Difference between revisions 31036 and 31054 on tewikisource

{{నా రాముడు}}
రఘురాముఁడు

ఉ.	దేశము కాలమున్‌ ముదిరి తెచ్చిన యాపదగాఁగనైన నా

వేశముపొంది యప్డు తన విష్ణ్వవతారత నెంచి యేచెడున్‌

దేశము కాలముం దనకుఁదేకువ లోకువగాఁగనైన స

(contracted; show full)ాముఁడు విష్ణువైనచో నతని ప్రక్క కూర్చుండ వలసినది లక్ష్మి; తాను కాదు. తాను వేదాత్మ - మహాశక్తి తాను తనపని కోసము వచ్చెను. రామునిచేత చేయించెను. తన దారిని తాను వెళ్ళెను. పెండ్లి సమయమునందు పట్టాభిషేక సమయము నందు సీత రామునితో పీటలపై కూర్చున్నదో లేదో! తాను వేదమూర్తి. యజ్ఞము వేద కర్మ. అక్కడ రామునితో పీటలమీఁద కూర్చుండదు. ఇది సీతాదేవి చేసిన చేత, రామునిచేత పని చేయించినది, అనుగ్రహము చూపినది. రామునెట్లు శిక్షించవలెనో అట్లు శిక్షించినది. చివరకు మిగిలిన రాముఁడెవఁడు? వట్టి రఘురాముఁడు రఘువంశము సాగుటకు నేర్పడిన లవకుశుల తండ్రి.