Revision 766555 of "రే-బాన్" on tewiki{{Advert|date=August 2010}}
{{Infobox company
|company_name = Ray-Ban
|company_logo = [[దస్త్రం:Ray-Ban logo.svg|250px]]
|company_type = Subsidiary of [[Luxottica]] Group S.p.a.
|foundation = 1937
|founder = Lester Belisario| location_city = {{Flag icon|Italy}} [[Milan]]
|location_country = [[Italy]], Formerly Rochester, NY
|marketing_slogan = "Never Hide"
|key_people =
|products = High End Eyewear and Sunglasses
|revenue =
|operating_income =
|net_income =
|num_employees =
|divisions =
|subsid =
|company_slogan = Genuine since 1937
|homepage =[http://www.ray-ban.com www.ray-ban.com]
|footnotes =
}}
'''రే-బాన్''' అనేది ఒక సన్‌గ్లాసెస్ తయారీదారు సంస్థ, బాష్ & లాంబ్ ద్వారా 1937లో ఇది స్థాపించబడింది.<ref name="Ray-Ban company website">[http://www.ray-ban.com/ రే-బాన్ వెబ్ సైట్ ]</ref> యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ ఎయిర్ కార్ప్స్ కోసం వారు పరిచయం చేయబడ్డారు.<ref>[http://www.historyofbranding.com/rayban.html రే-బాన్ యొక్క చరిత్ర]</ref> 1999లో, బాష్ & లాంబ్‌లు $640 మిలియన్ మొత్తానికి తమ బ్రాండ్‌ని ఇటాలియన్ లక్సోటికాకు అమ్మివేశారు.<ref name="nytimes stub">{{cite news |title=Company News: Bausch & Lomb Selling Sunglass Business to Luxottica |newspaper=NY Times |date=April 29, 1999 |url=http://www.nytimes.com/1999/04/29/business/company-news-bausch-lomb-selling-sunglass-business-to-luxottica.html |accessdate=September 5, 2010}}</ref>
రే-బాన్‌లనేవి 1937లో తయారయ్యాయి. అంతకు కొన్నేళ్ల ముందు, సాహస చర్యలో భాగంగా బెలూన్‌లో ప్రయాణించి తిరిగి వచ్చిన లెప్టినెంట్ జాన్ మ్యాక్‌క్రెడీ, సూర్యుడి వల్ల తన కళ్లు శాశ్వతంగా పాడయ్యాయని ఫిర్యాదు చేశారు. దీంతో బాష్ & లాంబ్‌ని సంప్రదించిన అతను సన్‌గ్లాసెస్‌ని తయారు చేయాల్సిందిగా వారిని కోరడంతో పాటు అవి రక్షణ కల్పించేవిగాను మరియు చూసేందుకు ఆకట్టుకునేలా కూడా ఉండాలని చెప్పాడు. మే 7, 1937న, బాష్ & లాంబ్ తమ ఉత్పత్తికి పేటెంట్ తీసుకున్నారు.<ref name="Fashion Dictionary Ray-Ban">[http://dellamoda.it/fashion_dictionary/r/rayban.php ఫ్యాషన్ నిఘంటువు రే-బాన్]</ref> అలా వారు మొదటగా తయారు చేసిన సన్‌గ్లాస్ రూపం యాంటీ-గ్లేర్‌గా సుపరిచితం కావడంతో పాటు బాగా తక్కువ బరువు కలిగిన ఫ్రేంతో 150 గ్రాముల బరువు మాత్రమే ఉండేది. పరారుణ మరియు అతినీలలోహిత కిరణాలను వడబోయడం కోసం మినరల్ గ్లాస్‌తో తయారు చేసిన పచ్చటి లెన్స్‌ను బంగారు పూత పూసిన లోహపు ఫ్రేమ్‌లో బిగించి కొత్త రకం కళ్లజోళ్లు తయారు చేశారు. యునైటెడ్ స్టేట్స్ సైన్యంలో వైమానిక దళం ఫైలట్‌లు వెనువెంటనే సన్‌గ్లాసెస్‌ని సొంతం చేసుకున్నారు.<ref name="Fashion Dictionary Ray-Ban"/> అప్పట్లో రే-బాన్ ఏవియేటర్ అనేది బాగా సుపరిచితమైన సన్‌గ్లాసెస్. [[రెండవ ప్రపంచ యుద్ధం|ప్రపంచ యుద్ధం II]] సమయంలో జనరల్ డగ్లస్ మ్యాక్‌ఆర్థూర్ [[ఫిలిప్పీన్స్|ఫిలిఫైన్స్]]లోని సముద్ర తీరంలో దిగిన సమయంలో ఆ రకమైన కళ్లజోడు ధరించిన ఆయనను ఫోటోగ్రాఫర్లు లెక్కలేనన్ని సంఖ్యలో ఫోటోలు తీశారు.<ref name="Fashion Dictionary Ray-Ban"/>
== రే-బాన్ ఫ్రేములు ==
అత్యంత ఆధునిక రే-బాన్ ఫ్రేములు కార్బన్ ఫైబర్‌తో తయారవుతాయి. ఈ ఫ్రేములు బరువు తక్కువగా ఉండడంతో పాటు దృఢంగానూ ఉంటాయి.{{Citation needed|date=September 2010}} వాటర్-కట్ కార్బన్ షీట్ అనేది రెజిన్‌తో కలిసి కార్బన్ ఫైబర్ల యొక్క 7 భిన్న రకాల పొరలను కలిగి ఉంటుంది. రే-బాన్ ద్వారా తయారయ్యే ఫ్రేములు తేలికగా మరియు దృఢంగా, వశ్యత కలిగి మరియు నిరోధకంగా మరియు ధరించిన వారికి సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. అంతేకాకుండా, ఈ ఫ్రేములు మోనోబ్లాక్ హింజ్‌తో తయారు కావడం వల్ల వీటి ముందరి భాగంలో ఎలాంటి వెల్డింగ్ చేయబడి ఉండదు. దీనివల్ల తెరిచి మరియు మూసే సమయంలో ఫ్రేమలు విరిగిపోయే అవకాశం చాలా తక్కువ. దీంతోపాటు ఈ కంపెనీ టెటానియంతో తయారయ్యే ఫ్రేములను కూడా ఉత్పత్తి చేస్తుంది.
అలాగే టెటానియం మరియు మెమో-రేలతో తయారయ్యే ఫ్రేములను కూడా రే-బాన్ తయారు చేస్తుంది. రే-బాన్ తయారుచేసే టెటానియం ఫ్రేములు హైపోలారిజెనిక్, నికిల్-రహితం, మరియు తుప్పు-నిరోధకంగా ఉండడం వల్ల చాలా రకాలైన పర్యావరణాలకి ఇవి చక్కగా సరిపోతాయి. అదేసమయంలో టెటానియం ఫ్రేములనేవి దృఢమైనవి మరియు తక్కువ బరువు కలిగినవి.
మెమో-రే ఫ్రేములనేవి నికెల్ మరియు టెటానియం మిశ్రమాలను కలిగి ఉండడం వల్ల ఫ్రేముకు మరింత ఎక్కువగా నిరోధకత మరియు వశ్యత సొంతమవుతుంది. రే-బాన్ తయారుచేసే ఫ్రేముల్లో ఇవి దృఢమైనవి కావడంతో పాటు అదేసమయంలో తక్కువ బరువైనవిగాను ఉంటున్నాయి.
== రే-బాన్ సన్‌గ్లాసెస్ ==
రే-బాన్ తన సన్‌గ్లాసెస్ ఎంపికలో ఏడు ప్రధాన శ్రేణులను కలిగి ఉంది. ఫెమిలియస్, ఐకాన్స్, యాక్టివ్ లైఫ్‌స్టైల్, హై స్ట్రీట్, ఫాస్ట్ మరియు ఫ్యూరియస్, టెక్, మరియు క్రాఫ్ట్ అనే పేర్లతో ఈ శ్రేణులు చెలామణి అవుతున్నాయి.
ఈ సన్‌గ్లాసెస్ ఫ్రేముల శ్రేణి బాగా పలుచని మొదలుకుని లోహం లాంటి మందమైన ఫ్రేముల వరకు, కార్బన్ ఫైబర్ ఫ్రేములు లాంటి అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రే-బాన్ సన్‌గ్లాసెస్ యొక్క లెన్సులు పోలరైజ్డ్‌గా ఉంటాయి, ప్రతిఫలించే ఉపరితలాల నుంచి వచ్చే వెలుగును ఇవి నిరోధిస్తాయి. దీని ఫలితంగా క్రోమ్, మరియు ఎక్కువ నీరు కలిగి ప్రదేశాల వంటి నునుపు తలాల నుంచి వచ్చే కాంతివంతమైన వెలుగును ఇవి సమర్థంగా అడ్డుకోవడంతో పాటు, ధరించేవారి కళ్లకు మరింత సౌకర్యవంతగా ఉంటాయి. ఈ లెన్సులు ధరించే వారి కళ్లకు ఎక్కువ హానికరమైన బ్లూ లైట్ నుంచి కూడా పూర్తి రక్షణ లభిస్తుంది. గీతలు పడకపోవడమే లక్షణం ఉండడం వల్ల ఈ లెన్సులు చాలా ఆదరణ పొందాయి, ఇవి స్పష్టతను కలిగి ఉండడంతో పాటు సూర్యుని నుంచి వచ్చే ప్రమాదకరమైన UV కిరణాల నుంచి కూడా 100% రక్షణ కల్పిస్తాయి.
ఇతర సన్‌గ్లాస్ ఫీచర్ అయిన G-15 లెన్సులనేవి కళ్లు అలిసిపోవడం మరియు దృష్టిలోపం లాంటి ప్రమాదాలను సమర్థంగా అడ్డుకుంటాయి. ఈ లెన్సులు రంగుల నిజమైన విలువను నిలిపి ఉంచడం ద్వారా వాటిని సమానంగా విస్తరింప చేస్తాయి. కాబట్టి వీటిని ధరించే వారికి మరింత సౌకర్యంగా ఉంటుంది. B-15 లెన్సులనేవి బ్లూ లైట్ తీవ్రతను ఎక్కువ శాతం అడ్డుకోవడం ద్వారా స్పష్టత మరియు సౌకర్యాన్ని అందిస్తాయి. స్పష్టత అవసరమైన డ్రైవింగ్, క్రీడలు మరియు ఇతర కార్యకలాపాల్లో ఉపయోగించడం కోసం కొందరు ఈ రకమైన సన్‌గ్లాసెస్‌ని సిఫార్సు చేస్తుంటారు. ఇక రే-బాన్ అందించే మరో విభాగానికి చెందిన సన్‌గ్లాసెస్‌ని లైట్ అడాప్టీవ్ పేరుతో పిలుస్తారు. విభిన్న రకాల కాంతి పరిస్థితులను అనుసరించి తగిన విధంగా సర్ధుబాటు చేయడం కోసం ఒకప్పుడు వీటిని రూపొందించారు. కమిలియన్-లాంటి సాంకేతికత కారణంగా ఈ రకమైన లెన్సులు సూర్యకాంతి నేరుగా పడే సమయంలో పూర్తి నలుపు రంగులోకి మరియు ఇళ్ల లోపల లేదా తక్కువ కాంతి ఉన్న ప్రదేశాల్లో పూర్తి స్పష్టతకు మారిపోగలవు.
యునైటెడ్ స్టేట్స్ లోపల అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా రే-బాన్ సన్‌గ్లాసెస్‌ని కొనుగోలు చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా, ఒక సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని ఆ వెబ్‌సైట్ కల్పిస్తోంది. స్థిరమైన ఖాతాదారులు సన్‌గ్లాసెస్‌ని వాస్తవంగా ప్రయత్నిచేందుకు ఇది అనుమతిస్తుంది.
== వీటిని కూడా చూడండి ==
*రే-బాన్ ఏవియేటర్
*రే-బాన్ వేఫ్యారర్
== సూచికలు ==
{{Reflist}}
[[వర్గం:1927లో స్థాపించబడిన సంస్థలు]]
[[వర్గం:ఐవేర్]]
[[వర్గం:సన్‌గ్లాసెస్]]
[[en:Ray-Ban]]
[[hi:रे-बैन]]
[[ml:റേ-ബാൻ]]
[[ar:راي بان]]
[[cs:Ray-Ban]]
[[cy:Ray-Ban]]
[[de:Ray-Ban]]
[[es:Ray-Ban]]
[[fa:ری-بن]]
[[fi:Ray-Ban]]
[[fr:Ray-Ban]]
[[id:Ray-Ban]]
[[it:Ray-Ban]]
[[ja:レイバン]]
[[ka:Ray-Ban]]
[[ko:레이밴]]
[[ms:Ray-Ban]]
[[nl:Ray-Ban]]
[[pl:Ray-Ban]]
[[pt:Ray-Ban]]
[[ru:Ray-Ban]]
[[sv:Ray-Ban]]
[[zh:雷朋]]All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?oldid=766555.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|