Revision 769745 of "సర్జీ బ్రిన్" on tewiki{{Infobox person
| name = Sergey Brin
| image = Sergey Brin.JPG| image_size =
| caption =
| birth_name = Sergey Mikhaylovich Brin
| birth_date = {{birth date and age|mf=yes|1973|8|21}}
| birth_place = [[Moscow]], [[Soviet Union]]
| residence = [[Los Altos Hills, California]]
| nationality = American
| ethnicity =
| citizenship = Soviet (1973-1979) <br /> American (from 1979)
| education = Univ. of Maryland (B.S., 1993)<br /> Stanford University (M.S., 1995)
| alma_mater = [[University of Maryland, College Park|University of Maryland]] <br /> [[Stanford University]]
| occupation = [[Computer scientist]], technology innovator, entrepreneur
| known_for = Co-founder of [[Google]], Inc.
| networth = {{gain}}[[United States dollar|US$]]15 [[1,000,000,000 (number)|billion]] (2010)<ref name="Profile page on Sergey Brin">{{cite web | title = Profile page on Sergey Brin | publisher = Forbes | url = http://www.forbes.com/profile/Sergey-Brin | accessdate = 2010-04-05}}</ref>
| salary = [[United States dollar|USD]] free of wage (2008)<ref>2005 compensations from Google: $1 in salary, $1723 in bonus, $41,999 other annual compensation, $3 all other compensation. Source: [[United States Securities and Exchange Commission|SEC]]. [http://www.sec.gov/Archives/edgar/data/1288776/000119312506070406/ddef14a.htm Google form 14A]. Filed March 31, 2006.</ref><ref name="myDanwei">[http://www.mydanwei.com/detail.php?org_oid=49f9f04e17e64d2652dc06384adf3d83&type=org&tab=1 Google Executives Compensation]</ref>
| spouse = [[Anne Wojcicki]]<ref name="Washington Post"/>
| website = [http://www-db.stanford.edu/~sergey/ stanford.edu/~sergey]
| footnotes =
}}
21 ఆగస్టు 1973న జన్మించిన '''సర్జీ మిఖాయ్‌లోవిచ్ బ్రిన్''' ({{lang-ru|Серге́й Миха́йлович Брин}}) ఒక రష్యన్ అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు పారిశ్రామికవేత్త<ref>''ఎన్సైక్లోపీడియా బ్రిటానిక అల్మానాక్ 2008'' , (2008) pg. 40</ref>. సెర్చ్ ఇంజిన్ (అన్వేషణ యంత్రం) మరియు ఆన్‌లైన్ వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద [[ఇంటర్నెట్|ఇంటర్నెట్ (అంతర్జాలం)]] కంపెనీ{{cite}}గా వెలుగొందుతున్న [[గూగుల్|Google]], Inc., సహ వ్యవస్థాపకుడుగా ల్యారీ పేజ్‌తో పాటు ఆయన సుపరిచితులు.<ref>జుంగ్ యియోన్-జి [http://www.highbeam.com/doc/1P1-140030803.html జెట్టి ఇమేజెస్ ఆర్టికిల్ ], మే 30, 2007</ref>
బ్రిన్ ఆరేళ్ల వయసులో సోవియట్ యూనియన్ నుంచి అమెరికా సంయుక్తరాష్ట్రాలకు వలస వచ్చారు. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఆయన అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. గణితశాస్త్రాన్ని అభ్యసించడం, ప్రత్యేకమైన అభిలాషతో కంప్యూటర్ శాస్త్రంను రెండు పర్యాయాలు చదవడం ద్వారా ఆయన తన తండ్రి మరియు తాతల అడుగుజాడల్లో నడిచారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత స్టాన్‌ఫోర్డ్‌కు కంప్యూటర్ సైన్స్‌లో PhD కోసం వెళ్లారు. అక్కడ ఆయన ల్యారీ పేజ్‌ను కలుసుకున్నారు. తర్వాత వారిద్దరూ స్నేహితులయ్యారు. వారు ఉంటున్న వసతి గృహాన్ని వారు చౌకగా లభించిన కంప్యూటర్లతో నింపారు. ఒక అత్యుత్తమ సెర్చ్ ఇంజిన్ రూపకల్పనకు బ్రిన్ యొక్క డాటా మైనింగ్ వ్యవస్థను అనువర్తించారు. సదరు ప్రోగ్రామ్‌కు స్టాన్‌ఫోర్డ్‌లో విశేష ఆదరణ లభించింది. దాంతో వారు తమ Ph.D చదువులను ఒక అద్దె గ్యారేజీలో Googleను ప్రారంభించడం కోసం రద్దు చేసుకున్నారు.
''ది ఎకనామిస్ట్'' సంచిక బ్రిన్‌ను ఒక "జ్ఞానోదయ వ్యక్తి"గా అభివర్ణించింది. అలాగే "వివేకం ఎప్పుడూ మంచిది మరియు కచ్చితంగా అది అజ్ఞానం కంటే కూడా మేలైనది" అనే దానిని విశ్వసించే మరికొంత మంది కూడా ఆయన్ను కొనియాడారు. ఈ సిద్ధాంతం యావత్ ప్రపంచ సమాచారాన్ని "విశ్వవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడం మరియు ప్రయోజనకరంగా చేయడం" మరియు "చెడుగా ప్రవర్తించవద్దు" అనే Google సంస్థ యొక్క లక్ష్య సారాంశాన్ని సూచిస్తుంది.
== బాల్యం మరియు విద్యాభ్యాసం ==
సర్జీ బ్రిన్ [[మాస్కో]] [[సోవియట్ యూనియన్|సోవియట్ యూనియన్]]లో యూద తల్లిదండ్రులైన మైఖేల్ బ్రిన్ మరియు యుజీనియా బ్రిన్‌లకు జన్మించారు. వారిద్దరూ మాస్కో స్టేట్ యూనివర్శిటీలో పట్టభద్రులు. ఆయన తండ్రి మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఒక గణితశాస్త్ర పండితుడు. ఆయన తల్లి [[నాసా|NASA]]కి చెందిన గోడార్డ్ అంతరిక్ష యాన కేంద్రంలో పరిశోధనా శాస్త్రవేత్త.<ref>స్మెల్, విల్ (ఏప్రిల్ 30, 2004). "[http://news.bbc.co.uk/2/hi/business/3666241.stm ప్రొఫైల్: ది గూగుల్ ఫౌండర్స్]". బిబిసి వార్తలు 2010-01-07న పొందబడినది. </ref><ref>"[http://www.nndb.com/people/826/000044694/ సర్జీ బ్రిన్]". NNDB. 2010-01-07న పొందబడినది. </ref>
=== సోవియట్ యూనియన్‌లో బాల్యం ===
1979లో, బ్రిన్ ఆరేళ్ల ప్రాయంలో, ఆయన కుటుంబం అమెరికా సంయుక్తరాష్ట్రాలకు బలవంతంగా మకాం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ''ది గూగుల్ స్టోరీ'' ,<ref name="Vise">వైస్, డేవిడ్, మరియు మల్సీద్, మార్క్. ''ది గూగుల్ స్టొరీ'' , డెల్ట పబ్లిషర్స్. (2006)</ref> రచయిత మార్క్ మాల్‌సీడ్‌తో ఇంటర్వూ సందర్భంగా సర్జీ తండ్రి "[[ఖగోళ శాస్త్రము|గణితశాస్త్రజ్ఞుడు]] కావాలన్న తన కలను కళాశాలకు చేరడానికి ముందే ఏ విధంగా త్యజించాడనే" విషయాన్ని వివరించారు. సెమిటిజం (జూడాయిజం) వ్యతిరేక అధికారిక విధానం అనేది సోవియట్ యూనియన్‌లో లేనప్పటికీ, కమ్యూనిస్టు పార్టీ పెద్దలు యూదులకు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాన్ని తిరస్కరించడం ద్వారా ఉన్నత పదవులు చేపట్టకుండా వారిని అడ్డుకున్నారని బ్రిన్ ఆరోపించారు. "ప్రత్యేకించి, [[భౌతిక శాస్త్రము|భౌతికశాస్త్ర]] విభాగం నుంచి యూదులను మినహాయించారు" అని ఆయన ఆరోపించారు. దాంతో మైఖేల్ బ్రిన్ తన పాఠ్యాంశాన్ని [[గణితము|గణితశాస్త్రం]]కు మార్చుకున్నారు. అక్కడ ఆయన దాదాపు నేరుగా ప్రవేశం పొందారు. "నేను యూదుడైనందున గ్రాడ్యుయేట్ పాఠశాలలో ప్రవేశానికి నన్నెవరూ పట్టించుకోలేదు" అని ఆయన చెప్పారు.<ref name="Moment">మల్సీద్, మార్క్ (ఫిబ్రవరి 2007). "[http://www.momentmag.com/Exclusive/2007/2007-02/200702-BrinFeature.html ది స్టొరీ అఫ్ సర్జీ బ్రిన్]". ''మొమెంట్ మగజైన్'' . 2010-01-07న పొందబడినది. </ref>
మధ్య మాస్కోలోని మూడు గదుల, 30 చదరపు మీటర్ల (350 చదరపు అడుగులు) భవంతిలో బ్రిన్ కుటుంబం నివశించింది. అందులో సర్జీ నానమ్మ కూడా ఉంది.<ref name="Moment"/> మాల్‌సీడ్‌తో సర్జీ ఈ విధంగా అన్నారు, "నా తండ్రి ఆయన కోరుకున్న జీవితాన్ని పొందలేకపోయారన్న విషయం నాకు చాలాకాలంగా తెలుసు", అయితే అమెరికాలో స్థిరపడిన తర్వాత కొన్నేళ్లకు సర్జీ మాత్రమే ఈ వివరాలపై దృష్టి సారించాడు. 1977లో, అంటే వార్సా, [[పోలాండ్|పోలాండ్]]లో జరిగిన గణితశాస్త్ర సదస్సును ఆయన తండ్రి ముగించుకుని వచ్చిన తర్వాత, తమ కుటుంబం వలసవెళ్లడానికి ఇది సరైన తరుణమని ఆయన ఏ విధంగా వెల్లడించాడన్న విషయాన్ని తెలుసుకున్నాడు. "మేము ఇక్కడ ఇక ఏ మాత్రం ఉండలేము", అని ఆయన తన భార్య మరియు తల్లితో అన్నారు. సమావేశంలో, ఆయన "అమెరికా [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|సంయుక్తరాష్ట్రాలు]], [[ఫ్రాన్స్]], [[ఇంగ్లాండు|ఇంగ్లాండ్]] మరియు [[జర్మనీ]] నుంచి వచ్చిన సహచరులతో కలివిడిగా ఉండగలిగారు. అంతేకాక పశ్చిమంలో ఆయన మేథో సమకాలీకులు పెద్ద పండితులేమీ కారని గుర్తించారు.'" మా కుటుంబంలో నిజంగా ఇక్కడ నుంచి మకాం మార్చాలని నిర్ణయించుకున్నది నేను మాత్రమే...." అని ఆయన తెలిపారు.<ref name="Moment"/>
సర్జీ తల్లి మాస్కోలోని వారి ఇంటిని విడిచిపెట్టడానికి అయిష్టత వ్యక్తం చేసింది. అక్కడే వారి సంపూర్ణ జీవితాలను గడిపేశారు. మాల్‌సీడ్ ఈ విధంగా రాశారు, "జెనియాకు సంబంధించి, ఈ నిర్ణయం సర్జీని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నది. ఇక ఆమె భర్త తన తనయుడు మాదిరిగానే ఆయన భవితవ్యం గురించి యోచిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఆమెకు 'అది సర్జీ గురించి 80/20'గా ఉండేది." సెప్టెంబరు, 1978లో వారు నిష్క్రమణ వీసా కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఫలితంగా ఆయన తండ్రి "వెంటనే తొలగించబడ్డారు". సంబంధిత కారణాల వల్ల, ఆయన తల్లి కూడా ఆమె ఉద్యోగానికి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. తర్వాత ఎనిమిది నెలల పాటు, స్థిరమైన ఆదాయం లేకపోవడంతో వారు మరింత కాలం వేచి ఉండటం వల్ల వారు తాత్కాలిక ఉద్యోగాలను బలవంతంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం అప్పటికే వారు పలు తిరస్కృతులను ఎదుర్కొన్నందున, ఎక్కడ తమ అభ్యర్థన మరోసారి తిరస్కరించబడుతుందోనని వారు భయపడటం. ఈ సమయంలో ఆయన తల్లిదండ్రులు ఆయన బాగోగుల బాధ్యతలను పంచుకున్నారు. ఆయన తండ్రి ఆయనకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి స్వయంగా బోధించారు. మే, 1979లో వారికి అధికారిక నిష్క్రమణ వీసాలు లభించాయి. తద్వారా దేశాన్ని విడిచిపెట్టేందుకు వారికి అనుమతి లభించింది.<ref name="Moment"/>
అక్టోబరు, 2000లో జరిగిన ఒక ఇంటర్వూలో బ్రిన్ ఈ విధంగా అన్నారు, "అక్కడ నా తల్లిదండ్రులు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులు నాకు తెలుసు. వారు నన్ను అమెరికా సంయుక్తరాష్ట్రాలకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు".<ref name="Scott">స్కాట్, విర్జీనియా. ''గూగుల్: కర్పరేష్ణ్స్ దట్ చెంజ్ద్ ది వరల్డ్'' , గ్రీన్వుడ్ పబ్లిషింగ్ గ్రూప్(2008)</ref> దశాబ్ది తర్వాత, అంటే 1990 వేసవిలో, ఆయన 17వ పుట్టినరోజుకు కొన్ని వారాల ముందు, సోవియట్ యూనియన్‌కు రెండు వారాల బదిలీ కార్యక్రమం సందర్భంగా ఆయన తండ్రి మేధావులైన హైస్కూల్ గణిత విద్యార్థుల, సర్జీ సహా, సమూహానికి నేతృత్వం వహించారు. "సర్జీ జ్ఞప్తికి తెచ్చుకున్నట్లుగా, ఈ యాత్ర ఆయన చిన్నతనంలోని అధికార భయాన్ని తట్టిలేపింది". "సోవియట్ అణచివేతను ప్రతిఘటించడంపై ఆయన మొట్టమొదటి ప్రేరణ ఒక పోలీసు కారుపై రాళ్లను రువ్వడం". మాల్‌సీడ్ ఈ విధంగా తెలిపారు, "యాత్ర రెండో రోజున, మాస్కో సమీపంలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక ఆరోగ్య కేంద్రానికి విద్యార్థుల సమూహం ప్రయాణం సందర్భంగా, సర్జీ ఆయన తండ్రిని ఒక పక్కకు లాగి, ఆయన కళ్లలోకి చూస్తూ ఈ విధంగా అన్నారు, 'మమ్మల్ని అందరినీ రష్యా వెలుపలకు తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు.'"<ref name="Moment"/><ref name="Moment"/>
=== అమెరికాలో విద్యాభ్యాసం ===
అడెల్ఫీ, మేరీల్యాండ్‌లోని పెయింట్ బ్రాంచ్ మాంటెస్సోరి స్కూల్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలకు బ్రిన్ వెళ్లారు. అయితే తదుపరి విద్యాభ్యాసాన్ని ఆయన తన ఇంటి వద్దనే కొనసాగించారు. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో గణతశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన తండ్రి గణతశాస్త్రం పట్ల ఆయనకు ఉన్న ఆసక్తిని ప్రోత్సహించారు. అంతేకాక రష్యన్-భాష నైపుణ్యాలను ఆయన తిరిగి పొందే విధంగా ఆయన కుటుంబం ఆయనకు సాయం చేసింది. సెప్టెంబరు, 1990లో, గ్రీన్‌బెల్ట్, మేరీల్యాండ్‌లోని ఎలీనర్ రూసీవెల్ట్ హైస్కూల్‌కు హాజరైన అనంతరం, కంప్యూటర్ సైన్స్ మరియు [[గణితము|గణితశాస్త్రం]] అభ్యసించడానికి బ్రిన్ మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం, కాలేజ్ పార్క్‌లో చేరారు. అక్కడ మే, 1993లో ఆయన గౌరవ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ అందుకున్నారు.<ref name="resume">{{cite web |url=http://infolab.stanford.edu/~sergey/resume.html |title=Resume |accessdate=2008-03-09 |last=Brin |first=Sergey |date=January 7, 1997 |quote= }}</ref>
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో బ్రిన్ తన కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదువును ప్రారంభించాడు. దీనికోసం ఆయన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నుంచి గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ (డిగ్రీ చదువుకు అందించే ఉపకారవేతనం) అందుకున్నారు. 1993లో ఆయన మేథమేటికా (ఒక విధమైన గణన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్) అభివృద్ధి సంస్థయైన వోల్‌ఫ్రామ్ రీసెర్చ్‌లో శిక్షణ తీసుకున్నారు.<ref name="resume"/> దీనికోసం ఆయన స్టాన్‌ఫోర్డ్‌లోని తన Ph.D. చదువుల నుంచి సెలవు తీసుకున్నారు.<ref>{{cite web |url=http://investing.businessweek.com/businessweek/research/stocks/people/person.asp?personId=534604&symbol=GOOG |title=Sergey Brin: Executive Profile & Biography – BusinessWeek |accessdate=2008-03-09|work=[[Business Week]] |publisher= |pages= |language= |doi= |archiveurl= |archivedate= |quote=He is currently on leave from the PhD program in computer science at Stanford...}}</ref>
== సెర్చ్ ఇంజిన్ అభివృద్ధి ==
స్టాన్‌ఫోర్డ్‌లో కొత్త విద్యార్థుల కోసం నిర్వహించిన దిక్సాధన సందర్భంగా ఆయన ల్యారీ పేజ్‌ను కలుసుకున్నారు. ''ది ఎకనామిస్ట్'' సంచికకు ఇచ్చిన ఒక తాజా ఇంటర్వూలో బ్రిన్ తమాషాగా ఇలా అన్నారు, "మేము రెండు రకాల అసహ్యకరమైన వ్యక్తులం". అనేక విషయాలపై వారిద్దరూ అసమ్మతిని కలిగి ఉండేవారుగా కన్పించేవారు. అయితే కొద్దికాలం ఒకటిగా కలిసి గడిపిన తర్వాత వారు "మేధో ప్రియులు మరియు ఆప్తమిత్రులు"గా మారారు. డాటా మైనింగ్ వ్యవస్థలపై బ్రిన్ దృష్టి కేంద్రీకరించగా, పేజ్ మాత్రం "ఒక పరిశోధన పత్రం యొక్క ప్రాధాన్యతను ఇతర పత్రాలలోని దాని అనుఖనాల ద్వారా ఆకళింపు చేసుకునే పద్ధతి"ని విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు.<ref name="Economist"/> ఒకటిగా, ఈ ద్వయం వారి ప్రారంభ రచనగా విస్తృతంగా భావించిన "ది అనాటమీ ఆఫ్ ఎ లార్జ్-స్కేల్ హైపర్‌టెక్చువల్ వెబ్ సెర్చ్ ఇంజిన్"ను రూపొందించారు.<ref>"[http://infolab.stanford.edu/pub/papers/google.pdf ది అనాటమీ అఫ్ ఏ లార్జ్-స్కేల్ హైపర్తెక్షువల్ వెబ్ సర్చ్ ఇంజిన్]"</ref>
ఇద్దరి ఆలోచనలను కలగలుపుతూ, వారు "వారి వసతి గృహాన్ని చౌకగా లభించిన కంప్యూటర్లతో నింపారు". తద్వారా వారి సరికొత్త సెర్చ్ ఇంజిన్ డిజైన్లను వెబ్‌పై పరీక్షించారు. ఈ కారణంగా వారి ప్రాజెక్టు "స్టాన్‌ఫోర్డ్ యొక్క గణన మౌలిక సదుపాయాలకు సమస్యలు తెచ్చిపెట్టే" స్థాయికి సత్వరం ఊపందుకుంది. అయితే వెబ్‌పై శోధన దిశగా ఒక అత్యున్నత ఇంజిన్‌ను సృష్టించడంలో సఫలీకృతులయ్యామన్న విషయాన్ని వారు గ్రహించారు. అందువల్ల ఈ ప్రాజెక్టుపై మరింత దృష్టి పెట్టేందుకు వారు తమ PhD చదువులకు స్వస్తి పలికారు.<ref name="Economist"/>
మార్క్ మాల్‌సీడ్ రాసిన విధంగా, "బోధనా సిబ్బంది, కుటుంబం మరియు మిత్రుల నుంచి నిధులను అభ్యర్థించిన సర్జీ మరియు ల్యారీ కలిసి కొన్ని సర్వర్‌లను కొనుగోలు చేశారు. వాటిని మెన్లో పార్క్‌లోని ఒక ప్రముఖ గ్యారేజీని అద్దెకు తీసుకున్నారు. [ఆ వెంటనే] సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకులు ఆండీ బెక్‌టాల్షీమ్ “Google, Inc.”కు $100,000 చెక్కును రాసి ఇచ్చారు. అయితే ఏకైక సమస్య “Google, Inc.” అప్పటికి కార్యరూపు దాల్చలేదు. అంటే అది సంస్థీకరించబడలేదు. రెండు వారాల పాటు ప్రాజెక్టుకు సంబంధించిన దస్త్రాలు ఇతర పత్రాల పనుల్లో వారిద్దరూ నిమగ్నమవడంతో డబ్బును ఎక్కడ జమ చేయాలో వారికి దిక్కు తోచలేదు."<ref name="Moment"/>
బ్రిన్ జీవితాశయం, పేజ్ మాదిరిగా, గూగుల్ లక్ష్యం యొక్క సారాంశంపై దృష్టి ఆధారంగా '"యావత్ ప్రపంచ సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడం మరియు ప్రయోజకరంగా చేయడం'" అని
''ది ఎకనామిస్ట్'' సంచిక వివరించింది. మరికొంత మంది వారి ఆలోచనను ఆధునిక ముద్రణ (మోడరన్ ప్రింటింగ్) ఆవిష్కర్త [[జోహాన్స్ గుటెన్‌బర్గ్|జోహన్స్ గూటన్‌బర్గ్]]తో పోల్చారు.
:"1440లో, జోహన్స్ గూటన్‌బర్గ్ బైబిలును ఎక్కువ మందికి పంచడానికి ఐరోపాలో యాంత్రిక ప్రింటింగ్ ప్రెస్‌ను ఆవిష్కరించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం పుస్తకాలు మరియు లిఖిత ప్రతుల ముద్రణకు ఉపయోగపడింది. వాస్తవికంగా చేతితో నకలుగా రూపొందించేవారు. ఈ ప్రతులను శరవేగంతో ముద్రించే అవకాశం లభించింది. తద్వారా విజ్ఞాన వ్యాప్తి మరియు యూరోపియన్ పునరుజ్జీవనోద్యమంలో దీనిని ప్రవేశపెట్టడానికి దోహదపడింది... గూగుల్ కూడా ఇదే విధమైన పని చేసింది."<ref>[http://www.librarystuff.net/2009/10/01/google-the-gutenberg/ ''ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ'' ], అక్టోబర్. 1, 2009</ref>
ఈ పోలికను ''ది గూగుల్ స్టోరీ'' రచయితలు అదే విధంగా గుర్తించారు, ఒక్క గూటన్‌బర్గ్ నుంచే కాక ఆ తర్వాత వచ్చిన అనేక కొత్త ఆవిష్కరణలు వ్యక్తులకు అధికారమిచ్చాయి. గూగుల్ మాదిరిగా సమాచార వినియోగం దిశగా మార్పులు చోటు చేసుకున్నాయి."<ref name="Vise"/>{{rp|1}}
"వెబ్ పరిశోధనలక తమ కొత్త ఇంజిన్‌ను సిద్ధం చేసిన కొద్ది కాలానికే, నేడు వెబ్ పరిధిలో లేని సమాచారం కోసం వారు ఆలోచించడం మొదలుపెట్టారు", అంటే పుస్తకాల డిజిటలీకరణ మరియు ఆరోగ్యానికి సంబంధించిన సమాచార విస్తరణ వంటివి.<ref name="Economist"/>
== వ్యక్తిగత జీవితం ==
మే, 2007లో [[బహామాస్|ది బహమాస్]]లో అన్నె వోజ్‌సిక్కిని బ్రిన్ వివాహం చేసుకున్నారు. వోజ్‌సిక్కి ఒక జీవసాంకేతిక విశ్లేషకురాలు. ఆమె 1996లో యాలే విశ్వవిద్యాలయం నుంచి [[జీవ శాస్త్రము|జీవశాస్త్రం]]లో B.S. పూర్తి చేశారు.<ref name="Washington Post">{{cite news | first = Amy | last = Argetsinger | coauthors = Roberts, Roxanne | title = The Reliable Source | work = [[The Washington Post]] | date = May 13, 2007 | url = http://www.washingtonpost.com/wp-dyn/content/article/2007/05/12/AR2007051201168.html | accessdate = 2007-10-20}}</ref><ref>{{cite web | title = Anne Wojcicki Marries the Richest Bachelor | publisher = Cosmetic Makovers | url = http://cosmetic-makeovers.com/2007/05/18/anne-wojcicki-marries-the-richest-bachelor | accessdate = 2007-10-20}}</ref>
ఆరోగ్య సంబంధ సమాచారంపై ఆమెకు అమితాసక్తి ఉండేది. ఆమె మరియు బ్రిన్ కలిసి దానిని ఉపయోగించుకునే దిశగా కొత్త మార్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. వారి ప్రయత్నాల్లో భాగంగా, మానవ విశ్వజన్యురాశి ప్రాజెక్టు గురించి ప్రముఖ పరిశోధకులతో పాటు వారు తీవ్రంగా కృషి చేశారు. "బ్రిన్ సహజంగా ఒక డాటాబేస్ మాదిరిగా మరియు సమస్యను అంచనా వేయడానికి [[జన్యుశాస్త్రం]]పై దృష్టి పెట్టారు. అంటే 23andMe అనే సంస్థ సహ వ్యవస్థాపకురాలైన ఆయన భార్య చేసిన విధంగా. ఇది ప్రజలు వారి సొంత జన్యుపరమైన నిర్మాణాన్ని (23 జతల క్రోమోజోమ్‌లు ఉంటాయి) విశ్లేషించడం మరియు పోల్చడానికి అవకాశం కల్పిస్తుంది.<ref name="Economist"/> గూగుల్ యొక్క జీట్‌గీస్ట్ ఇటీవలి ప్రకటనలో, వైద్యులు, రోగులు మరియు పరిశోధకులు సమాచారాన్ని విశ్లేషించడం తద్వారా లోటుపాట్లను సవరించే విధంగా ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరూ వారి జన్యుపరమైన కోడు గురించి తెలుసుకుంటారని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.<ref name="Economist"/>
బ్రిన్ తల్లి యుజీనియాకు పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నట్లు నిర్థారించబడింది. 2008లో ఆయన తల్లి చికిత్స పొందుతున్న యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు విరాళం ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు.<ref>{{cite news | title = Google Co-Founder Has Genetic Code Linked to Parkinson's | url= http://www.nytimes.com/2008/09/19/technology/19google.html?_r=1&partner=rssnyt&emc=rss&oref=slogin | accessdate = 2008-09-18 | work=The New York Times | first=Miguel | last=Helft | date=September 19, 2008}}</ref> 23AndMe సేవలను బ్రిన్ ఉపయోగించుకున్నారు. పార్కిన్సన్స్ అనేది సాధారణంగా ఆనువంశికమైనది కాకపోయినప్పటికీ, ఆయన మరియు ఆయన తల్లి ఇద్దరూ LRRK2 జన్యువు యొక్క [[ఉత్పరివర్తనము|ఉత్పరివర్తన]]ను కలిగి ఉన్నట్లు గుర్తించబడింది. ఈ కారణంగా తదుపరి సంవత్సరాల్లో ఆయనలో పార్కిన్సన్స్ వ్యాధి 20 నుంచి 80% మేర ప్రబలే అవకాశం ఉంది.<ref name="Economist">"ఎన్లితెన్మెంట్ మాన్", ''ది ఎకోనామిస్ట్'' , డిసెంబర్. 6, 2008 [http://www.economist.com/science/tq/displaystory.cfm?story_id=12673407 ]</ref> అలాంటి విషయాల్లో అవివేకం అనేది మంచిది కాదని అడిగినప్పుడు, తనకున్న విజ్ఞానం ప్రస్తుతం ఆ వ్యాధిని పారద్రోలే చర్యలను తీసుకోగలగడం అని బదులిచ్చారు. ''ది ఎకనామిస్ట్'' సంచికలో వచ్చిన ఒక సంపాదకీయం ఈ విధంగా తెలిపింది, "బ్రిన్ తన LRRK2 ఉత్పరివర్తనను ఆయన వ్యక్తిగత కోడులో ఒక దోషంగా గుర్తించారు. గూగుల్ ఇంజినీర్లు ప్రతిరోజూ సరిచేస్తున్న కంప్యూటర్ కోడులోని దోషాలకు అది భిన్నమైనది ఏమీ కాదు. తనకు తాను సాయం చేసుకుంటూ తద్వారా ఇతరులకు కూడా ఆయన సాయపడగలరు. తాను అదృష్టవంతుడుగా ఆయన భావించారు... అయితే బ్రిన్ మరో పెద్ద విషయాన్ని కూడా ప్రస్తావించారు. వివేకం అనేది ఎల్లప్పుడూ మంచిది కాకుంటే అది కచ్చితంగా అవివేకం కంటే ఎప్పుడూ ఉత్తమమైనదే కదా?"<ref name="Economist"/>
== చైనాలో గూగుల్ భద్రతా సమీక్ష (సెన్సార్‌షిప్) ==
{{details|Censorship in the People's Republic of China}}
సోవియట్ యూనియన్‌ను విడిచిపెట్టడానికి సంబంధించిన ఆయన యుక్తవయస్సు మరియు కుటుంబ కారణాలను నెమరువేసుకుంటూ, ఆయన "సెర్చ్ ఇంజిన్ ఫలితాలను నిషేధించే అనుమతి కల్పిస్తూ చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని బుజ్జగించడానికి గూగుల్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు". అయితే చైనీయులు ఇప్పటికీ గూగుల్ అందుబాటులో లేకుండానే బాగానే ఉండగలరని నిర్ణయించుకున్నారు.<ref name="Economist"/> ''ఫార్చ్యూన్'' సంచికకు ఆయన తమ కారణాలను వివరించారు.
:"అక్కడ మేము పాలుపంచుకోవడం మరియు మా సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడం, మేము ఎక్కువగా కోరుకునే 100 శాతం సేవలు కాకపోయినప్పటికీ, ఇది చైనా వెబ్ యూజర్లకు మంచిదవుతుంది. ఎందుకంటే, మొత్తం కాకపోయినా వారు సాధ్యమైనంత ఎక్కువ సమాచారం ఎట్టకేలకు పొందగలరు."<ref name="Martin">మార్టిన్, డిక్. ''రీబిల్డింగ్ బ్రాండ్ అమెరికా: హాట్ వి మస్ట్ డు టు రీస్టోర్ అవర్ రెప్యుటేషన్ అండ్ సేఫ్ గార్డ్ ది ఫ్యూచర్ అఫ్ అమెరికన్ బిజినెస్స్ అబ్రోడ్'' , AMACOM Div. అమెరికన్ Mgmt. Assn. (2007)</ref>
12 జనవరి 2010న తమ కంప్యూటర్లు మరియు కార్పొరేట్ మౌలిక సదుపాయాలపై భారీ సైబర్ దాడి జరిగిందని గూగుల్ ప్రకటించింది. ఇది నెల రోజుల ముందు ప్రారంభమైందని పేర్కొంది. అసంఖ్యాక Gmail ఖాతాల్లోకి అక్రమంగా చొరబడి, గూగుల్ యొక్క మేధోసంపదను కొల్లగొట్టారని సంస్థ ఆరోపించింది. ఈ దాడి చైనా నుంచే జరిగిందని ధ్రువీకరించిన తర్వాత, చైనాలో సెర్చ్ ఇంజిన్ యోచనకు ఇక ఎంతమాత్రమూ సమ్మతించే ప్రసక్తేలేదని సంస్థ ప్రకటించింది. అంతేకాక ఆ దేశాన్ని పక్కనపెడుతున్నట్లు స్పష్టం చేసింది. "దాడిచేసేవారి ఒక ప్రాథమిక లక్ష్యం చైనీస్ మానవ హక్కుల కార్యకర్తల జిమెయిల్ ఖాతాల్లోకి అక్రమంగా ప్రవేశించడం. అయితే ఆ దాడి ఆర్థిక, సాంకేతిక, మీడియా మరియు రసాయన రంగాలకు చెందిన మరో 20 ఇతర అతిపెద్ద కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకుందని"
''న్యూయార్క్ టైమ్స్'' వెల్లడించింది.<ref>[http://www.nytimes.com/2010/01/13/world/asia/13beijing.html "గూగుల్, సైటింగ్ సైబర్ అట్టాక్, త్రిటేన్స్ టు ఎగ్జిట్ చైనా"], ''న్యూ యార్క్ టైమ్స్'' , జనవరి 12, 2010</ref><ref>[http://googleblog.blogspot.com/2010/01/new-approach-to-china.html చైనా కు ఒక కొత్త దృక్పధం]</ref> గూగుల్ యొక్క అత్యంత విలువైన మేధో సంపదగా చెప్పుకునే ఒక పాస్‌వర్డ్ వ్యవస్థ దాడికి గురైనట్లు తర్వాత నివేదించడం జరిగింది. సదరు వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యూజర్ల ప్రవేశాన్ని నియంత్రిస్తుంది."<ref>[http://www.nytimes.com/2010/04/20/technology/20google.html?nl=technology&emc=techupdateema1 "సైబర్ అటాక్ ఆన్ గూగుల్ సెడ్ టు హిట్ పాస్వర్డ్ సిస్టం"] ''న్యూ యార్క్ టైమ్స్'' , ఏప్రిల్ 19, 2010</ref>
మార్చి, 2010 ఆఖర్లో గూగుల్ సంస్థ చైనా ఆధారిత సెర్చ్ ఇంజిన్‌ను అధికారికంగా తొలగించింది. అయితే భద్రతా సమీక్ష చేపట్టని దాని [[హాంగ్‌కాంగ్|హాంకాంగ్]] స్థావరం కార్యకలాపాలను మాత్రం యధావిధిగా కొనసాగించింది. ఇదే విధమైన చర్యగా డొమైన్ రిజిస్ట్రార్ గో డాడీ ఇంక్., సైతం తమ వద్ద నమోదుకాబడిన వ్యక్తుల యొక్క గోప్య సమాచారానికి చైనీస్ కొత్త అవసరాల కారణంగా నిషేధం విధించనున్నట్లు కాంగ్రెస్‌కు తెలిపింది.<ref name="WSJ"/> ఒక ఇంటర్వూలో బ్రిన్ గూగుల్ తరపున మాట్లాడుతూ, చైనాలో మనం చేపడుతున్న చర్య ద్వారా చైనా పరిస్థితి నిజంగా ఇతర దేశాలు వారి సొంత ఫైర్‌వాల్స్ ఏర్పాటుకు ప్రయత్నించడం మరియు వాటిని అమలు చేసుకునే విధంగా ప్రేరేపించనుండటం నేను సంతోషపడటానికి గల ఒకానొక కారణం."<ref name="WSJ">[http://online.wsj.com/article/SB10001424052748704266504575141064259998090.html "బ్రిన్ డ్రోవ్ గూగుల్ టు పుల్ బాక్ ఇన్ చైనా"] '''' వాల్ స్ట్రీట్ జోర్నాల్ /2}, మార్చ్ 24, 2010</ref> ''స్పైజెల్'' తో మరో ఇంటర్వూ సందర్భంగా, ఆయన ఈ విధంగా అన్నారు, "ఇంటర్నెట్‌పై నిష్కాపట్యత కోసం ఏ విధంగా పోరాడాలనేది ఎప్పుడూ మనకు ఒక చర్చ. నిష్కాపట్యత సూత్రాలు మరియు ఇంటర్నెట్‌పై సమాచార స్వేచ్ఛను మేం కాపాడగలిగేందుకు ఇదే అత్యుత్తమమైనదని మేము విశ్వసిస్తున్నాం."<ref>[http://www.spiegel.de/international/business/0,1518,686269,00.html "గూగుల్ కో-ఫౌండర్ ఆన్ పుల్లింగ్ అవుట్ అఫ్ చైనా"] ''స్పీగల్ ఆన్ లైన్'' , మార్చ్ 30, 2010</ref>
మరోవైపు ఇప్పటివరకు కొన్ని అతిపెద్ద కంపెనీలు మాత్రమే ఈ బృహత్ చర్యకు మద్దతిచ్చాయి. పలువురు ఇంటర్నెట్ "స్వేచ్ఛా ప్రతిపాదకులు ఈ చర్యను ప్రోత్సహిస్తున్నారు". అంతేకాక ఇది U.S.లో శాసనరూపకర్తల ప్రశంసలను గెలుచుకుంది.<ref name="WSJ"/><ref>[http://money.cnn.com/2010/03/24/technology/china_google_hearing/index.htm "కాంగ్రెస్స్ స్లామ్స్ చైనా అండ్ మైక్రోసాఫ్ట్, గూగుల్ పొగడ్త"] ''CNN మనీ '' , మార్చ్ 24, 2010</ref> భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మరియు సమాచారం దిశగా గూగుల్ తీసుకున్న నిర్ణయం ఒక బలమైన చర్య అని సెనేటర్ బైరాన్ డోర్గాన్ అన్నారు.<ref>[http://news.yahoo.com/s/ap/20100325/ap_on_hi_te/as_china_google "గూగుల్స్ డీల్స్ ఇన్ డౌట్ అమిడ్ స్పాట్ విత్ బీజింగ్"] యాహూ వార్తలు, మార్చ్ 25, 2010</ref> మరియు కాంగ్రెస్ నేత బాబ్ గుడ్‌లాటీ "Google.cn.పై శోధన ఫలితాల నిషేధాన్ని ఆపే దిశగా గూగుల్ తీసుకున్న సాహసోపేత చర్యను నేను మెచ్చుకుంటున్నాను" అని అన్నారు. గూగుల్ ఇసుకపై ఒక గీత గీసింది. అది చైనాలోని వ్యక్తిగత స్వేచ్ఛా నిషేధాల యొక్క అత్యంత అంధకార ప్రాంతంలో ఒక దీపాన్ని వెలిగిస్తోంది"<ref>[http://goodlatte.house.gov/2010/03/goodlatte-statement-in-support-of-googles-decision-to-stop-censoring-in-china.shtml "గూడ్లట్టి స్టేట్మెంట్ ఇన్ సపోర్ట్ అఫ్ గూగుల్స్ డిసిషన్ టు స్టాప్ సెన్సరింగ్ ఇన్ చైనా "] మార్చ్ 23, 2010</ref> అయితే గూగుల్ తీసుకున్న ఈ చర్య కారణంగా ఆ సంస్థ లాభాలపై ప్రభావం పడవచ్చని వ్యాపార దృష్టికోణం నుంచి పలువురు అభిప్రాయపడ్డారు. "తన చర్యతో గూగుల్ భారీ మూల్యం చెల్లించుకోనుంది. అంటే, చైనాలో తన సేవలపై నిషేధానికి తిరస్కరించడం ద్వారా ఆ సంస్థ ప్రశంసలు పొందడానికి అర్హమై ఉండటం."<ref>[http://www.kansascity.com/2010/03/28/1842611/googles-strategy-in-china-deserves.html "గూగ్లేస్ స్ట్రాటజీ ఇన్ చైనా డిసర్వ్స్ ప్రైస్"] ''కన్సాస్ సిటి స్టార్'' , మార్చ్ 28, 2010</ref> "[ఆండ్రీ] సాఖరోవ్‌తో స్పష్టమైన అదే విధమైన సంబంధంతో అంటే విజ్ఞానం మరియు స్వేచ్ఛకు సంబంధించింది, గూగుల్ వచ్చినట్లు కన్పిస్తోందని, ఈ చర్య "వీరత్వం"ను సూచిస్తోందని
''ది న్యూ రిపబ్లిక్'' అభివర్ణించింది.<ref>[http://www.tnr.com/article/dont-be-evil "డోంట్ బి ఈవిల్"], "ది హీరోయిసం అఫ్ గూగుల్," ''ది న్యూ రిపబ్లిక్ '' , ఏప్రిల్ 21, 2010</ref>
== పురస్కారాలు మరియు గుర్తింపు ==
[[దస్త్రం:Sergey Brin cropped.jpg|thumb|సర్జీ బ్రిన్ ]]
నవంబరు, 2009లో ''ఫోర్బ్స్ సంచిక'' బ్రిన్ మరియు ల్యారీ పేజ్‌లు ప్రపంచంలో ఐదో అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా కొనియాడింది.<ref>[http://www.forbes.com/lists/2009/20/power-09_Sergey-Brin-and-Larry-Page_D664.html "ది వరల్డ్స్ మోస్ట్ పోవర్ఫుల్ పీపుల్: #5 సర్గే బ్రిన్ మరియు లర్రి పేజ్"] ''ఫోర్బ్స్'' మగజైన్, Nov. 11, 2009</ref> అదే ఏడాది మొదట్లో, ఫిబ్రవరిలో, నేషనల్ అకాడెమీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బ్రిన్ ప్రవేశం పొందారు. ఒక ఇంజినీరు ప్రకారం, అందులో ప్రవేశం అత్యున్నత వృత్తిపరమైన విలక్షణతలను సూచిస్తుంది.... [మరియు] ఇంజినీరింగ్ పరిశోధన, సాధనకు విశేష కృషి చేసిన వారిని గుర్తిస్తుంది." "వరల్డ్ వైడ్ వెబ్ నుంచి సుసంగత సమాచారాన్ని సత్వరం గుర్తించడం మరియు దానిని తిరిగి పొందడంలో ప్రదర్శించిన నాయకత్వానికి" ఆయన్ను ప్రముఖంగా ఎంపిక చేశారు.<ref>[http://www8.nationalacademies.org/onpinews/newsitem.aspx?RecordID=02062009 నేషనల్ అకాడెమి అఫ్ ఇంజనీరింగ్], పత్రికా విడుదల, Feb. 6, 2009</ref>
2003లో "కొత్త వ్యాపారాల సృష్టికి వ్యాపార సామర్థ్య స్ఫూర్తిని మరియు వేగాన్ని కలిగించినందుకు" బ్రిన్ మరియు పేజ్ ఇద్దరూ IE బిజినెస్ స్కూల్ నుంచి గౌరవ (హానరరీ) MBA అందుకున్నారు.<ref>[http://www.ie.edu/IE/php/en/noticia.php?id=225 బ్రిన్ అండ్ పేజ్ అవార్దేడ్ MBAs], పత్రిక విడుదల, Sept. 9, 2003</ref> మరియు 2004లో వారు మార్కోని ఫౌండేషన్ బహుమతి అందుకున్నారు. "ఇంజినీరింగ్‌లో ఇది అత్యున్నత పురస్కారం". అంతేకాక వారు కొలంబియా విశ్వవిద్యాలయంలో మార్కోని ఫౌండేషన్ పరిశోధకులు (ఇక్కడ సహచరులు అనే అర్థం కూడా రావొచ్చు)గా ఎన్నికయ్యారు. "వారి ఎన్నిక ప్రకటన సందర్భంగా, ఫౌండేషన్ అధ్యక్షులు జాన్ జే ఐస్లీన్ ఈనాటి సమాచార పునస్సంపాదన యొక్క మార్గాన్ని సమూలంగా మార్చివేసిన వారి నవకల్పనకు వారిద్దరిని అభినందించారు." "ఎంపికైన 32 మంది ప్రపంచ అత్యంత ప్రభావశీల సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞాన వైతాళికుల" సరసన వారు చేశారు.<ref>"[http://findarticles.com/p/articles/mi_m0EIN/is_2004_Sept_23/ai_n6208748 బ్రిన్ అండ్ పేజ్ మార్కొని ఫౌండేషన్ ప్రతిష్టాత్మిక గౌరవం అందుకున్నారు]". పత్రిక విడుదల, సెప్టెంబర్ 23, 2004.</ref>
వారి యొక్క పరిశోధకుల "వ్యక్తిగత వివరాల"లో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అంతకుముందు పలు అవార్డులను చేర్చింది.
:"ప్రపంచ ఆర్థిక సదస్సు మరియు సాంకేతిక వినోద మరియు రూపకల్పన సమావేశంలో ఆయన ఒక విశిష్ట ఉపన్యాసి... ''PC సంచిక'' గూగుల్ టాప్ 100 వెబ్‌సైట్లు మరియు సెర్చ్ ఇంజిన్ల (1998)ల గూగుల్ నిలిచిందని ప్రశంసించింది. అంతేకాక 1999లో వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌లో నవకల్పనకు గూగుల్‌కు టెక్నికల్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. 2000లో గూగుల్ సంస్థ వెబ్బీ అవార్డును అందుకుంది. సాంకేతిక ఘనతకు ప్రదానం చేసే ఒక పీపుల్స్ వాయిస్ అవార్డు. అలాగే 2001లో ఔట్‌స్టాండింగ్ సెర్చ్ సర్వీస్, బెస్ట్ ఇమేజ్ సెర్చ్ ఇంజిన్, బెస్ట్ డిజైన్, మోస్ట్ వెబ్‌మాస్టర్ ఫ్రెండ్లీ సెర్చ్ ఇంజిన్ మరియు బెస్ట్ సెర్చ్ ఫీచర్ అవార్డులను సెర్చ్ ఇంజిన్ వాచ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సందర్భంగా అందజేశారు."<ref>[http://www.nsfgrfp.org/why_apply/fellow_profiles/sergey_brin నేషనల్ సైన్సు ఫౌండేషన్], ఫెలో ప్రోఫైల్స్ </ref>
''ఫోర్బ్స్'' ప్రకారం, ఆయన మరియు ల్యారీ పేజ్ ప్రస్తుతం ప్రపంచంలో 24వ అత్యంత సంపన్నులుగా కొనసాగుతున్నారు. 2010లో వారి వ్యక్తిగత సంపద US$17.5 బిలియన్లు.<ref name="Topic page on Sergey Brin">{{cite web | title = Topic page on Sergey Brin | publisher = Forbes | url = http://billionaires.forbes.com/topic/Sergey_Brin | accessdate = 2010-04-05}}</ref>
== ఇతర అభిరుచులు ==
గూగుల్ కంటే గొప్పవైన ఇతర, అత్యంత వ్యక్తిగత ప్రాజెక్టులపై బ్రిన్ దృష్టి పెట్టారు. ఉదాహరణకు, ఆయన మరియు పేజ్ ప్రపంచం యొక్క ఇంధన మరియు పర్యావరణ సమస్యల పరిష్కారానికి గూగుల్ యొక్క పరోపకారి విభాగం, [http://www.google.org google.org] ద్వారా కృషి చేస్తున్నారు. పునరుత్పాదక ఇంధన వనరులను విస్తృతంగా అన్వేషించే దిశగా ప్రత్యామ్నాయ ఇంధన పరిశ్రమలో ఇది పెట్టుబడి పెడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిజమైన అతిపెద్ద సమస్యలను తమ వ్యవస్థాపకులు పరిష్కరించాలని కోరుకుంటున్నారని కంపెనీ గుర్తించింది."<ref name="windpower">[http://voices.washingtonpost.com/posttech/2010/10/google_a_vanguard_of_the.html "కార్స్ అండ్ విండ్: వాట్ నెక్స్ట్ ఫర్ గూగుల్ యాస్ ఇట్ పుషేస్ బియోండ్ ది వెబ్?"] ''వాషింగ్టన్ పోస్ట్'' , అక్టోబర్. 12, 2010</ref>
ఉదాహరణకు, అక్టోబరు, 2010లో, తూర్పు తీర పవర్ గ్రిడ్ (విద్యుత్ తంత్రీ జాలకం),<ref>[http://googleblog.blogspot.com/2010/10/wind-cries-transmission.html "ది విండ్ క్రైస్ ట్రాన్స్మిషన్"] అధికారిక గూగుల్ శీర్షిక, అక్టోబర్. 11, 2010</ref>కు సాయపడే విధంగా
ఒక అతిపెద్ద తీరస్థ పవన విద్యుత్ అభివృద్ధికి వారు పెట్టుబడులు పెట్టారు. ఎట్టకేలకు ఇది అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో మొట్టమొదటి "తీరస్థ పవన కేంద్రం"గా అవతరించింది.<ref>[http://www.reuters.com/article/idUSTRE69B4NU20101012?pageNumber=2 "గూగుల్ జయిన్స్ $5 బిలియన్ U.S. ఆఫ్షోర్ విండ్ గ్రిడ్ ప్రాజెక్ట్"] ''రీటర్స్'' Oct. 12, 2010</ref> వారం రోజుల ముందు ఒక "కృత్రిమ మేధ" కారును వారు ఆవిష్కరించారు. అది వీడియో కెమేరాలు మరియు రాడార్ సెన్సార్లను ఉపయోగించుకుని, స్వయంగా నడవగలదు.<ref name="windpower"/> భవిష్యత్తులో అదే విధమైన సెన్సార్లు కలిగిన కార్లను నడిపే డ్రైవర్లు స్వల్ప ప్రమాదాలకు మాత్రమే గురవుతారు. అందువల్ల ఈ సురక్షిత వాహనాలు తేలికగా మరియు తక్కువ ఇంధనాన్ని వినియోగించుకునే విధంగా తయారు చేయబడతాయి.<ref>మర్కొఫ్ఫ్, జాన్. [http://www.nytimes.com/2010/10/10/science/10google.html?_r=2&hp=&pagewanted=all "గూగుల్ కార్స్ డ్రైవ్ దేమ్సేల్వ్స్, ఇన్ ట్రాఫ్ఫిక్"] ''న్యూ యార్క్ టైమ్స్,'' అక్టోబర్. 9, 2010</ref>
ప్రపంచ సరఫరాను పెంచే దిశగా సరికొత్త పరిష్కారాలను కనుగొనే కంపెనీలను పొందడానికి వారు ప్రయత్నిస్తున్నారు.<ref name="LATimes">గుయిన్, జెస్సికా (సెప్టెంబర్ 17, 2008). "[http://latimesblogs.latimes.com/technology/2008/09/googles-schmidt.html గూగుల్స్ స్క్మిడ్ట్, పేజ్ అండ్ బ్రిన్ హోల్డ్ కోర్ట్ ఏట్ జీత్గేస్ట్]". లాస్ ఏంజిల్స్ టైమ్స్ 2010-01-07న పొందబడినది. </ref> ఆయన టెస్లా మోటార్స్‌లోనూ పెట్టుబడిదారుడు. ఈ కంపెనీ టెస్లా రోడ్‌స్టర్ అనే ఒక 244-మైళ్ల (393 km) దూరం ప్రయాణించ గల బ్యాటరీ విద్యుత్ వాహనంను అభివృద్ధి చేసింది.
''చార్లీ రోస్'' , CNBC మరియు CNN సహా బ్రిన్ బుల్లితెర ప్రదర్శనలు మరియు పలు లఘు చిత్రాల్లోనూ దర్శనమిచ్చారు. 2004లో ఆయన మరియు ల్యారీ పేజ్‌లను "పర్సన్స్ ఆఫ్ ది వీక్"గా
''ABC వరల్డ్ న్యూస్ టునైట్'' ప్రకటించింది. జనవరి, 2005లో ఆయన ప్రపంచ ఆర్థిక సదస్సు యొక్క "యువ ప్రపంచ నేతల"లో ఒకరుగా ఎంపికయ్యారు. ఆయన మరియు పేజ్ 2009 చలనచిత్రం ''బ్రోకెన్ యారోస్'' కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్లు.
జూన్, 2008లో [[వర్జీనియా]] ఆధారిత అంతరిక్ష యాన కంపెనీ, స్పేస్ అడ్వెంచర్స్‌లో బ్రిన్ $4.5 బిలియన్లు పెట్టుబడి చేశాడు. ఆయన పెట్టుబడి 2011లో స్పేస్ అడ్వెంచర్స్ యొక్క ప్రతిపాదిత విమానాలలో ఒక దానిలో రిజర్వేషన్ (రక్షితం)కు డిపాజిట్ మాదిరిగా పనిచేస్తుంది. ఇప్పటివరకు స్పేస్ అడ్వెంచర్స్ కంపెనీ ఏడుగురు యాత్రీకులను అంతరిక్షంలోకి పంపింది.<ref>{{cite news | first = John| last = Schwartz| title = Google Co-Founder Books a Space Flight | publisher = [[The New York Times]] Online | date = June 11, 2008 | url = http://www.nytimes.com/2008/06/11/technology/11soyuz.html?hp | accessdate = 2008-06-11}}</ref>
ఆయన మరియు పేజ్ సౌకర్యవంతంగా తయారు చేసిన బోయింగ్ 767-200 మరియు డార్నియర్ ఆల్ఫా జెట్‌లకు సహ యజమానులుగా ఉన్నారు. వాటి భద్రతకు యేటా $1.4 మిలియన్లను వారు చెల్లిస్తున్నారు. అంతేకాక రెండు గల్ఫ్‌స్ట్రీమ్ V జెట్ విమానాలను మోఫెట్ ఫెడరల్ ఎయిర్‌ఫీల్డ్ వద్ద గూగుల్ ప్రతినిధులు సొంతంగా కలిగి ఉన్నారు. ఈ విమానంలో [[నాసా|NASA]] ఏర్పాటు చేసిన శాస్త్రీయ సరంజామా ఉంది. ఇది విమానంలో ప్రయోగ సంబంధ సమాచారాన్ని సేకరించే విధంగా అనుమతిస్తుంది.<ref>{{cite news|url=http://www.nytimes.com/2007/09/13/technology/13google.html|title=Google Founders’ Ultimate Perk: A NASA Runway|first=Miguel|last=Helft|date=September 13, 2007|work=The New York Times|accessdate=2007-09-13}}</ref><ref>{{cite news|url=http://www.sfgate.com/cgi-bin/article.cgi?f=/c/a/2007/09/13/BUPRS4MHA.DTL|title=Google founders pay NASA $1.3 million to land at Moffett Airfield|first=Verne|last=Kopytoff|date=September 13, 2007|accessdate=2007-09-13|work=San Francisco Chronicle}}</ref>
బ్రిన్ AmBAR సభ్యుడు కూడా. ఇది [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్తరాష్ట్రాల]]లో రష్యన్-భాష మాట్లాడే వ్యాపార నిపుణుల (బహిష్కృతులు మరియు వలసజాతులు)కు సంబంధించిన ఒక నెట్‌వర్కింగ్ సంస్థ. ఆయన పలు ప్రసంగాలు ఇచ్చారు.<ref>[http://www.svod.org/2006/sponsors/ambar ''అమెరికన్ బిజినెస్స్ అసోసియేషన్ అఫ్ రష్యన్ ప్రొఫిషనల్స్'' ]</ref>
== ఉల్లేఖనాలు ==
*"డబ్బును సంపాదించడం చాలా సులువైనప్పుడు, వాస్తవిక నవకల్పన మరియు వ్యాపారతత్వంతో కూడిన ఇబ్బందికర పరిస్థితలు ఉంటాయి. గడ్డు పరిస్థితులు సిలికాన్ వ్యాలీలోని అత్యుత్తమ భాగాలను ఆవిష్కరించాయి."<ref name="LATimes">[http://latimesblogs.latimes.com/technology/2008/09/googles-schmidt.html లాస్ ఏంజెల్స్ టైమ్స్, సెప్టెంబర్. 17, 2008]</ref>
*"అన్ని వెబ్ పేజీలు సమానంగా సృష్టించరాదనే అభిమతంతో మేము ముందుకు వచ్చాం. మనుషులను మాత్రమే– కానీ వెబ్ పేజీలు కాదు."<ref name="UCB">[http://video.google.com/videoplay?docid=7582902000166025817 గెస్ట్ లెక్చర్, UC బెర్కిలీ] అక్టోబర్. 5, 2005 – 40 నిముషాలు.</ref>
*"టెక్నాలజీ అనేది స్వాభావిక ప్రజాస్వామ్యసాధకి. హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ పరిణామం వల్ల దానికి అనుగుణంగా మనం దాదాపు ప్రతి దానినీ అభివృద్ధి చేసుకోవాలి. అంటే, మన జీవితకాలంలో ప్రతి ఒక్కరూ సమాన అధికార పరికరాలను కలిగి ఉండొచ్చు."
== సూచనలు ==
{{Reflist|2}}
== బాహ్య లింకులు ==
{{commons category}}
{{wikiquote|Sergey Brin}}
* [http://en.scientificcommons.org/sergey_brin సర్జీ బ్రిన్ శాస్త్రీయ ప్రచురణల జాబితా]
* [http://video.google.com/videoplay?docid=7582902000166025817 వీడియో ఆఫ్ బ్రిన్ గివింగ్ ఎ లెక్చర్ ఎట్ UC బర్కిలీ] – వికీపీడియా ప్రస్తావన మరియు సెర్చ్ ఇంజిన్ల అభివృద్ధి, గూగుల్ మరియు దాని పరిణామంపై సమాలోచనలు, Q&A (శరత్కాలం, 2005)
* [http://www.nsf.gov/discoveries/disc_summ.jsp?cntn_id=100660&org=NSF → ఆన్ ది ఆరిజన్స్ ఆఫ్ గూగుల్]
* [http://too.blogspot.com సర్జీ బ్రిన్ బ్లాగు]
* [http://quotewords.com/quotes/Sergey_Brin.html సర్జీ బ్రిన్ ఉల్లేఖనాలు]
=== ఇంటర్వూలు ===
* బ్రిన్ మరియు పేజ్‌లతో వీడియో సంభాషణలు [http://www.ted.com/index.php/talks/sergey_brin_and_larry_page_on_google.html "ఇన్‌సైడ్ ది గూగుల్ మెషీన్"] – ఫిబ్రవరి, 2004, 20 నిమిషాల నిడివి.
* [http://www.linuxjournal.com/article/4196 లైనక్స్ జర్నల్ ఇంటర్వూ] – ఆగస్టు 31, 2000
* [http://www.archive.org/details/Newwebsi01 నెట్ కేఫ్ టెలివిజన్ ఇంటర్వూ] – అక్టోబరు 6, 2000. ఇంటర్వూ సుమారు 18 నిమిషాల 15 సెకన్లలో మొదలవుతుంది.
* {{Fresh Air episode|url_date_arg=October 14, 2003|date=October 14, 2003}}
* [http://searchenginewatch.com/searchday/article.php/3081081 సెర్చ్ ఇంజిన్ వాచ్ ఇంటర్వూ] – అక్టోబరు 16, 2003
* [http://www.time.com/time/podcast/business/In_Search_of_the_Real_Google.mp3 టైమ్ మేగజైన్ పాడ్‌కాస్ట్ ఎబౌట్ గూగుల్ అండ్ ఇట్స్ ఫౌండర్స్]
* [http://bnaibrith.org/pubs/bnaibrith/spring2006bbm/searchmeisters.cfm "ది సెర్చ్‌మీస్టర్స్"] – ''B'nai B'rith సంచిక'' నుంచి బ్రిన్ మరియు పేజ్‌ల వ్యక్తిగత వివరాలు (ప్రొఫైళ్లు) (వసంతం, 2006).
* [http://video.google.com/videoplay?docid=6958201596441974119#0h37m34s వీడియో → గూగుల్ ఫౌండర్స్ - 2001 నుంచి చార్లీ రోస్ ఇంటర్వూ (14 నిమిషాలు)]
=== వ్యాసాలు ===
* [http://forbes.com/2004/12/23/cz_pn_fortuneslide_2.html Forbes.com: ఫార్చ్యూన్స్ దట్ రోర్డ్ ఇన్ 2004]
* [http://www.momentmag.com/Exclusive/2007/2007-02/200702-BrinFeature.html Momentmag.com: ది స్టోరీ ఆఫ్ సర్జీ బ్రిన్]
{{Google Inc.|corporate=yes|products=no}}
{{Lists of Russians}}
{{Persondata
|NAME= Brin, Sergey
|ALTERNATIVE NAMES= Брин, Сергей
|SHORT DESCRIPTION= [[Entrepreneur|Co-Founder]] of [[Google]]
|DATE OF BIRTH= August 21, 1973
|PLACE OF BIRTH= [[Moscow]]
|DATE OF DEATH=
|PLACE OF DEATH=
}}
{{DEFAULTSORT:Brin, Sergey}}
[[వర్గం:1973 జననాలు]]
[[వర్గం:అమెరికన్ బిలియనీర్లు ]]
[[వర్గం:అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్లు ]]
[[వర్గం:అమెరికన్ యూదులు]]
[[వర్గం:సాఫ్ట్ వేర్ లో వ్యాపారవేత్తలు]]
[[వర్గం:గూగుల్ ఉద్యోగులు]]
[[వర్గం:జీవించివున్న వ్యక్తులు]]
[[వర్గం:యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అకాడమి అఫ్ ఇంజనీరింగ్ నందు సభ్యలు ]]
[[వర్గం:సంయుక్త రాష్ట్రాల సహజమైన పౌరులు]]
[[వర్గం:మాస్కో నుండి వచ్చిన ప్రజలు]]
[[వర్గం:మారిలాండ్, ప్రిన్స్ జార్జ్ కౌంటీ నుండి ప్రజలు ]]
[[వర్గం:శాన్ ఫ్రాన్సిస్కో బే ప్రాంతంలో నుండి ప్రజలు ]]
[[వర్గం:రష్యన్- యోధుల సంతతి నుండి అమెరికన్ ప్రజలు ]]
[[వర్గం:రష్యన్ యూదులు]]
[[వర్గం:రష్యన్ సంతతి నుండి అమెరికన్ ప్రజలు]]
[[వర్గం:రష్యన్ వ్యాపారవేత్తలు]]
[[వర్గం:రష్యన్ ఇన్వెన్టర్స్ ]]
[[వర్గం:సిలికాన్ వాలి ప్రజలు ]]
[[వర్గం:యునైటెడ్ స్టేట్స్ కు సోవియట్ ఇమ్మిగ్రంట్స్]]
[[వర్గం:స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు]]
[[వర్గం:యునివర్సిటి అఫ్ మారిలాండ్, కాల్లేజ్ పార్క్ పూర్వ విద్యార్ధులు ]]
[[వర్గం:WEF YGL హోనోరీస్ ]]
[[en:Sergey Brin]]
[[hi:सर्गी ब्रिन]]
[[kn:ಸೆರ್ಗೆ ಬ್ರಿನ್]]
[[ta:சேர்ஜி பிரின்]]
[[ml:സെർജി ബ്രിൻ]]
[[am:ሰርጌይ ብሪን]]
[[ar:سيرجي برين]]
[[az:Sergey Brin]]
[[be:Сяргей Міхайлавіч Брын]]
[[be-x-old:Сяргей Брын]]
[[bg:Сергей Брин]]
[[bn:সের্গেই ব্রিন]]
[[ca:Serguei Brin]]
[[cs:Sergey Brin]]
[[da:Sergej Brin]]
[[de:Sergey Brin]]
[[el:Σεργκέι Μπριν]]
[[es:Serguéi Brin]]
[[eu:Sergey Brin]]
[[fa:سرگئی برین]]
[[fi:Sergei Brin]]
[[fr:Sergueï Brin]]
[[gl:Sergey Brin]]
[[gu:સેર્ગેઈ બ્રિન]]
[[he:סרגיי ברין]]
[[hu:Sergey Brin]]
[[id:Sergey Brin]]
[[is:Sergey Brin]]
[[it:Sergey Brin]]
[[ja:セルゲイ・ブリン]]
[[jv:Sergey Brin]]
[[kk:Сергей Брин]]
[[ko:세르게이 브린]]
[[la:Sergius Brin]]
[[lv:Sergejs Brins]]
[[mk:Сергеј Брин]]
[[mn:Сергей Брин]]
[[my:ဆာဂေး ဘရင်]]
[[nl:Sergey Brin]]
[[nn:Sergey Brin]]
[[no:Sergey Brin]]
[[pl:Sergey Brin]]
[[pt:Sergey Brin]]
[[qu:Sergey Brin]]
[[ro:Sergey Brin]]
[[ru:Брин, Сергей Михайлович]]
[[sh:Sergey Brin]]
[[sk:Sergej Brin]]
[[sl:Sergey Brin]]
[[sq:Sergey Brin]]
[[sr:Сергеј Брин]]
[[sv:Sergey Brin]]
[[th:เซอร์เกย์ บริน]]
[[tr:Sergey Brin]]
[[uk:Сергій Брін]]
[[ur:سرگرے برن]]
[[vi:Sergey Brin]]
[[zh:谢尔盖·布林]]All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?oldid=769745.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|