Difference between revisions 323962 and 323966 on tewiktionary

నా జన్మస్థలం:  వెంకట్రామపురము, చిత్తూరు జిల్లా.  ప్రస్తుతం  వనస్థలి పురం,  హైదరాబాదులో నివాసం. విశ్రాంత ఉద్యోగి. కొన్ని సంవత్సరాల క్రితం వికిపీడియా చూసి  కొన్ని చిన్న చిన్న విషయాలు వ్రాశాను. అప్పట్లో ఈ వికిపీడియా పై నాకు పరిపూర్ణ అవగాహన లేకనో  లేదా అప్పట్లో అందులో వుండిన విషయాలు నాకు నచ్చకనో (నేను చదివి నంతవరకు) కొంత కాలం మిన్నకున్నాను.  ఇప్పుడు తెలుగు భాషాభివృద్దికి వికిపీడియా చేస్తున్న కృషికి స్పందించి గతేడాది నుండి చురుకుగా పాల్గొంటున్నాను.  నాకు తెలుగు భాషాభిమానమెక్కువ. దానివలన.........     తెలుగు పదాలకు .....  ఇతరత్రా........ వ్వాసాలలో     తెలుగుతనము లేని బొమ్మలు ఎక్కువగా కానవస్తుంటే  నాకు మనసు చివుక్కు మంటుంది. పరదేశీ బొమ్మలు ఎక్కువగా వున్నాయి. కనీసం భారతీయత ఉన్నా కొంత బాగుండేది. అందుచేత నేను  తెలుగుదనమున్న   అనేక బొమ్మలు చేరుస్తున్నాను. గ్రామీణ వాతావరణము, పల్లె వాసుల జీవన విధానము,  తెలుగు నాట వివిద ప్రాంతాలలో వ్వవసాయ  విధానాలు, చారిత్రిక ప్రదేశాల పర్యటన, తెలుగులో జాతీయాలు, సామెతలు, మొదలగు విషయాలు నాకు ఇష్టమైనవి.  ఈ విషయాలలో నేను ఏ నాడో నాకొరకు వ్రాసి పెట్టుకున్న సమాచారాన్ని ఇప్పుడు వికిపీడియాలో చేరుస్తున్నాను.  ప్రస్తుతం నేను విక్ష్నరి., వికిపీడియా లలో ఎక్కువగా చొరవ చూపించాలని వున్నది. అదే చేస్తున్నాను.
నా ఫోన్. నెంబరు:  
040---   24241424.,  సెల్: 9493565833