Revision 772463 of "గుడ్‌విల్‌ (అకౌంటింగ్‌)" on tewiki

{{Accounting}}
'''గుడ్‌విల్‌ ''' అనే పదం అకౌంటింగ్‌లో, ప్రస్తుతం నడుస్తున్న వ్యాపారం యొక్క ''దూరదృష్టిగల విలువ''ను ప్రతిఫలిస్తుంది. వ్యాపారం యొక్క ఆస్థులతో సంబంధం లేకుండా, సంస్థ తన క్లయింట్స్‌ దగ్గర ఉన్న మంచి పేరుకు ఇది సూచన. ఒక కొనుగోలుదారు తన వ్యాపారం యొక్క సామర్ధ్యం పెంచుకునేందుకు ''అధికంగా చెల్లించడానికి'' అంగీకరించడం. అకౌంటింగ్‌ దృష్టిలో గుడ్‌విల్‌ అంటే ఒక సంస్థ తన దగ్గర ఉన్న ఆస్థులను, వాటి అసలు విలువ కంటే ఎక్కువ మొత్తానికి ఎందుకు అమ్మగలుగుతుందో చెబుతుంది.

==ఆధునిక అర్థం==
ఫైనాన్సియల్‌ స్టేట్‌మెంట్స్‌లో గుడ్‌విల్‌ అంటే, ఒక కంపెనీ మరొక కంపెనీ యొక్క ఆస్తులను వాటి సాధారణ విలువ కంటే ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేయడం. ఆస్థులను కొంటున్న ధరకు, నికర ఆస్థుల సాధారణ విలువకు మధ్య ఉన్న తేడాను అమ్ముతున్న కంపెనీ యొక్క ''గుడ్‌విల్‌''గా చెప్పాలి. కొనుగోలు చేసే కంపెనీ తన ఆర్థిక స్టేట్‌మెంట్స్‌లో గుడ్‌విల్‌ను ఒక ఆస్థిగా చూపించుకుంటుంది. దీనిని తమ ఆస్థిఅప్పుల పట్టికలో ప్రత్యేకంగా చూపిస్తుంది. ప్రస్తుతం ఉన్న కరెంట్‌ కొనుగోల్‌ అకౌంటింగ్‌ పద్దతి ప్రకారం ఇలా చూపిస్తారు. ఈ అర్థంలో గుడ్‌విల్‌ అనేది ఒక సంస్థ చూపించే అకౌంటింగ్‌ సమాచారంలో, మరొక కంపెనీని కొన్నప్పుడు దాని పుస్తక విలువ కంటే ఎక్కువ మొత్తానికి కొన్నప్పుడు ఆ తేడాను ప్రతిఫలించేదిగా భావించాలి. గుడ్‌విల్‌ అనేది నెగెటివ్‌గా కూడా ఉండవచ్చు. నికర ఆస్థులు కంపెనీని కొనేనాటికి, సాధారణ విలువను కలిగి ఉండి, తర్వాత కొనుగోలు ధర పెరిగితే నెగెటివ్‌ అవుతుంది.<ref>[http://www.ventureline.com/glossary_N.asp అకౌంటింగ్‌ టర్మ్స్‌ - అకౌంటింగ్‌ డిక్షనరీ - అకౌంటింగ్‌ గ్లాసరీ]</ref> నెగెటివ్‌ గుడ్‌విల్‌ అనేది లాభంగానే గుర్తించబడుతుంది. కొన్ని ఆస్థులకు కేటాయింపులు జరిపాక ఆ మేరకు దీనిని లెక్కిస్తారు. ప్రస్తుతం ఉన్న అకౌంటింగ్‌ ప్రమాణాల ప్రకారం, గుడ్‌విల్‌ను అసాధారణ అంశంగా పరిగణించనవసరం లేదు.
ఉదాహరణకు, ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి నికర ఆస్థులు (కొన్ని ప్రాథమిక పరికరాలు మరియు అప్పులేమీ లేవు) 1 మిలియన్‌ డాలర్ల విలువతో ఉన్నాయనుకుందాం. కానీ కంపెనీ యొక్క మొత్తం విలువ (బ్రాండ్‌, వినియోగదారులు, ఇంటలెక్చువల్‌ మూలధనం కలుపుకుని) 10 మిలియన్‌ డాలర్లు ఉందనుకుందాం. ఈ కంపెనీని కొనేవారు ఎవరైనా తమ పుస్తకాలలో ఆస్థుల విలువను 10 మిలియన్‌ డాలర్లుగానే చూపించాలి. ఇందులో 1 మిలియన్‌ డాలర్‌ విలువకు భౌతికంగా కనిపించే ఆస్థులు ఉండే, మరో 9 మిలియన్‌ డాలర్లకు గుడ్‌విల్‌ ఉంటుంది. ప్రైవేటు కంపెనీలో గుడ్‌విల్‌ విలువ దానిని ఎవరైనా కొనడానికి రాకముందు తెలియదు; దాని విలువ ''నిర్వచనం ప్రకారం''  మరో రెండు మారే అంశాలపై ఆధారపడి ఉంటుంది. బహిరంగంగా అమ్మే కంపెనీ, కాంట్రాస్ట్‌ ద్వారా, మార్కెట్‌ విలువను నిర్దేశిత పద్దతిలో లెక్కిస్తుంది. కాబట్టి గుడ్‌విల్‌ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది.

గుడ్‌విల్‌ అనేది సంస్థ చేస్తున్న వ్యాపారంపై ఆధారపడి రెండు రకాలుగా ఉంటుంది: ఇన్‌స్టిట్యూషనల్‌ గుడ్‌విల్‌ మరియు ప్రొఫెషనల్‌ ప్రాక్టీస్‌ గుడ్‌విల్‌. దీని గురించి ఇంకా చెప్పాలంటే, ప్రొఫెషనల్‌ ప్రాక్టీస్‌ కంపెనీలో గుడ్‌విల్‌ అనేది దాని ప్రాక్టీస్‌పై, మరియు ప్రొఫెషనల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది.<ref> [http://www.valuadder.com/glossary/business-goodwill.html వాల్యుయాడర్‌ - బిజినెస్‌ గుడ్‌విల్‌]</ref>

గుర్తించదగ్గ మరో అంశం ఏమిటంటే, గుడ్‌విల్‌ అనేది సాంకేతికంగా కంటికి కనిపించని ఆస్థి. కంపెనీ యొక్క ఆస్థి అప్పుల పట్టికలో కనిపించని ఆస్థుల జాబితాలో గుడ్‌విల్‌ను ప్రత్యేక అంశంగా పేర్కొంటారు.<ref> [[wikinvest:Intangible Assets|వికిఇన్‌వెస్ట్‌లో కనిపించని ఆస్థుల నిర్వచనం]]</ref><ref>[[wikinvest:Goodwill|వికిఇన్‌వెస్ట్‌లో గుడ్‌విల్‌ నిర్వచనం]]</ref>

==చరిత్ర మరియు కొనుగోలు వర్సెస్‌ పూలింగ్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌==
గతంలో, కంపెనీలు ఒక వ్యాపార కాంబినేషన్‌ను రికార్డు చేసేందుకు రెండు అకౌంటింగ్‌ పద్దతులలో ఒకదానిని ఎంచుకుని కొనుగోలు వ్యవహారాలను నడిపేవి: కొనుగోలు అకౌంటింగ్‌ లేదా పూలింగ్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌ అకౌంటింగ్‌. పూలింగ్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌ పద్దతి అంటే, ప్రస్తుత కంపెనీ మరియు కొనుగోలు చేయబోతున్న కంపెనీకి ఉన్న ఆస్థులను, అప్పులను కలిపి సంయుక్త విలువతో కొత్త ఆస్థి అప్పుల పట్టిక తయారు చేయడం. ఈ పద్దతిలో ఏ కంపెనీ ఏ కంపెనీని కొనుగోలు చేసిందో చెప్పలేరు. కంపెనీని కొనుగోలు చేయడం కోసం ఎంత కొనుగోలు మొత్తం చెల్లించారనేది కూడా ఇక్కడ కనిపించదు. యు.ఎస్‌. సాధారణంగా అంగీకరించిన అకౌంటింగ్‌ సిద్ధాంతాల ప్రకారం (ఎఫ్‌ఎఎస్‌ 141) పూలింగ్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌ పద్దతిని ఉపయోగించడం లేదు.

==రుణ విమోచన మరియు కొనసాగింపు విలువను సర్దుబాటు చేయడం==
యు.ఎస్‌. జిఎఎపి (ఎఫ్‌ఎఎస్‌ 142) ప్రకారం, గుడ్‌విల్‌ను రుణవిమోచన చేయడానికి వీల్లేదు.<ref>[http://www.fasb.org/st/summary/stsum142.shtml  స్టేట్‌మెంట్‌ నెం. 142 యొక్క సమ్మరీ]</ref> ఎఫ్‌ఎఎస్‌ 142 ను 2001 జూన్‌లో విడుదల చేశారు. కంపెనీలు పూలింగ్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌ పద్దతిని తీసేయడాన్ని వ్యతిరేకించాయి. దీంతో ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌ బోర్డు రుణ విమోచనను పరిహారంగా తొలగించింది. 1-1-2005 నాటికి, అంతర్జాతీయ ఆర్థిక రిపోర్టింగ్‌ స్టాండర్డ్స్‌లో కూడా ఇది కనుమరుగైంది. ప్రస్తుతం గుడ్‌విల్‌ను కేవలం జిఎఎపి ప్రమాణాల ప్రకారమే లెక్కిస్తున్నారు.<ref> [http://www.axiomvaluation.com/documents/2004.04.27-GoodwillImpairmentPrimer.pdf గుడ్‌విల్‌ విలువను లెక్కించడంలో ఒక ప్రైమర్‌: ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌ 142 లేవనెత్తిన లెక్కింపు అంశాలు.]</ref>

40 సంవత్సరాల పాటు ప్రతి ఏడాది కొంత గుడ్‌విల్‌ విలువను తగ్గించుకుంటూ పోవడం కంటే, ప్రస్తుతం కంపెనీలు రిపోర్టింగ్‌ యూనిట్ల యొక్క సాధారణ విలువ ఎంత ఉందో చూసి, ప్రస్తుత విలువను భవిష్యత్‌ నగదు బదిలీలో ఉపయోగిస్తున్నారు. మరియు దాని కొనసాగే విలువ (ఆస్థుల పుస్తక విలువ, గుడ్‌విల్‌లను కలిపిన మొత్తంలోంచి అప్పులను తీసివేయడం)ను పోల్చి చూస్తున్నారు. గుడ్‌విల్‌ విలువను తగ్గించడం వల్ల, ఆస్థుల సాధారణ విలువను తెలుసుకుని, అవి ఎంత విలువ చేస్తాయనేది తెలుస్తుంది. ఆదాయ స్టేట్‌మెంట్‌లో దీనికి సంబంధించిన నష్టాన్ని ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది. ఆస్థిఅప్పుల పట్టికలో సరిజేసిన కొత్త ఆస్థి విలువను మాత్రమే చూపిస్తున్నారు.<ref>[http://www.pwc.com/pdf/my/eng/issues/intangibleassets.pdf  గుడ్‌విల్‌పై దృష్టి, కనిపించని ఆస్థులు]


</ref>

ఒకవేళ వ్యాపారం ఇబ్బందుల్లో వుంటే, దివాలా తీసే ప్రమాదం ఏర్పడితే, పెట్టుబడిదారులు గుడ్విల్ విలువను తగ్గించి లెక్క కడతారు. ఎందుకంటే, తర్వాత వ్యాపారానికి తిరిగి అమ్మకపు విలువ వుండదు.

==వీటిని కూడా చూడండి==
*కనిపించని ఆస్థులు
*వ్యాపార విలువ
*కన్సాలిడేషన్‌ (వ్యాపారం)
*కంట్రోల్‌ ప్రీమియమ్‌
*డివెస్ట్‌మెంట్‌
*సంస్థ విలువ
*విలీనాలు మరియు స్వాధీనాలు
*ఉప కంపెనీ

==సూచికలు==
{{Reflist}}

{{corporate finance and investment banking}}

{{DEFAULTSORT:Goodwill (Accounting)}}
[[Category:సాధారణంగా అంగీకరించే అకౌంటింగ్‌ సిద్ధాంతాలు]]
[[Category:విలీనాలు మరియు స్వాధీనాలు]]

[[en:Goodwill (accounting)]]
[[hi:साख (लेखा)]]
[[ml:ഗുഡ്‌വിൽ]]
[[ar:شهرة (محاسبة)]]
[[ca:Fons de comerç]]
[[cs:Goodwill]]
[[da:Goodwill]]
[[de:Geschäfts- oder Firmenwert]]
[[el:Υπεραξία]]
[[es:Fondo de comercio]]
[[eu:Merkataritza-funts]]
[[fa:سرقفلی]]
[[fi:Liikearvo]]
[[fr:Goodwill]]
[[he:מוניטין (חשבונאות)]]
[[id:Goodwill (akuntansi)]]
[[is:Viðskiptavild]]
[[ja:のれん (会計)]]
[[nl:Goodwill]]
[[no:Goodwill]]
[[pl:Wartość firmy]]
[[pt:Patrimônio de marca]]
[[ru:Деловая репутация]]
[[sv:Goodwill]]
[[th:ค่าความนิยม]]
[[uk:Гудвіл]]
[[zh:商譽]]