Difference between revisions 31035 and 31053 on tewikisource

{{నా రాముడు}}
జానకీ రాముఁడు

ఉ.	ఆయమపుట్టెఁ బాల్కడలి నంగనగాఁ దనవంతు తీసికోన్‌

ఈయమధాత్రిలోన జనియించెను విల్లును వంపఁ బెండ్లమై

ఈయమ మున్ను వేదముల యింపగు తత్త్వము తానెయామెయై

(contracted; show full)డు లంకకు రావలయును. రావణుని చంపవలయును. ఎందుకు? ఒకటి తాను జానకీ రాముఁడగుటకు. జనకుని కూగురు జానకి. ఆయన బ్రహ్మవేత్త. కనుక నిచ్చట రాముఁడు బ్రహ్మపదార్థ జ్ఞానిసహితుఁడని యర్థము. జానకీ రాముఁడనగా నర్థమిది. మఱి రెండవది యీ రావణుని శిక్ష శాశ్వతముగా నుండవలయును. ఎంత శాశ్వతమనగా రావణవధ జరిగి మూఁడు యుగములైనది. మఱల రావణుని వంటి వాఁడు పుట్టలేదు. పుట్టఁడు. తానువైకుంఠాధిపతిని కావలెనని యెవ్వఁడు ననుకొనడు శాశ్వతము-నిత్యము. నిజానికి శాశ్వతికము. అనిన రూపముండవలె. కాని శాశ్వతమన్న శబ్దము సర్వకవులు నుపయోగించుచున్నారు. ఇది ప్రయోగ సాధువు.