Revision 738310 of "దూర విద్య" on tewiki

{{విలీనము ఇక్కడ |దూర విద్య (యాంత్రిక అనువాదం)}}
దూర విద్య అనగా విద్యార్ధులు   తమ నివాసంలోనే వుంటూవిద్య నేర్చుకోవడం. దీనికోసం  ప్రత్యేకంగా తయారు చేసిన పుస్తకాలు, దృశ్య శ్రవణ సాధనాలు, అప్పుడప్పుడు   సంపర్క తరగతులు వాడుతారు.  మొట్టమొదటగా 1960 లో ఇంగ్లాండ్ లో యూనివర్సిటీ ఆఫ్ ఎయిర్ అనే సంస్ధని  దూర విద్యకోసం స్ధాపించారు. భారత దేశంలో 1962లో ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ లో 1982 లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం  దూర విద్యని ప్రవేశ పెట్టాయి. చదువు మధ్యలో ఆపిన వారికి, ఉద్యోగాలు  చేస్తూ పై చదువులపై అసక్తి కలవారికి, తక్కువ ఖర్చు తో చదువుకోనాలసుకొనే వారికి  ఇదిచాలా ఉపయోగం.
== ప్రాధమిక, మాధ్యమిక విద్య==
ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్ <ref>[http://apopenschool.org/ ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్] </ref> 14 సంవత్సరాలు నిండిస  బాల బాలికలకు, ఎలాంటి విద్యార్హత  లేకుండా  10 వతరగతి చదివే అవకాశం కలిగిస్తున్నది. నేషనల్  ఇన్సిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్<ref>[http://www/nios.ac.in  నేషనల్  ఇన్సిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ]</ref>ద్వారా,  సెకండరీ, సీనియర్ సెకండరీ  కోర్సులు చేయవచ్చు.
ఫిభ్రవరి 1991 లో సార్వత్రిక పాఠశాల  సంఘం (ఎపిఒఎస్ఎస్) స్థాపించబడింది.   ఈ సంస్థ కు ముఖ్యమంత్రి  ప్రధాన పోషకుడు మరియు విద్యా మంత్రి పోషకుడు గా వ్యవహరిస్తారు. 2008-09లో  ప్రభుత్వ వుత్తర్వు ప్రకారం  ఎపిఒఎస్ఎస్ జారిచేసి వుత్తీర్ణతా ధృవపత్రాలు (10 వ తరగతి(ఎపిఒఎస్ఎస్), మరియు ఇంటర్మీడియట్(ఎపిఒఎస్ఎస్))  సాధారణ నియత విద్యా మండళ్లు( మాధ్యమిక విద్యా మండలి, ఇంటర్మీడియట్ విద్యా మండలి) జారి చేసే ధృవపత్రాలకు సమానా హోదా ఇవ్వబడింది. ఆ తరువాత 2006-07 లో ఉత్తీర్ణతా శాతం 66కు చేరింది. <ref>[http://www.col.org/PublicationDocuments/pub_StateOpenSchools_India_Rajagopalan_2011.pdf  సార్వత్రిక పాఠశాల పనితీరు అధ్యయన నివేదిక(ఆంగ్లంలో)] </ref>

== ఉన్నత విద్య ==
* [[ఇగ్నో]]
* [[డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము]]
* [[ఇఫ్లూ]]
* [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]
* [[కేంద్రీయ విశ్వ విద్యాలయం]], హైదరాబాదు
* [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]
* [[జె ఎన్ టి యు]]
*[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]]
* [[ద్రవిడ విశ్వ విద్యాలయం]]
* [[శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం]]
* [[నాగార్జున  విశ్వ విద్యాలయం]]
* [[కాకతీయ విశ్వ విద్యాలయం]]
* [[మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం]]
===బోధన పద్ధతి===
ఉదాహరణగా  డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము వారు సాధారణంగా వాడే పద్ధతులు (వారానికి)
*  * 12 నుండి 16 గంటలు  కోర్సు పుస్తకాలు (స్వయం బోధనా పద్దతిలో ముద్రించబడిన పుస్తకాలు)
* ఆరు నుండి ఎనిమిది గంటలు దగ్గరిలో గల విద్యా కేంద్రములో సలహా సంసర్గ తరగతులు
* 30 నిముషాలు రేడియో పాఠాలు (హైద్రాబాద్  ఎ [[రేడియో]] స్టేషన్ ఉ 7.25 నుండి 7.55 వరకు, మధ్యమ మరియు పొట్టి తరంగాల ద్వారా)
*  2 నుండి 3 గంటలు దృశ్య, శ్రవణ లేక శ్రవణ పద్ధతులద్వారా చదువు (సోమ నుండి శుక్ర ఉ 5.30 నుండి 6.00  వరకు దూరదర్శన్ [[సప్తగిరి]], [[మన టివి]]లో  9.30 నుండి 10.30 (వారపురోజులు),  సా 4.00   నుండి 5.00 మరల ప్రసారం), [[గ్యాన దర్శన్]]  రాత్రి 10.30 నుండి 11.00)
* దూర శ్రవణ (tele conf)సమావేశాలు (సా 2.00  నుండి  3.00 దూరదర్శన్ సప్తగిరి)

== మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
* [http://www.suryaa.com/main/showEducation.asp?cat=7&subCat=1&ContentId=32346  దగ్గరవుతున్న దూర విద్య , సూర్య  దిన పత్రిక ప్రజ్ఞ, 27 జనవరి 2010]
[[వర్గం: విద్య]]