class='s3'>81.11%<td class='s3'>15.75%</tr><tr><td class=hd><p style='height:16px;'></td><td class='s2'>2003-2004 <td class='s3'>79.86%<td class='s3'>17.09%</tr><tr><td class=hd><p style='height:16px;'></td><td class='s2'>2004-2005 <td class='s3'>78.38%<td class='s3'>18.61%</tr><tr><td class=hd><p style='height:16px;'></td><td class='s2'>2005-06 <td class='s3'>76.07%<td class='s3'>21.04%</tr><tr><td class=hd><p style='height:16px;'></td><td class='s2'>2006-07 <td class='s3'>73.91%<td class='s3'>23.32%</tr><tr><td class=hd><p style='height:16px;'></td><td class='s2'>2007- 08 <td class='s3'>71.08%<td class='s3'>26.01%</tr></table></table>
===[[కంప్యూటర్ సహాయంతో విద్య]]===
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2005-2006 సంవత్సరం వరకు 3518 పాఠశాలలలో కంప్యూటర్ సహయంతో విద్య ప్రవేశపెట్టారు. వీటిలో 2057 ప్రాధమిక, 584 ప్రాధమికోన్నత, 877 ఉన్నత పాఠశాలున్నాయి. వీటికొరకు పాఠశాలలలో కంప్యూటర్ సహాయంతో విద్య (వేయి కంప్యూటరుల ప్రాజెక్టు, ఎంపి నిధులతో ఇవ్వబడిన కంప్యూటరులు, లేదా ఇతర స్వచ్ఛంద సంస్థలచే ఇవ్వబడిన కంప్యూటరులు) , పాఠశాల వెలుపల కంప్యూటర్ సహాయంతో విద్య అనగా (దగ్గరలో కంప్యూటర్ సదుపాయంగల పాఠశాలు, లేక ఈ-సేవ కేంద్రాలు మొదలైనవి) పధకాలు వాడుతున్నారు.
;సిడి అభివృద్ది
[[అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ]] రూపొందించిన 64 సిడీలను 1 నుండి 9 తరగతి వరకు, తెలుగు, ఇంగ్లీషు, గణితం, విజ్ఞాన శాస్త్రం, సమాజ శాస్త్రం విషయాలను నేర్పటానికి వాడుతున్నారు. దీనికొరకు అధ్యాపకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు.
; పనితీరు
అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ నాలుగు రాష్ట్రాలలో కంప్యూటర్ సహాయ విద్య పనితీరుని 2008 లో పరిశీలించింది.<ref>[http://www.azimpremjifoundation.org/pdf/CALP-Report-2008.pdf కంప్యూటర్ సహాయ నేర్చుకొనే ప్రణాళిక నివేదిక 2008 (ఇంగ్లీషు)]</ref> చాలా కొద్ది కేంద్రాలు మాత్రమే సరిగా పనిచేస్తున్నాయని తెలిసింది. లోపాలు ఉపాధ్యాయులు, మరియు ప్రధాన ఉపాధ్యాయల మనస్సులో వీటి నిర్వహణ బాధ్యత గురించి అవగాహన లేకపోవటం, కంప్యూటర్ విద్యగురించిన అపోహలు, వీటిని వాడటానికి సరియైన మూలభూతసౌకర్యాలు లేకపోవటం అని తెలిపింది.
==ఇవీ చూడండి==
* [[భారతదేశంలో విద్య]]
* [[విద్య]]
* [[జాతీయ విద్యావిధానం]]
* [[అక్షరాస్యత]]
==వనరులు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
* [http://ssa.nic.in/ Official website]
{{ మూస: విద్య, ఉపాధి }}
[[వర్గం:భారతదేశంలో విద్య]]
[[వర్గం:భారతదేశంలో విద్యా విధానం]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లో విద్య]]
[[వర్గం: విద్య]]
[[en:Literacy in India]]All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?oldid=738019.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|