Revision 772906 of "డెల్ఫీ" on tewiki

{{యాంత్రిక అనువాదం}}
{{Infobox World Heritage Site
|Name        = Archaeological Site of Delphi
|infoboxwidth= 250px
|Image       = [[దస్త్రం:Delphi Composite.jpg|250px]]<br /><small>The theatre, seen from above</small>
|State_Party = {{GRE}}
|Type        = Cultural
|Criteria    = i, ii, iii, iv, v and vi
|ID          = 393
|Region      = [[List of World Heritage Sites in Europe|Europe]]
|Year        = 1987
|Session     = 11th
}}

'''డెల్ఫీ'''  (గ్రీకు){{polytonic|Δελφοί}}{{IPA-el|ðelˈfi|}}<ref>ఇంగ్లిష్‌లో ''డెల్ఫీ''  పేరును {{IPA-en|ˈdɛlfaɪ|}}గా గానీ, లేదా గ్రీకు మాదిరిగా ధ్వనించే {{IPA|/ˈdɛlfiː}}గా గానీ పిలుస్తారు. గ్రీక్‌ స్పెలింగ్‌ను యథాతథంగా అనువదిస్తే ''''డెల్ఫోయి''' '' (ఓ తో పాటుగా) అని వస్తుంది. ఇందులోని మాండలికాలు '''బెల్ఫోయ్‌'''  (అయోలియన్‌ రూపం), డాల్ఫోయ్‌ (ఫోసియన్‌ రూపం), వీటితో పాటు [http://www.travel-to-delphi.com/page.php?id=3&amp;back=delphi.php ఇతర గ్రీకు మాండలిక రూపాలు].</ref>[[గ్రీస్|గ్రీస్‌]]లో ఓ పురాతత్వ ప్రాంతం, ఆధునిక నగరం కూడా. ఫోసిస్‌ లోయలో మౌంట్‌ పార్నాసస్‌కు నైరుతి భాగాన ఉంటుంది. గ్రీకు పౌరాణికాల్లో డెల్ఫిక్‌ దైవవాణికి డెల్ఫీ ఆవాసం. ఇది ప్రామాణిక గ్రీకు ప్రపంచంలోని దైవ వాణుల్లోకెల్లా అతి ముఖ్యమైనది. [[అపోలో]] (గ్రీకుల సూర్యదేవుడు) కొండచిలువను హతమార్చిన తర్వాత నుంచీ అతన్ని పూజించే ప్రముఖ స్థలంగా మారింది. సూర్యదేవుడు అక్కడే నివసిస్తూ భూమి కేంద్రాన్ని కాపాడతాడని గ్రీకులు నమ్ముతారు. అయితే అపోలో ఓడించిన కొండచిలువకు గుర్తుగా ఈ ప్రాంతానికి అసలు పేరు పైతాన్‌ (పైథియాన్‌ అనే క్రియాపదం నుంచి వచ్చింది, అంటే కుళ్లిపోవడమని అర్థం) అని కూడా కొందరు చెబుతారు (మిల్లర్‌, 95). ఈ ప్రాంతానికి పురాతన నామం ''క్రిస''  అని డెల్ఫిక్‌పై హెమర్‌ రాసిన సూక్తం చెబుతుంది.<ref>''హిమ్‌ టు పైథియన్‌ అపోలో'' , 1. 254ా74: గ్లేడ్స్‌ ఆఫ్‌ పార్నసాస్‌కు దిగువన ''క్రిసా'' ప్రాంతంలో తన ఒరాకిల్‌ ఆలయాన్ని నిర్మించాల్సిందిగా టెల్ఫౌసా అపోలోకు సిఫార్సు చేస్తుంది.</ref> డెల్ఫీలో అపోలో పవిత్ర ఆవరణ పాన్‌హెలెనిక్‌ సంరక్షణ కేంద్రం. అక్కడ క్రీస్తుపూర్వం 586 నుంచీ(మిల్లర్‌, 96) ప్రతి నాలుగేళ్లకోసారి గ్రీక్‌ ప్రపంచమంతటి నుంచీ క్రీడాకారులు వచ్చి పైథియాన్‌ క్రీడల్లో పాల్గంటుంటారు.ఇది నాలుగు పాన్‌హెలెనిక్‌ క్రీడల్లో (లేదా స్టెఫానిటిక్‌) ఒకటి. ఆధునిక ఒలింపిక్‌ క్రీడలకు కూడా ఇవే ఆద్యులు. డెల్ఫీ పోటీల్లో విజేతలకు ప్రశంసాపూర్వకంగా మకుటం బహకరించేవారు. పైథాన్‌ను హతమార్చే (మిల్లర్‌, 96) గాథను అభినయించే ఒక కుర్రాడు ఆ కిరీటాన్ని టెంపేలోని ఓ చెట్టు నుంచి కొట్టి తెచ్చేవాడు. అయితే డెల్ఫీ ఇతర క్రీడా స్థలాలకు భిన్నంగా ఉండేది. ఎందుకంటే మౌసికోలు, సంగీత పోటీలకు (మిల్లర్‌, 95) కూడా అది ఆతిథ్యమిచ్చేది. ఈ పైథియాన్‌ క్రీడలు ప్రాధాన్యత (మిల్లర్‌, 96) ఆధారంగా వరుస క్రమంలో నాలుగు స్టెఫానిక్‌ క్రీడల్లో రెండో స్థానం ఆక్రమించేవి. అయితే ఒలింపియా క్రీడలకు ఇవి భిన్నంగా ఉండేవి. ఒలింపియా క్రీడలకు ఒలింపియా నగరంలో ఇచ్చినంతటి అమిత ప్రాధాన్యాన్ని డెల్ఫీ క్రీడలకు డెల్ఫీ నగరంలో ఇచ్చేవారు కాదు. అయితే ఈ క్రీడలకు ఆతిథ్యమిచ్చినా, ఇవ్వకున్నా డెల్ఫీ ప్రఖ్యాత నగరంగానే భాసిల్లేది. దానికి ఇతరత్రా ఎన్నో ఆకర్షణలున్నాయి. అవే డెల్ఫీని భూ కేంద్రం (ఓంఫలస్‌)గా పేరు తెచ్చి పెట్టాయి.మరోలా చెప్పాలంటే ప్రపంచానికి కేంద్రంగా డెల్ఫీని మార్చాయి (మిల్లర్, 96-7).
అపోలో ఆలయం లోపలి ''హెసిటా''  (అగ్నిగుండం)లో ఓ అమర జ్యోతి జ్వలిస్తూ ఉండేది. ప్లాటా యుద్ధం తర్వాత గ్రీకు నగరాలన్నింట్లోనూ నిప్పు నిండుకుంది. దాంతో అవన్నీ డెల్ఫీలోని గ్రీస్‌ అగ్నిగుండం నుంచే కొత్త నిప్పును తెచ్చుకున్నాయి. పలు గ్రీకు వలస రాజ్యాల స్థాపనకు సంబంధించిన కథల్లో కూడా వాటి స్థాపకులు వాటిని డెల్ఫీకే అంకితం చేసేవారు.<ref>బర్కెర్ట్‌ 1985, పేజీలు 61, 84.</ref>

== ప్రాంతం ==
[[దస్త్రం:Map Greek sanctuaries Delphi.gif|thumb|డెల్ఫీ (ఎడమ కేంద్రం) మధ్య గ్రీసులో కోరింత్‌ అగాథానికి ఉత్తరాన ఉంది.]]

డెల్ఫీ దిగువ మధ్య గ్రీసులో మౌంట్‌ పర్నసాస్‌ వాలును ఆనుకుని పీఠభూమి/ఎత్తయిన సమ ప్రదేశంపై ఉంటుంది. పురాతన దైవవాణికి ఆలవాలమైన అపోలో సంరక్షణ కేంద్ర ప్రాంతం కూడా డెల్ఫీలోనే ఉంటుంది. ఫాడ్రియాడ్స్‌గా పిలిచే అర్ధవృత్తాకార ప్రాంతం ప్లెస్టోస్‌ లోయకు ఎదురుగా, డెల్ఫీకి నైరుతీ దిక్కుగా కన్పిస్తుంది. దీనికి దాదాపు {{convert|15|km|mi|abbr=on|lk=off}} దూరంలో కోరింతియన్‌ అగాథంలో కిర్హా రేవు పట్టణం ఉంటుంది.
మౌంట్‌ పార్నసాస్‌ స్పర్‌కు నైరుతి దిక్కుగా కూడా డెల్ఫీయే ఉంటుంది.

== అపోలోకు అంకితం ==
''డెల్ఫోయ్‌''  అనే పేరు ''డెల్ఫిస్‌''  అనే మూలపదం నుంచే వచ్చింది. దీనికి [[గర్భం]] అని అర్థం. [[భూమి]] అమ్మమ్మ గైయాకు, ఈ ప్రాంతంలోని భూమాతకు ఉన్న పురాతన ప్రాధాన్యానికి ఇది చిహ్నం.<ref>జోసెఫ్‌ ఫోంటేన్‌రోజ్‌, ''ద డెల్ఫిక్‌ ఒరాకిల్‌: ఇట్స్‌ రెస్పాన్సెస్‌ అండ్‌ ఆపరేషన్స్‌, విత్‌ ఏ కేటలాగ్‌ ఆఫ్‌ రెస్పాన్సెస్‌''  (1978). పేజీలు 3-4 ''దాని ప్రతిష్ట అంతటిది. క్రీస్తుపూర్వం 500 తర్వాత హెలెనెస్‌లో చాలామంది ప్రపంచపు తొట్ట తొలి రోజుల్లో అపోలో ఇంకా అంతటినీ తన అధీనంలోకి తీసుకోకముందు అక్కడే పునాదులు ఉంచేవారు. గే (భూమి( (''గైయా'' ), ఆమె కూతురు థెమిస్‌ ఇద్దరూ పైథో వద్ద దైవ వాణి చెప్పేవారని వారన్నారు. ఈ సంప్రదాయపు శక్తి యెంతటిదంటే, ఈ ప్రాంతం అపోలో ఆవాసంగా మారకముందు గైయా, థెమిస్‌ ఇద్దరూ ఇక్కడ దైవ వాణి చెప్పారన్న పురాతన వాక్యాన్ని సంప్రదాయంతో పాటు పలువురు చరిత్రకారులు కూడా వాస్తవమనే అంగీకరించారు. కానీ ఈ వాక్యాలను బలపరిచేందుకు ఐతిహ్యాలే తప్ప ఆధారాలేవీ లేవు. డెల్ఫిక్‌ దైవ వాణి ప్రారంభపు దినాలకు సంబంధించి మనకు అందుబాటులో ఉన్న తొట్ట తొలి ఆధారాలను చూస్తే ఈ గాథ హెAమర్‌ అపోలోకు రాసిన సూక్తం (281-374)లో ఇది తొలుత కన్పిస్తుంది. అపోలో ఇక్కడికి వచ్చి కొండచిలువ ఏకైక ఆవాసమైన గొప్ప ఆడ గ్రాడన్‌ను చంపేదాకా ఇక్క దైవ వాణే లేదు. ఇది ఆరో శతాబ్దానికి చెందిన డెల్ఫీ ఐతిహ్యమన్నది సుస్పష్టం.</ref><ref>
లూయిస్‌ రిచర్డ్‌ ఫార్నెల్‌, ''ద కల్ట్స్‌ ఆఫ్‌ ద గ్రీక్‌ స్టేట్స్‌'' , మూడో సంపుటి. పేజీలు 8-10 నుంచి. ''భూమి మృతుల ఆవాసం. అందుకే భూ దేవతకు దెయ్యాల ప్రపంచం పై అధికారముంటుంది. కలల రూపాలపై కూడా. అవి తరచూ భవిష్యత్తును సూచిస్తుంటాయి. ఈ కలలు అథో జగత్తు నుంచి పుట్టుకొస్తాయని భావిస్తారు. అందుకే భూ దేవతకు దైవ వాణి చెప్పే విధి కూడా నిర్దేశించబడింది. మరీ ముఖ్యంగా పొదిగే ప్రక్రియలో భాగంగా. ఇందులో కన్సల్టెంటు పవిత్ర మందిరంలో తన చెవిని భూమికి ఆన్చి పడుకుని ఉంటాడు. ఇలాంటి అంచనాలను గైయాకు ఆపాదిస్తారు. ఏథెన్స్‌, ఏగేల్లోని డెల్ఫీలో ఆమె చేసిన పూజలకు వీటిని ఆపాదిస్తారు. ఇటీవల బయట పడిన శాసనాల్లో ఒకటి డెల్ఫీలో గే ఆలయం గురించి మాట్లాడుతుంది. ... బహూశా గైయాను దృష్టిలో ఉంచుకునే ఇది చెప్పారు కావచ్చు. మనం కూడా దీన్ని అంగీకరించవచ్చు. అనంతర కాలపు డెల్ఫిక్‌ దైవత్వానికి సంబంధించిన పలు లక్షణాల్లో ఇది ధ్రువీకరించబడింది కూడా. దాంతోపాటు కొండచిలువకు చెందిన గాథ కూడా దీన్ని ధ్రువీకరించింది.</ref> అపోలోకు డెల్ఫీనియన్‌ (''డెల్ఫినోస్‌'' ) అనే తన బిరుద నామం ద్వారా ఈ ప్రాంతంతో సంబంధముంది. ''అపోలోను స్తూతిస్తూ హెమర్‌ రాసిన సూక్తం''  (400వ లైను)లో వచ్చే ఈ బిరుదుకు డాల్ఫిన్లతో సంబంధముంది. అపోలో డాల్ఫిన్‌ రూపంలో తన వీపు పై క్రేటన్‌ పూజారులను ఎక్కించుకుని తొలిసారిగా డెల్ఫీకి వచ్చిన పురాణ గాథను ఇది గుర్తు చేస్తుంది. ఈ దైవ వాణికి [[హోమర్|హెమర్‌]] పెట్టిన పేరు ''పైథో''  ''(Πυθώ)'' .<ref>ఒడిస్సీ, 7, 80.</ref>

అపోలో ఉత్తర దిశ నుంచి డెల్ఫీకి నడిచి వెళ్లాడని, థెసలీలోని టెంపే నగరం వద్ద తనకు అతి పవిత్రమైన లారెల్‌ మొక్క (ఇంగ్లిష్‌లో బే ట్రీ అని కూడా అంటారు)ను తెంపేందుకు ఆగాడని మరో ఐతిహ్యం చెబుతుంది. ఈ ఐతిహ్యానికి గుర్తుగా పైథియన్‌ క్రీడల్లో విజేతలు ఈ ఆలయం నుంచి తీసుకొచ్చిన భస్మాన్ని (బే ఆకుల) కానుకగా స్వీకరిస్తారు.

[[దస్త్రం:Temple of Apollo at Delphi from below with ivy.JPG|200px|thumb|అపోలో ఆలయం తూర్పు చివర దిగువ నుంచి కన్పిస్తుంది.]]
[[దస్త్రం:Ancient athletics stadium at Delphi.JPG|200px|thumb|పైథియన్‌ క్రీడల కోసం వాడే డెల్ఫీ సంరక్షణ కేంద్రం మౌంటేన్‌ టాప్‌ స్టేడియం దృశ్యంకుడివైపు ఉన్న రాతి మెట్లు/సీట్లు రోమన్ల హయాంలో నిర్మించినవి.]]

ఫోబెస్‌ అపోలో తాలూకు పెద్ద ఆలయంతో పాటు పైథియాన్‌ క్రీడలకు, ప్రఖ్యాత పూర్వా చారిత్రక దైవ వాణికి కూడా డెల్ఫీ ఆలవాలంగా మారింది. రోమన్‌ కాలంలో కూడా ఇక్కడ వందలాది వోటివ్‌ విగ్రహాలుండేవి. ప్లినీ ద యంగర్‌ వీటిని అభివర్ణించాడు. పసానియస్‌ కూడా వీటిని సందర్శించాడు. ఈ ఆలయంలోకి మలిచారని చెప్పే మూడు పదబంధాలు{{polytonic|γνωθι σεαυτόν}} కూడా కన్పిస్తాయి. (''గ్లోథి సీటెన్'' ‌ - నో దై సెల్ప్‌ - అంటే నిన్ను నీవు తెలుసుకో), (''మెడెన్‌ అగన్‌''  - నథింగ్‌ ఇన్‌ ఎక్సెస్‌ - ఏదీ మితిమీరకూడదు), {{polytonic|μηδέν άγαν}}''ఎంగ్యా పరా డేట్'' ‌ - మేక్‌ ఏ ప్లెడ్జ్‌ అండ్‌ మిస్చిఫ్‌ ఈజ్‌ నై - చిలిపి చేష్టలు చేయబోననే వాగ్దానం). వీటితో పాటు ఓ భారీ 'ఇ' అక్షరం కూడా ఉంది.<ref>ప్లేటో, ''చార్మిడీస్‌''  164 డీ - 165 ఏ.</ref> మిగతా వాటిలో 5 అంకెను కూడా ఎప్సిలోన్‌ ప్రధానంగా చూపుతుంది. ఈ శాసనానికి ఉన్న ఏకైక సాహితీ ఆధారం '''ఇ ఎట్‌ డెల్ఫీ'' 'పై ప్లాట్రాచ్‌ రాసిన వ్యాసం మాత్రమే. ప్రాచీన కాలంలో ఈ పదబంధాల మూలాన్ని ఏడుగురు గ్రీస్<ref>[[ప్లేటో]], [[''ప్రోతాగరస్‌'']]  343 ఏాబీ.</ref>‌ రుషుల్లో ఒకరికి ఆపాదిస్తారు. వీటి విశ్వసనీయతను ఆధునిక మేధావులతోపాటు పాత కాలం వారు కూడా ఎప్పుడూ సందేహించారు.<ref>హెచ్‌.పార్క్‌, డి.వార్నెల్‌. ''ద డెల్ఫిక్‌ ఒరాకిల్‌'' , (బాసిల్‌ బ్లాక్‌వెల్‌, 1956), వాల్యూమ్‌ 1. పేజీలు 387–389.</ref> ఒక జంట మేధావుల అభిప్రాయంలో ''డెల్ఫీలోని ఆలయం పై ఉన్న ఈ మూడు సామెతల కర్త ఎవరన్నది బహూశా ఎప్పటికీ సందిగ్ధమే. కాకపోతే తర్వాతి కాలంలో వాటిని మెల్లిగా ప్రఖ్యాత రుషులకు ఆపాదించారు''.<ref>పార్క్‌, వార్నెల్‌, పేజీ 389.</ref> 

పాత కాలం వాటితో విభేదించే ఓ తర్వాతి కాలపు ఐతిహ్యం ఇలా చెబుతుంది. అపోలో యువకునిగా ఉండగా పాతాళవాసి అయిన ఓ సర్పం అయిన కొండచిలువను చంపాడట. పాత ఐతిహ్యాల్లో దాన్నే పైథియాగా చెప్పారు. కానీ తర్వాతి కాలంలో వచ్చిన కొన్ని ప్రస్తావన ప్రకారం అది కస్టాలియన్‌ స్ప్రింగ్‌ పక్కన నివసించే అతని భార్య. ఎందుకంటే అపోలో, అర్తెమిస్‌ల వల్ల గర్భవతి అయిన లేటోను బలాత్కరించేందుకు పైథియా ప్రయత్నించింది. వారి జంట శరీరాలను అపోలో రాడ్‌ చుట్టూ చుట్టి ఉంచారు. వాటినతను తన రెక్కల సాయంతో దైవ సూచిక అయిన కాడుసెస్‌గా మార్చాడు. ఈ ప్రవాహం ఆలయం కేసి ప్రవహించి అక్కడ భూగర్భంలోకి అంతర్ధానమైపోతుంది. అక్కడ పగుళ్లను ఏర్పరుస్తుంది. అందులోంచి వచ్చే బుడగలే డెల్ఫీలోని దైవ వాణి భవిష్యత్తు చెప్పేందుకు దోహదపడతాయి. అపోలో కొండచిలువను చంపాడు గానీ అందుకు శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఎందుకంటే అది గైయా సంతానం. అపోలోకు అంకితమిచ్చిన ఆ ఆలయం కూడా తొలుత గైయాదే. ఆ తర్వాత బహూశా పొసేడియాన్‌ది. డెల్ఫిక్‌ దైవ వాణికి పైథియా అనే పేరే కొనసాగింది. ఈ హత్యకు శిక్షగా ఎనిమిదేళ్ల పాటు నీచపు పనులు చేసేందుకు అపోలోను పంపారు. కొండచిలువను చంపడాన్ని చిత్రించేందుకు ఏటా సెప్టేరియా నాటకాన్ని ప్రదర్శిస్తారు. ఆ తర్వాత ఎగిరిపోవడం, దైవ వాణి, ఆయన ఆవిర్భావాలను అందులో చూపుతారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని పైథియాన్‌ క్రీడలు ప్రతి నాలుగేళ్లకోసారి జరిగేవి.<ref>సీఎఫ్‌.సీఫెర్ట్‌, ''డిక్షనరీ ఆఫ్‌ క్లాసిక్‌ ఆంటీక్విటీస్‌'' , [http://www.ancientlibrary.com/seyffert/0178.html ఆర్టికల్‌ ఆన్‌ ''డెల్ఫిక్‌ ఒరాకిల్‌''].</ref> డెల్ఫీలో నిత్యం జరిగే మరో ఉత్సవం ''థెయోఫానియా''. ఇది ఏటా వసంత కాలంలో జరుపుకునే పండుగ. అపోలో తన చలికాలపు ఆవాసంలో గాఢసుషుప్తి నుంచి బయటికి వచ్చే సందర్భాన్ని ఇలా జరుపుకుంటారు. సాధారణంగా ఆలయం లోపల సంరక్షణ కేంద్రంలో దాచి ఉంచే దైవ ప్రతిమలను భక్తుల దరికీ ప్రదర్శించడంతో సాధారణంగా ఈ పండుగ ముగుస్తుంది.<ref>జేమ్స్‌ హాల్‌, ''ఏ హిస్టరీ ఆఫ్‌ ఐడియాస్‌ అండ్‌ ఇమేజెస్‌ ఇన్‌ ఇటాలియన్‌ ఆర్ట్‌'' , పేజీలు 70-71, 1983, జాన్‌ ముర్రే, లండన్‌, ISBN 0-7195-3971-4</ref> ఇక ప్రతి వేసవిలోనూ ''థెయోక్సేనియా''ను జరుపుతారు. ఇది దేవతలకు, ఇతర రాజ్యాల ప్రతినిధులకు ఇచ్చే విందు.<ref>[http://books.google.co.uk/books?id=EiyDaZ5DWx0C&amp;pg=PA138&amp;dq=Delphi+theoxenia&amp;lr=&amp;as_brr=3&amp;ei=0rrfSeOlJJbyygTwrvjaBA గూగుల్‌ బుక్స్‌] స్టేల్‌, ఎవా. ''పర్ఫార్మెన్స్‌ అండ్‌ జెండర్‌ ఇన్‌ ఏన్షెంట్‌ గ్రీస్‌: నాన్‌డ్రమాటిక్‌ పోయెట్రీ ఇన్‌ ఇట్స్‌ సెటింగ్‌'' , పేజీ 138, ప్రిన్‌స్టెన్‌ యూనివర్సిటీ ప్రెస్‌, 1996, ISBN 0-691-03617-9, 9780691036175</ref> 

అపోలో ఓడించి చంపి, ఓంఫలస్‌ కింద పూడ్చి పెట్టిన కొండచిలువ ఓ భూసురం. ఒక దేవత మరో దేవత సమాధిపై ఆలయం నిర్మించడానికి ఇదో ఉదాహరణ అని ఎర్విన్ రోడ్ రాశాడు. గ్రీకుల దేవతల సమూహంలో అపోలో చాలా తర్వాతి కాలంలో చేరాడన్నది మరో వాదన. నిజమైన గాథలో ఆయన స్థానం లైడియాదని చెబుతారు. ఉత్తర అనతోలియాకు చెందిన ఎత్రుస్కాన్లు కూడా అపోలోను పూజించారు. అతను తొలుత మెసపుటోమియా అప్లుకు అచ్చమైన నమూనా అయి ఉండవచ్చు. అకాడియన్‌ పదబంధమైన అప్లు అంటే కుమారుడని అర్థం. తొలుత దీన్ని ఎన్లిల్‌ కొడుకైన నెర్గాల్‌ దేవునికిచ్చారు. అపోలో స్మింథెయస్‌ (గ్రీకు){{ polytonic|Απόλλων Σμινθεύς}} చిట్టెలుకల సంహర్త<ref>ఎంట్రీ [http://old.perseus.tufts.edu/cgi-bin/ptext?doc=Perseus%3Atext%3A1999.04.0057%3Aentry%3D%2395523 σμινθεύς]హెన్రీ జార్జ్‌ లిడెల్‌, రాబర్ట్‌ స్కాట్‌, ఏ గ్రీక్‌ ఇంగ్లిష్‌ లెక్సికాన్‌</ref>. వ్యాధులకు ప్రథమ కారణమైన ఎలుకలన్నింటినీ నిర్మూలిస్తాడు. కాబట్టి నివారక ఔషధాల వాడకాన్ని ఆయన ప్రోత్సహిస్తాడని చెబుతారు.

== దైవ వాణి ==

స్థానిక సంరక్షణ కేంద్రంలోని దైవ వాణికి డెల్ఫీ బహూశా బాగా ప్రఖ్యాతి పొందింది. ప్రాచీన కాలంలో దీన్ని అపోలోకు అంకితం చేశారు. ''ఎమ్‌ఎండిస్‌''  ముందుమాటలో అషిలస్‌ చెప్పిన ప్రకారం దీని మూలాలు పూర్వ చారిత్రక సమయాల్లోనే ఉన్నాయి. గైయా పూజలో కూడా అవి కన్పిస్తాయి. క్రీస్తుపూర్వం 8వ శతాబ్ది చివరి నాళ్లలో డెల్ఫీ ప్రాంతపు వలసల్లో పెద్ద సంఖ్యలో కళాకృతులు, కళాఖండాలు నిత్యం దొరుకుతూనే ఉండేవి. ఇది 9వ శతాబ్ది అనంతరపు మైసేనియన్‌ తర్వాతి కాలపు కొత్త ఆవాస ప్రాంతం. వారి పింగాణీ, కాంస్య పాత్రలు తదితరాలతో పాటు త్రిపాది జంతువులకు అంకితమిచ్చిన వస్తువులు ఒలింపియాతో పోలిస్తే తరచూ దొరుకుతూ వస్తున్నాయి. అయితే అప్పట్లో డెల్ఫీ అందరి దృష్టినీ నిత్యం ఆకర్షించేదని చెప్పే ప్రతిష్టాత్మక అంకితాత్మకాలు గానీ, పలు రకాల వస్తువులు గానీ అక్కడేమీ దొరకలేదు. కాకపోతే అత్యధిక విలువ ఉన్న వస్తువులు భారీ స్థాయిలో దొరికాయి. అవి ఈ స్థాయిలో మరే ప్రాంతంలోనూ దొరకలేదు. ఇది కచ్చితంగా డెల్ఫీ ప్రాధాన్యతను పెంచేదే.

అపోలో తన దైవవాణి రూపకంగా మాట్లాడేవాడు. డెల్ఫీ దైవ వాణిలోని సిబిల్‌, లేదా పూజారినికి పైథియా అని పేరు. ఆ ప్రాంతంలోని రైతుల నుంచి ఆమెను ఎన్నుకునేవారు. మచ్చలేని జీవితం గడిపిన ముసలి వ్యక్తే అందుకు తగి ఉండేది. భూమి మధ్యలో తొలిచిన ఒక ప్రదేశంలో త్రిపాదాసనం పై ఆమె కూచునేది. అపోలో కొండచిలువను నరికేసినప్పుడు దాని శరీరం అందులో పడిపోయిందని ఐతిహ్యం. దాని కుళ్లిన శరీరం నుంచి విషవాయువులు వెలువడ్డాయి. వాటి ధాటికి సిబిల్‌ నిత్యం మగతలోకి జారుకునేది. అప్పుడు అపోలో ఆమెను ఆవహించేవాడు. ఆ స్థితిలో ఆమె సోది చెప్పేది. తీవ్రస్థాయి మగతకు దారితీసే ఎథిలీన్‌తో కూడిన భారీ విష వాయువులు అందులోంచి వచ్చేవని చెబుతారు. కాకపోతే ఇది ఎప్పుడూ చర్చనీయంగానే ఉంది.<ref>స్పిల్లర్‌, మేల్‌, డీ బోయెర్‌ (2000)లను చూడండి.</ref><ref name="Roach">{{cite news|title= Delphic Oracle's Lips May Have Been Loosened by Gas Vapors|author=John Roach|publisher=National Geographic|date=2001-08-14|url= http://news.nationalgeographic.com/news/2001/08/0814_delphioracle.html |accessdate=March 8, 2007 }}</ref> ఆ మగతలో పైథియా బహూశా ఓ అందమైన రూపానికి చెందిన ప్రసంగాన్ని చెక్కింది. వాటిని ఆలయంలోని పూజారులు అద్భుతమైన హెక్సామీటర్లలోకి అనువదించేవారు. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన అతి ప్రధానాంశాల నుంచి వ్యక్తిగత విషయాల దాకా అన్నింటికీ ప్రజలు ఈ దైవ వాణిని విధిగా సంప్రదించేవారు. కాకపోతే చలికాలపు నెలల్లో మాత్రం దైవ వాణిని వినడం సాధ్యపడేది కాదు. ఎందుకంటే సంప్రదాయికంగా అవి అపోలో గాఢసుషుప్తిలోకి జారుకునే నెలలు. అపోలో గైర్హాజరీలో డయోనిసస్‌ ఆ ఆలయంలో కొలువుండేవాడు.<ref>చూడండి ఫెరాన్‌ 2007, 182</ref>
 
డెల్ఫీ స్థాపన, అక్కడి దైవ వాణి వంటివన్నీ పూర్వ చారిత్రక యుగానికి చెందిన దృగ్విషయాలనీ, వాటి మూలాలు ఇప్పటికీ అస్పష్టమేనని హెచ్‌డబ్ల్యూ పార్క్‌ రాశారు. కాకపోతే టైటన్‌, గైయాల పూజల గురించి మాత్రం తేదీలను గణించడం బహూశా సాధ్యపడవచ్చని అభిప్రాయపడ్డారు.<ref>హెర్బర్ట్‌ విలియం పార్క్‌, ''ద డెల్ఫిక్‌ ఒరాకిల్‌'' , ఒకటో సంపుటి, మూడో పేజీ. ''డెల్ఫీ, దాని దైవ వాణి స్థాపన చారిత్రక యుగానికి ముందే జరిగింది. దీన్ని గురించి పురాతన సాధికార ఆధారాల నుంచి స్పష్టమైన వాక్యాలను ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. కానీ ప్రాథమిక సంప్రదాయాలను గురించిన సాదాసీదా వర్ణనలను ఆశించవచ్చు. నిజానికి మనం కనిపెట్టింది ఇది కాదు. దైవ వాణి స్థాపనను ముగ్గురు తొలినాళ్ల రచయితలు వర్ణించారు. ''హెమరిక్‌ హిమ్‌ టు అపోలో''  రచయిత యాషిలస్‌ తన ''యూమెండిస్‌''  ముందుమాటలో చెప్పాడు. యురిపిడెస్‌ కూడా తన ''ఇఫిజెనియా ఇన్‌ టౌరీస్‌'' లో దీన్ని ధ్రువీకరించాడు. ఈ మూడు కథనాలూ సులువుగా, సంప్రదాయికంగా ఉండటానికి బదులు సెలక్టివ్‌గా, సంక్లిష్టంగా ఉన్నాయి. మౌలికంగా అవి పరస్పరం విభేదిస్తాయి. కానీ తర్వాతి పురాతన కాలాల్లో వాటిని పైపైన మెరుగులద్ది ఒకటిగా చూపించారు''. పార్క్‌ ఇంకా ఇలా చెప్పారు. ''ఈ కథనాలు (ఎరిపైడస్‌) కచ్చితంగా తొలినాళ్ల సంప్రదాయాలను ఆధునిక రీతిలో తిరిగి చూపిస్తాయి. యెషిలిస్‌ తన సొంత ప్రయోజనం కోసమే ఇలా చేశాడు. అపోలో డెల్ఫీకి ఆక్రమణదారుగా వచ్చాడన్న వాదనను, అంతకు ముందు నుంచే ఉన్న భూ దైవ వాణిని సొంతం చేసుకున్నాడన్న కథనాన్ని ఆయన వ్యతిరేకించాడు. ఇక పెనుబామును నరికేయడం ఆ భూమి పై ఆధిపత్యం సాధించేందుకు అపోలో చేసిన దురాక్రమణే తప్ప ''హెమరిక్‌ హిమ్‌'' లో చెప్పినట్టుగా ఆ స్థలాన్ని అభివృద్ధి చేసే క్రమంలో జరిపిన ద్వితీయ ప్రాధాన్య కార్యం కానే కాదు. మరో భారీ వ్యత్యాసం కూడా ఉందిక్కడ. ఇక్కడ జోస్యం చెప్పేందుకు అనుసరించిన తీరు దాదాపుగా డొడోనాలో వాడేదానికి సమీపంగానే ఉందన్నట్టుగా ''హెమరిక్‌ హిమ్‌'' లో చెప్పారు. యాషెలిస్‌, ఎరుపైడెస్‌ కూడా ఐదో శతాబ్దం నాటి తమ రచనల్లో వీటిలో అవే పద్ధతులను వాడారని చెప్పుకొచ్చారు. అలాగే త్రిపాదులు, జోస్యపు గద్దెలను గురించి వారు చెప్పినవి కూడా ఇలాగే చాలా అంచనాల మీద ఆధారపడ్డాయి''. ఇక 6వ పేజీలో ఈ కథనాన్ని కొనసాగిస్తూ, ''డెల్ఫీలో ఉన్న మరో బిరుద నామపు లక్షణం కూడా ఈ స్థానానికి భూ దేవతతో ఉన్న పురాతన సంబంధాలను నిర్ధారించేదే. ఇది ఓంఫొలస్‌ అనే అండాకారపు రాతి. ఇది చారిత్రక కాలంలో ప్రధానాలయపు లోపలి భాగాన సంరక్షణ కేంద్రంలో ఉండేది. ఇది భూ కేంద్రానికి (నావెల్‌-ఓంఫలస్‌) సూచిన అని పురాతన ఐతిహ్యం చెప్పింది. ఈ స్థానాన్ని జేయుస్‌ గుర్తించాడట. రెండు గద్దలను భూమికి రెండువైపుల నుంచి ఎగిరేందుకు వదిలితే అవి సరిగ్గా ఇక్కడే కలుసుకున్నాయట''. ఇక ఏడో పేజీలో ఆయనింకా ఇలా రాశారు. ''అందుకే డెల్ఫీ తొలుత భూ మాత పేజకే అంకితమైన ప్రాంతం. భూ మాతను గ్రీకులు గై, లేదా గైయా (పురాణం) అని పిలచేవారు. సంప్రదాయికంగా భూమాత కూతురిగా, భాగస్వామిగా, లేదా వారసురాలిగా  చెప్పే థెమిస్‌ నిజానికి మరో దేవత తాలూకు అవతారమట. అషెలియస్‌ తాలూకు మరో అస్తిత్వాన్ని మరో సందర్భంలో గుర్తించారు. ఈ ఇద్దరి పూజ (ఒకటిగా గానీ, వేర్వేరుగా గానీ) అపోలో ఆగమనంతో ఆగిపోయింది. ఇక అపోలో ఆవిర్భావానికి సంబంధించిన గాథ కూడా అతి పెద్ద, ప్రఖ్యాత వివాదాల్లో ఒకటిగా నిలిచింది. అతనికి ''హెమరిక్‌ హిమ్‌''  ప్రాతినిధ్యం వహించిందని మాత్రం తెలుసుకుంటే మన వరకు చాలు. ఆ హిమ్‌ అతన్ని ఉత్తర దిశ నుంచి వచ్చిన ఆక్రమణదారుగా చిత్రిస్తుంది. ఈ ఆగమనం కచ్చితంగా మైసెలీనియన్‌, హెలెనిక్‌ కాలాల మధ్య వచ్చిన చీకటి యుగంలోనే జరిగింది ఉంటుంది. ఈ పూజా స్థలం కోసం గేతో అతని సంఘర్షణను అతను సర్పాన్ని సంహరించే ఐతిహ్యంలో భాగంగా చూపించారు''.</ref>

గ్రీకు ప్రపంచమంతటిపైనా దైవ వాణి ప్రభావం చాలా ఉంది. యుద్ధాలు, వలసల స్థాపన, ఇలా ప్రతి భారీ కార్యానికి ముందూ విధిగా ఆమెను సంప్రదించేవారు. గ్రీకు ప్రపంచానికి చుట్టుపక్కలా ఉన్న అర్ధ హెలెనిక్‌ దేశాల్లో కూడా ఆమె పట్ల అపార గౌరవ ప్రపత్తు ఉండేవి. లిడియా, కారియా, [[పురాతన ఈజిప్టు|ఈజిప్టు]] దాకా ఆమె ప్రతిష్ట ఇలా వ్యాపించింది.

:''పైథియా విన్పించిన దైవ వాణుల్లో చాలా ప్రఖ్యాతి పొందిన వాటి జాబితా కోసం ఫేమస్‌ ఒరాక్యులర్‌ స్టేట్‌మెంట్స్‌ ఫ్రమ్‌ డెల్ఫీని చూడండి.'' 

తొలుత ఈ దైవ వాణి కార్యక్రమానికి మాసిడోనియా రాజులు రక్షణ కల్పించారు. అనంతరం ఆ బాధ్యతలు అటోలియన్ల చేతికి వెళ్లాయి. కొంతకాలం తర్వాత రోమన్‌ సామ్రాజ్య ఆధిపత్యం పాతుకోవడం మొదలైంది. క్రీస్తుపూర్వం 109లోనూ, తిరిగి 105లోనూ ప్రమాదకరమైన ఆటవికుల దాడి బారి నుంచి దైవ వాణిని వారు కాపాడారు. వాటిని పునర్‌వ్యవస్థీకరించేందుకు భారీ ప్రణాళికను కూడా వారు ప్రారంభించారు. కానీ మిత్రిడాటిక్‌ యుద్ధాలు, సులా యుద్ధాలతో వాటికి విఘ్నం ఏర్పడింది. ఆ సమయంలో విధ్వంసకారులు దైవ వాణి నుంచి విలువైన బహూమతులెన్నింటినో కొల్లగొట్టారు. ఇక హఠాత్తుగా వచ్చి పడ్డ ఆటవిక మూకలు ఆలయాన్ని కాల్చి బూడిద చేశాయి. అనంతరం క్రీస్తుపూర్వం 83లో వచ్చిన భారీ భూకంపం దెబ్బకు ఆలయం మరింతగా దెబ్బతిన్నది. ఇలా దైవ వాణి క్రమంగా దెబ్బ తిని బీదరికంలోకి కూరుకుపోయింది. అక్కడి జనాభాకు ఖాళీలను పూరించడం పెను సమస్యగా మారింది. అంతేగాక కొన్ని సందిగ్ధమైన జోస్యాలు చెప్పడంతో దైవ వాణి ప్రతిష్ట కూడా మసకబారుతూ వచ్చింది. క్రీస్తుశకం 66లో నీరో గ్రీసుకు వచ్చినప్పుడు దాదాపు 500కు పైగా అత్యద్భుతం, అత్యుత్తమం అయిన శిల్పాలను డెల్ఫీ నుంచి రోమ్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాతి ఫ్లావియన్‌ వంశపు రోమన్‌ చక్రవర్తులంతా దైవ వాణి పునరుద్ధరణకు బాగా కృషి చేశారు. హండ్రియన్‌ అయితే దానికి పూర్తి స్వతంత్ర ప్రతిపత్తే కల్పించాడు. ప్లుటార్చ్ ప్రధాన పూజారిగా తానే ఉండటం ద్వారా దాని ప్రాధాన్యతను మరింతగా పెంచే ప్రయత్నం కూడా చేశాడు. కానీ ఆటవికుల దాడులు మార్కస్‌ అరేలియస్‌ సమయంలో బాగా పెరిగిపోయాయి. దాంతోపాటు శిల్పాల తొలగింపు, ఇతర విలువైన బహకృతులను కాన్‌స్టాంటైన్‌ 1 లూటీ చేయడం వంటివన్నీ మళ్లీ దైవ వాణిని దుర్దశకు తీసుకెళ్లాయి. కొంతకాలం పాటు సాగిన జూలియన్‌ పాలన పరిస్థితుల్ని పెద్దగా మార్చలేకపోయింది. అయితే క్రీస్తుశకం 395లో చక్రవర్తి థియోడొసియస్‌ 1 మూసేసే దాకా దైవ వాణి ప్రభ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత దాదాపు 100 ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని అంతా వదిలేశారు. క్రీస్తు శకం 600 తర్వాత క్రైస్తవులు ఈ ప్రాంతంలో స్థిరంగా ఆవాసముండటం మొదలు పెట్టి కస్త్రీ పేరుతో అక్కడ చిన్న పట్టణాన్ని ఏర్పాటు చేసేదాకా ఇదే పరిస్థితి కొనసాగింది.

== డెల్ఫిక్‌ సిబిల్‌ ==

డెల్ఫిక్‌ సిబిల్‌ ఓ పౌరాణిక జోస్యకత్తె. ట్రోజన్‌ యుద్ధాల అనంతరం డెల్ఫీలో ఆమె సోదె చెప్పిందని భావిస్తారు. ఆమెకు ఆపాదించే పలు జోస్యాలను ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంచారు. వాటితో పాటు బాకీల వంటి దైవ వాణి చెప్పేవారి జోస్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే సిబిల్‌కు అపోలో దైవ వాణితో ఏ సంబంధమూ ఏదు. కాబట్టి దీన్ని పైథియాగా పొరపడరాదు.<ref>హ బౌడెన్‌. [http://books.google.com/books?id=SoSJLj3O3tYC&amp;printsec=frontcover ''క్లాసికల్‌ ఎథేన్స్‌ అండ్‌ ద డెల్ఫిక్‌ ఒరాకిల్‌'' ],[http://books.google.com/books?id=SoSJLj3O3tYC&amp;printsec=frontcover ''డివినేషన్‌ అండ్‌ డెమోక్రసీ'' ], కేంబ్రిడ్జ్‌. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ప్రెస్‌, 2005. ISBN 0-8058-2179-1 Cf. పేజీ 14. ''రహస్యమైన డెల్ఫిక్‌ సిబిల్‌ గురించి వారు బహూశా తెలుసుకోవచ్చు. రహస్య స్త్రీ ప్రవక్తకు ఈ దైవ వాణి సంప్రదాయాలకు ఏ సంబంధమూ లేదు''.</ref>

== భవంతులు, నిర్మాణాలు ==
[[దస్త్రం:Santuario de Apolo Pitio.gif|thumb|left|200px|డెల్ఫీలోని అపోలో సంరక్షణ కేంద్రం ప్రాంతం నమూనా]]

వృత్తి
మైసేనియన్‌ కాలం (క్రీస్తుపూర్వం 1600-1100) సమయంలో ఇదంతా వృద్థిలోఉండేది. ఇప్పుడు కన్పించే శిథిలాల్లో అత్యధికం ఇక్కడ భారీ స్థాయిలో కార్యకలాపాలు మొదలైన క్రీస్తుపూర్వం 6వ శతాబ్దికి చెందినవే అయ్యుంటాయి.<ref name="a">[http://www.ancient-greece.org/archaeology/delphi-archaeology.html డెల్ఫీ పురాతత్వ ప్రాంతం].Ancient-Greece.org</ref> 

=== అపోలో ఆలయం ===
దాదాపు క్రీస్తుపూర్వం 4వ శతాబ్ది నాటికి చెందిన డెల్ఫీ ఆలయ శిథిలాలు నేటికీ అక్కడ దర్శనమిస్తాయి. ఇవన్నీ ఒక పెరిప్టెరల్‌ డోరిక్‌ భవంతి తాలూకువే. దాన్ని అంతకు ముందున్న ఆలయపు గుర్తుల పై పునర్నిర్మించారు. అవి క్రీస్తుపూర్వం 6వ శతాబ్ది నాటివి. నిజానికి ఆ గుర్తుల తాలూకు ఆలయాన్ని కూడా క్రీస్తుపూర్వం 7వ శతాబ్ది తాలూకు నిర్మాణ శిథిలాలపైనే పునర్నిర్మించారు. ఆ 7వ శతాబ్ది నిర్మాణాలను ట్రపోనియోస్‌, అగమెడెస్‌ అనే రూపశిల్పుల ప్రతిభగా చెబుతారు.<ref name="b">[http://www.ancient-greece.org/architecture/delphi-temple-of-apollo.html డెల్ఫీలోని అపోలో ఆలయం].Ancient-Greece.org</ref>
[[దస్త్రం:721-Grece.jpg|thumb|200px|డెల్ఫీలోని అపోలో ఆలయం]]
క్రీస్తుపూర్వం 6వ శతాబ్ది నాటి ఆలయానికి టెంపుల్‌ ఆఫ్‌ ఆల్కమెయోనిడా అని పేరు. అంతకుముందు కాలి బూడిదైన వాస్తవ ఆలయ పునర్నిర్మాణానికి నిధులందించిన అథేనియన్‌ కుటుంబానికి గౌరవ చిహ్నంగా దానికి ఆ పేరు పెట్టారు. కొత్త భవంతి 6 బై 15 సైజుల్లో నిర్మించిన డోరిక్‌ హెక్సా శైలి భవనం. ఈ ఆలయాన్ని క్రీస్తుపూర్వం 373లో ఓ భారీ భూకంపం తుడిచిపెట్టింది. ఆ శిథిలాల పై క్రీస్తుపూర్వం 330లో మరో ఆలయాన్ని నిర్మించారు. ఈ మూడో ఆలయాన్ని స్పింథరోస్‌, అగథాన్‌ అనే రూపశిల్పులు కట్టారని చెబుతారు.<ref name="b"/>
[[దస్త్రం:Columns of the Temple of Apollo at Delphi, Greece.jpeg|thumb|200px|గ్రీసులో డెల్ఫీలోని అపోలో ఆలయం వద్ద వరుసలు]]
ఇక్కడి పెడిమెంట్ శిల్పాలను [[ఏథెన్స్|ఏథెన్స్‌]]కు చెందిన ప్రాక్సియాస్‌, ఆండ్రోస్థెనెస్‌లకు ఆపాదిస్తారు. ఇదే రీతిలో కట్టిన రెండో ఆలయంలో కూడా 6 బై 15 తరహా శైలినే యథాతథంగా అనుసరించారు. స్టైలోబేట్‌ చుట్టూ ఇదే కన్పిస్తుంది.<ref name="b"/> అడిటోన్‌ లోపల డెల్ఫిక్‌ దైవ వాణి మధ్య భాగంలో, పైథియా ఆసనం సమీపంలో దీన్ని చూడవచ్చు. క్రీస్తుపూర్వం 1938-1300 మధ్య కాలంలో ఈ నిర్మాణాన్ని పాక్షికంగా పునరుద్ధరించారు.

ఈ ఆలయం క్రీస్తుశకం 390 దాకా మనగలిగింది. అప్పుడు ఈ ఆలయాన్ని, అందులోని దాదాపు అన్ని శిల్పాలనూ, కళాకృతులనూ క్రైస్తవం పేరుతో క్రైస్తవ చక్రవర్తి థియోడొయస్‌ 1 నాశనం చేశాడు. తద్వారా దైవ వాణిని సమాప్తం చేశాడు.<ref name="Ringp185">ట్రూడీ రింగ్‌, రాబర్డ్‌ ఎం.సాల్కిన్‌, షరోన్‌ లా బోడ్‌. ''ఇంటర్నేషనల్‌ డిక్షనరీ ఆఫ్‌ హిస్టారిక్‌ ప్లేసెస్‌: సదరన్‌ యూరప్‌'' , పేజీ 185[http://books.google.com/books?id=74JI2UlcU8AC&amp;pg=PA185&amp;dq=Temple+of+Apollo+delphi++theodosius&amp;hl=en&amp;ei=6BgCTKTLFcH68AafmNnBDQ&amp;sa=X&amp;oi=book_result&amp;ct=result&amp;resnum=1&amp;ved=0CCUQ6AEwAA#v=onepage&amp;q=Temple%20of%20Apollo%20delphi%20%20theodosius&amp;f=false ]</ref> అనంతరం పాగన్‌ మతపు చిహ్నాలన్నింటినీ తుడిచి పెట్టేందుకు ఈర్ష్యాళువులైన క్రైస్తవులు చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా పూర్తిస్థాయిలో నేలమట్టం చేసి వదిలారు.<ref name="Ringp185"/>

=== అంఫిక్టియోనిక్‌ కౌన్సిల్‌ ===
అంఫిక్టియోనిక్‌ కౌన్సిల్‌ డెల్ఫీని నియంత్రించే 12 గ్రీకు తెగల ప్రతినిధులతో కూడిన మండలి. పైథియన్‌ క్రీడలను కూడా ఇదే పర్యవేక్షించేది. వారు ప్రతి రెండోళ్లకు ఓసారి సమావేశమయేవారు. ఇందుకోసం థెసలీ నుంచి మధ్య గ్రీసుకు వెళ్లేవారు. కాలానుగుణంగా డెల్ఫీ పట్టణమే తనంత తానుగా ప్రాధాన్యం సంతరించుకుంటూ వచ్చింది. దాంతో ఈ మండలి ప్రాధాన్యం దాదాపుగా లుప్తమయింది.

=== సంపదలు ===
[[దస్త్రం:Treasury of Athens at Delphi.jpg|thumb|200px|ఏథెన్స్‌లో పునర్నిర్మించిన సంపద. బ్యాటిల్‌ ఆఫ్‌ మరాథాన్‌లో వారి విజయానికి గుర్తుగా దీన్ని నిర్మించారు.]]

ఈ ప్రాంతపు ప్రాకారం నుంచి వాలుగా దాదాపు ఆలయం దాకా అంతటా ఎటు చూసినా ఓటివ్‌ శిల్పాకృతులు మరియు వాటితో పాటే లెక్కలేనన్ని సంపదలు కూడా భారీ సంఖ్యలో దర్శనమిస్తాయి. వీటన్నింటినీ పలు గ్రీకు నగర రాజ్యాలు నిర్మించాయి. సముద్ర మధ్య భాగాన ఉన్న వాటితో పాటు ప్రధాన గ్రీసు భూభాగం పై ఉన్న రాజ్యాలు కూడా ఇందులో పాలు పంచుకున్నాయి. దైవ వాణి జోస్యం ఆధారంగా యుద్ధాల్లో పాల్గని గెలిచిన తర్వాత అందుకు కృతజ్ఞతా సూచకంగా అవి ఇలా నిర్మాణాలు చేసేవి. దైవ వాణి వల్లే తమ విజయాలు సాధ్యపడ్డాయి అని అవి నమ్మేవి. వీటిలో అపోలోకు కేటాయించిన పలు కానుకలను సమర్పించేవారు కాబట్టి వాటని సంపదలు (ట్రెజరీస్‌) అనేవారు. ఇవి సాధారణంగా తిథ్‌, అంటే యుద్ధంలో కొల్లగొట్టిన వస్తు సంపదల్లో పదో వంతు అయి ఉండేవి. ప్రస్తుతం పునరుద్ధరించిన ఆంథెనియన్‌ ట్రెజరీ వీటిలో అత్యంత ముఖ్యమైనది. సలామీల యుద్ధంలో ఆంథేనియన్ల యుద్ధానికి స్మారకంగా దీన్ని సమర్పించారు. చెక్క గోడల పై విశ్వాసముంచాల్సిందిగా గతంలో దైవ వాణి వారికి సలహా ఇచ్చిందని పాసానియా కథనం. దాన్ని తమ నావికా బలం పై నమ్మకముంచాలన్న సలహాగా తీసుకున్న వాళ్లు సలామీ యుద్ధంలో అద్భుత రీతిలో విజయం సాధించారు. నాటి సంపదల్లో చాలా వాటిని ఇప్పటికీ గుర్తించవచ్చు. సిఫ్నియన్‌ ట్రెజరీ వాటిలో ఒకటి. సిఫ్నియోస్‌ నగరం సమర్పించిన ఈ ట్రెజరీలో నగరవాసులు తమ బంగారు గనుల సంపదలో పదో వంతును సమర్పించుకున్నారు. సముద్రం పొంగి ముంచెత్తడంతో గనుల తవ్వకాలు మధ్యలోనే ఆగిపోయేదాకా ఈ సమర్పణలు కొనసాగాయి.

మరిన్ని గుర్తించగల ట్రెజరీల్లో సిక్యోనియన్స్‌, బోయెతియన్స్‌, థెబన్స్‌ వంటివాటిని చెప్పుకోవచ్చు. ఇక అతి పెద్ద ట్రెజరీల్లో ఆర్గోస్‌ ఒకటి. దీన్ని డోరిక్‌ యుగపు మలి నాళ్లలో నిర్మించారు. ఇతర నగర రాజ్యాలను ఓడించి తమ ఆధిపత్యం స్థాపించడం పట్ల అర్గీవ్‌ వాసులు బాగా ఆసక్తి చూపేవారు. దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు. క్రీస్తుశకం 380లో పూర్తయిన ఈ ట్రెజరీకి నగరపు అక్రోపలిస్ అయిన అర్గోలిస్‌లో ఉన్న హెరా ఆలయం చాలా వరకు స్ఫూర్తి. అయితే దీని స్థాపన అంతకు ముందే జరిగిందని ఇటీవలి కాలంలో ఈ పురాతత్వ వస్తువుల పై చేసిన పరిశోధనలు, పరిశీలనలు చెబుతున్నాయి.

ఈ ట్రెజరీల కారణంగా, ఆంఫిక్టియోనిక్‌ మండలి రక్షణ కారణంగా డెల్ఫీ దాదాపుగా పూరాతన గ్రీసుకు కేంద్ర బ్యాంకుగా వ్యవహరించసాగింది. ఈ సంపదలను మాసిడోనియా రాజు ఫిలిప్‌ దుర్వినియోగం చేశాడు. ఆ తర్వాత సెల్టులు, రోమన్‌ నియంత సుల్లా ఆధిపత్యం వంటివి గ్రీక్‌ నాగరికత పతనానికి, రోమ్‌ వికాసానికి దారితీశాయి.

=== చియాన్స్‌ యజ్ఞవాటిక ===
ఇది అపోలో ఆలయం ముందున్న ప్రధాన యజ్ఞవాటిక. దీన్ని చియోస్‌ ప్రజలు నిర్మించి నిర్వహించారు. దాని కర్నిస్ పై ఉన్న శాసనాలను బట్టి ఇది క్రీస్తుపూర్వం 5వ శతాబ్దికి చెందినదని తెలుస్తోంది. మొత్తం నల్లరాతితో జరిగిన ఈ నిర్మాణం (పునాదులు, కోర్నిస్‌ తప్ప) అద్భుతంగా కన్పించేది. దీన్ని 1920లో పునరుద్ధరించారు.<ref name="ministry">[http://www.culture.gr/2/21/211/21110a/e211ja01.html డెల్ఫీ], హెలెనిక్‌ మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్‌.</ref>

=== స్టోవా ఆఫ్‌ ద ఎథేనియన్స్‌ ===
ప్రధాన సంరక్షణ కేంద్రం నుంచి ఈశాన్య దిశగా స్టోవా ఉంటుంది. అయోనిక్‌ తరహాలో నిర్మితమైన స్టోవాలో ఏడు ఫ్లూటెడ్‌ కాలమ్‌లు కన్పిస్తాయి. వీటిని సాధారణంగా ఏకశిలల నుంచి నిర్మించారు. (వీటిలో చాలా కాలమ్‌లను పరస్పరం అనుసంధానించిన డిస్కుల ఆధారంగా నిలిపారు). స్టైలోబేట్‌ పై ఉన్న శాసనాలను బట్టి దీన్ని క్రీస్తుపూర్వం 478లో పర్షియన్ల పై సాధించిన నావికా విజయం అనంతరం ఏథెన్స్‌వాసులు నిర్మించారని తెలుస్తోంది. తమ యుద్ధ కానుకలను దాచుకునేందుకు వారు దీన్ని వాడుకున్నారట.<ref name="ministry"/> స్టోవా వెనక గోడ పై దాదాపు 1000కి పైగా శాసనాలున్నాయి. బహూశా ఏథెన్స్‌లో స్వేచ్ఛ పొందని ప్రతి బానిసా తనకు సంబంధించిన గాథను సంక్షిప్తంగా దీని పై చెక్కాల్సి ఉండేదట. తాను స్వేచ్ఛకు ఎందుకు అర్హుడో అందులో వివరించాలన్నమాట.

=== అథ్లెటిక్‌ శిల్పాలు ===
ఆరక్షిత అథ్లెటిక్‌ శిల్పాలకు కూడా డెల్ఫీ బాగా ప్రసిద్ధి చెందింది. వాస్తవానికి ఒలంపియా వీటిలో చాలా శిల్పాలకు ఆవాసంగా ఉండేదని, వాటిలో చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయని తెలుస్తోంది. రానురానూ డెల్ఫీయే అథ్లెటిక్‌ శిల్పాలకు ప్రధాన వేదికగా మారిందట (మిల్లర్‌, 98). బలానికి ప్రతీకలైన సోదరులు క్లియోబిస్‌, బిటన్‌ డెల్ఫీలో ఇప్పటిదాకా లభించిన అతి పురాతన శిల్పాల్లో రెండింటిలో దర్శనమిస్తారు. ఎద్దులు లేకపోవడంతో ఈ సోదరులిద్దరూ వాళ్ల తల్లి కూర్చున్న బండిని మైళ్ల కొద్దీ లాగి హెరా సంరక్షణ కేంద్రానికి చేరుస్తారు. దాన్ని పురస్కరించుకుని ఈ శిల్పాలను చెక్కించారు. దీన్ని చూసి పొరుగు వాళ్లంతా ఎంతో ప్రభావితులయ్యారు. దాంతో వాళ్ల తల్లి వారికి అత్యంత ఉత్తమమైన కానుక ప్రదానం చేయాల్సిందిగా హెరాను కోరుతుంది. వారు హెరా మందిరంలోకి ప్రవేశించగానే సుషుప్తిలోకి జారుకుంటారు. ఇక దాన్నుంచి లేవనే లేవరు. వారి కీర్తి చుక్కలనంటిన ఆ సమయంలో మరణించడమే వారికి అత్యుత్తమ కానుకన్నమాట (మిల్లర్‌, 98)!
ఇక డెల్ఫీ రథ చోదకుడు కూడా ఇక్కడి అతి పురాతన శిథిలాల్లో ఒకటి. శతాబ్దాల పాటు ఇది కాలపరీక్షకు నిలిచింది. ఇక్కడి అత్యుత్తమ శిల్పాల్లో ఇదొకటి. కానీ రథ చోదకుడు‌ శిల్పం చాలా భాగం కళ కోల్పోయింది. రథంతో పాటు అతని ఎడమ చేయి కూడా ఇప్పుడు కనిపించదు. కానీ పురాతన అథ్లెటిక్‌ కళలకు తిరుగులేని నివాళిలా అదిప్పటికీ అలాగే నిలిచి ఉంది (మిల్లర్‌, 98)

=== బహూపార్శ్వపు గోడ ===
క్రీస్తుపూర్వం 548లో అపోలో రెండో ఆలయ నిర్మాణ పిట్టగోడకు మద్దతుగా కట్టిన రిటైనింగ్‌ గోడ ఇది. దీన్ని నిర్మించిన పాలిగైనల్ విధానాన్ని బట్టి ఈ పేరు వచ్చింది.<ref name="ministry"/>

=== వ్యాయామశాల ===
ప్రధాన సంరక్షణ కేంద్రానికి అర మైలు దూరంలోని ఈ [[వ్యాయామశాల]] డెల్ఫీ యువత ఉపయోగించిన అనేక భవనాల సముదాయం. ఈ భవనం రెండు స్థాయిల్లో ఉంది. ఎగవ పార్శ్వంలో స్టోవా ఖాళీ స్థలాన్ని అందిస్తుంది. దిగువ అంతస్తులో ఒక పాలయెస్ట్రా, ఈత కొలనులు, స్నానఘట్టాలుంటాయి. ఈ ఈత కొలనులకు, స్నానఘట్టాలకు అద్భుత శక్తులుండేవని చెబుతారు. నేరుగా అపోలోతోనే మాట్లాడగల శక్తి వాటి సొంతమట!<ref name="ministry"/>

=== సాంకేతిక సమాహారం ===
డెల్ఫీలో పైథియన్‌ క్రీడల సమయంలో పరుగు పందాలు జరిగే ప్రాంతం హిప్పోడ్రోమ్‌. ఇప్పుడు దీని గుర్తులు కూడా దొరకడం లేదు. కానీ స్టేడియం ఉన్న ప్రాంతం, రిటైనింగ్‌ గోడలకు సంబంధించిన కొన్ని గుర్తులు మాత్రం దర్శనమిస్తాయి. ఇది ఒక మైదాన ప్రాంతం పై నిర్మితమైందని, నగరంలోని ప్రధాన భాగంలోనే ఉండేదని, అపోలోలోని పెరిబలోస్‌కు దూరంగా ఉండేదని తెలుస్తోంది (మిల్లర్‌, 101).

=== కస్టాలియన్‌ ఊటలు ===
[[దస్త్రం:Delphi stadium DSC06305.jpg|thumb|200px|డెల్ఫీలోని మౌంటేన్‌ టాప్‌ స్టేడియం. దిగువనున్న ఆలయాలు/నాటక రంగాలకు చాలా ఎత్తున ఉంది.]]

[[దస్త్రం:Athina Pronaia Sanctuary at Delphi.jpg|thumb|right|300px|డెల్ఫీలోని ఎథెనా ప్రొనాయియా సంరక్షణ కేంద్రం.]]

[[దస్త్రం:Delphi amphitheater from above dsc06297.jpg|thumb|200px|డెల్ఫీలోని నాటక రంగం (పై వరుస సీట్ల సమీపం నుంచి కన్పించే దృశ్యం).]]

[[దస్త్రం:DelphiTholos1.jpg|right|thumb|మౌంట్‌ పమసాస్‌ పాదపీఠం వద్ద థోలోస్‌. 20 వృత్తాకార వరుసల్లో 3.]]

డెల్ఫీలోని పవిత్ర ఊట ఫాడ్రియాడ్స్‌ నదీ గర్భం సమీపాన ఉంటుంది. ఇక్కడి రెండు అతి భారీ ఫౌంటెయిన్ల తాలూకు శిథిలాలను ఇప్పటికీ దాచి ఉంచారు. ఈ ఊట నుంచి అవి నీటిని గ్రహించేవి. వీటిని అర్చాయిక్‌, రోమన్‌ యుగాలకు చెందినవిగా చెబుతారు. అనంతర కాలంలో వీటిని రాళ్లుగా తొలిచేశారట.

=== స్టేడియం ===

స్టేడియం ''వయా సక్రా'' కు, థియేటర్‌కు ఆవల, కొండకు మరింత పై భాగాన నిర్మితమైంది. తొలుత దీన్ని క్రీస్తుపూర్వం 5వ శతాబ్దిలో నిర్మించారు. తర్వాతి శతాబ్దాల్లో మారుస్తూ వచ్చారు. చివరిసారిగా క్రీస్తుశకం 2వ శతాబ్దంలో దీన్ని పునర్నిర్మించారు. ఇది హీరోడస్‌ అటికస్‌ హయాంలో జరిగింది. దీనికి రాతి సీట్లు, ఆర్చితో కూడిన ప్రవేశ ద్వారాలను కూడా నిర్మించారు. ఇందులో ఒకేసారి 6,500 మంది కూచోగలిగే వీలుండేది. ఇక ఇక్కడి రన్నింగ్‌ ట్రాక్‌ 177 మీటర్ల పొడవు, 25.5 మీటర్ల వెడల్పుతో ఠీవిగా ఉండేది.<ref name="d">[http://www.ancient-greece.org/architecture/delphi-stadium.html డెల్ఫీ, స్టేడియం] at Ancient-Greece.org.</ref>

=== నాటక రంగం ===
డెల్ఫీలోని పురాతన నాటక రంగం‌ను అపోలో ఆలయం నుంచి కొండకు మరింత పై భాగాన నిర్మించారు. అక్కడి నుంచి చూస్తే దిగువ లోయలోని సంరక్షణ కేంద్రం దృశ్యం పూర్తిగా కన్పించేలా దాని నిర్మాణం సాగింది. తొలుత దీన్ని క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో నిర్మించారు. అనంతరం చాలాసార్లు పునర్నిర్మిస్తూ పోయారు. ఇక్కడి 35 వరుసల్లో 5,000 మంది ప్రేక్షకులు కూచునే వీలుంది.<ref name="b">[http://www.ancient-greece.org/architecture/delphi-theater.html డెల్ఫీ నాటక రంగం] at Ancient-Greece.org.</ref>

=== థోలోస్‌ ===
అథెనా ప్రోనాయియా సంరక్షణ కేంద్రం వద్ద ఉన్న థోలోస్‌ ఓ వృత్తాకార భవంతి. దీన్ని క్రీస్తుపూర్వం 380, 360 మధ్య నిర్మించారు. ఇందులో 20 వృత్తాకారపు వరుసలుంటాయి. అవి బయటి వైపు 14.76 మీటర్లు, లోపలివైపు 10 కోరింతియన్‌ కాలమ్‌ల నిర్మాణంతో ఉంటాయి. 

ఈ థోలోస్‌ డెల్ఫీ తాలూకు ప్రధాన శిథిలాలకు దాదాపుగా అర మైలు (అంటే 800 మీటర్లు) దూరంలో ఉంది. ఇక్కడి వృత్తాకారపు వరుసల్లో మూడింటిని పునర్నిర్మించారు. వీటిని డెల్ఫీలో పర్యాటకులు ఫొటోలు తీసుకునేందుకు అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతాలుగా మార్చారు.

డెల్ఫీలో ఉన్న వృత్తాకారపు భవన నిర్మాత థియోడరస్‌ ద ఫోషియాన్‌ అని విట్రువియస్‌ (7, ఉపోద్ఘాతం) చెప్పాడు.

=== సిబిల్‌ రాయ ===
సిబిల్‌ రాయ ఎథేనియన్‌ ట్రెజరీ, స్టోవా ఆఫ్‌ ద ఎథేనియన్స్‌ మధ్యలో ఒక రాతిపై పొడుచుకు వచ్చినట్టుగా ఉండే చర్చి బోధకుని వేదిక వంటి నిర్మాణం. డెల్ఫీ పురాతత్వ ప్రాంతంలో అపోలో ఆలయానికి దారి తీసే పవిత్ర మార్గం పై ఇది ఉంటుంది. సిబిల్‌ దీని పైనే కూచుని సోదె చెప్పేదని ఐతిహ్యం.

== తవ్వకాలు ==
మధ్యయుగ కాలం నుంచీ ఈ ప్రాంతాన్ని కస్త్రీ గ్రామవాసులు ఆక్రమించుకుని ఆవాసంగా మార్చుకున్నారు. ఈ ప్రాంతంలో వ్యవస్థీకృతమైన తవ్వకాలు ప్రారంభించడానికి ముందు ఈ గ్రామాన్ని ఇంకో చోటికి తరలించి అక్కడ వారందరికీ పునరావాసం కల్పించాల్సి వచ్చింది. కానీ వారు ఊహించినట్టుగానే ఈ ప్రయత్నాలను ప్రతిఘటించారు. కాకపోతే ఈ ప్రాంతం భూకంపంతో చాలా వరకు దెబ్బతినడంతో గ్రామస్థులను అక్కడి నుంచి తరలించేందుకు అవకాశం చిక్కింది. తర్వాత గ్రామస్థులకు ఓ పూర్తిస్థాయి కొత్త గ్రామాన్ని నిర్మించి ఇస్తామని వాగ్దానం చేశారు. బదులుగా పాత స్థలాన్ని వదలాలని కోరారు. 1893లో ఇక్కడి భారీ ఇసుక నిల్వలను ఫ్రెంచి పురాతత్వ పాఠశాల తొలిగించింది. వాటి కింద దాగున్న అపోలో, ఎథెనా ప్రొయెయా సంరక్షణ కేంద్రాల తాలూకు భవంతులను బయట పెట్టడంతో పాటు వేలాది వస్తువులు, శాసనాలు, శిల్పాలను కూడా వెలికి తీసేందుకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.<ref name="ministry"/>

== ఆధునిక డెల్పీ ==
ఆధునిక డెల్ఫీ ఈ పురాతత్వ ప్రాంతానికి పశ్చిమాన ఆనుకునే నిర్మితమైంది. ఇదిప్పుడు అతి పెద్ద పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇటేయ, అరకోవల గుండా అమ్ఫిస్సా ను కలిపే పెద్ద హైవే మీద ఇది ఉంది. నగరంలో ఎన్నో హెటళ్లు, అతిథి గృహాలు, టావెర్నులు, బార్లు ఉన్నాయి. ప్రధాన వీధులు ఇరుకుగా ఉంటాయి. చాలా వరకు అవి ఒక వైపు మార్గాలు అయ్యుంటాయి. డెల్ఫీలో ఒక పాఠశాల, లైసియం, చర్చి, స్వ్కేర్‌ (''ప్లటేరియా'' ) ఉన్నాయి. యూరప్‌ పొడవునా వెళ్లే ఫుట్‌పాత్‌ ఈ4 నగరపు తూర్పు అంచు గుండానే సాగుతుంది. ఇక్కడి పురాతత్వ ప్రాముఖ్యతకు తోడు పమసాస్‌ స్కీ కేంద్రం, ఈ ప్రాంతంలోని ప్రఖ్యాత తీర పట్టణాలను సందర్శించే పర్యాటకులను కూడా డెల్ఫీ బాగా ఆకర్షిస్తోంది. నగరంలో 2,373 మంది ప్రజలుంటారు. క్రిస్సో (ప్రాచీన క్రిసా)తో కలిపి డెల్ఫీ మున్సిపాలిటీ జనాభా 3,511.

మధ్యయుగ కాలంలో డెల్పీని కస్త్రీ అని కూడా పిలిచేవారు. అది పురాతత్వ ప్రాంతపు శిథిలాలపైనే నిర్మితమైంది. ఇక్కడి పాలరాతి వరుసలను, నిర్మాణాలను తమ పేదరికపు నిర్మాణాలకు స్తంభాలుగా స్థానికులు వాడుకుంటూ వచ్చారు. పాక్షికంగానో, పూర్తిగానో ధ్వంసమైన, మరీ ముఖ్యంగా 1580 నాటి భూకంపం ధాటికి నేలమట్టమైన నగరాన్ని పునర్నిర్మించేందుకు ఇది ఊహించదగిన విధానమే! ఆ భూకంపం ఫోసిస్‌లోని పలు పట్టణాలను ధ్వంసం చేసేసింది. ఎకోల్‌ ఫ్రాంకాయిస్‌ డీ ఎథేన్స్‌కు చెందిన పురాతత్వవేత్తలు 1893లో ఎట్టకేలకు పురాతన డెల్ఫీకి సంబంధించిన అసలు ప్రాంతాన్ని<ref>([http://216.239.59.104/search?q=cache:VBH7i4wfeucJ:www.greeka.com/greece-archaeological-sites.htm+french+archaeological+school+athens+delphi&amp;hl=en&amp;gl=uk&amp;ct=clnk&amp;cd=2 లింకు] చూడండి)</ref> కనిపెట్టగలిగారు. అనంతరం అక్కడి గ్రామాన్ని కొత్త చోటికి మార్చారు. ఆలయాల ప్రాంతానికి పశ్చిమంగా దాన్ని తరలించారు.

ప్రధాన పురాతత్వ కాంప్లెక్సు పాద పీఠం వద్ద ఉన్న డెల్ఫీ పురాతత్వ మ్యూజియం గ్రామానికి తూర్పు దిశగా కన్పిస్తుంది. ప్రధాన రహదారికి ఇది ఉత్తరాన ఉంటుంది. పురాతన డెల్ఫీకి సంబంధించినవిగా చెప్పే పలు ఆసక్తికరమైన వస్తువులు ఈ మ్యూజియంలో కొలువుదీరాయి. మెలడీకి సంబంధించిన అతి పురాతన భావజాలాల ప్రతీకలు, రథ చోదకుడు, పవిత్ర మార్గం కింద దొరికిన బంగారు నిధులు, సిఫ్నియన్‌ నిధికి సంబంధించిన చిన్న చిన్న విభాగాల వంటివి వీటిలో ఉన్నాయి. బయటి ప్రవేశ ద్వారానికి వెంటనే ఆనుకుని (దీన్ని చాలామంది టూర్‌ గైడ్‌లు నిర్లక్ష్యం చేస్తారు కూడా) రోమన్‌ ప్రొకౌన్సుల్‌ గాలియోను ప్రస్తావించే శాసనం ఒకటుంటుంది.

మ్యూజియం, ప్రధాన కాంప్లెక్సుల్లోకి ప్రవేశాలకు ప్రత్యేక రుసుములుంటాయి. కొంత రాయితీతో రెండింట్లోకీ ఉమ్మడి ప్రవేశం కూడా కల్పిస్తారు. లోపల ఒక చిన్న కఫే ఉంటుంది. పోస్టాఫీసు కూడా మ్యూజియం సమీపంలోనే ఉంది. కాస్త తూర్పుగా ముందుకెళ్తే మ్యూజియం దక్షిణపు వైపు రోడ్డుకు దగ్గరగా వ్యాయామశాల, థోలోస్‌ ఉన్నాయి. వాటిలోకి మాత్రం ప్రవేశం ఉచితమే.

== మీడియా ==
[[దస్త్రం:Delphi Sights.ogg|డెల్ఫీ ప్రధాన భాగాలను చూపించే ఓ చిన్న వీడియోను మధ్యలో ప్రముఖంగా కన్పించేలా ఏర్పాటు చేయండి.]]

== వీటిని కూడా పరిశీలించండి ==
* గ్రీకు కళ
* సంప్రదాయ గ్రీకు ప్రాంతాల పేర్ల జాబితా
* అరిస్టోక్లియా - క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందిన డెల్ఫీ పూజారిని. [[పైథాగరస్]]‌కు శిక్షకురాలని చెబుతారు
* డెల్ఫీ పురాతత్వ మ్యూజియం
* ఎథిలేన్‌

== గమనికలు ==
{{reflist|2}}

== సూచనలు ==
* జె. విలియం బ్రాడ్‌. [http://books.google.com/books?id=8Oi_sVWIXLAC&amp;printsec=frontcover ''ద ఒరాకిల్‌: ఏన్షెంట్‌ డెల్ఫీ అండ్‌ ద సైన్స్‌ బిహైండ్‌ ఇట్స్‌ లాస్ట్‌ సీక్రెట్స్‌'' ], న్యూయార్క్‌. పెంగ్విన్‌, 2006 ISBN 1-58883-001-2
* వాల్టర్‌ బర్కెర్ట్‌, ''గ్రీకు రెలిజన్‌''  1985.
* జాన్‌ బ్రేటన్‌ కనెలీ, [http://books.google.com/books?id=sAspxHK-T1UC&amp;printsec=frontcover ''పోర్ట్రెయిట్‌ ఆఫ్‌ ఏ ప్రీస్టెస్‌: విమెన్‌ అండ్‌ రిచువల్‌ ఇన్‌ ఏన్షెంట్‌ గ్రీస్‌'' ], ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ ప్రెస్‌, 2007 ISBN 0-262-08150-4
* రెవరెండ్‌ టి.డెంప్సీ, [http://books.google.com/books?id=4Cj0ueSqyVQC&amp;printsec=frontcover ''ద డెల్ఫిక్‌ ఒరాకిల్‌, ఇట్స్‌ అర్లీ హిస్టరీ, ఇన్ఫ్లుయెన్స్‌ అండ్‌ ఫాల్‌'' ], ఆక్స్‌ఫర్డ్‌. బీహెచ్‌ బ్లాక్‌వెల్‌, 1918
* లూయిస్‌ రిచర్డ్‌ ఫార్నెల్‌, ''ద కల్ట్స్‌ ఆఫ్‌ ద గ్రీక్‌ స్టేట్స్‌'' , ఐదు సంపుటాలు, కార్లెండన్‌ ప్రెస్‌, 1896-1909. (Cf‌. ముఖ్యంగా పైథోనెస్‌, డెల్పీలపై [http://books.google.com/books?id=9J0wnXWZmL8C&amp;printsec=toc&amp;source=gbs_summary_r&amp;cad=0#PPR1,M1 మూడో సంపుటం], [http://books.google.com/books?id=ewIIU_JNarIC&amp;printsec=titlepage&amp;source=gbs_summary_r&amp;cad=0 నాలుగో సంపుటం])
* డేవిడ్‌ ఫెరాన్‌, ''బాచిలైడ్స్‌: పాలిటిక్స్‌, పర్ఫార్మెన్స్‌, పొయెటిక్‌ ట్రెడిషన్‌'' , ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌, 2007. ISBN 0-262-08150-4 
* జోసెఫ్‌ ఎడ్డీ ఫోంటెన్‌రోస్‌, ''ద డెల్ఫిక్‌ ఒరాకిల్‌, ఇట్స్‌ రెస్పాన్సెస్‌ అండ్‌ ఆపరేషన్స్‌, విత్‌ ఏ క్యాటలాగ్‌ ఆఫ్‌ రెస్పాన్సెస్‌'' , బెర్కిలీ యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా ప్రెస్‌, 1978, ISBN 0-262-08150-4
* జోసెఫ్‌ ఎడ్డీ ఫోంటెన్‌రోజ్‌, ''పైథాన్‌; ఏ స్టడీ ఆఫ్‌ డెల్ఫిక్‌ మిత్‌ అండ్‌ ఇట్స్‌ ఆరిజిన్స్'' ‌, న్యూయర్క్‌, బిబిలియో, టానెన్‌, 1974, ISBN 0-262-08150-4
* నోర్మా లారీ గుడ్‌రిచ్‌, ''ప్రీస్టెసెస్‌'' , న్యూయార్క్‌. ఎఫ్‌.వాట్స్‌, 1989, ISBN 0-262-08150-4
* విలియం కీత్‌ చాంబర్స్‌ గుత్రీ, ''ద గ్రీక్స్‌ అండ్‌ దెయిర్‌ గాడ్స్‌'' , 1955.
* మాన్లీ పాల్మర్‌ హాల్‌, ''ద సీక్రెట్‌ టీచింగ్స్‌ ఆఫ్‌ ఆల్‌ ఏజెస్‌'' , 1928, [http://www.sacred-texts.com/eso/sta/sta14.htm 14వ అధ్యాయం, ][http://www.sacred-texts.com/eso/sta/sta14.htm గ్రీక్‌ ఒరాకిల్స్‌] [http://www.sacred-texts.com/eso/sta/index.htm www], [http://www.prs.org/secret.htm PRS]
* హెరిడోటస్‌, ''ద హిస్టరీస్‌'' 
* [http://omacl.org/Hesiod/hymns.html హెమరిక్‌ హిమ్‌ టు పైథియాన్‌ అపోలో]
* జాన్‌ హెలెన్‌ మనస్‌, [http://books.google.com/books?id=W9300nUf4uMC&amp;printsec=frontcover ''డివినేసన్‌, ఏన్షెంట్‌ అండ్‌ మోడర్న్‌'' ], న్యూయార్క్‌, పైథాగరియన్‌ సొసైటీ, 1947.
* హెర్బర్ట్‌ విలియం పార్కే, ''హిస్టరీ ఆఫ్‌ ద డెల్ఫిక్‌ ఒరాకిల్‌'' , 1939.
* ప్లుటార్చ్‌ ''లైవ్స్‌''
* ఎర్విన్‌ రోడ్‌, ''సైక్‌'' , 1925
* ఆస్కర్‌ సెఫెర్ట్‌, ''[http://www.ancientlibrary.com/seyffert/index.html డిక్షనరీ ఆఫ్‌ క్లాసికల్‌ ఆంటిక్విటీస్‌]'', లండన్‌. డబ్ల్యూ.గ్లైషెర్‌, 1895.
* హెన్రీ ఏ స్పిల్లర్, జాన్ ఆర్ హెల్, జేలే జెడ్ డీ బోఏర్. ది డెల్ఫిక్ మల్టీ డిసిప్లినరీ డిఫెన్స్‌ ఆఫ్‌ ద గాసెయస్‌ వెంట్‌ థీరీ. ''క్లినికల్‌ టాక్సికాలజీ''  40.2 (2000) 189-196.
* వెస్ట్, మార్టిన్‌ లిచ్‌ఫీల్డ్‌ వెస్ట్‌, ''ద ఆర్ఫిక్‌ పోయమ్స్‌'' , 1983. ISBN‌ 0-385-14348-6.
* ''ఏన్షెంట్‌ గ్రీక్‌ అథ్లెటిక్స్‌'', బై స్టెఫాన్‌ జి.మిల్లర్‌. న్యూ హావెన్‌ అండ్‌ లండన్‌. యేల్‌ యూనివర్సిటీ ప్రెస్‌, 2004

== మరింత చదవటానికి ==
* క్యాథరిన్‌ మోర్గాన్‌,, ''అథ్లెట్స్‌ అండ్‌ ఒరాకిల్స్‌: ద ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఆఫ్‌ ఒలింపియా అండ్‌ డెల్ఫీ ఇన్‌ ద యైత్‌ సెంచరీ బీసీ'' , కేంబ్రిడ్జ్‌ (ఇంగ్లండ్‌), న్యూయార్క్‌: కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్‌, 1990 ISBN 0-262-08150-4
* రాబర్ట్‌ టెంపుల్‌, ''[http://www.robert-temple.com/papers/Fables_Delphi.pdf ఫేబుల్స్‌, రిడిల్స్‌, అండ్‌ మిస్టరీస్‌ ఆఫ్‌ డెల్ఫ]'', ''ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ఫోర్త్‌ ఫిలసాఫికల్‌ మీటింగ్‌ ఆన్‌ కాంటెంపరరీ ప్రాబ్లమ్స్‌'' , నంబర్‌ 4, 1999 (ఏథెన్స్‌, గ్రీస్‌). గ్రీక్‌, ఇంగ్లిష్‌ భాషల్లో.

== బాహ్య లింకులు ==
{{commonscat|Delphi}}

=== సాధారణ ===
* [http://odysseus.culture.gr/h/3/eh351.jsp?obj_id=2507 అఫీషియల్‌ వెబ్‌సైట్‌ ఆఫ్‌ ద ఆర్కియలాజికల్‌ సైట్‌] 
* [http://odysseus.culture.gr/h/1/eh151.jsp?obj_id=3404 అఫీషియల్‌ వెబ్‌సైట్‌ ఆఫ్‌ ద మ్యూజియం] 
* [http://www.efa.gr/histoire/histoire1870_03.htm హిస్టరీ ఆఫ్‌ ద ఎకోల్‌ ప్రాంచైస్‌ డీ ఎథేన్స్‌ ఇన్‌ డెల్ఫీ]{{fr icon}}
* [http://www.fokida.gr/en/dim_delfon.html హెమ్‌పేజ్‌ ఆఫ్‌ ద మోడర్న్‌ మున్సిపాలిటీ]{{en icon}}{{el icon}}
* [http://www.culture.gr/2/21/211/21110a/e211ja01.html హెలెనిక్‌ మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్‌: డెల్ఫీ]
* [http://hellas.teipir.gr/prefectures/greek/Fokidas/Delfoi.htm డెల్ఫీ]{{el icon}}
* [http://www.moonspeaker.ca/Delphi/delphi.html సి.ఇఓస్‌బోర్న్‌, ''ఏ షార్ట్‌ డీటూర్‌ టు డెల్ఫీ అండ్‌ ద సిబిల్స్‌'']
* [http://www.livius.org/a/greece/delphi/delphi.html లివియస్‌ పిక్చర్‌ ఆర్కైవ్‌: డెల్ఫీ]
* [http://www.theosophy-nw.org/theosnw/world/med/me-elo.htm ఎలోయిస్‌ హార్ట్‌, ''ద డెల్ఫిక్‌ ఒరాకిల్‌'']
* [http://delphic.de/index.php?id=87&amp;L=0 3 జూనియర్‌ డెల్ఫిక్‌ గేమ్స్‌ 2007 బాగియో సిటీ, పిలిప్పీన్స్‌ - నవంబర్‌ నుంచి 15]
* [http://www.delphic.org ఇంటర్నేషనల్‌ డెల్ఫిక్‌ కౌన్సిల్‌]
* [http://www.coastal.edu/ashes2art/delphi2/index.html యాషెస్‌ టు ఆర్ట్‌ డిజిటల్‌ డెల్ఫీ]

=== డెల్ఫీ భూ విజ్ఞాన శాస్త్రం ===
* [http://www.sciam.com/article.cfm?articleID=0009BD34-398C-1F0A-97AE80A84189EEDF జాన్‌ ఆర్‌.హేల్స్‌, ఎట్‌ ఆల్‌., ''క్వశ్చనింగ్‌ ద డెల్ఫిక్‌ ఒరాకిల్‌: వెన్‌ సైన్స్‌ మీట్స్‌ రెలిజియన్‌ ఎట్‌ దిస్‌ ఏన్షెంట్‌ గ్రీక్‌ సైట్‌, ద టూ టర్నవుట్‌ టు బీ ఆన్‌ బెటర్‌ టర్మ్స్‌ దాన్‌ స్కాలర్స్‌ హాడ్‌ ఒరిజినలీ థాట్‌'', ఇన్‌ ''సైంటిఫిక్‌ అమెరికన్‌''  ఆగస్ట్‌ 2003]
* [http://news.nationalgeographic.com/news/2001/08/0814_delphioracle.html జాన్‌ రోచ్‌, ''డెల్ఫిక్‌ ఒరాకిల్స్‌ లిప్స్‌ మే హావ్‌ బీన్‌ లూజన్డ్‌ బై గ్యాస్‌ వేపర్స్‌'' ఇన్‌ ''నేషనల్‌ జియోగ్రాఫిక్‌ న్యూస్‌'' ], 2001 ఆగస్ట్‌
* [http://geology.about.com/cs/odds_and_ends/a/aa081901a.htm జియాలజీ ఆఫ్‌ డెల్ఫీ]
* [http://www.erowid.org/chemicals/inhalants/inhalants_history1.shtml ''ద న్యూయార్క్‌ టైమ్స్‌'' , 2002 మార్చి 19: ''ఫ్యూమ్స్‌ అండ్‌ విజన్స్‌ వర్‌ నాట్‌ ఏ మిత్‌ ఫర్‌ ఒరాకిల్‌ ఎట్‌ డెల్ఫీ'']
* [http://geologie.uqac.ca/~mhiggins/greece.htm ''ఏ జియలాజికల్‌ కంపేనియన్‌ టూ గ్రీస్‌ అండ్‌ ద ఎజెయన్‌''  బై మైఖేల్‌ అండ్‌ రేనాల్డ్‌ హిగిన&amp;్స, కార్నెల్‌ యూనివర్సిటీ ప్రెస్‌, 1996]

{{World Heritage Sites in Greece}}

[[వర్గం:డెల్ఫీ]]
[[వర్గం:ప్రపంచ వారసత్వ ప్రదేశాలు]]
[[వర్గం:ప్రాచీన గ్రీకు ప్రాంతాలు]]
[[వర్గం:పవిత్ర నగరాలు]]
[[వర్గం:ప్రాచీన దైవ వాణులు]]
[[వర్గం:గ్రీస్‌లోని వరల్డ్‌ హెరిటేజ్‌ ప్రాంతాలు]]
[[వర్గం:ఫోసిస్‌ ప్రెఫెక్చర్‌లోని జన సమ్మర్ధ ప్రాంతాలు]]
[[వర్గం:గ్రీకు]]
[[వర్గం:మాజీ నాటక రంగాలు]]
[[వర్గం:గ్రీస్‌లోని సంరక్షణ కేంద్రాలు]]
[[వర్గం:మధ్య గ్రీసులోని పురాతత్వ ప్రాంతాలు]]
[[వర్గం:వీడియో క్లిప్ లను కలిగి ఉన్న వ్యాసాలు]]

{{Link FA|hu}}

[[en:Delphi]]
[[hi:डेल्फी]]
[[ta:டெல்பி (நகரம்)]]
[[af:Delphi]]
[[ar:دلفي]]
[[az:Delphi]]
[[bg:Делфи]]
[[br:Delfi]]
[[bs:Delfi]]
[[ca:Delfos (ciutat)]]
[[cs:Delfy]]
[[cy:Delphi]]
[[da:Delfi]]
[[de:Delphi]]
[[el:Δελφοί]]
[[eo:Delfo]]
[[es:Delfos]]
[[et:Delfi]]
[[eu:Delfos]]
[[fa:دلفی (شهر)]]
[[fi:Delfoi]]
[[fr:Delphes]]
[[gl:Delfos]]
[[gu:ડેલ્ફી]]
[[he:דלפי]]
[[hr:Delfi]]
[[hu:Delphoi]]
[[hy:Դելֆի]]
[[is:Delfí]]
[[it:Sito archeologico di Delfi]]
[[ja:デルポイ]]
[[ka:დელფო]]
[[ko:델포이]]
[[la:Delphi (urbs Graeciae)]]
[[lt:Delfai]]
[[mk:Делфи]]
[[mr:डेल्फी, ग्रीस]]
[[nl:Delphi (Griekenland)]]
[[nn:Delfí]]
[[no:Delfi]]
[[pl:Delfy]]
[[pnb:ڈیلفی]]
[[pt:Delfos]]
[[ro:Delphi, Grecia]]
[[ru:Дельфы]]
[[scn:Delfi]]
[[sh:Delfi]]
[[simple:Delphi, Greece]]
[[sk:Delfy]]
[[sl:Delfi]]
[[sr:Делфи]]
[[sv:Delfi]]
[[th:เดลฟี]]
[[tr:Delfi]]
[[uk:Дельфи]]
[[vi:Delphi]]
[[war:Delphi]]
[[yi:דעלפי]]
[[zh:德尔斐]]