Difference between revisions 31028 and 31048 on tewikisource

{{నా రాముడు}}
అవతారమూర్తి

మ.	మదియోగించిన సృష్టియిద్ది యొక పద్మవ్యూహ మిచ్చోట ని

ట్టిది యిచ్చోటిది యిట్టిదంచును పరీష్టిన్‌ జేయcగానైన వీ

లొదవన్‌ రానిది యెన్నొరీతులుగ నెంతోమందిచేc జెప్పcబ

(contracted; show full) చూచుట మాత్రమే కాదుగదా వాఁడామహా విషయమును దర్శించి నాఁడందుము. ఒక మహావిషయమును తెలిసికొనుట దర్శించుట. అందుచేత లోచనయుగ్మమని వాడఁబడినది. అప్పుడొక్కలోచనము చాలుగదా, రెండు కన్నులనుట యెందులకు? మానవుని దర్శనశక్తి రెండు కనులలోను కలిసి యుండును చర్మచక్షుస్సులైనను జ్ఞానచన్సులైనను సంపూర్ణదర్శనము కలుగుటకురెండు కన్నుల శక్తియు కావలయును. వానిని దేవుఁడీయవలయును. యుగ్మశబ్దము. యుగ్మమనగా జంట. అవి రెండును కలసి యున్నప్పుడే చూచుట. ఒక కంటితో చూచుట సగముచూచుట. కుడివైపు కన్పించదు నాకు. లోచన యుగ్మమనుటచేత సంపూర్ణమైన దర్శన శక్తి యనియర్థము.