Difference between revisions 31029 and 31049 on tewikisource

{{నా రాముడు}}
బాలరాముడు

ఉ.	అప్పటికేమొ పెండిలియునై నదిలేదు భవిష్యమందునా

యెప్పుడొ మాయలేడియయి యీతఁడు రావలెనంచు దవ్వుగాఁ

జొప్పడ దూసె బాణమును జోద్యముగా నవతారకార్యమై

(contracted; show full) గూర్చి చెప్పఁబడినది. లోకములో తోచీతోచని వారి మాటలు పొందుపఱపఁబడినవి. వీనికి సమాధానము పూర్వమే చెప్పఁబడినది. రాముఁడు ద్వాదశాహస్కరుల యీడు వాడనగా పండ్రెండేండ్ల వాఁడని చెప్పుటయేకాక పన్నిద్దరు సూర్యులను పేర్కొనుటచేత సూర్యానాం సూర్యః సూర్యులకు సూర్యుఁడు అని యాయన పరమేశ్వరత్వమును గూర్చి చెప్పుటయైనది. గీత పద్యములోని చివరి రెండు చరణములు రాముని సౌందర్యమును చెప్పుచున్నవి. విచారణ లేదు, తర్కము లేదు. భక్తులకు స్వామి యొక్క సౌందర్యమే ధ్యేయము. ఈ శీర్షిక బాలరాముఁడు. ఆయన బాల్యము యొక్క సొగసంతయు నీ రెండు చరణములలో కవి చెప్పిఁనాడు.