Revision 852549 of "అడిడాస్" on tewiki{{Infobox company
| company_name = Adidas AG
| company_logo = [[దస్త్రం:Adidas Logo.svg|200px|Adidas logo]]
| company_type = [[Aktiengesellschaft]] ({{FWB|ADS}}, [[American Depositary Receipt|ADR]]:{{Pinksheets|ADDYY}})
| foundation = 1924 as ''Gebrüder Dassler Schuhfabrik'' <br /> (registered in 1949)<ref name=history>{{cite web|url=http://www.adidas-group.com/en/overview/history/default.asp |title=Adidas Group History |publisher=Adidas-group.com |date= |accessdate=2010-09-26}}</ref>
| founder = [[Adolf Dassler]]
| location = [[Herzogenaurach]], [[Germany]]
| key_people = [[Herbert Hainer]] <small>([[chief executive officer|CEO]])</small><br /> [[Robin Stalker]] <small>([[chief financial officer|CFO]])</small><br /> Erich Stamminger <small>(CEO, Adidas Brand)</small><br /> Igor Landau <small>(Chairman of the [[supervisory board]])</small>
| industry = [[Clothing]] and [[Final goods|consumer goods]] [[manufacturing|manufacture]]
| products = [[Footwear]], [[sportswear]], [[sports equipment]], [[toiletries]]
| area_served = Worldwide
| revenue = [[Euro|€]]10.38 billion <small>(2009)</small><ref name="AR2009">{{cite web |url=http://www.adidas-group.com/en/investorrelations/assets/pdf/annual_reports/2009/GB_2009_En.pdf |title=Annual Report 2009 |accessdate=2010-03-23 |publisher=Adidas}}</ref>
| operating_income = €508 million <small>(2009)</small><ref name="AR2009" />
| net_income = €245 million <small>(2009)</small><ref name="AR2009" />
| num_employees = 39,600 <small>(2009)</small><ref name="AR2009" />
| homepage = [http://www.adidas-group.com/ www.adidas-group.com]
| intl = yes
}}
'''అడిడాస్ ఏజీ''' {{FWB|ADS}}, ఏడీఆర్{{Pinksheets|ADDYY}} [[జర్మనీ]] క్రీడా దుస్తుల ఉత్పత్తి సంస్థ మరియు అడిడాస్ గ్రూప్ మాతృ సంస్థ. ఇందులో [[రీబాక్|రీబాక్]] క్రీడా దుస్తుల సంస్థ, [[గోల్ఫ్|గోల్ఫ్]] సంస్థ (యాశ్వర్త్ తో కలిపి), మరియు రాక్‌పోర్ట్. క్రీడా పాదరక్షలతో పాటు సంస్థ ఇతర ఉత్పత్తులైన బ్యాగులు, చొక్కాలు, గడియారాలు, కళ్లద్దాలు మరియు ఇతర క్రీడా మరియు దుస్తులకు సంబంధించిన వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ [[ఐరోపా|యూరోప్]]లో అతిపెద్ద క్రీడా దుస్తుల తయారీదారు. మరియు అమెరికాలోని తన ప్రత్యర్థి నైక్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రీడా వస్తువుల ఉత్పత్తిదారు.<ref>{{cite web |url=http://www.bloomberg.com/apps/news?pid=20601100&sid=ah3ZhaeNWMdM&refer=germany |title=Adidas, Deutsche Telekom, Infineon: German Equity Preview |accessdate=2008-01-26 |date=16 January 2008 |publisher=[[Bloomberg L.P.]]}}</ref>
''గిబ్రూడర్ డాస్లర్ సంస్థ స్కూఫాబ్రిక్'' డాస్లర్, అతని తమ్ముడు రూడాల్ఫ్ మధ్య విడిపోయిన తర్వాత అడాల్ఫ్ 1948లో అడిడాస్‌ను ''ఆదీ'' డాస్లర్ ఏర్పాటు చేశారు. తర్వాత రూడాల్ఫ్ పుమాను ఏర్పాటు చేశాడు. ఇదే అడిడాస్ తొలి ప్రత్యర్థి. దీనిని 1949లో రిజిస్టర్ చేయించారు. ప్రస్తుతం అడిడాస్ జర్మనీలోని హెర్జోజినార్క్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తోంది. పుమా కూడా అక్కడే ఉంది.
సంస్థ దుస్తులు మరియు బూట్ల నమూనాలు ప్రత్యేకమైన మూడు సమాంతర రేఖల లక్షణాలను కలిగి ఉన్నాయి, మరియు ఈ గుర్తే ప్రస్తుతం అడిడాస్ అధికారిక లోగోగా మారింది. ఈ ''మూడు ముక్కలు'' 1951లో ఫిన్నిష్ క్రీడా సంస్థ కర్తు స్పోర్ట్స్ నుంచి తీసుకున్నారు.<ref name="smit">{{Cite book | title = Pitch Invasion, Adidas, Puma and the making of modern sport | author = Smit, Barbara | isbn = 0141023686 | publisher = Penguin | year = 2007 | page = 44}}</ref><ref>{{Cite book | title = International cases in the business of sport | author = Simon Chadwick, Dave Arthur | page = 438 | publisher = Butterworth-Heinemann | year = 2007 | isbn = 0750685433 }}</ref> సంస్థ ఆదాయం 2009లో 1,038 కోట్ల పౌండ్లుగా, 2008లో 1,080 కోట్ల పౌండ్లుగా నమోదైంది.
== చరిత్ర ==
=== గిబ్రూడర్ డాస్లర్ స్కూఫ్యాబ్రిక్ ===
[[దస్త్రం:Adidas Samba sneakers, Originals branch.JPG|thumb|ఆడిడాస్ సాంబా ఫుట్‌బాల్ శిక్షకుల జంట.]]
[[మొదటి ప్రపంచ యుద్ధం]] నుంచి తిరిగి వచ్చిన తర్వాత అడాల్ఫ్ ''ఆదీ'' డాస్లర్ తన సొంత క్రీడా బూట్ల తయారీ బవేరియాలోని హెర్జోజినార్క్‌లో తన తల్లి వంటగదిలో ప్రారంభించాడు. 1924లో అతని తమ్ముడు రూడాల్ఫ్ ''రూడి'' డాస్లర్ కూడా వ్యాపారంలో చేరిన తర్వాత ఆ వ్యాపారం''{{lang|de|Gebrüder Dassler Schuhfabrik}}'' (''డాస్లర్ సహోదరుల బూట్ల ఫ్యాక్టరీ'' ) బాగా విస్తరించింది. ఈ వ్యాపారాన్ని వారు తమ తల్లి లాండ్రీలో<ref name="Sneaker Wars">{{Cite book|last=Smit|first=Barbara|title=Sneaker Wars|publisher=Harper Perennial|year=2009|location=New York|isbn=978-0-06-124658-6}}</ref>{{rp|5}} ప్రారంభించారు, అయితే ఆ సమయంలో, పట్టణంలో విద్యుత్ సరఫరాపై ఆధారపడే పరిస్థితి లేకపోవడంతో, ఈ సోదరులు కొన్నిసార్లు తమ పరికరాలను నడిపేందుకు స్థిరంగా ఉండే సైకిల్‌ను తొక్కడం ద్వారా వచ్చే శక్తిని ఉపయోగించేవారు.[9]<ref name="DW">{{cite web|last=James|first=Kyle|url=http://www.dw-world.de/popups/popup_printcontent/0,,2074427,00.html |title=The Town that Sibling Rivalry Built, and Divided | Business | Deutsche Welle | 03.07.2006 |publisher=Dw-world.de |date= |accessdate=2010-09-26}}</ref>
1936 వేసవి ఒలింపిక్స్ సమయానికి అడి డాస్లెర్ స్పైక్‌లతో నింపిన ఒక సూట్‌కేస్‌తో బావారియా నుంచి ప్రపంచంలో మొట్టమొదటి మోటారు వాహనమార్గాల్లో ఒకటైన రోడ్డుపై ఒలింపిక్ గ్రామానికి చేరుకున్నాడు, అక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రాల పరుగు వీరుడు జెస్సీ ఒవెన్స్ వాటిని ఉపయోగించేలా ఒప్పించగలిగాడు, ఒక ఆఫ్రికన్ అమెరికన్‌కు లభించిన మొదటి స్పాన్సర్‌షిప్ ఇదే కావడం గమనార్హం. ఓవెన్ సాధించిన నాలుగు బంగారు పతకాలతో ఆయన విజయం దాస్లార్ బూట్లకు ప్రపంచంలోని అతి ప్రముఖ క్రీడాకారుల్లో ప్రఖ్యాతి తెచిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ఈ సోదరులకు ఉత్తరాలు వచ్చాయి, ఇతర జాతీయ జట్లకు శిక్షణ ఇచ్చేవారు డాస్లెర్ షూలు కావాలని లేఖల ద్వారా ఆసక్తి చూపారు. వ్యాపారం విస్తరించింది. దాస్లేర్లు రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఏటా 2 లక్షల జటలను అమ్మసాగారు.<ref name="rediff">{{cite web|url=http://in.rediff.com/sports/2005/nov/08adi.htm |title=How Adidas and PUMA were born |publisher=In.rediff.com |date=2005-11-08 |accessdate=2010-09-26}} {{Dead link|date=October 2010|bot=H3llBot}}</ref>
రెండో ప్రపంచ యుద్ధం చివరలో బూట్ల ఫ్యాక్టరీని పాంజెర్ష్‌రెక్ అంటి-ట్యాంక్ వెపన్ ఉత్పత్తి కి మార్చారు.<ref>{{cite web|url=http://www.spiegel.de/international/germany/a-611400.html |title=The Prehistory of Adidas and Puma; ''Spiegel'' |publisher=Spiegel.de |date= |accessdate=2010-09-26}}</ref>
=== కంపెనీ విభజన ===
ఇద్దరు సోదరులు నాజీ పార్టీలో చేరారు. కానీ రూడాల్ఫ్ పార్టీకి కాస్త దగ్గరగా ఉన్నాడు. యుద్ధం సందర్భంగా ఆ జంట మధ్య ఏర్పడిన విభేదాలు పెరిగి, వారు విడిపోయే స్థితికి చేరాయి. 1943లో సంకీర్ణ దళాలు బాంబులతో దాడి చేస్తున్నపుడు ఆడీ, అతని భార్య బాంబుల బారి నుంచి రక్షణ కల్పించే ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే రూడాల్ఫ్, అతని కుటుంబం అక్కడ ఉన్నారు. సంకీర్ణ దళాల విమానాలు రావడం చూసి ''దొంగ నా కొడుకులు మళ్లీ వస్తున్నారు,'' అని ఆడి అన్నాడు, కానీ రూడాల్ఫ్ మాత్రం తన సోదరుడు తనను, తన కుటుంబాన్నే ఆ మాటలు అన్నాడని భావించాడు.<ref>{{cite web|last=Esterl |first=Mike |url=http://online.wsj.com/article/SB120606066903653643.html?mod=googlenews_wsj |title=Review of "Sneaker Wars: The Enemy Brothers Who Founded Adidas and PUMA and the Family Feud That Forever Changed the Business of Sport", Barbara Smit, March 2008, ISBN 978-0-06-124657-9 |publisher=Online.wsj.com |date=2008-03-21 |accessdate=2010-09-26}}</ref> తర్వాత రూడాల్ఫ్‌ను అమెరికన్ సైనికులు పట్టుకున్నారు. వాఫెన్ ఎస్‌ఎస్ సభ్యుడిగా ఉన్నాడని అభియోగాలు మోపారు. సోదరుడే తనను అందులో చేరాలా చేశాడని వారికి చెప్పాడు.<ref name="DW"/>
ఆ సోదరులు 1947లో విడిపోయారు.<ref>{{cite web|last=Esterl |first=Mike |url=http://online.wsj.com/article/SB120606066903653643.html?mod=googlenews_wsj |title=Review of "Sneaker Wars: The Enemy Brothers Who Founded adidas and Puma and the Family Feud That Forever Changed the Business of Sport", Barbara Smit, March 2008, ISBN 978-0-06-124657-9 |publisher=Online.wsj.com |date=2008-03-21 |accessdate=2010-09-26}}</ref>
* '''రూ''' డాల్ఫ్ '''డా''' స్లర్ నుంచి '''రూడా''' అనే కొత్త సంస్థను రూడీ స్థాపించాడు. తర్వాత అదే పుమాగా పేరొందింది.
* తర్వాత ఆడి ఓ సంస్థను స్థాపించి, 1949 18 ఆగస్టులో '''అడిడాస్ ఏజీ''' (పొడి అక్షరాలు)గా దాన్ని నమోదు చేయించాడు. ఆ ఆక్రోనిం పదాలను విస్తరిస్తే, '''రోజంతా నేను క్రీడల గురించే కలగంటాను'' ' అని వస్తుంది. అయినప్పటికి కొన్నిసార్లు అడిడాస్ పేరు పుట్టుకను పరిశీలిస్తే, బాక్రోనిమ్‌లో రూపొందించిన నాటి పరిస్థితులే కనిపిస్తాయి. వాస్తవంగా దీని పేరు పోర్ట్‌మ్యాన్‌టేయు, ''ఆడి'' (ఇది అడాల్ఫ్ ముద్దుపేరు), ''డాస్'' (''డాస్లర్'')ల నుంచి రూపొందింది.<ref name="history"/>
=== తైపీ వ్యవహారం ===
[[దస్త్రం:Bernard-Tapie.jpg|thumb|మాజీ ఫ్రెంచి వ్యాపారవేత్త బెర్నార్డ్ టాపీ. ఒకప్పుడు ఆడిడాస్‌కు యజమాని. కానీ ఆ త ర్వాత అప్పుల కారణంగా కంపెనీపై యాజమాన్యాన్ని వదులుకున్నాడు.]]
{{Refimprove|section|date=October 2010}}
1987లో అడాల్ఫ్ డాస్లర్ కొడుకు హోర్‌స్ట్ డాస్లర్‌కు తండ్రి మరణానంతరం క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. దాన్ని ౧.06 బిలియన్ ఫ్రెంచి ఫ్రాంకులకు (ప్రస్తుతం 24.3918 కోట్ల యూరో[[యూరో]]లు) కొనుగోలు చేసేందుకు ఫ్రెంచి పారిశ్రామికవేత్త బెర్నార్డ్ తైపీ 1989లో ముందుకొచ్చాడు. అలాగే కొనుగోలు చేశాడు కూడా. దివాళా తీసిన సంస్థలను రక్షించే ప్రముఖ నిపుణునిగా తైపీకి ఆ రోజుల్లో పేరుండేది. అతను తన స్వీయ నైపుణ్య ఆధారంగానే తన భాగ్యరేఖలను రూపొందించుకున్నాడు.
తీరప్రాంతం నుంచి [[ఆసియా|అసియా]]కు తన ఉత్పత్తిని మార్చాలని తైపీ నిర్ణయించుకున్నాడు. తన ఉత్పత్తుల ప్రచారకర్తగా మడోనాను నియమించాడు. అడాల్ఫ్ డాస్లర్ వారసులను (అమిలియా రాండెల్ డాస్లర్, బెల్లా బెక్ డాస్లర్) కలుసుకోవడానికి అతను న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నుంచి ఓ బూట్ల అమ్మకపు ప్రతినిధిని పంపించాడు. అక్కడ సంస్థ ప్రచారానికి కొన్ని వస్తువులను కూడా పంపించాడు.
1992లో రుణాలపై వడ్డీ చెల్లించలేని పరిస్థితిలో క్రెడిట్ లియోన్నెయిస్ [[బ్యాంకు]]తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అడిడాస్‌ను తైపీ అమ్మాల్సి వచ్చింది. వెంటనే బ్యాంకు తన అప్పు మొత్తాన్ని ఆ సంస్థ ఈక్విటీగా మార్చేసింది. అప్పటి ఫ్రెంచ్ బ్యాంకింగ్ పద్ధతుల్లో ఇది పరిపాటి. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తైపీని వ్యక్తిగత సాయం కింద వెంటనే రక్షించడానికి రాష్ట్ర యాజమాన్య బ్యాంకు ప్రయత్నించింది. ఎందుకంటే తైపీ అప్పటి ఫ్రెంచ్ ప్రభుత్వ పట్టణ వ్యవహారాల మంత్రి(డి లా విల్లే మంత్రి).
1993 ఫిబ్రవరిలో క్రెడిట్ లయోన్నెస్ అడిడాస్‌ను బెర్నార్డ్ తైపీ మిత్రుడైన రాబర్ట్ లూయిస్ డ్రెఫస్‌కు తైపీ తీసుకున్న దానికంటే చాలా ఎక్కువ మొత్తానికి, 285 కోట్ల ఫ్రాంకులకు (43.479 కోట్ల యూరోలు) బదులు 448.5 కోట్ల (68.3514 కోట్ల యూరోలు) ఫ్రాంకులకు విక్రయించింది. పరోక్ష అమ్మకంతో తనకు నష్టం కలగజేశారంటూ తర్వాత బ్యాంకుపై తైపీ దావా వేశాడు.{{Citation needed|date=October 2010}}
రాబర్ట్ లూయిస్-డ్రెఫస్ సంస్థ కొత్త సీఈఓగా నియమితులయ్యాడు. దాంతోపాటు 1993 వరకు తైపీ ఆధీనంలో ఉన్న ఒలింపిక్ డి మార్సిల్లెకు కూడా అధ్యక్షుడయ్యాడు.{{Citation needed|date=October 2010}}
1994లో తైపీ వ్యక్తిగత దివాళా దరఖాస్తు దాఖలు చేశాడు. పలు న్యాయ వివాదాలకు అతడే కేంద్ర బిందువుగా మారాడు, అందులో ప్రముఖమైనది ఫుట్‌బాల్ క్లబ్ మ్యాచ్ ఫిక్సింగ్. [[పారిస్|పారిస్]]లోని లా సాంటె జైలు విధించిన 18 నెలల శిక్షలో 1997లో ఆరు నెలలు అనుభవించాడు. 2005లో ఫ్రెంచి న్యాయస్థానం తైపికీ 13.5 కోట్ల యూరోల పరిహారం ప్రకటించింది. (సుమారు 88.6 కోట్ల ఫ్రాంకులు).{{Citation needed|date=October 2010}}
=== తైపీ తర్వాతి శకం ===
[[దస్త్రం:An Adidas shoe.jpg|thumb|ఆడిడాస్ సాధారణ బూట్లు కంపెనీ తాలూకు మూడు ప్రత్యేకమైన సమాంతర బార్లతో లభిస్తాయి.]]
1994లో ఫిఫా యువ బృందంతో కలిసిన తర్వాత ఎస్‌ఓఎస్ పిల్లల పల్లెలు ప్రధానంగా ప్రయోజనం పొందాయి.
స్కీయింగ్ దుస్తులను విక్రయించే సోలోమెన్ గ్రూప్‌ను అడిడాస్ ఏజీ 1997లో సొంతం చేసుకుంది. దాని కార్పొరేట్ పేరును ఆడిడాస్-సోలోమన్ ఏజీగా మార్చేసింది. ఎందుకంటే ఈ కొనుగోలుతో టైలర్‌మేడ్ గోల్ఫ్ కంపెనీ, మాక్స్‌ఫీలను కూడా కొనుగోలు చేసింది. తద్వారా నైకీ గోల్ఫ్‌తో పోటీ పడే సామర్థ్యాన్ని సంతరించుకుంది.
జట్ల యూనిఫారాలు, ఇతర దు స్తులపై వాణిజ్య లోగోల సంఖ్య, పరిమాణాన్ని తగ్గించిన ఎన్‌సీఏఏ నిబంధనలను ఆడిడాస్ 1998లో కోర్టులో సవాలు చేసింది. తదనంతరం రాజీ కుదరడంతో కేసును వెనక్కు తీసుకుంది. అడిడాస్ ట్రేడ్‌మార్కులుగా పరిగణించిన మూడు స్ట్రైప్‌ల డిజైన్ల వాడకం తదితరాలకు సంబంధించి నిర్దేశకాలను ఇరు వర్గాలూ కుదుర్చుకున్నాయి.
తన మూడు స్ట్రైప్‌లకు అతి సమీపంగా ఉండేలా రెండు స్ట్రైప్‌లను వాడిన ఫిట్‌నెస్ వరల్డ్ ట్రేడింగ్ కంపెనీపై [[యునైటెడ్ కింగ్‌డమ్|బ్రిటిష్]] కోర్టుల్లో ఆడిడాస్ 2003లో దావా వేసింది. తేడాలున్నప్పటికీ రెండు స్ట్రైప్‌ల గుర్తును ''ఫిట్‌నెస్ వరల్డ్'' వాడటం ఆడిడాస్ హక్కులను భంగపరచడమేనని కోర్టు పేర్కొంది. ఆ స్ట్రైప్‌లను బట్టి రెండు కంపెనీల మధ్య సాన్నిహిత్యముందని అంతా భావించే ఆస్కారమున్నట్టు పేర్కొంది.<ref>[http://www.guardian.co.uk/business/story/0,3604,995976,00.html తన మూడు స్ట్రైప్‌లు ట్రేడ్‌మార్కేమీ కాదని ''ద గార్డియన్'' లో ఆడిడాస్] చెప్పింది</ref>
ఇంగ్లీష్ ఫ్యాషన్ డిజైనర్ స్టెల్లా మెక్‌కార్ట్‌నీ 2004లో ఆడిడాస్‌తో ఒక జాయింట్ వెంచర్ మొదలు పెట్టాడు. తద్వారా సంస్థతో తన దీర్ఘకాలిక బంధానికి శ్రీకారం చుట్టాడు. వారి భాగస్వామ్యంలో ''అడిడాస్ బై స్టెల్లా మెక్‌కార్ట్‌నీ''<ref>{{cite web|url=http://www.adidas.com/campaigns/women/content/stella/stella.asp?strCountry_Adidascom=com |title=– Stella McCartney collection |publisher=Adidas.com |date= |accessdate=2010-09-26}}</ref> పేరుతో మహిళలకు క్రీడా పరికరాలు తదితరాల కలెక్షన్లు వెలువడ్డాయి. అవి అందరి ప్రశంసలూ అందుకున్నాయి.<ref>[http://www.imdb.com/name/nm0565383/bio స్టెల్లా మెక్‌కార్ట్‌నీ జీవితచరిత్ర], ఇంటర్నెట్ మూవీ డేటాబేస్‌లో</ref>
తమ భాగస్వామ్య కంపెనీ సాల్మన్ గ్రూపును 48.5 కోట్ల పౌండ్లకు ఫిన్లండ్‌కు చెందిన అమర్ స్పోర్ట్స్‌కు విక్రయించినట్టు 2005 మే3న ఆడిడాస్ ప్రకటించింది.
{{Wikinews|German Adidas buys American Reebok}}
తన బ్రిటిష్ ప్రత్యర్థి [[రీబాక్]]ను 308 కోట్ల అమెరికా డాలర్లకు కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు 2005 ఆగస్టులో ఆడిడాస్ ప్రకటించింది. 2006లో భాగస్వామ్య పద్ధతిన ఈ టేకోవర్ ప్రక్రియ ముగిసింది.<ref name="history">[http://www.reebok.com/useng/history/2000.htm రీబాక్ చరిత్ర, 2000]{{dead link|date=September 2010}}</ref> తద్వారా ఉత్తర అమెరికాలో నైకీకి ఉన్న అమ్మకాలకు అతి సన్నిహితంగా ఆడిడాస్ కూడా కార్యకలాపాలు సాగించేందుకు ఇది ఊతమిచ్చింది. రీబాక్‌ను కొనుగోలు చేయడం వల ్ల ప్రపంచవ్యాప్తంగా రెండో అతి పెద్ద అథ్లెటిక్ బూట్ల తయారీదారుగా నైకీతో పోటీ పడేందుకు కూడా ఆడిడాస్‌కు సావకాశం చిక్కింది.<ref>{{cite web|url=http://aolsvc.news.aol.com/business/article.adp?id=20050803092509990002 |title=AOL.com |publisher=Aolsvc.news.aol.com |date= |accessdate=2010-09-26}}</ref>
ఆడిడాస్‌కు జర్మనీలో గ్లోబల్ కార్పొరేట్ ప్రధాన కార్యాలయముంది. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పోర్ట్‌లాండ్ ఓఆర్, హాంకాంగ్, టరంటో, తైవాన్, ఇంగ్లండ్, జపాన్, ఆస్ట్రేలియా, స్పెయిన్ వంటి పలు దేశాల్లో ఇతర వ్యాపార సముదాయాలున్నాయి. ప్రధానంగా అమెరికాలోనే అమ్ముడయే ఆడిడాస్, ఆ ఉత్పత్తులతో పాటుగా ఆయా దేశాల్లో పలు ఆస్తులను కలిగి ఉంది. ఇప్పుడు విదేశీ మార్కెట్లలోకి కూడా బాగా విస్తరిస్తోంది.
2005లో ఆడిడాస్ 1ను సంస్థ ప్రవేశపెట్టింది. మైక్రో ప్రాసెసర్‌ను ఉపయోగించి తయారైన తొలి బూటుగా అది చరిత్ర సృష్టించింది. ''ప్రపంచంలోకెల్లా అత్యంత తెలివైన బూటు''గా సంస్థ పేర్కొన్న ఆడిడాస్ 1లో పలు ప్రత్యేకతలున్నాయి. సెకనుకు 50 లక్షల లెక్కలు వేసి మరీ పర్యావరణానికి తగ్గట్టుగా బూటు ఉపరితలం తనంత తానుగా సర్దుకుపోతుంది! దాదాపు 1,000 గంటల పాటు నడిచే వాడకందారు సొంతంగా మార్చుకోగలిగే చిన్న బ్యాటరీని ఈ బూట్లలో వేయడం అవసరం. ఆడిడాస్ 1 కొత్త వెర్షన్‌ను 2005 నవంబర్ 25న సంస్థ విడుదల చేసింది. కుషనింగ్ మరింత ఎక్కువగా ఉండటం, తద్వారా బూటు మరింత మృదువుగా, అదే సమయంలో దృఢంగా ఉండటం దీని ప్రత్యేకత. దాంతోపాటు 153 శాతం ఎక్కువ టార్క్ ఇందులో ఉంటుంది.{{Citation needed|date=August 2008}}
ఎన్‌బీఏతో 11 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఆ సంస్థకు అధికారిక దుస్తుల తయారీదారుగా ఆడిడాస్ అవతరించింది. అంటే, ఎన్‌బీఏ, ఎన్‌బీడీఎల్, డబ్ల్యూఎన్‌బీఏల దుస్తులు, ఆయా జట్ల రంగుల దుస్తులకు కూడా తగినట్టుగా ''సూపర్‌స్టార్'' బాస్కెట్‌బాల్ బూట్లను సంస్థ 11 ఏళ్ల పాటు తయారు చేస్తుందన్నమాట. దీని విలువ 40 కోట్ల డాలర్ల పై చిలుకు! 2001 నుంచి పదేళ్ల పాటు ఈ ఒప్పందం రీబాక్ అధీనంలో ఉంది.
== ఉత్పత్తులు ==
=== పరుగు పందెం ===
[[దస్త్రం:Adidas Response Cushion 18.JPG|thumb|ఆడిడాస్ రెస్పాన్స్ కుషన్ జంట 18 మంది శిక్షకుల వద్ద చలామణీలో ఉంది.]]
ఆడిడాస్ ప్రస్తుతం పలు రన్నింగ్ బూట్లను తయారు చేస్తోంది. ఆడిస్టార్ కంట్రోల్ 5, ఆడిస్టార్ రైడ్ (ఆడిస్టార్ కుషన్ 6కు ఇది ప్రత్యామ్నాయం), సూపర్‌నోవా సీక్వెన్స్ (సూపర్‌నోవా కంట్రోల్ 10కి ప్రత్యామ్నాయం), సూపర్‌నోవా కుషన్ 7 (దీన్ని కూడా త్వరలో సూపర్‌నోవా గ్లైడ్‌తో భర్తీ చేయనున్నారు) వంటివి ఇందులో కొన్ని. వీటికి తోడు, అడిడాస్ పర్ఫార్మెన్స్ దుస్తులు, ఇతర సామగ్రిని రన్నింగ్‌లో పాల్గనే అథ్లెట్లు చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఆడిడాస్ ఖరీదైన బూట్లను తయారు చే సేందుకు కంగారూ చర్మాన్ని వాడుతోంది.<ref>{{cite web|url=http://www.savethekangaroo.com/international/australia/adidasflyer.pdf |title=SaveTheKangaroo.com |format=PDF |date= |accessdate=2010-09-26}}</ref><ref>{{cite web|author=“” |url=http://www.youtube.com/watch?v=JUZrKj6ClBg |title=YouTube.com |publisher=YouTube.com |date= |accessdate=2010-09-26}}</ref>
=== ఫుట్‌బాల్ (సాకర్) ===
ఆడిడాస్‌కు ప్రధాన ఆదాయ వనరుల్లో ఫుట్‌బాల్ కిట్, సంబంధిత సామగ్రి కూడా ఒకటి. దాంతోపాటు మేజర్ లీగ్ సాకర్‌లోని అన్ని పెద్ద జట్లకూ ఆడిడాస్ క్రీడా ఉత్పత్తులు, పరికరాలు, దుస్తులను సరఫరా చేస్తోంది.
అంతర్జాతీయ ఫుట్‌బాల్ జట్లకు కూడా ప్రధాన పరికరాలు, దుస్తుల సరఫరాదారుగా ఆడిడాస్ నిలుస్తోంది.
పలు దేశాలు, ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ పోటీల్లో జరిగే లీగ్‌లలో విరివిగా వాడే రిఫరీ కిట్లను కూడా ఆడిడాస్ తయారు చేస్తోంది. ఒక్క అమెరికాలోనే ప్రధాన రిఫరీ సరఫరాదారు అధికారిక క్రీడా సంస్థ అయినా ఎంఎల్‌ఎస్ మ్యాచుల్లో రిఫరీలు ఆడిడాస్ కిట్లనే ధరిస్తారు.
ఫుట్‌బాల్ క్రీడకు సంబంధించినంత వరకూ ఆడిడాస్ పలు కొత్త కల్పనలు చేస్తోంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ ఉదాహరణలున్నాయి. కోపా ముండియల్ మౌల్డెడ్ బూటును దాదాపు 40 ఏళ్లుగా పొడిబారిన పిచ్‌లపై జరిగే మ్యాచుల్లో వాడుతున్నారు. 1978లో అర్జెంటీనా గెలుచుకున్న దీనికి సమానమైన పోటీని ప్రపంచకప్‌కు అనుసరణగా పిలిచారు. అప్పట్లో అర్జెంటీనాకు కూడా చాలావరకు పరికరాలను ఆడిడాసే సరఫరా చేసేది. ప్రస్తుతం కొన్ని అత్యంత ప్రముఖ ఫుట్‌బాల్ జట్లకు ఆడిడాస్ స్పాన్సరర్‌గా ఉంటోంది.
మాజీ లివర్‌పూల్, ఆస్ట్రేలియా అంతర్జాతీయ ఆటగాడు క్రెయిగ్ జాన్‌స్టన్ అభివృద్ధి చేసిన ప్రిడేటర్ బూట్ డిజైన్‌ను మరింతగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఆడిడాస్ బాగా పేరు సంపాదించింది. రిబ్ మాదిరిగా ఉండే రబ్బర్ నిర్మాణాన్ని బూటు పై తోలుకు బదులుగా వాడటం దీని ప్రత్యేకత. బంతిని తన్నినప్పుడు దాని వేగం మరింత పెరిగేందుకు వీలుగా ఈ ఏర్పాటు జరిగింది. ఈ కొత్త డిజైన్‌తో కూడిన బూట్ల సాయంతో బంతిని మరింతగా కోణీయ మార్గంలో తన్నేందుకు తమకిప్పుడు చాలా సులువుగా ఉందని పలువురు దిగ్గజ ఆటగాళ్లు కొనియాడారు.{{Citation needed|date=December 2008}}ప్రిడేటర్ కూడా క్రెయిగ్ జాన్‌స్టన్ రూపొందించిన ట్రాక్సియాన్ సోల్‌ను వాడుతోంది.
ఫుట్‌బాల్‌కు ప్రపంచస్థాయి నియంత్రిత, నిర్వహణ సంస్థ అయిన ఫిఫా తన సొంత ప్రపంచ కప్ పోటీలను మరింత ఆకర్షణీయంగా, అటాకింగ్ తరహా పోటీలుగా మార్చేందుకు అనువైన ఫుట్‌బాల్‌లను తయారు చేయాల్సిందిగా ఆడిడాస్‌ను పురమాయించింది. 2006 ప్రపంచకప్ ద ''టీమ్‌జిస్ట్'' కు సరఫరా చేసిన బంతులను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. అంతకు ముందు బంతులతో పోలిస్తే తన్నినప్పుడు మరింత దూరం దూసుకెళ్లగలిగే వాటి సామర్థ్యాన్ని అంతా మెచ్చుకున్నారు. తద్వారా సుదూరాల నుంచి కూడా గోల్స్ చేసేందుకు ఈ బంతులు బాగా వీలు కల్పించాయి. కాకపోతే ఈ బంతుల డిజైన్‌తో గోల్‌కీపర్లకు మాత్రం కష్టకాలం వచ్చి పడింది. వారు వీటిని చూసి బాగా అసౌకర్యంగా ఫీలవసాగారు. వాటి గమనాన్ని అంచనా వేయడం తమకు బాగా కష్టంగా మారిపోయిందని ఫిర్యాదు చేశారు.
2010 ప్రపంచ కప్‌కు అడిడాస్ మరో తరహా బంతులను ప్రవేశపెట్టింది. అదే జబులానీ బంతి. దాన్ని చెల్సియా ఎఫ్‌సీతో కలిసి లోబ్రో విశ్వవిద్యాలయం డిజైన్ చేసింది. అయితే ఆటగాళ్లతో పాటు మేనేజర్లు, క్రీడా పండితులు కూడా వీటిని బాగా విమర్శించారు. ఈ బంతులను నియంత్రించడం చాలా కష్టసాధ్యమైన వ్యవహారమని మొత్తుకున్నారు. తేలికగా, గాల్లో మరింతగా దూసుకెళ్లే సామర్థ్యంతో రూపొందిన జబులానీ కారణంగా ఆటగాళ్లకు తాము సంధించే షాట్లను కచ్చితత్వంతో నియంత్రించడం చాలా కష్టంగా మారింది. దాంతో చాలా బంతులు లక్ష్యానికి సుదూరంగా, గోల్‌పోస్ట్ మీదుగా దూసుకెళ్లాయి. ప్రపంచకప్‌లో అతి తక్కువ సంఖ్యలో లాంగ్ రేంజ్ గోల్స్ నమోదు కావడానికి జబులానీ బంతి వాడకమే కారణమని అన్ని వర్గాల నుంచీ బాగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇంకా టోర్నమెంట్ ప్రారంభ దశలోనైతే ఈ బంతులతో సుదూరం నుంచి కచ్చితమైన షాట్లు సంధించేందుకు ఆటగాళ్లు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
అలాగే పైన పేర్కొన్న ప్రిడేటర్ బూటుతో పాటు ఎఫ్50, ఆడిప్యూర్ శ్రేణుల్లోని ఫుట్‌బాల్ బూట్లను కూడా ఆడిడాస్ తయారు చేసింది.
=== టెన్నిస్ ===
[[దస్త్రం:Andy murray crop.JPG|thumb|ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రే]]టెన్నిస్ ఆటగాళ్లకు కూడా ఆడిడాస్ స్పాన్సర్ చేసింది. ఇటీవలే కొత్త తరహా టెన్నిస్ రాకెట్లను ప్రవేశపెట్టింది. దాని ఫెదర్‌ను సాధారణ ఆటగాని కోసమే తయారు చేసినా, అది క్లబ్ ఆటగాళ్లకు తగ్గట్టుగా రూపొందినా, 12.2 ఓజ్ బారికేడ్ టూర్ మోడల్ ద్వారా టోర్నమెంట్ ఆటగాళ్లను సంస్థ లక్ష్యంగా చేసుకుంది.<ref>tennis-warehouse.com/</ref> ఈ కింద పేర్కొన్న ప్రొఫెషనల్ ఆటగాళ్లకు ముఖ్యంగా వారి దుస్తులు, పాదరక్షలను ఆడిడాస్ స్పాన్సర్ చేస్తోంది: అన్నా ఇవనోవిక్, ఆండీ ముర్రే, మరియా కిరిలెంకో, కరోలిన్ వోజ్నియాకీ, జస్టిన్ హెనిన్, జో విల్‌ఫ్రెడ్ సోంగా, డినారా సఫీనా, డేనియెలా హంతుచోవా, అలిసియా మోలిక్, ఫెర్నాండో వెర్దాస్కో, గిలిస్ సైమన్, ఫెర్నాండో గొంజాలెస్, ఫ్లావియా పానెట్టా, లారా రాబ్సన్, మలానీ ఓడిన్, సొరానా క్రిస్టియా. ఆడిడాస్ టెన్నిస్ దుస్తుల్లో క్లిమాకూల్ పరిజ్ఞానం ఉంటుంది. ఇతర అథ్లెటిక్ జెర్సీలు, పాదరక్షల్లో కూడా అదే ఉంటుంది.<ref>{{cite web|url=http://adidas.com/us/tennis/ |title=adidas tennis |publisher=Adidas.com |date= |accessdate=2010-04-10}}</ref>
ఐదేళ్ల కాలానికి ఏకంగా 2.45 కోట్ల డాలర్లతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా, ఆడిడాస్ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ మొత్తం చెల్లించిన వ్యక్తిగా 2009 నవంబర్‌లో ప్రపంచ నంబర్ 4 ఆటగాడు ఆండీ ముర్రే రికార్డు సృష్టించాడు.<ref>{{cite web|url=http://www.sportspromedia.com/news/andy_murray_signs_head-to-toe_deal_with_adidas/ |title=Andy Murray signs head-to-toe deal with Adidas |publisher=SportsProMedia |date= |accessdate=2010-10-10}}</ref>
ఆడిడాస్ స్పాన్సర్ చేసిన ఆటగాళ్లు ఆడిడాస్ ఆటగాళ్ల మెరుగుదల కార్యక్రమం నుంచి మరింతగా లబ్ధి పొందవచ్చు. ఇందులో భాగంగా కోచ్‌లు, ఫిట్‌నెస్ శిక్షకులు, క్రీడా మానసిక విశ్లేషకుల వంటి వారిని కూడా ఆటగాళ్లకు సంస్థ అందుబాటులోకి తెస్తుంది. తద్వారా వారు తమ కెరీర్లను మరింతగా పొడిగించుకునేందుకు వీలు కల్పిస్తుంది. డారెన్ కాహిల్, స్వెన్ గ్రోయెనెవెల్డ్ వంటి దిగ్గజాలైన కోచ్‌లు ఈ శిక్షణ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారు.
సిన్సినాటీలోని మాసన్‌లో ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌లో బాల్ బాయ్, బాల్ గాళ్ యూనిఫారాలను కూడా ఆడిడాస్ స్పాన్సర్ చేసింది.
=== గోల్ఫ్ ===
ఆడిడాస్‌గోల్ఫ్ ఆడిడాస్‌లో భాగం. ఇది జర్మనీకి చెందిన క్రీడా దుస్తులు, ఇతర ఉత్పత్తుల తయారీ సంస్థ. ఆడిడాస్ గ్రూపులో భాగస్వామి. ఇందులో [[రీబాక్|రీబాక్]] క్రీడాదుస్తుల కంపెనీ, టైలర్‌మేడ్ - ఆడిడాస్ గోల్ఫ్ కంపెనీ, రాక్‌పోర్ట్ భాగం. ఆడిడాస్ గ్రూపు క్రీడా దుస్తులు, వస్తువుల తయారీలో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటి. అతి విస్తృత శ్రేణులకు చెందిన ఉత్పత్తులను పలు కీలక రంగాల్లో ఆడిడాస్, రీబాక్, టైలర్‌మేడ్-ఆడిడాస్ గోల్ఫ్ సంస్థలు అందిస్తున్నాయి. ఆడిడాస్‌గోల్ఫ్ ఆడిడాస్ బ్రాండ్‌తో కూడిన గోల్ఫ్ ఉత్పత్తులు, దుస్తులు, బూట్లు, ఇతర సహాయక సామగ్రిని విక్రయిస్తుంది.
'''కంపెనీ కాలక్రమం:'''
ఆల్పైన్ స్కీయింగ్ దుస్తుల తయారీలో స్పెషలిస్టు అయిన సాల్మన్ గ్రూపును 1997లో ఆడిడాస్ ఏజీ కొనుగోలు చేసింది. దాని కార్పొరేట్ పేరును ఆడిడాస్-సోలోమన్ ఏజీగా మార్చేసింది. ఎందుకంటే ఈ కొనుగోలుతో టైలర్‌మేడ్ గోల్ఫ్ కంపెనీ, మాక్స్‌ఫీలను కూడా కొనుగోలు చేసింది. తద్వారా నైకీ గోల్ఫ్‌తో పోటీ పడే సామర్థ్యాన్ని సంతరించుకుంది. టైలర్‌మేడ్ కంపెనీ, ఇతర క్రీడా పరికరాల కంపెనీల్లో తనకున్న మెజారిటీ, నియంత్రక వాటాలను ప్రపంచ స్థాయి దిగ్గజమైన ఆడిడాస్ ఏజీకి సాల్మన్ విక్రయించింది.
1998లో ఆడిడాస్ గోల్ఫ్ యూఎస్‌ఏ తన వ్యాపార కార్యకలాపాలను ఆరెగాన్‌లోని టౌలాటిన్ నుంచి [[కాలిఫోర్నియా]]లోని టైలర్‌మేడ్ గోల్ఫ్ ప్రధాన కార్యాలయం కార్ల్‌సాడ్‌లోకి మార్చేసింది. దాన్ని ఆడిడాస్-సాల్మన్ అప్పటికే కొనుగోలు చేసింది. ఆడిడాస్‌యూఎస్‌ఏ 30 మంది ఉద్యోగులకు పునరావాసం కల్పించాల్సి వచ్చింది. ఆడిడాస్‌కు ప్రధాన పోటీదారు అయిన కాలవే గోల్ఫ్ కంపెనీకి కూడా కార్ల్‌స్‌బాడ్ నిలయం.
టైలర్‌మేడ్, ఆడిడాస్‌గోల్ఫ్‌యూఎస్‌ఏ 1999లో కొత్త కంపెనీగా రూపాంతరం చెందాయి. దాని పేరు టైలర్‌మేడ్-ఆడిడాస్ గోల్ఫ్‌గా మారింది. దీనికి కార్ల్స్‌బాడ్‌లో ప్రపంచ ప్రధాన కార్యాలయముంది. మార్క్ కింగ్‌ను కంపెనీ అధ్యక్షునిగా ప్రకటించారు. ఆయన 1981లో సంస్థలో సేల్స్ రిప్రజెంటేటివ్‌గా కెరీర్ మొదలు పెట్టారు! కొంతకాలం, అంటే 1998లో కాలవే గోల్ఫ్‌బాల్ సంస్థకు అమ్మకాలు, మార్కెటింగ్‌కు ఉపాధ్యక్షునిగా కూడా ఉన్నారు.
2008 నవంబర్‌లో ఆష్‌వర్త్ (దుస్తులు) టైలర్‌మేడ్-ఆడిడాస్ గోల్ఫ్‌కు పూర్తిస్థాయి సబ్సిడరీ కంపెనీగా మారిపోయింది. ఆడిడాస్ గోల్ఫ్ సింథటిక్ పర్ఫార్మెన్స్ దుస్తులకు కాంప్లిమెంటరీగా రూపాంతరం చెందింది.
'''ఉత్పత్తులు:'''
స్త్రీలు, పురుషులు, యువత కోసం దుస్తులు, పాదరక్షలు, సహాయక సామగ్రిని ఆడిడాస్ గోల్ఫ్ విక్రయిస్తుంది. పురుషుల పరికరాల్లో పాదరక్షలు, షర్టులు, షార్టులు, ప్యాంట్లు, ఔటర్‌వేర్, బేస్ లేయర్, ఐవేర్ వంటివి ఉన్నాయి.
మహిళల సామగ్రిలో పాదరక్షలు, షర్టులు, షార్టులు, స్కర్టులు, ప్యాంట్లు, ఔటర్‌వేర్, బేస్ లేయర్లు, ఐవేర్ ఉంటాయి. యువత సామగ్రిలో యువతీ యువకులిద్దరికీ పాదరక్షలు, దుస్తులు, ఐవేర్ వంటివి ఉన్నాయి.
=== క్రికెట్ ===
భారత క్రికెట్ దిగ్గజం [[సచిన్ టెండుల్కర్|సచిన్ టెండూల్కర్]]తో 1990ల్లో ఆడిదడాస్ ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి ఆయనకు బూట్లు తయారు చేయడం మొదలు పెట్టింది.<ref>{{cite web|url=http://www.indianexpress.com/news/brand-tendulkar-will-never-lose-value/3801/ |title=‘Brand Tendulkar will never lose value’ |publisher=Indianexpress.com |date=2006-05-05 |accessdate=2010-04-10}}</ref> క్రికెట్ ఆడేటప్పుడు ఇప్పటికీ టెండూల్కర్ ఆడిడాస్ బూట్లే ధరిస్తాడు. సచిన్ టెండూల్కర్ తో అడిడాస్ ఆక్షన్ ఫిగర్స్ కూడా తయారు చేసింది.
ఇంగ్లండ్ బ్యాటింగ్ స్టార్ కెవిన్ పీటర్సన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా 2008లో ఆడిడాస్ ఇంగ్లండ్ క్రికెట్ మార్కెట్‌లోకి కూడా ప్రవేశించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వుడ్‌వార్మ్‌తో జీవితకాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాక సంస్థ ఈ చర్య తీసుకుంది.<ref>{{Cite news |url=http://www.telegraph.co.uk/sport/cricket/kevinpietersen/3204505/Kevin-Pietersen-snaps-up-lucrative-bat-deal-after-the-demise-of-Woodworm-Cricket.html |title=Kevin Pietersen snaps up lucrative bat deal after the demise of Woodworm |publisher=The Daily Telegraph |date=October 16, 2008 |accessdate=2009-05-14 | location=London | first=Derek | last=Pringle}}</ref> ఆ తర్వాతి ఏడాదే మరో ఇంగ్లిష్ క్రికెటర్ ఇయాన్ బెల్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే పాక్ ఆటగాడు సల్మాన్ భట్, భారత ఆటగాడు రవీంద్ర జడేజాలతో కూడా. కొన్నేళ్ల పాటు క్రికెట్ బూట్లను తయారు చేసిన తర్వాత బ్యాట్ల తయారీలోకి కూడా అంతిమంగా కంపెనీ 2008లో ప్రవేశించింది. ఇప్పుడు ఇంకుర్జా,ఆ పారెలా, లిబ్రో శ్రేణుల్లో ఆడిడాస్ కికెట్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వాడే యూనిఫారాలను కూడా ఆడిడాస్ సంస్థే తయారు చేస్తుంది.
2011లో క్రికెట్ సౌతాఫ్రికాతో కూడా ఆడిడాస్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. అందలో భాగంగా 2011 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడిడాస్ తయారు చేసిన క్రీడా దుస్తులనే దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు వాడాలి.
దక్షిణ కొరియా జాతీయ క్రికెట్ జట్టును కూడా ఆడిడాస్ స్పాన్సర్ చేసింది.
2008, 2009 సీజన్లలో [[ఇండియన్ ప్రీమియర్ లీగ్|ఇండియన్ ప్రీమియర్ లీగ్]] (ఐపీఎల్)లో [[ముంబై ఇండియన్స్|ముంబై ఇండియన్స్]], [[ఢిల్లీ డేర్ డెవిల్స్|ఢిల్లీ డేర్‌డెవిల్స్]] జట్లను ఆడిడాస్ స్పాన్సర్ చేసింది.
2009 నుంచి [[సచిన్ టెండుల్కర్|సచిన్ టెండూల్కర్]] వాడుతున్న బ్యాట్‌ను ఆడిడాస్ స్పాన్సర్ చేస్తోంది. అతని కోసం ప్రత్యేకించి 'ఆడిడాస్ మాస్టర్ బ్లాస్టర్' పేరుతో కొత్త బ్యాటును కంపెనీ సృష్టించింది.
=== బాస్కెట్‌బాల్ ===
ఆడిడాస్ చిరకాలంగా బాస్కెట్‌బాల్ బూట్ల తయారీ రంగంలో ఉంది. పైగా ప్రపంచవ్యాప్తంగా బాస్కెట్‌బాల్ బ్రాండ్లలో ప్రముఖ కంపెనీగా వెలుగొందుతోంది. పలువురు దిగ్గజాలైన సూపర్‌ష్టార్ ఆటగాళ్లకు అనువుగా ఉండే మోడల్ బూట్ల తయారీకి ఆడిడాస్ బాగా పేరు పొందింది. వాటిని ముద్దుగా ''షెల్‌టోస్'' అని పిలుచుకుంటారు. ఎందుకంటే వాటికి ప్రత్యేకంగా వాడే రబ్బర్ టో బాక్స్ ఇందుకు కారణం. 1980ల్లో ఆడిడాస్ స్ట్రైప్ సైడెడ్ పాలిస్టర్ సూట్లతో పాటుగా హిప్ హాప్ స్ట్రీట్‌వేర్‌ను ఇవి చాలా పాపులర్‌గా మార్చేశాయి.
ప్రస్తుతం జాతీయ బాస్కెట్‌బాల్ అసోసియేషన్‌కు చెందిన మొత్తం 30 ఫ్రాంచైజీలకూ ఆడిడాసే దుస్తులు తయారు చేసిస్తుంది ([[రీబాక్|రీబాక్]]ను సొంతం చేసుకున్నాక ఈ విషయంలో ఆ సంస్థ స్థానాన్ని దక్కించుకుంది). దాంతోపాటు కరీం అబ్దుల్ జబ్బార్, ట్రాసీ మెక్‌గ్రాడీ, డ్వైట్ హోవర్డ్, చాన్సీ బిలుప్స్, డెరిక్ రోస్, ఎరిక్ గోర్డన్, మైఖేల్ బీస్లీ, జోష్ స్మిత్, టిమ్ డంకన్ వంటి పలువురు ప్రఖ్యాత గత, ప్రస్తుత ఆటగాళ్లను స్పాన్సర్ చేసింది.
కోబ్ బైరంట్‌ను కూడా ఆడిడాస్ ఎక్విప్‌మెంట్ కేబీ8 రూపంలో తొలి సిగ్నేచర్ బూటుగా ఆడిడాస్ ఎండార్స్ చేసేది. 2003లో ఆయనకు ఎండార్స్ చే యడాన్ని నిలిపేసింది. కెవిన్ గ్రానెట్‌కు కూడా ఎండార్స్ చేసింది. 2010లో ఈ ఒప్పందం నుంచి వైదొలగేందుకు అతను నిర్ణయించుకునేదాకా దీన్ని కొనసాగించింది. అతను ప్రస్తుతం అంటాకు ఎండార్స్ చేస్తున్నాడు. లెబ్రోన్ జేమ్స్ కూడా ఆడిడాస్‌కు వున్నత పాఠశాల స్థాయిలో ఎండార్స్‌మెంట్ ఇచ్చాడు. ఇప్పుడతను నైకీకి ఎండార్స్ చే స్తున్నాడు. గత సీజన్‌లో చోటుచేసుకున్న తుపాకీ ఉదంతం వరకూ గిల్బర్ట్ అరేనాస్ కూడా ఆడిడాస్ ఎండార్సర్‌గా ఉండేవాడు. ఇప్పుడతనికీ ఏ ఎండార్స్‌మెంటూ లేదు.
=== లాక్రొసీ ===
లాక్రొసీ పరికరాల భావి ఉత్పత్తులు తానే చేపడతానని 2007లో అడిడాస్ ప్రకటించింది. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]లోని టాప్ 600 హైస్కూళ్ల అండర్‌క్లాస్‌మెంన్ లాక్రోసీ ఆటగాళ్లకు ఆడిడాస్ నేషనల్ లా క్రొసీ క్లాసిక్‌ను కూడా స్పాన్సర్ చేస్తానని ప్రకటించింది.<ref>{{cite web|url=http://www.adidasnationallacrosseclassic.com |title=Level 2 Sports – Home |publisher=Adidasnationallacrosseclassic.com |date= |accessdate=2010-04-10}}</ref>
=== రగ్బీ ===
[[దస్త్రం:Allblack-whitewashed.PNG|thumb|ఆల్ బ్లాక్స్ రగ్గీ జెర్సీ]]రగ్బీ బంతులు, రగ్బీ గేర్లను కూడా ఆడిడాస్ తయారు చేస్తుంది. [[న్యూజీలాండ్|న్యూజిలాండ్]] ఆల్ బ్లాక్స్, ఐర్లండ్ మన్‌స్టెర్ రగ్బీ, అర్జెంటీనా ప్యూమాస్, [[దక్షిణ ఆఫ్రికా|దక్షిణాఫ్రికా]] స్టార్మర్స్, పశ్చిమ ప్రావిన్స్ రగ్బీ యూనియన్ జట్ల వంటి వాటికి ప్రస్తుతం కిట్లు, బంతులను సరఫరా చేస్తోంది. హెంకెన్ కప్‌కు ఆడిడాసే అధికారిక బంతుల సరఫరాదారు.
=== జిమ్నాస్టిక్స్ ===
అమెరికా జిమ్నాస్టిక్స్ జట్టు కోసం యూఎన్‌ఏ జిమ్నాస్టిక్స్ పేరుతో 2000 నుంచీ ఆడిడాస్ స్త్రీలు, పురుషుల జట్ల జిమ్నాస్టిక్ దుస్తులను తయారు చేస్తోంది. 2006లో అడిడాస్ జిమ్నాస్టిక్స్ లెటార్డ్స్ ఫర్ విమెన్, ఆడిడాస్ మెన్స్ కాంప్ షర్ట్స్, జిమ్నాస్టిక్స్ ప్యాంట్స్, జిమ్నాస్టిక్ షార్టులు అమెరికాలో అందుబాటులోకి వచ్చాయి. వసంత కాలం, వేసవిల్లో సీజనల్ లియోటార్డ్‌లను కూడా కంపెనీ అందించింది. సెలవులు, హిమపాతం వంటి సందర్భాలకు 2009 నుంచీ ఆడిడాస్ జిమ్నాస్టిక్స్ దుస్తులు ప్రపంచవ్యాప్తంగా జీకే ఎలైట్ దుస్తుల సంస్థ ద్వారా అందుబాటులోకి వచ్చాయి.<ref>{{cite web|url=http://www.gkelite.com/adidas.html |title=adidas gymnastics |publisher=Gkelite.com |date= |accessdate=2010-04-10}}</ref>
=== స్కేట్‌బోర్డింగ్ ===
ఆడిడాస్ ఎస్‌బీ (స్కేట్‌బోర్డింగ్) బూట్లు ప్రత్యేకించి స్కేట్‌బోర్డింగ్ కోసం తయారయ్యాయి. గతంలో ఆడిడాస్ తయారు చేసిన చాలా బూట్లను స్కేట్‌బోర్డింగ్ కోసం సంస్థ రీ డిజైన్ చేసింది.
ఆడిడాస్ స్కేట్‌బోర్డింగ్‌కు స్కేట్‌బోర్డింగ్ జట్టు కూడా ఉంది. ఈ జట్టులో మార్క్ గోంజాలెస్, డెన్నిస్ బుసెనిట్జ్, టిమ్ ఓకానర్, సిలాస్ బాక్సెటెర్-నీల్, పీట్ ఎల్డ్‌రిడ్జ్, బెన్నీ ఫెయిర్‌ఫాక్స్, నెస్టర్ జుడ్కిన్స్, లెమ్ విలెమిన్, విన్స్ డెల్ వాలే, జేక్ బ్రౌన్ సభ్యులు.
=== ఇతర పరికరాలు ===
చెప్పులు, [[గడియారం|గడియారాలు]], [[కళ్ళద్దాలు|ఐవేర్]], బ్యాగులు, బేస్‌బాల్ టోపీలు, సాక్స్ వంటి పలు సహాయక సామగ్రిని కూడా ఆడిడాస్ తయారు చేస్తుంది.
[[దస్త్రం:FreshImpactLimited.JPG|thumb|ఆడిడాస్ ఫ్రెస్ ఇంపాక్ట్ - పరిమిత విడుదల]]వాటితో పాటు స్త్రీ, పురుష సెంట్లు, ఆఫ్టర్ షేవ్, లోషన్లు, డియోడ్రెంట్లలో కూడా పలు బ్రాండెడ్ శ్రేణులు ఆడిడాస్‌లో అందుబాటులో ఉన్నాయి.
== మార్కెటింగ్ ==
ఇతర క్రీడా బ్రాండ్ల మాదిరిగానే ఆడిడాస్ కూడా అత్యుత్తమ స్థాయి బ్రాండ్ లాయల్టీని విశ్వసిస్తుంది. ఆడిడాస్, నైకీ ఇంక్, ప్యూమా ఏజీ, పలు ఇతర క్రీడాదుస్తుల బ్రాండ్లను ఇటీవలే ఒక అధ్యయనంలో పరిశీలించారు.<ref>జె.డావెస్,''ఇంగ్లండ్ క్రీడా దుస్తుల మార్కెట్‌లో బ్రాండ్ నైతికత''. అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన జర్నల్, 51వ సంపుటి, 2009 నవంబర్ 1.</ref> ఈ బ్రాండ్లపై వినియోగదారులు చూపే లాయల్టీ అర్థరహితమేమీ కాదని అది తేల్చింది.
1990ల మధ్యలో ఆడిడాస్ తన బ్రాండ్‌ను మూడు ప్రధాన గ్రూపులుగా విభజించింది. ప్రతిదానికీ ప్రత్యేక రంగాలను కేటాయించింది: '''ఆడిడాస్ పర్ఫార్మెన్స్''' ను అథ్లెట్లను చూసుకునేందుకు; '''ఆడిడాస్ ఒరిజినల్''' ను ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ విభాగాల కోసం; '''స్టైల్ ఎసెన్షియల్స్''' ను వీటిలో '''వై-3''' ప్రధాన గ్రూపుగా ప్రత్యేకించింది.
''''ఇంపాజిబుల్ ఈజ్ నథింగ్'' (ఏదీ అసాధ్యం కాదు)'' అనే ప్రస్తుతం ఆడిడాస్‌కు ప్రధాన మార్కెటింగ్ నినాదం. ఈ ప్రచారాన్ని ఆమ్‌స్టర్‌డామ్‌లోని 180/టీబీడడ్ల్యూఏ తొలుత తయారు చేసింది. కానీ శాన్‌ఫ్రాన్సిస్కోలోని టీబీడబ్ల్యూఏ/షియట్/డే కూడా ఇందులో ప్రధానంగా పాలు పంచుకుంది. ముఖ్యంగా బాస్కెట్‌బాల్ కోసం ఆడిడాస్ రూపొందించిన ''బిలీవ్ ఇన్ ఫైవ్'' నినాదం రూపకల్పనలో.2007 అంతర్జాతీయ ప్రకటనల ప్రచారం కోసం జేన్ పీచ్<ref>{{cite web|url=http://www.wolfecontemporary.com/news.htm |title=:: Mark Wolfe Contemporary Art :: |publisher=Wolfecontemporary.com |date= |accessdate=2010-04-10}}</ref>ను టీబీడబ్ల్యూఏ/షియట్/డే నియమించింది.
=== క్రీడా ప్రచారం ===
పలు క్రీడల్లో ఆడిడాస్ బ్రాండ్ కన్పిస్తుంది. అమీగా/కొమొడోర్ అమీగా: డేలీ థాంప్సన్స్ ఒలింపిక్ చాలెంజ్ సోనీ పాలిస్టేషన్: ఆడిడాస్ పవర్ సాకర్ కొమొడోర్ 64, జెడ్‌ఎక్స్ స్పెక్ట్రం, ఆమ్‌స్ట్రాడ్ సీపీసీ: ఆడిడాస్ చాంపియన్‌షిప్ ఫుట్‌బాల్.
=== స్పాన్సర్‌షిప్ ===
ఆడిడాస్ అతి పెద్ద దేశీయ (జర్మనీలో), అంతర్జాతీయ క్రీడా సంరంభాల స్పాన్సర్. గత కొన్నేళ్లుగా ఆడిడాస్ గ్రూప్ తన [[విక్రయం|మార్కెటింగ్]]; స్పాన్సరింగ్ బడ్జెట్‌ను బాగా పెంచింది.<ref>{{Cite web|title=adidas Group 2010 Outlook|publisher=Adidas Group|year=2010|url=http://www.adidas-group.com/en/investorrelations/targets/fyguidance/default.aspx|accessdate=8 November 2010}}</ref> నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ)కు ఆడిడాస్ కీలక స్పాన్సర్, సరఫరాదారు. 2010-2011 సీజన్‌లో ఎన్‌బీఏ ఆటగాళ్లంతా ధరించే కొత్త ఎన్‌బీఏ గేమ్ జెర్సీలను సంస్థ ఇప్పటికే విడుదల చేసింది కూడా.
అత్యంత విజయవంతమైన [[న్యూజీలాండ్|న్యూజిలాండ్]] జాతీయ రగ్బీ జట్టు ఆల్ బ్లాక్స్‌కు కూడా ఆడిడాసే ప్రధాన స్పాన్సర్, కిట్ సరఫరాదారు. లోస్ పూమాస్, ఐర్లండ్ ప్రొఫెషనల్ రగ్బీ యూనియన్ జట్టు ద ఈగిల్స్, మన్‌స్టర్ రగ్బీ, [[ఫ్రాన్స్|ఫ్రెంచ్]] ప్రొఫెషనల్ రగ్బీ యూనియన్ క్లబ్ స్టేడ్ ఫ్రాంకాయిస్‌లకు కూడా ఆడిడాసే సరఫరాదారు.
రగ్బీ లీగ్ క్లబ్ గోల్డ్ కోస్ట్ టైటన్స్ రగ్బీ జట్టుకు ఆస్ట్రేలియా జాతీయ రగ్బీ లీగ్ (ఎన్‌ఆర్‌ఎల్) పోటీల్లో ఆడిఆసే స్పాన్సరర్. పైగా వాటికి దుస్తులను కూడా సంస్థే సరఫరా చేస్తుంది.
క్రికెట్‌లో ప్రధానంగా విజయవంతంగా ఆడే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో పాటు ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు కూడా ఆడిడాస్ ప్రనధాన, కిట్ల స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. [[సచిన్ టెండుల్కర్|సచిన్ టెండూల్కర్]], [[వీరేంద్ర సెహ్వాగ్|వీరేంద్ర సెవాగ్]] వంటి విజయవంతమైన భారత [[క్రికెట్|క్రికెటర్ల]]తో పాటు ఇంగ్లండ్ క్రికెట్ ఆటగాళ్లు కెవిన్ పీటర్సన్, ఇయాన్ బెల్‌లకు కూడా ఆడిడాస్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. [[ఇండియన్ ప్రీమియర్ లీగ్|ఇండియన్ ప్రీమియర్ లీగ్]] జట్లయిన [[ఢిల్లీ డేర్ డెవిల్స్|ఢిల్లీ డేర్‌డెవిల్స్]], [[ముంబై ఇండియన్స్|ముంబై ఇండియన్స్]]కు కూడా ఆడిడాసే స్పాన్సర్.
జర్మనీ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు కూడా ఆడిడాసే చిరకాలంగా కిట్లు సరఫరా చేస్తోంది. ఈ బంధం అప్పుడెప్పుడో 1954లో మొదలైంది. దాన్ని 2018 దాకా కొనసాగిస్తారు. అర్జెంటీనా, జపాన్, మెక్సికో, స్పెయిన్ జాతీయ ఫుట్‌బాల్ జట్ల వంటి వాటికి కూడా ఆడిడాసే స్పాన్సర్.<ref>{{cite web|url=http://www.scottishfa.co.uk|title=Islam Feruz called up to U17 squad|work=ScottishFA.co.uk|date=2009-10-12|accessdate=2009-10-12}}</ref>
ఆర్‌ఎస్‌సీ ఆండర్లెచ్, ర్యాపిడ్ వియన్నా, రియల్ మ్యాడ్రిడ్, లివర్‌పూల్; ఏసీ మిలాన్, డైనమో కివ్, మెటాలిస్ట్, పార్టిజాన్ బెల్‌గ్రేడ్, ఫ్లమెనీస్, పామెరాస్, బయెర్న్ మ్యూనిక్, చెల్సియా, స్టోక్ సిటీ ఎఫ్‌సీ, లియాన్, మార్సెలీ, ఏఎఫ్‌సీ ఎజాక్స్, షాక్ 04, గెలాటసరీ, బెన్‌ఫియా, రివర్ ప్లేట్, బెసిక్టాస్, ఫెనర్బాషే, యూఏఎన్‌ఎల్ టైగర్స్, పాంథినైకోస్, సౌత్ మెల్‌బోర్స్ ఎఫ్‌సీ, ఐఎఫ్‌కే గోటేబోర్గ్, అల్-అహ్లీ, అల్-హిలాల్, అహ్లీ జెడ్డా, కారకాస్, యూనివర్సిడాడ్ డీ చిలీ, లాస్ మిలియనీరోస్, సెలాంగర్, బెయ్‌టర్ జెరూసలేం ఎఫ్‌సీ, అల్బీరెక్స్ నిగాటా, అథ్లెటో నేసినల్ వంటి అత్యుత్తమ ఫుట్‌బాల్ క్లబ్‌లకు స్పాన్సర్ చేయడంలో ఆడిడాస్ అతి చురుగ్గా వ్యవహరిస్తోంది.
ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ లీగ్‌లో కాలింగ్‌వుడ్ ఫుట్‌బాల్ క్లబ్, ఎసెండన్ ఫుట్‌బాల్ క్లబ్‌లకు దుస్తుల భాగస్వామిగా ఆడిడాస్ వ్యవహరిస్తోంది.
ఆడిడాస్, మేజర్ లీగ్ సాకర్ (ఎంఎల్‌ఎస్) 2001 ఆగస్టులో 8 ఏ ళ్ల స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని ప్రకటించాయి. లీగ్‌కు ఆడిడాస్‌ను అధికారిక అథ్లెటిక్ స్పాన్సర్‌గా, లైసెన్సున్న ఉత్పత్తుల స రఫరాదారుగా ఈ ఒప్పందం మార్చేసింది. దాంతోపాటు 2018 దాకా ఎంఎల్‌ఎస్ లీడ్ అభివృద్ధి, విస్తరణ పనులను సంయుక్తంగా చేపట్టేందుకు వీలు కల్పించింది.<ref>{{cite web|url=http://web.mlsnet.com/news/mls_events_news.jsp?ymd=20041110&content_id=18624&vkey=mlscup2004&fext=.jsp|title=adidas, MLS strike long-term agreement|work=MLSnet.com|date=2004-11-10|accessdate=2008-08-06}} {{Dead link|date=October 2010|bot=H3llBot}}</ref>
లండన్ మారథాన్ వంటి క్రీడలను కూడా ఆడిడాస్ స్పాన్సర్ చేస్తోంది.
రాప్ గ్రూప్ నిర్వహించిన డీఎంసీ అనే అద్భుతమైన ఐడియాను ఆడిడాస్ 1980లో స్పాన్సర్ చేసింది.
చైనాలోని బీజింగ్‌లో జరిగిన 2008 వేసవి ఒలింపిక్స్ క్రీడలను స్పాన్సర్ చేసేందుకు ఏకంగా 7 కోట్ల పౌండ్ల[[యూరో]]ను ఆడిడాస్ వెచ్చించింది. అందుకు పలు విమర్శల పాలైంది.<ref>{{cite web|url=http://www.spiegel.de/international/business/0,1518,551262,00.html|title=Adidas Chief Criticizes Anti-China Protestors|work=[[Der Spiegel]]|date=2008-05-03|accessdate=2008-05-03}}</ref>
ఎన్‌ఏఎస్‌సీఏఆర్‌ను కూడా ఆడిడాస్ మార్కెటింగ్ చేస్తోంది. డేల్ ఎర్న్‌హార్డ్ జూనియర్, టోనీ స్టీవర్ట్ వంటి దిగ్గజాలైన డ్రైవర్లను స్పాన్సర్ కూడా చేస్తోంది.
== కార్పొరేట్ సమాచారం ==
=== ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ బోర్డు ===
* సీఈఓ ఆడిడాస్ గ్రూపు: హెర్బర్ట్ హెయినర్
* ఫైనాన్స్, ఆడిడాస్ గ్రూపు: రాబిన్ జె.స్టాకర్
* సీఈఓ ఆడిడాస్ బ్రాండ్: ఎరిక్ స్టమింగర్
* గ్లోబల్ ఆపరేషన్స్, ఆడిడాస్ గ్రూప్: గ్లెన్ ఎస్.బెనెట్
=== మాజీ నిర్వాహకులు ===
* సీఈఓ (1993-2002): రాబర్ట్ లూయీస్-డ్రెఫ్యూస్.
=== ఆర్థిక సమాచారం ===
{| class="wikitable"
|+ <td>'''ఆర్థిక గణాంకాలు మిలియన్ యూరోల్లో''' <ref>[http://www.opesc.org/fiche-societe/fiche-societe.php?entreprise=ADIDAS ఓపెస్ సీ]{{fr icon}}</ref></td>
! సంవత్సరం
! 2005
! 2006
! 2007
! 2008
! 2009
|-
| విక్రయాలు
| 10.084
| 10.266
| 12.478
| 14.636
| .
|-
| ఈబీఐటీడీఏ
| 532
| 627
| 725
| 818
| 1 098
|-
| [[లాభం|నికర ఫలితాలు]]
| 483
| 499
| 520
| 560
| 600
|-
| నికర అప్పు
| 1498
| 946
| 594
| 551
| 2231
|}
== విమర్శలు ==
అతి నిపుణులైన బ్రాండ్ ఆధారిత అంతర్జాతీయ సంస్థగా ఆడిడాస్ తన వ్యాపార కార్యకలాపాల్లో కార్మికుల సంక్షేమం, వారికి సంబంధించిన ఇతర నైతిక అంశాల పట్ల ప్రవర్తించే తీరుపై చాలా వ్యతిరేకతలు, విమర్శలు వచ్చాయి.<ref>{{cite web|url=http://thetyee.ca/News/2008/06/11/OlympicLabour/ |title=Tyee – Homepage |publisher=Thetyee.ca |date=2008-06-11 |accessdate=2010-09-26}}</ref><ref>{{cite web|url=http://www.commondreams.org/headlines02/0308-03.htm |title=News & Views |publisher=Common Dreams |date=2002-03-08 |accessdate=2010-09-26}}</ref>
== వీటిని కూడా చూడండి ==
== గమనికలు ==
{{Reflist|colwidth=30em}}
== సూచికలు ==
* {{cite web |url=http://www.sportsbusinessdaily.com/article/30237 |title=ADIDAS GOLF USA MOVES TO CARLSBAD; ADIDAS FACES LEGAL SUIT |date= August 19, 1998 |work=Sports Business Daily |accessdate=22 October 2010}}
* {{cite web |url=http://www.fundinguniverse.com/company-histories/Taylor-Made-Golf-Co-Company-History.html |title=Taylor Made Golf Co |work=FundingUniverse |accessdate=22 October 2010}}
* {{cite news |title=Taylor, Adidas merge, reshuffle | Hiring of Callaway official for key post could trigger lawsuit |first=Mike |last= Freeman |newspaper=[[The San Diego Union-Tribune]] |page=C.1 |date=August 19, 1999 |url=http://pqasb.pqarchiver.com/sandiego/access/1246929281.html?dids=1246929281:1246929281&FMT=ABS |accessdate=22 October 2010}}
* {{cite news |url=http://www.sdbj.com/news/2001/may/14/profile-mark-king-is-finally-settling-back-in/ |title=Profile: Mark King, Taylor Made For His Job |first=Denise T. |last=Ward |date=May 14, 2001 |work=[[San Diego Business Journal]] |archiveurl=http://www.allbusiness.com/company-activities-management/board-management-changes/10623278-1.html |archivedate=? |accessdate=22 October 2010}}
== బాహ్య లింకులు ==
{{Commons}}
* {{official|http://www.adidas-group.com/}}
** [http://www.adidas.com/ అడిడాస్ బ్రాండ్ వెబ్‌సైట్]All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikipedia.org/w/index.php?oldid=852549.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|