Revision 739017 of "స్త్రీబాధ" on tewikiఅనిల్ అనే వ్యక్తి ఈ వూరినందు జన్మించి త్రిబుల్ ఐటిలో చదువు రాసిన పాటలు ఒక రెండు ఇవ్వబడినవి.
నేపధ్యం :సమాజంలో బాధలకు గురైనటువంటి స్త్రీలు ఒక దేవుని గుడికి వెళ్ళి తన బాధలను దేవతకు మొరపెట్టుకొను సందర్భంలో వచ్చిన నా చిన్ని పాట.
@ పాట 1 @
పల్ల్లవి : ఆడ పిల్లలం తల్లీ మేము ఆడపిల్లలం
అన్ని వున్నట్టి అనాధలం మేమె ఆడపిల్లలం.
చరణం :పుట్టగానే అమ్మా అని పిలిచేలోపే పుణ్యలోకాలు చేరేటి పసికందులం.......తల్లీ(పల్లవి)
కంటకన్న కలలు కన్నీళ్ళు చేసి
వయసొచ్చిందంటూ,పుట్టింటోల్లు
మెట్టె తొడిగే కాలమిదేనంటూ
అత్తోరింటికి తరిమేస్తారూ....తల్లీ
నమ్ముకున్న వాడు నరకంబెట్టి
ఇవ్వవలసినది ఏదో తేలేదంటూ
అత్తమామళ్ళు చివాట్లెట్టి
వీధిలోకి లాగి దూచేస్తారు...తల్లీ
గప్పటిదాక వున్న నిర్భరాన్ని
నలుగురి యెట్టి నలిచేస్తారు....తల్లీ
(పల్లవి)
చరణం :గరిటబట్టి వంటింట్లోనే లోకంతో పనిలేక బతికేటట్టి
నిరాశకులం మేమే..అంగడిలో అమ్ముడు బొమ్మలం మేమే....తల్లీ
ఆడది గొప్పది అంటూ
బయటెన్నో చిలకపలుకులు పలికే వారికింద ఊడిగం చేస్తూ
ఆడజన్మనెత్తిన అభాగ్యులం.....తల్లీ
(పల్లవి)
చరణం :పొద్దుపొడవడం ఎంత నిజమో
అంత గొప్ప బాధలు భరిస్తూ, భూదేవి సహానం చూపిస్తూ
లోకానికి ఏకాకులమైనట్టి వారిమి తల్లీ.....
(పల్లవి)
చరణం :అమ్మ దైవరూపమంటూ
ఆ అమ్మే ఆడది అంటూ
ఆ అమ్మనే అమ్ముకునే లోకంలో బాధితులం ...తల్లీ
(పల్లవి)
చరణం :స్త్రీ పురుషులంటూ ఏలా ఈ బేధం
చీకటి మా బతుకుల్లో వెలుగును నింపే
ఆ రోజూ ఎన్నడు వచ్చునో చెప్పవే తల్లీ..... (పల్లవి)
.............జి.అనిల్ కుమార్ from GANTAVARIPALEM at GUNTUR dt......
నేపధ్యం : దిక్కుమొక్కులేని అనాధలందరు కలసి వాళ్ళ పరిస్థితి గూర్చి వారికి వారే వివరించుకొను సందర్భంలోనిది ఈ పాట.
@ పాట 2@
పల్లవి :అనాధలం మేము అనాధలం
అమ్మ అనే లోపే ఆరుబయట పడినట్టి అనాధలం
తల్లి దండ్రి ప్రేమను నోచుకోని అనాధలం.
చరణం : కన్నీళ్ళుకడుపు నింపవని
కష్టమే మార్గం అనుకొంటూ
బుడిబుడి అడుగులతో,కష్టంతో
బ్రతుకు బండిని ఈడ్చుకెళ్తున్నా అభాగ్యులం......
(పల్లవి)
చరణం : ఊరూర వెళుతూ, వీధి వీధి తిరుగుతూ
చెత్తయే మా సొమ్మంటూ
దానినే భద్రపరచి, రూపాయి సంపాదించి,
ఒక్క పొద్దు భోజంతో,దయగల వాని దుస్తులతో
కష్టాలు వారదిగా మార్చి కన్నీళ్లు దాటుకుంటూ
కాలాన్ని కదిలిస్తున్న బాల కార్మికులం మేము బాల కార్మికులం........
(పల్లవి)
చరణం :చల్లని వెన్నెలె తల్లి అంటూ
రోజు కన్పించే సూర్యుడే తండ్రి అంటూ
భుజాన బ్రతుకును యెట్టి
ప్రకృతిలో విలవిలాడుతు వున్న పిల్లలం.. పసిపిల్లలం..........
(పల్లవి)
చరణం :ఏ దేవుడు వినలేదా మా ఘోష
ఆ ఆకాశం కనలేదా మా రూపం
మా కన్నీళ్ళతో తడుస్తున్న ఈ భువికి బాధ అనిపించలేదా
లోకానికి ఏకాకులం ఎవరి తప్పూ........(పల్లవి)
......... G.ANIL KUMAR FROM IIIT RK-Valley...........
above songs written by Anil kumar.He is agreat comedian and artist. He is leaving in Gantavaripalem in Savalyapuram (md) at Guntur dt.All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?oldid=739017.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|